| Song Name : | edalo laya egise laya |
| Movie: | Anveshana |
| Singers: | S. Janaki గారు |
| Lyricist: | Veturi Sundara rama murthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director | Vamsy గారు |
పపగ పపగ , పపగ పస పపగ పస
ఎదలో లయ ఎగసే లయ
ససమ నినిరి ససమ నినిరి గగగ మమమ ససస ససస ససస
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి శుకమా స్వరమా పికమా పదమా శుకమా
గా గా.. ఆ..
దివ్యమే నీ దర్శనం శ్రావ్యమేలే స్పందనం
శోధనే నా జీవనం సాధనేలే జీవితం
వెతలే శృతులై కలిసే ఆలాపన
వెతికి వెతికి బ్రతుకే అన్వేషణ
నాలో నేడే విరుల వానా...
ఎదలో లయ ఎగసే లయ
ఎగసి ఎగిరి ఎదలో ఒదిగి శుకమా స్వరమా పికమా పదమా శుకమా
కోకిల గీతం తుమ్మెద నాదం
కోకిల గీతం తుమ్మెద నాదం
జలజల పారే శెలగానం ఘుమ ఘుమలాడే సుమ గానం
అరెరె.. ఆ... ఆ...
కొండ కోన ఎండ వాన ఏకమైన ప్రేమగీతం
ఔనా మైనా నీవే నేనా శుకపికముల కలరవముల స్వరలహరులలో..
సస సస దద దద పప పప
రిరి నిని సస సస రిరి నిని సస సస
కలికి చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ
కలికి చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
సససస సససస
విహంగమా సంగీతమా - విహంగమా సంగీతమా
సంగీతమే విహంగమై చరించగా
స్వరాలతో వనాంతమే జ్వలించగా
ఎన్నాళ్ళు సాగాలి ఎకాంత అన్వేషణ...
అలికిడి ఎరుగని తొలకరి వెలుగులలో
కలికి చిలుక పలికేదేమో ఒడిలో ప్రియుడే ఒదిగిన వేళ
విరుల తెరలో జరిగేదేమో మరులే పొంగి పొరలిన వేళ
సససస దదదద పపపప
సససస దదదద పపపప

No comments:
Post a Comment