| Title : | Kalaya nijama |
| Movie: | Coolie No 1 |
| Singers: | Illayaraja గారు, P. Suseela గారు |
| Lyricist: | Sirivennela Sitarama sastry గారు |
| Composer: | Illayaraja గారు |
| Director: | K. Raghavendra Rao గారు |
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా
అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా.. కలయా నిజమా ..
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నది.. ఆహా..
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నది
కోకముళ్ళ కూపీ తీసే కైపుచూపు కొరుకుతున్నది
కుర్రకళ్ళు చీరగళ్ళలో దారేలేక తిరుగుతున్నవి
ముంచే మైకమో మురిపించే మోహమో
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా.. కలయా నిజమా ..
చేయి వేయనా సేవచేయనా ఓయ్ అనే వయ్యారమా.. హ హ హ
పాలముంచినా నీటముంచినా నీ దయే శృంగారమా.. ఆహా
ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నది
కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది
హా అంతా మాయగా అనిపించే కాలము
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా
అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
కలయా నిజమా తొలిరేయిహాయి మహిమా.. కలయా నిజమా ..



















