Song Name : | Aalayana haarathilo |
Movie: | Suswagatam |
Singers: | S.P. Bala subramanyam garu |
Lyricist: | Sirivennela Sitarama sastry garu |
Composer: | S A Rajkumar garu |
Director: | Bhimineni Srinivasa rao garu |
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందొ, తాపాన బలిపెడుతుందొ
అమృతమో హాలహలమో ఎమో ప్రేమ గుణం , ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఎండమావిలొ ఎంతవెతికినా నీటిచెమ్మ దొరికేన, గుండె బావిలొ ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలొ ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం, చేస్తోంది గగన ప్రయాణం
ఎదర ఉంది నడిరేయంది ఈ సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కలకోసం, కళ్ళుమూసుకుని కలవరించెనీ కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసియైనా, రేయిచాటు స్వప్నంకోసం ఆలాపన ఆగేన
పొందేది ఏదేమైనా, పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం, ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో, రెండిటిలొ నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందొ, తాపాన బలిపెడుతుందొ
అమృతమో హాలహలమో ఎమో ప్రేమ గుణం , ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
No comments:
Post a Comment