Showing posts with label Hamsalekha. Show all posts
Showing posts with label Hamsalekha. Show all posts

Saturday, April 26, 2025

Evaro okaru epudo apudu [ఎవరో ఒకరు ఎపుడొ అపుడు] - Ankuram

Song Name :Evaro okaru epudo apudu
Movie:Ankuram
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Sirivennela Seeta Rama Sastry garu
Composer:Hamsalekha garu
Director:C. Uma Maheswara rao garu

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి, మొదటి ఆదుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదీ 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చిన, అనుకొని కోడికూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే, మబ్బు పొంగు చాటుగా ఒదిగి దాగితే 
వాన ధార రాదుగా నేల దారికి, ప్రాణమంటు లేదుగా బ్రతకడానికి
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చెదరకపోదుగా చిక్కని చీకటి మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికీ 
దానికి లెక్కలేదు కాళరాతిరి 
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని, రెప్పవెనక ఆపనీ కంటి నీటిని 
సాగలేక ఆగితే దారి తరుగునా, జాలిచూపి తీరమే దరికి చేరునా 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

యుగములు సాగినా నింగిని తాకక ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా 
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా 
ఎంతవేడి ఎండతో ఓళ్ళు మండితే , అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా 
అంతగొప్ప సూర్యుడు కళ్ళు మూయడా, నల్లమబ్బు కమ్మితే చల్లబారడా 
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు 

Wednesday, September 25, 2024

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం (Sri Manjunatha)

Song Name :Ee Paadam punya paadam
Movie:Sri Manjunatha
Singers:S.P. Bala Subramanyam garu
Lyricist:Saamaveda shanmukha Sastry garu
Composer:Hamsalekha garu
DirectorK. Raghavendra rao garu

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం 

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం 

ప్రణవమూలనాదం ప్రథమలోకపాదం 

ప్రణతులే చేయలేనీ ఈ కరమేల ఈ కరమేల 

ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం 


మార్ఖండేయరక్షపాదం మహాపాదం  

మార్ఖండేయరక్షపాదం మహాపాదం  

భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం  

భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం  

ఆత్మలింగ స్వయంపూర్ణా  ఆత్మలింగ స్వయంపూర్ణుడే సాక్షత్కరించినా చేయూతవీడినా అయ్యో  అందని అనాథనైతీ మంజునాథా 

ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం 

ప్రణయమూలపాదం ప్రణయనాట్యపాదం ప్రణతులే చేయలేనీ ఈ శిరమేలా ఈ బ్రతుకేలా     

ఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం 

 

భక్తసిరియాళుమేలిన ప్రేమపాదం 

భక్తసిరియాళుమేలిన ప్రేమపాదం 

బ్రహ్మ విష్ణులేభజించి ఆదిపాదమనాదిపాదం

బ్రహ్మ విష్ణులేభజించి ఆదిపాదమనాదిపాదం

అన్నదాతవిశ్వనాథా అన్నదాతవిశ్వనాథుడే  లీలావినోదిగా నన్నేలగాదిగిరాగా  అయ్యో 

ఛీపొమ్మంటినే పాపినైతినే 

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్యపాదం సకలప్రాణపాదం సర్వమోక్షపాదం తెలుసుకోలేనీ నా ఈతెలివేలా ఈ తనువేలా   

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం