Tuesday, November 24, 2026

Jilibili palukulu telugu lyrics [జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా] - Sitara

Song Name :Jilibili palukula
Movie:Sitara
Singers:S.P. Balasubramanyam గారు , S. Janaki గారు 
Lyricist:Veturi Sundara rama murthy గారు 
Composer:Illayaraja గారు 
DirectorVamsy గారు  

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా

మిల మిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార

మిల మిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార

మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా 

కలలను తెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా


అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా 

చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా

తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ

తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ

హరివిల్లు రంగుల్లో వర్ణలే 

చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా


ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా

మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా 

ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ 

ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ 

వినువీధి వీణల్లో రాగంలా 

ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా 


జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా 

మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార 

గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం 

మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా 

చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా 

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

తొలకరి వయసుల మిణుగురు సొగసులదీ మైనా మైనా  

No comments:

Post a Comment