Sunday, September 29, 2024

చల్తీకా నామ్ గాడీ (Chalti ka Naam Gaadi)

Song Name :Chalti ka naam gaadi
Movie:Chettu kinda pleader
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Vennelakanti garu
Composer:Illayaraja garu
DirectorVamsy garu


చల్తీకా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడి

చల్తీకా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడి

రంగేళి జోడి, బంగారు బాడి, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి..

అహో.. ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా 

చల్తీకా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడి

రంగేళి జోడి, బంగారు బాడి, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి..

అహో.. ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా 


దేవతలే మెచ్చిన కారు, దేశాలు తిరిగిన కారు

వీరులకు ఝాన్సీ కారు, హీరోలకు ఫ్యాన్సీ కారు

అశోకుడు యుద్ధంలోన వాడిందీ ఈ కారు, శివాజి గుర్రం వీడీ ఎక్కింది ఈ కారు

చరిత్రల లోతులు చేరి, రాతలు మారి, చేతులు మారినదీ.. 

జంపరు బంపరు బండిరా బండిరా, జగమోండిరా మొండిరా ..

చల్తీకా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడి


ఆంగ్లేయులు తోలిన కారు, ఆంధ్రానే ఏలిన కారు

అందాల లండన్ కారు, అన్నింటా ఎమ్‌డెన్ కారు

బుల్లెట్లా దూసుకుపోయే రాకెట్టే ఈ కారు, రేసుల్లో కప్పులు మనకే రాబట్టే ఈ కారు

హుషరుగ ఎక్కిన చాలు, దక్కును మేలు, చిక్కు సుఖాలు 

ఇదే సూపరు డూపరు బండిరా బండిరా, జగమోండిరా మొండిరా ..

చల్తీకా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడి

రంగేళి జోడి, బంగారు బాడి, వేగంలో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి..

అహో.. ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా 

చల్తీకా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడి

 

No comments:

Post a Comment