Song Name : | Uttaraala urvasi.. |
Movie: | Allari Priyudu |
Singers: | S.P. Balasubramanyam garu, K.S. Chitra garu |
Lyricist: | Veturi Sundararama Murthy garu |
Composer: | M.M.Keeravani garu |
Director | K.Raghavendra Rao garu |
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
హల హలా అదెంత వేడివెన్నెలా, ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
గీతగోవిందుడు వీనులావిందుడు రాగమాలతోనె రాసలీలలాడగా
మజా మజా మాజా గుమాగుమాలయా, నిజానికి ఇదంత ఒట్టు నీ దయా
పువ్వులెన్నొవిచ్చినట్టుగ చెలి నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నొపుట్టినట్టుగ ప్రియా చూసుకోర పట్టి కౌగిలీ
ఖవ్వాలిల కన్నులతోనే జవానీల జాబులురాసే జగడమొకటి సాగిందోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలురేపి లలిత కవిత నీకేపాలగా
దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై వంశధారనీటిమీద హంసలేఖరాసినా
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
హల హలా అదెంత వేడివెన్నెలా
నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా
సమ్ముఖాన రాయభారమా, సరే, సందేగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా, అదీ, అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో పదాలింక కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మా
సరాగాల సంపెంగల్లో పరాగాలు పండిస్తుంటే, పరువమొకటి వచ్చే వాంఛలా
కన్నె చెట్టు కొమ్మ మీద పొన్న తోట తుమ్మెదాడి
ఝుంటితేని పట్టులోన కొంటె వేణువూదిన
గీతగోవిందుడు వీనులావిందుడు రాగమాలతోనె రాసలీలలాడగా
మజా మజా మాజా గుమాగుమాలయా, నిజానికి ఇదంత ఒట్టు నీ దయా
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ
హల హలా అదెంత వేడివెన్నెలా, ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
No comments:
Post a Comment