Saturday, May 16, 2026

Andamga lena [అందంగాలేనా అస్సలేం బాలేనా] - Godavari

Title :Andamga lena
Movie:Godavari
Singers:Sunita Upadrashta గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Sekhar Kammula గారు

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అలుసైపోయానా అస్సలేమీకానా వేషాలూ చాల్లేపొమ్మనా 

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా.. 


కనులుకలపవాయే మనసుతెలుపవాయే పెదవికదపవాయే మాటవరసకి  

కలికి చిలకలాయే కొలత నిదురలాయే మరవలేక నిన్నే మదనపడితినే 

ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వోచ్చి అడగాలి అన్నట్టు నేబెట్టు చేసాను ఇన్నాళ్ళుగా  

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..


నీకు మనసుఇచ్చా, ఇచ్చినపుడే నచ్చా, కనుల కబురుతెచ్చా తెలుసు నీకది

తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు, మహాతెలియనట్టు నటనలే అదీ 

వెన్నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా 


అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అలుసైపోయానా అస్సలేమీకానా వేషాలూ చాల్లేపొమ్మనా 

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా.. 

Preminche premava [ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా] - Nuvvu Nenu Prema

Title :Preminche premava
Movie:Nuvvu nenu prema
Singers:Shreya Goshal గారు, Naresh Ayyar గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:A.R. Rahman గారు
Director:Obeli N. Krishna గారు

ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా 

ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే 

నే నేనా అడిగా నన్ను నేనే, నే నీవే హృదయం అన్నదే 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి 

సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల విందులు 


పువ్వైనా పూస్తున్నా నీ పరువంగా నే పుడతా 

మధుమాసపు మాలల మంటలు రగిలించే.. ఉసురై..

నీవే నా మదిలో ఆడా నేనే నీ నటనై రాగా 

నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్ధం.. ఉందే.. హో 

తోడై దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మేనం...

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..

నే నేనా అడిగా నన్ను నేనే

నే నేనా అడిగా నన్ను నేనే

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..


నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా

నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా..

తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా 

నే ఒదిగి ఎదపై ఎవరో నిదురించ తరమా 

నీవు సంద్రము చేరే గలగల పారే నది తెలుసా 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే 

నే నేనా అడిగా నన్ను నేనే, నే నీవే హృదయం అన్నదే 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..ప్రేమించే నా ప్రేమవా పూవల్లే పూవల్లే..


రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల విందులు 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల విందులు 

Yamuna teeram [యమునా తీరం సంధ్యా రాగం] - Anand

Title :Yamuna teeram
Movie:Anand
Singers:K.S. Chitra గారు, Hari haran  గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Sekhar Kammula గారు

యమునా తీరం సంధ్యా రాగం 

నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో

నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో

నిలువగనే తేనెల్లొ పూదారి ఎన్నెల్లో గొదారి మెరుపులతో

యమునా తీరం సంధ్యా రాగం 


ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం, చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం 

శిశిరంలో చలిమంటై రగిలేదే ప్రేమ, చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ 

మరువకుమా ఆనంద-మానంద-మానందమాయేటి మధుర కథా 

మరువకుమా ఆనంద-మానంద-మానందమాయేటి మధుర కథా 

యమునా తీరం సంధ్యా రాగం 


ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా, పండెననుకో ఈ బ్రతుకే మనసుతీరా 

శిధిలంగా విధినైనా చేసేదే ప్రేమ, హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ 

మరువకుమా ఆనంద-మానంద-మానందమాయేటి మనసు కథా 

మరువకుమా ఆనంద-మానంద-మానందమాయేటి మనసు కథా 

యమునా తీరం సంధ్యా రాగం 

నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో

నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో

నిలువగనే తేనెల్లొ పూదారి ఎన్నెల్లో గొదారి మెరుపులతో 

Nuvvena na nuvvena [నువ్వేనా నా నువ్వేనా.. నువ్వేనా నాకూ నువ్వేనా] - Anand

Title :Nuvvena 
Movie:Anand
Singers:Shreya Goshal గారు, K.M. Radha krishna  గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Sekhar Kammula గారు

నువ్వేనా నా నువ్వేనా.. నువ్వేనా నాకూ నువ్వేనా 

సూర్యుడల్లే సూదిగుచ్చే సుప్రభాతమేనా 

మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా 

చేరువైనా దూరమైనా ఆనందమేనా.. 

చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆనందమేనా ..ఆనందమేనా ..

