| Title : | Janaki kalaganaledu |
| Movie: | Rajkumar |
| Singers: | S.P. Balasubramanyam గారు, P. Suseela గారు |
| Lyricist: | Veturi sundararama murthy గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | Gutta Raamineedu గారు |
జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం
రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు
చెలిమనసే శివధనుస్సైనది తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది
ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని చిర యశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాకా నీవే మరుజన్మకు నీవే
జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు
సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజూ ఒక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కథ కానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే
రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు
జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం


















