Showing posts with label bhuvanachandra. Show all posts
Showing posts with label bhuvanachandra. Show all posts

Saturday, August 1, 2026

Oh Vennela [ఓ వెన్నెలా తెలిపేదెలా] - Prema Desam

Title :Oh vennela 
Movie:Prema Desam
Singers:Unni Krishnan గారు
Lyricist:Bhuvana Chandra గారు
Composer:A.R. Rahman గారు
Director:Kathir గారు

ఓ వెన్నెలా తెలిపేదెలా .. ఓ నేస్తమా నిలిచేదెలా

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

ఓ వెన్నెలా తెలిపేదెలా .. ఓ నేస్తమా నిలిచేదెలా

జడివాన నింగిని తడిచేయునా, గంధాలు పూవ్వుని విడిపోవునా

నన్నడిగి ప్రేమ ఎదచేరెనా, వలదన్న ఎదను విడిపోవునా 

మరిచాను అన్నా మరిచేదెలా, మరిచాక నేను బ్రతికేదెలా 

ఓ వెన్నెలా తెలిపేదెలా .. 

వలపించు హృదయం ఒకటే కదా, ఎడమైతే బ్రతుకు బరువేకదా 

నిలిపాను ప్రాణం నీకోసమే, కలనైన కూడా నీ ధ్యానమే 

మదిలోని ప్రేమా చనిపోదులే, ఏనాటికైనా నిను చేరులే 

ఓ వెన్నెలా తెలిపేదెలా .. 

ఓ నేస్తమా నిలిచేదెలా

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

కళ్ళు కళ్ళూ కలిసాయంటా, వలపే పూవై పూసిందంట

నమ్మినవారే పూవ్వుని కోస్తే, నీ ఎదలో బాధ తీరేదెట్టా 

Vennela vennela [వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే] - Premedesam

Title :vennela vennela
Movie:Prema Desam
Singers:Unni Krishnan గారు, S.P. Balasubramanyam గారు
Lyricist:Bhuvana Chandra గారు
Composer:A.R. Rahman గారు
Director:Kathir గారు

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ 

కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

ఆశ ఎన్నడు విడువదా, అడగరాదని తెలియదా 

నా ప్రాణం చెలియా నీవేలే 

విరగబూసిన వెన్నెలా వదిలివేయకే నన్నిలా

రారాదా ఎదనీదే కాదా 

నిదురనిచ్చే జాబిలి నిదురలేక నీవే వాడినావా 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

మంచుతెరలో అలిసిపోయే మదన సంధ్య తూకెనే **

పుడమి ఒడిలో కలలు కంటూ పాపానీవు నిదురపో

మల్లె అందం మగువకెరుక మనసుబాధ తెలియదా

గుండెనిండా ఊసులే ఎదుటనుంటే మౌనమే 

జోలపాట పాడినానే నిదురలేక వాడినా 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ 

కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళ 

వెన్నెల వెన్నెలా, మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

Saturday, April 11, 2026

Ni Navve chalu pubanti [నీ నవ్వేచాలు పూబంతీ చామంతి] - Peddarikam

Title :ni navve chalu 
Movie:Peddarikam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Raj-Koti గారు
Director:A.M. Rathnam గారు

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

ఆ మాటే చాలు నెలవంకా రా ఇక, ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక 

విలాసాల దారికాసా సరాగాల గాలమేసా 

కులాశాల పూలు కోసా వయ్యారాల మాల వేసా 

మరో నవ్వు రువ్వరాదటే ..

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

మల్లెపూల మంచమేసి హుషారించనా, జమాయించి జాజిమొగ్గ నిషాచూడనా

తెల్లచీర టెక్కులేవో చెలాయించనా, విర్రవీగు కుర్రవాణ్ణి నిభాయించనా 

అతివకు ఆత్రము తగదటగా, తుంటరి చేతులు విడువవుగ మనసుపడే పడుచు ఒడి

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

కోరమీసమున్నవాడి కసేచూడనా, దోర దోర జామపళ్ళ రుచే చూపనా 

కొంగుచాటు హంగులన్ని పటాయించనా, రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా 

పరువము పరుపుల పరమటగా, వయసున సరసము సులువటగా తధిగిణతోం మొదలెడదాం 

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

విలాసాల దారికాసా సరాగాల గాలమేసా 

కులాశాల పూలు కోసా వయ్యారాల మాల వేసా 

మరో నవ్వు రువ్వరాదటే ..

