| Song Name : | Meghama dehama |
| Movie: | Manchu pallaki |
| Singers: | S. Janaki గారు |
| Lyricist: | Veturi Sundara rama murthy గారు |
| Composer: | Rajan-Nagendran గారు |
| Director | Vamsy గారు |
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసినా కురిసినా కరుగునీ
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరుపులతోపాటు ఉరుములుగా దరిరిసా రిమదనిసదనిపగ
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటివాకిట ముగ్గులుగా .. ఆ.. స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచు పల్లకిగా
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
పెనుగాలికి పెళ్ళిచూపు, పువ్వు రాలినవేళ కళ్యణం
అందాకా ఆరాటం ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో .. ఓ..
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం

No comments:
Post a Comment