Song Name : | Kaliki menilo |
Movie: | Sankeerthana |
Singers: | S.P. Bala subramanyam garu, S, Janaki garu |
Lyricist: | C Narayana reddy garu |
Composer: | Illayaraja garu |
Director: | Geetha Krishna garu |
కలికి మేనిలో కలిగే స్పందనం..
కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో
రంగుల కలగ మెరిసే అకాశం, ముంగిట తానే నిలిచే
తోటకు వరమై దొరికే మధుమాసం, గూటిని తానే వలచే
గర్భగుడిని దాటి కదిలింది దేవతా,
గర్భగుడిని దాటి కదిలింది దేవతా, చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జతా
కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో
పెదవుల వలలో పెరిగే ఏకాంతం ప్రేమకు తేరై ఎగసే
తలపుల ఒడిలో ఒదిగే అనురాగం తలుపులు తానే తెరిచే
తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి
తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి, వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలీ
కలికి మేనిలో కలిగే స్పందనం
కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ
ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం
కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో
No comments:
Post a Comment