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ఆ మాటే చాలు నెలవంకా రా ఇక 

Saturday, March 28, 2026

Chilakapaccha koka [చిలకపచ్చకోక పెట్టినాదికేక ] - Narasimha Nayudu/Naidu

Title :Chilakapaccha koka
Movie:Narasimha naidu
Singers:Nagur babu (Mano) గారు, Radhika గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Mani sharma గారు
Director:B. Gopal గారు

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

చిలకపచ్చకోక హ పెట్టినాదికేక 

చంపకమాలా చంపకే బేలా చాటుముద్దుల్లోనే ఉంది ఘాటుమసాలా 

కొంటెగోపాలా ఆపరగోలా సరసానికి ఉందిరయ్యో వేళాపాళా 

వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోద ఒసే తూగుటుయ్యాలా 

వద్దు వద్దన్నా ముద్దుపెట్టేసే మగసిరినీకుందిగా మురళిలోలా 

పిల్లచూస్తె జామకాయలే దీంతస్సదియ్య కొరకబోతె మిరపకాయలే 

చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే 

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

నిన్నుచూసాకే వెన్నుమీటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో 

చెనుపట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో 

పాలుకావాలా పళ్ళుకావాలా పళ్ళుపాలతోటి పడుచుపిల్ల కావాలా 

చెంతచేరాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే 

ఏడూళ్ళా అందగత్తిని నీసోకుమాడ పట్టుకుంటె అత్తిపత్తిని 

హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి 

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా హొయ్ 

Monday, March 16, 2026

Chanduruni takinadi [చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా] - Rakshakudu

Title :Chanduruni takinadi
Movie:Rakshakudu
Singers:Hari Haran గారు, Sujata గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:A.R. Rahman గారు
Director:Praveen Gandhi గారు

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా 

చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

చందురుని తాకినది నీవేగా అరె నీవేగా 

వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా

వయస్సు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శృతిలయల శృంగారం 

ఓ, పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే 

ఓ, పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే 

పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే 

ఓ, తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియుని కలుసుకున్నా 

తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్న, మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా

కోరికల కోవలలో కర్పూరమౌతున్నా ...చందురుని 

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా 

చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

రమ్మనే పిలుపువిని రేగుతోంది యెవ్వనమే, ఏకమైపోదమంటూ జల్లుతోంది చందనమే 

నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా, కోరుకున్న ప్రియసఖుడే కౌగిలికి భారమౌనా

చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్ల

పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల 

ఓ, అలిగిన మగతనమే పగబడితే వీడదే .. చందురునీ 

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా 

చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం 

Saturday, March 7, 2026

Kannepetta ro kannukottaro [కన్నెపెట్టరో కన్నుకొట్టరో ] - Hello Brother

Song Name :Kannepetta ro kannukotta ro
Movie:Hello Brother
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Raj - Koti garu
DirectorE.V.V Satyanarayana garu

అట్టా ఎర్రిమొహాలేస్కోని సూత్తారేంట్రా... వాయించండీ ...

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో..

ఓయ్..పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

అరే అరే అరే

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో.. పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

గుట్టుగుట్టుగా జట్టుకట్టరో జంటచేరితే గంటకొట్టరో 

ఒట్టూ గిట్టూ పెట్టావంటే ఊరుకోను, బెట్టే కట్టి ఉట్టేకొట్టి తీరతాను 

ఓ..ఓ..ఓహో..   ఓ..ఓ..ఓహో..

