Title : | Aavesamanta aalaapaneley |
Movie: | Aalaapana |
Singers: | S.P. Balasubramanyam గారు |
Lyricist: | Veturi గారు |
Composer: | Illayaraja గారు |
Director: | Vamsy గారు |
ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే..ఉదయినిగా... నాలో జ్వలించే వర్ణాల రచన.. నాలో జలించే స్వరాలా..
ఆవేశమంతా ఆలాపనేలే..
అలపైటలేసే.. సెలపాట విన్న.. గిరివీణమీటే జలపాతమన్న
నాలోన సాగే ఆలాపన.. రాగాలుతీసే ఆలోచన ..
ఝరుల జతల నాట్యం అరవిరుల మరుల కావ్యం..
ఎగసి ఎగసి నాలో గళ మధువులడిగె గానం
నిదురలేచె నాలో హౄదయమే..
ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో
ఆవేశమంతా ఆలాపనేలే...
వనకన్యలాడే తొలిమాసమన్నా.. గోధూళి తెరలో మలిసంధ్య కన్నా
అందాలు కరిగే ఆవేదన..నాదాల గుడిలో ఆరాధన..
చిలిపి చినుకు చందం.. పురివిడిన నెమలి పింఛం
ఎదలు కదిపి నాలో.. విరిపొదలు వెతికె మోహం
బదులు లేని ఎదో పిలుపులా
ఆవేశమంతా ఆలాపనేలే..ఎదలయలో... నాలో జ్వలించే వర్ణాల రచన.. నాలో జలించే స్వరాలా..
ఆవేశమంతా ఆలాపనేలే..
Watch and Listen
English
AvESamaMtA AlApanElE..edalayalO
AvESamaMtA AlApanElE..udayinigA... nAlO jwaliMchE varNAla rachana.. nAlO jaliMchE swarAlA..
AvESamaMtA AlApanElE..
alapaiTalEsE.. selapATa vinna.. girivINamITE jalapAtamanna
nAlOna sAgE AlApana.. rAgAlutIsE AlOchana ..
jharula jatala nATyaM aravirula marula kAvyaM..
egasi egasi nAlO gaLa madhuvulaDige gAnaM
niduralEche nAlO hRudayamE..
AvESamaMtA AlApanElE..edalayalO
AvESamaMtA AlApanElE...
vanakanyalADE tolimAsamannA.. gOdhULi teralO malisandhya kannA
aMdAlu karigE AvEdana..nAdAla guDilO ArAdhana..
chilipi chinuku chaMdaM.. puriviDina nemali piMChaM
edalu kadipi nAlO.. viripodalu vetike mOhaM
badulu lEni edO pilupulA
AvESamaMtA AlApanElE..edalayalO... nAlO jwaliMchE varNAla rachana.. nAlO jaliMchE swarAlA..
AvESamaMtA AlApanElE..