చూపు చూపుకొక చిటికెల మేళం చూసిపెట్టనా చిట్టెమ్మో

ఊపు ఊపుకొక తకధిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మో

అదిరిపడిన కుడిఎడమల నడుమున ఉడుకువయసు ముడిపెట్టుకోనా 

అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పడుచుపనులు మొదలెట్టుకోనా 

అదిరే సరుకు ముదిరే వరకు 

అటో ఇటో ఎటో ఎటో పడి పడి, కలేయ్యనా అదో ఇదో కలబడి 

ఓ..ఓ..ఓహో..   ఓ..ఓ..ఓహో..

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో..

ఓయ్..పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

హేయ్, గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వ గుండెలో రిం ఝిం ఝిం

వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రం పం పం 

మిడిసిపడిన తడి తళుకుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే  

మతులుచెడిన చెలి జిగిబిగి బిగువులు అరిచి అరిచి మొరపెట్టుకుంటే 

పనిలో పనిగా ఒడిలో పడనా 

చలో చలో ఎకాఎకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం 

ఓ..ఓ..ఓహో..   ఓ..ఓ..ఓహో..

కన్నెపెట్టరో కన్నుకొట్టరో ఓ..ఓహో..

ఓయ్..పాలపిట్టరో పైటపట్టరో.. ఓ..ఓహో..

గుట్టుగుట్టుగా జట్టుకట్టరో జంటచేరితే గంటకొట్టరో 

ఒట్టూ గిట్టూ పెట్టావంటే ఊరుకోను, బెట్టే కట్టి ఉట్టేకొట్టి తీరతాను  

Saturday, February 28, 2026

Kitukulu telisina chitapata [కిటుకులు తెలిసిన చిటపట చినుకులు] - Gharana Mogudu

Song Name :Kitikulu telisina chitapata chinukulu
Movie:Gharana mogudu
Singers:నాగూర్ బాబు (మనో) గారు, చిత్ర గారు 
Lyricist:భువనచంద్ర గారు 
Composer:M.M. కీరవాణి గారు
DirectorK.రాఘవేంద్ర రావు గారు

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తళుకులు

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులుకావవి మగసిరి పిలుపులు 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

రివ్వున కొట్టిన ఓ చినుకు కసిగా పదమంటే 

రైకలు కట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే 

హత్తుకుపోయిన ఓ చినుకు వగలే వొలికిస్తే 

చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే 

కురిసే వయ్యారి వాన, మెరిసే నీ కన్నుల జాణ

కురిసే వయ్యారి వాన, మెరిసే నీ కన్నుల జాణ

ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులుకావవి మగసిరి పిలుపులు 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

హద్దులుమీరిన ఆవేశం తలుపే తడుతుంటే 

అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే 

తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు

కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు 

వొడిలో బంగారుచేప పడితే నీకంతటి ఊపా 

వొడిలో బంగారుచేప పడితే నీకంతటి ఊపా 

తడిలో అందాలపాప పడితే పులుసౌతది చేపా 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులుకావవి మగసిరి పిలుపులు 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన 

Saturday, February 7, 2026

Endi be ettaga undi vollu [ఏందిబే ఎట్టాగ ఉంది వొళ్ళు] - Gharana Mogudu

Title :Endibe ettaga undi vollu
Movie:Gharana Mogudu
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana Chandra గారు
Composer:M.M. Keeravani గారు
Director:K. Raghavendra rao గారు

ఏందిబే ఎట్టాగ ఉంది వొళ్ళు, ఎక్కడో గుచ్చావు చేపముళ్ళు

ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు, చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

విస్కీ పట్టు ఇలా ఇలా, సోడా కొట్టూ అలా అలా

ఎక్కిస్తే కిక్కిచ్చేలా హా హా.. ఏందిబే 

ఏందిబే ఎట్టాగ ఉంది వొళ్ళు, ఎక్కడో గుచ్చావు చేపముళ్ళు

ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు, చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

హే లబకు జబకు గడుసు పెళ్ళాంసు, తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసు 

హే చటకు ఫటకు చిలిపి మొగుడ్సు, రిస్క్‌చేసి తెంపమాకు రిబ్బన్సు 

చిప్స్ఉన్నాయా చీకులున్నాయా నాటుకోడిలెగ్స్ ఉన్నాయా

చిప్స్ఉన్నాయి లిప్స్ఉన్నాయి పిడతకింద పప్స్ఉన్నాయి 

అడిటప్పా టప్పా టపా టప్పా, రడీ రబ్బా రబ్బా యమదెబ్బ

అడిటప్పా టప్పా టపా టప్పా, రడీ రబ్బా రబ్బా యమదెబ్బ

ఏందిబే ఎట్టాగ ఉంది వొళ్ళు, ఎక్కడో గుచ్చావు చేపముళ్ళు

ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు, చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

నీ లటకు పటకు చురుకు చూపుల్సు, గుచ్చుకుంటె రెచ్చిపోయె బుగ్గల్సు 

నీ కసకు మసకు నడుము వొంపుల్సు, తడుముతుంటే రేగిపోయె జిల్‌జిల్సు  

పెట్టు ముద్దుల్సు లేవు హద్దుల్సు ఓకే.. ఇవ్వమంది ఈడు సాంపుల్సు 

కొట్టు బాటిల్సు తీరు తీపుల్సు మోగుతుంటే జోదు మద్దెల్సు .. తరిగిటతోం..

అడిటప్పా టప్పా టపా టప్పా, రడీ రబ్బా రబ్బా యమదెబ్బ

అడిటప్పా టప్పా టపా టప్పా, రడీ రబ్బా రబ్బా యమదెబ్బ

ఏందిబే ఎట్టాగ ఉంది వొళ్ళు, ఎక్కడో గుచ్చావు చేపముళ్ళు

ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు, చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

విస్కీ పట్టు ఇలా ఇలా, సోడా కొట్టూ అలా అలా

ఎక్కిస్తే కిక్కిచ్చేలా హా హా.. ఏందిబే 

ఏందిబే ఎట్టాగ ఉంది వొళ్ళు, ఎక్కడో గుచ్చావు చేపముళ్ళు

ఓసినీ ఇంకాస్త .., చట్టిలో సరుకేదో ... 

Thursday, February 5, 2026

Chittigumma padave [చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం] - Tholi muddu / Toli muddu

Title :Chitti gumma padave
Movie:Tolimuddu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Illayaraja గారు
Director:K. Rushendra Reddy గారు

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండిమబ్బు ఒడిలో ముద్దుముచ్చటలాడుకుందాం

చిరుగాలై కొండా కోనల్లోన తేలి, చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి 

చిరుగాలై కొండా కోనల్లోన తేలి, చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి 

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండిమబ్బు ఒడిలో ముద్దుముచ్చటలాడుకుందాం

కడలి అంచుల్లో జలకాలాడి, అలలా అంతు పొంతు చూసొద్దామా 

యమహో ముందో ముద్దు లాగిద్దామా 

తొణికే వెన్నెల్లో సరసాలాడి, వయస్సు హద్దు పొద్దు తేలుద్దామా 

త్వరగా అస్సూ బుస్సూ కానిద్దామా 

తరగని మోహాలే వేసాయి వలలు, తడి తడి ఒంపుల్లో పిల్లోడా 

అరగని అందాలే పొంగాయి సడిలో, పెదవుల తాబూళం అందీవే 

తనువిచ్చేయ్‌మంటోంది , మనసొద్దోద్దంటొంది

ఇక సిగ్గేమంటూ కొమ్మ రెమ్మ ఊగాడింది 

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండిమబ్బు ఒడిలో ముద్దుముచ్చటలాడుకుందా

చిరుగాలై కొండా కోనల్లోన తేలి, చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి 

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండిమబ్బు ఒడిలో ముద్దుముచ్చటలాడుకుందాం

చలిలో చిన్నారి వయ్యారాలే, కసిగా గుచ్చి గుచ్చి ఊరిస్తొంటే 

ఉసిగా తట్టి తట్టి వేధిస్తుంటే 

వలపుల కౌగిళ్ళా నజరానాలే, రతిలా మళ్ళి మళ్ళి అందిస్తుంటే 

మరుడే వొళ్ళోకొచ్చి కవ్విస్తుంటే 

తెలియని ఆవేశం రేఇందే మదిలో, తలుపులు తీవేమే బుల్లెమ్మా 

పరువపు ఆరాటం తీరాలి జడిలో, తకధిమి సాగించేయ్ బుల్లోడా

ఇహ అడ్డేముందమ్మో మలి ముద్దిచ్చేవమ్మో

మెరుపల్లే బాణం సంధించేయ్‌రా వీరా ధీరా  

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండిమబ్బు ఒడిలో ముద్దుముచ్చటలాడుకుందాం

చిరుగాలై కొండా కోనల్లోన తేలి, చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి 

చిరుగాలై కొండా కోనల్లోన తేలి, చిరునవ్వై పూలగుండెల్లోన దాగాలి 

చిట్టిగుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం, వెండిమబ్బు ఒడిలో ముద్దుముచ్చటలాడుకుందాం

Monday, January 26, 2026

Love me my hero [లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో] - Rowdy Alludu

Title :Love me my hero
Movie:Rowdy Alludu
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvanachandra గారు
Composer:Raj-Koti గారు
Director:K. Raghavendra Rao గారు

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

ఓకే మైలేడీ అలాగే కానీ అమ్మాడీ చలో చూసేస్తా నీ వేడీ

తనువే బహుమానం ముదిరే చలికాలం 

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

అరె.. ఓకే మైలేడీ అలాగే కానీ అమ్మాడీ చలో చూసేస్తా నీ వేడీ హా 

హో.. ఒకటో ముద్దు వయస్సుకిచ్చేసా, రెండో ముద్దు రౌండప్‌చేసేసా 

మూడో ముద్దు మరింత లాగించేయ్, నాల్గో ముద్దు నిషాలు చూపించేయ్

పనిలో పని పదవే మరి, ప్రాక్టీసు మొదలెడదాం 

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి, ఆరో ముద్దు అక్కర తీర్చాలి

ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే, ఎమ్దో ముద్దు ఇచ్చేదిస్తుంటే 

లెక్కెందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు 

ఓకే మైలేడీ అలాగే కానీ అమ్మాడీ చలో చూసేస్తా నీ వేడీ

లవ్ మీ మైహీరో మజాగా ముద్దిస్తారారో ఖుషీగా కౌగిట్లో మారో 

ముదిరే చలికాలం తనువే బహుమానం .. ఆహా.. 

Sunday, November 23, 2025

Aakasavidhilo [ఆకాశవీధిలో..వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే] - Akasavidhilo

Title :Aakasavidhilo
Movie:Aakasavidhilo
Singers:Devi Sri Prasad గారు, Ganga గారు
Lyricist:bhuvana chandra గారు
Composer:M.M. Keeravani గారు
Director:Singeetam Srinivasarao గారు

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నీదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

మేఘాలె ముగ్గులుపెట్టే మేడల్లో, దేహాలె ఉగ్గులుకోరే నాదంలో 

చందమామే మంచం సర్దుకుందాం కొంచెం 

అహో రాత్రులు, ఒకే యాత్రలు, రహస్యాల రహదారిలో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నాదైతే 

భూదేవే బిత్తరపోయే వేగంలో, నాదేవే నిద్దురలేచే విరహంలో 

తొకచుక్కై చూస్తా, ఒహోహో సోకులెక్కే రాస్తా 

ముల్లోకాలకే ముచ్చెమటేయగా ముస్తాబంత ముద్దాడుకో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

Sunday, November 16, 2025

Meghama maruvake [మేఘమా మరువకే, మోహమా విడువకే] - Seetharatnam gari abbayi

Title :Meghama maruvake
Movie:Seetharatnam gari abbayi
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Raj Koti గారు
Director:E.V.V Satyanarayana  గారు

మేఘమా మరువకే, మోహమా విడువకే 

మాఘమాస వేళలో మల్లెపూల మాలగా 

మరుని కూడి మెల్లగా మరలి రావె చల్లగా 

మదిలో మెదిలే మధువై....

మేఘమా మరువకే, మోహమా విడువకే 

నిదుర కాచిన కన్నె పానుపే రా రా రమ్మంటుంటే 

కురులు విప్పి నా అగరువత్తులే అలకలు సాగిస్తుంటే

సిగ్గే ఎరుగని రేయిలో తొలిహాయిలో అలివేణీ 

రవికే తెలియని అందము అందించనా నెలరాజా

కలలా అలలా మెరిసీ ...

మేఘమా మరువకే, మోహమా విడువకే 

గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందండిలోనా 

తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామ 

మరుగే ఎరుగని కోనలో ఆ మోజులో మహరాజా 

నలిగే మల్లెల సవ్వడి వినిపించనా నెరజాణా 

జతగా కలిసి అలిసి...

మేఘమా మరువకే, మోహమా విడువకే 

Sunday, September 7, 2025

Manohara na hrudayamune [మనోహర నా హృదయమునే ] - Cheli

Title :manohara na hrudayamune
Movie:Cheli
Singers:Bombay Jaysree గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Harris Jayraj గారు
Director:Gowtham Menon గారు

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట 

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట 

నా యవ్వనమే నీపరమై పులకించే వేళ 

నా ఎదలో ఒకసుఖమే ఊగెనుగా ఉయ్యాల

జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా 

శృతిమించుతోంది దాహం ఒక పాంపుపై పవళిద్దాం 

కసి కసి పదాలెన్నో ఎన్నో కాసి 

నను జయించుకుంటే నేస్తం, నా సర్వస్వం అర్పిస్తా

ఎన్నటికీ మాయదుగా చిగురాకుతొడిగే ఈ బంధం 

ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం 

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

సుధాకర తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట  

ఓ ప్రేమ ప్రేమ 

సందెవేళ స్నానంచేసే నన్ను చేరి 

నా చీరకొంగుతో వొళ్ళు నువ్వు తుడుస్తావే అదో కావ్యం 

దొంగమల్లే ప్రియా ప్రియా సడేలేక 

వెంకాలనుండి నన్ను హత్తుకుంటావే మధుకావ్యం 

నీకోసం మదిలోనే గుడికట్టినానని తెలియనిదా 

ఓసారి ప్రియమార ఒడీచేర్చుకోవ నీ చెలిని

మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట

రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట 

నా యవ్వనమే నీపరమై పులకించే వేళ 

నా ఎదలో ఒకసుఖమే ఊగెనుగా ఉయ్యాల 

Saturday, May 31, 2025

Vaana vaana velluvaye [వానా వానా వెల్లువాయె] - Gangleader

Song Name :Vana vana velluvaye
Movie:Gangleader
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana chandra garu
Composer:Bappilahari garu
DirectorVijaya baapineedu garu 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ప్రియుని శ్వాశలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం

పక్కన చేరిన మగమహరాజుకి సొంతం 

హో..తొలకరి చిటపట చినుకులలో మకరందం

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం 

చివురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా..

ఒడిలో రేగెను ఎదో తెలియని జ్వాలా..

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా

బిగిసిన కౌగిట కరిగించెను పరువాలా 

కలవరింతలే పలకరింపులై పదునుమీరగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ప్రియుని శ్వాశలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

Saturday, May 17, 2025

Nanu nene marichina ni todu [నను నేనె మరచినా నీ తోడు] - Prema Desam

Song Name :Nanu nenu marichina
Movie:Premadesam
Singers:S.P. Balasubramanyam garu, O.S. Arun Kumar garu
Lyricist:Bhuvana chandra garu
Composer:A.R. Rahman garlu
DirectorKathir garu 

ప్రేమ.. ప్రేమ.. ప్రేమ... ప్రేమ...

నను నేనె మరచినా నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు 

వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...

నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాశలోన అది చేరిందే

నేనున్న సంగతే మరిచిందే, ప్రేమా... ప్రేమా...

చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ...రావా.. నా వాకిట్లో.. నీకై.. నే వేచానే...

నను నేనె మరచినా నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు 

వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...

ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్న, నీ పిలుపుకోసం చిన్నారీ

నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి

నా గుండెలోతుల్లో దాగుంది నీవే, నువ్ లేక లోకంలో జీవించలేనే

నీ ఊహతోనే బ్రతికున్నా...

నను నేనె మరచినా నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు 

వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...

నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాశలోన అది చేరిందే

నేనున్న సంగతే మరిచిందే, ప్రేమా... ప్రేమా...

నిముషాలు శూలాలై వెంటాడుతున్నా, వొడి చెర్చుకోవా వయ్యారి

విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా, ఓదార్చిపోవా ఓసారి 

ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ, ప్రేమించినానంటూ బ్రతికించలేవా 

అది నాకు చాలే చెలీ 

నను నేనె మరచినా నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు 

వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...

నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాశలోన అది చేరిందే

నేనున్న సంగతే మరిచిందే, ప్రేమా... ప్రేమా...

చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ...రావా.. నా వాకిట్లో.. నీకై.. నే వేచానే...

నను నేనె మరచినా నీ తోడు, విరహాన వేగుతూ ఈనాడు 

వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా...

Sunday, April 6, 2025

ni pilupe premageetam [నీ పిలుపే ప్రేమగీతం] - Prema Lekha

Song Name :Ni Pilupe Premageetam
Movie:Premalekha
Singers:Unni Krishnana garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:A.R. Rahman garu
DirectorAgastyan garu 

నీ పిలుపే ప్రేమగీతం, నీ పలుకే ప్రేమ వేదం

ఆశలే బాసలై కలలుగనే పశి మనసులై 

కవితలు పాడీ కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ 

కళ్ళు కళ్ళు మూసుకున్న హృదయంతో మాట్లాడునమ్మా ప్రేమా

నిద్దుర చెదిరీ పోయేనమ్మా నేస్తం కోసం వెతికేనమ్మా ప్రేమా

ఆడించి పాడించి అనురాగం కురిపించీ అలరించేదే ప్రేమా

రమ్మంటే పొమ్మంటూ, పొమ్మంటే రమ్మంటూ కవ్వించేదే ప్రేమా

ప్రేమలకు హద్దుల్లేవులే దాన్ని ఎవ్వరైనా ఆపలేరులే 

నీ పిలుపే ప్రేమగీతం

జాతీ లేదు మతమూ లేదు కట్నాలేవీ కోరుకోదు ప్రేమా

ఆదీ లేదు అంతం లేదు లోకం అంతా తానై ఉండును ప్రేమా 

ఊరేదో పేరేదో కన్నోళ్ళ ఊసేదో అడగదు నిన్ను ప్రేమా 

నాలోనా నీవుండీ నీలోనా నేనుండీ జీవించేదే ప్రేమా 

జాతకాలు చూడబోదులే ఎన్ని జన్మలైనా వీడిపోదులే 

నీ పిలుపే ప్రేమగీతం, నీ పలుకే ప్రేమ వేదం

ఆశలే బాసలై కలలుగనే పశి మనసులై 

కవితలు పాడీ కవ్వించనీ కవ్వించనీ కవ్వించనీ 

Tuesday, March 4, 2025

Marala Telupana (మరల తెలుపన ప్రియా) - Swayamvaram

Song Name :Marala telupana
Movie:Swayamvaram
Singers:K.S. Chitra garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Vandemataram Srinivas garu
DirectorVijay bhaskar garu 

మ ప మ ప ని రి మ రి మ స

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

యెదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 

యెదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 

కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని 

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని 

అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని 

అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని 

నిదురపోని కన్నులలో పవళించు ఆశలని 

చెప్పలేక చేతకాక మనసుపడే తడబాటుని 

మరల తెలు...ప్రియా..మరల తెలుపన 

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి 

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి 

మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి

మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి

ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన 

తెలియరాక తెలుపలేక మనసుపడే మధురబాధ  

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

మరల తెలుపన ప్రియా మరల తెలుపనా 

Monday, January 27, 2025

Priya Ragale gundelona - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా [Hello Brother]

Song Name :Priya ragale gundelona
Movie:Hello Brother
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Raj - Koti garu
DirectorE.V.V Satyanarayana garu

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం.

తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం 

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంట

వేకువపూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతీ లయా నేనౌతా

కలకాలం కౌగిలై నినేచేరుకోని, కనురెప్పల నీడలో కలే ఒదిగిపోనీ 

ఓ ప్రియా... ఓ..దరిచేరితే దాచుకోనా, తొలిప్రేమలే దోచుకోనా

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

సవ్వడి చేయని యెవ్వనవీణలు  అలా అలా సవరించు పదే పదే పలికించు 

వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించు సుఖాలలో తేలించు 

పెదవులతొ కమ్మనీ కధే రాసుకోన 

వొడిచేరి వెచ్చగా చలే కాసుకోన 

ఓ ప్రియా ఓ.. పరువాలనే పంచుకోనీ, పడుచాటలే సాగిపోనీ 

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం. 

తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం 

ఓ.. ఓ.. ఓ...

Friday, September 27, 2024

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట (chinarayudu)

Song Name :Bulli Pitta bujji pitta
Movie:Chinarayudu
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Bhuvanachandra garu
Composer:Illayaraja garu
DirectorB. Gopal garu

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట పంజరాన రామచిలుక ఎట్టావున్నది

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట పంజరాన రామచిలుక ఎట్టావున్నది

అది ఎవరే ఎవరే తెలిపేది ఎన్నినాళ్ళే ఇట్టా గడిచేది 

అది ఎవరే ఎవరే తెలిపేది ఎన్నినాళ్ళే ఇట్టా గడిచేది 

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట పంజరాన రామచిలుక ఎట్టావున్నది

నిన్నే తలుచుకుంటు ప్రాణం నిలుపుకుంటు నీకై నిలిచివుంది శ్వాశ 

కాలం కరుగుతున్న శోకం పెరుగుతున్నా ఎదో జరుగునన్న ఆశ

పూమాల వాడలేదు పారాణి ఆరలేదు అయినా లోకం జాలిచూపదే 

నీ గుండె చప్పుడింక నా గుండె చేరలేదు అయినా అయినా కథ మారదే 

కష్టాలన్నీ గాయాలే అవి కాలంతోటే మారాలే..

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట చెట్టుమీద పాలపిట్ట ఊరిలోని గోరువంక ఎట్టావున్నదే 

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట పంజరాన రామచిలుక ఎట్టావున్నది

నువ్వే దేవుడివన్నా ఊరే నిందిస్తు ఊంటే చెప్పలేని గుండెకోత 

కళ్ళే కలుపుకొని ఎన్నొ కలలుగన్న వేళే కాటేసింది బాధ 

మురిపాల కట్టుకున్న పొదరిల్లు కూలిపోతె ఎదలో రగిలే మంటలారునా 

నూరేళ్ళ పంట ఇట్ట మూణ్ణాళ్ళ ముచ్చటైతే మామా మామా వ్యధ తీరున 

మళ్ళీ ఎట్టా కలిసేది నా ప్రాణం ఎట్టా నిలిపేది

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట పంజరాన రామచిలుక ఎట్టావున్నది

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట చెట్టుమీద పాలపిట్ట ఊరిలోని గోరువంక ఎట్టావున్నదే 

అది ఎవరే ఎవరే తెలిపేది ఎన్నినాళ్ళే ఇట్టా గడిచేది 

అది ఎవరే ఎవరే తెలిపేది నేనెట్టా ఎట్టా బతికేది  

బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వపిట్ట పంజరాన రామచిలుక ఎట్టావున్నది