నువ్వేనా నా నువ్వేనా.. నువ్వేనా నాకూ నువ్వేనా 


మేఘమల్లే సాగివచ్చి దాహమేదొ పెంచుతావు 

నీరుగుండెలోన దాచి మెరిసి మాయమౌతావు .. కలలేనా కన్నీరేనా 

తేనెటీగలాగ కుట్టి తీపిమంట రేపుతావు 

పువ్వులాంటి గుండెలోనా దారమల్లె దాగుతావు .. నేనేనా నీ రూపేనా 

చేరువైనా దూరమైనా ఆనందమేనా.. 

చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆనందమేనా ..ఆనందమేనా ..

నువ్వేనా నా నువ్వేనా.. నువ్వేనా నాకూ నువ్వేనా 


కోయిలల్లె వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు

కొమ్మగొంతులోన గుండే కొట్టుకుంటె నవ్వుతావు.. ఏ రాగం ఇది ఏ తాళం 

మసక ఎన్నెలల్లె నీవు ఇసకతిన్నె చేరుతావు

గసగసాల కౌగిలింత గుసగుసల్లే మారుతావు.. ప్రేమంటే నీ ప్రేమేనా 

చేరువైనా దూరమైనా ఆనందమేనా.. 

చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆనందమేనా ..ఆనందమేనా ..

నువ్వేనా నా నువ్వేనా.. నువ్వేనా నాకూ నువ్వేనా 

Ninnu road mida chusinadi lagayatu [నిన్ను రోడ్డుమీద చూసినది లగాయతు] - Allari alludu

Title :lagayathu
Movie:Allari alludu
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra  గారు
Lyricist:Veturi Sundararama murty గారు
Composer:M.M. Keeravani గారు
Director:A. Kodanda rami reddy గారు

నూనూగు మీసాల నూత్నయెవ్వనమున ఏలూరు సీ ఆర్ రెడ్డి కళాశాలలో 

ఓ రాణీ ప్రేమపురాణం ఆ ముచ్చటకైన ఖర్చు 

రోజంతా జంట షికార్లు ఊరంతా ఉత్త పుకార్లు 

మరపురావు కాలేజీ రోజులు ..once more

మరపురావు కాలేజీ రోజులు.. వాహ్ క్యాబాత్ హై


నిన్ను రోడ్డుమీద చూసినది లగాయతు, నాను రోమియోగా మారినది లగాయతు

నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సెగాయతు, అది భామకాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు, నన్ను కౌగిలింత కోరినది లగాయతు

నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు, ఇక చూడు ప్రేమలోతు 


కాంచనమాల లగాయతు లగాయతు, సూర్యకుమారి లగాయతు లగాయతు

నేను కానా నీకు లేనా

ఆ రోజుల్లో మీ ఆడాళ్ళల్లో, కట్‌బ్లౌసుల్లో లైల ఫోజుల్లో

మొహమాటాలే విడిచి మొగుడాటల్లో గెలిచి 

ప్లాటుఫారమో పార్కుతీరమో, ప్రేమలేఖల రాయబారమా

జన్మకురానిది మన్మధ సీసను ప్రేమటపాలపు అడ్రస్స్ యు మై లవ్ 

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు, నన్ను కౌగిలింత కోరినది లగాయతు

నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు, ఇక చూడు ప్రేమలోతు 


యస్ డీ బర్మన్ లగాయతు లగాయతు, ఆనంద్ బక్షి లగాయతు లగాయతు

నీది రాగం నాది భావం 

ఈ కౌగిట్లో సాగే డ్యూయట్లో, సిగ్గందిట్లో జారే సందిట్లో 

చలిపాఠాలే కదిలి వలపాటల్లో కరిగి 

లవ్ పరిక్షలో ఫస్ట్ రాంకులో హిట్టూ కొట్టనా జట్టు కట్టనా

నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల ప్రేమజపాలకు అడ్రస్స్ ఐ లవ్ యూ..


నిన్ను రోడ్డుమీద చూసినది లగాయతు, నాను రోమియోగా మారినది లగాయతు

నాకు గుండెల్లోన పుట్టుకొచ్చే సెగాయతు, అది భామకాదు బక్ బక్ 

నిన్ను క్లాసులోన చూసినది లగాయతు, నన్ను కౌగిలింత కోరినది లగాయతు

నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు, ఇక చూడు ప్రేమలోతు 

Saturday, May 2, 2026

Naalo oohalaku [నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు] - Chandamaama

Title :nalo uhalaku 
Movie:Chandamaama
Singers:Asha Bhonsle గారు
Lyricist:Anant Sreeram గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Krishna Vamsi గారు

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 

పరుగులుగా.. పరుగులుగా అవే ఇలా ఇవాళె నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 


కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే 

పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే 

శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమౌతోందిలా 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 


మౌనమే విరుగుతు బిడియమే ఉరుగుతు

మనసిలా మరుగుతు అవధులే కరుగుతు 

నిన్ను చూస్తు ఆవిరౌతు అంతమవ్వాలనే 

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు 

పరుగులుగా.. పరుగులుగా అవే ఇలా ఇవాళె నిన్నే చేరాయి

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు 

Regumullole / Meesalu gucchakunda [రేగు ముళ్ళోలే / మీసాలు గుచ్చాకుండ] - Chandamaama

Title :Misalu gucchakunda / regu mullole
Movie:Chandamaama
Singers:Karthik గారు, M.M. Sreelekha గారు
Lyricist:Suddala Ashok teja గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Krishna Vamsi గారు

గమనిక: యాస మరియు పాటలోని దీర్ఘాలని మార్చకుండా రాయటం జరిగింది. కనుక, కొంచెం పదాలు సాగతీతలాగా ఉండి తప్పులుగ అనిపించొచ్చు. 


రేగు ముళ్ళోలే నాటు సిన్నాది, బొడ్డూ మల్లేను సూడూ అన్నాది

మీసాలు గుచ్చాకుండ ఒరె బావో ముద్దాడుతావా అంది 

కందిపూవల్లే ముట్టూకుంటాను కందీరీగల్లే కుట్టీపోతాను 

కుచ్చిళ్ళు జారకుండా ఒయ్ బావో కౌగిళ్ళు ఇవ్వూ నువ్వు 

నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటె వడదెబ్బ 

నువ్వు కెలకమాకు మనసబ్బా ఇక నిదుర రాదు నీ యబ్బా 

మీసాలు గుచ్చాకుండ 


కోనేటి నీళ్ళల్లో వంగిందిరో కుండల్లే నా గుండె ముంచిందిరో 

తను తడిసిందిరో నను తడిపిందిరో 

ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో కొమ్మొంచి కాయేదో తెంపిందిరో 

అది జాంపండులా నను తింటుందిరో 

ఎదురే పడితే ఎదలో గుండుసూదల్లే దిగుతావురో 

తన కనులు కిలికి సింగారి, తన జడలు విసిరి వొయ్యారి 

చిరు నగవు చిలికి ఒకసారి, కొస పెదవి కొరికి ప్రతిసారి 

మీసాలు గుచ్చాకుండ ఒరె బావో ముద్దాడుతావా నువ్వు 


ఆ జొన్న చేలల్లో పక్కందిరో, ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో 

బులుపే తీరక కసి ఊరిందిరో 

ఓసారి నాతోని సయ్యంటెరో, దాసోహమౌతాను నూరేళ్ళురో 

ఇక తన కాళ్ళకే పసుపౌతానురో 

ఇదిగో పిల్లగో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో 

నీ నడుముపైన ఒక మడతై పై జనమ లోన ఇక పుడతా 

అని చెలిమి చేరి మొరపెడితే తెగకులుకులొలికి ఆ సిలకా 

మీసాలు గుచ్చాకుండా ఒసె భామా ముద్దాడలేనే నేను 


కందిపూవల్లే ముట్టూకుంటాను కందీరీగల్లే కుట్టీపోతాను 

కుచ్చిళ్ళు జారకుండా ఒయ్ బావో కౌగిళ్ళు ఇవ్వూ నువ్వు 

మీసాలు గుచ్చాకుండ ఒరె బావో ముద్దాడుతావా అంది 

Wednesday, April 29, 2026

Kanulu terichina kanulu musina [కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల] - Aanandam

Title :Kanulu terichina 
Movie:Aanandam
Singers:Mallikharjuna గారు, Sumangali గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:Devi Sri Prasad (DSP) గారు
Director:Sreenu Vaitla గారు

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల

ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా, ఇదిగో ఇపుడే చూసా సరిగా

ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన

అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల


పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది

నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది

ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది

అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది 

దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది 

కానీ ఆ దూరమె నిన్ను దగ్గరే చేసింది

నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది 

నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని 

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల


ప్రతి నిముషం నా తలపంత నీ చుట్టూ తిరిగింది

ఎవరైన కనిపెడతారని కంగారుగ ఉంటొంది 

నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది 

నాక్కూడ ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది 

అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే 

నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే 

ప్రేమా ఈ కొత్తస్వరం అనుమానం కలిగింది

నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువు ఇయ్యమంది మరి 


కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల

ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా, ఇదిగో ఇపుడే చూసా సరిగా

ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన

అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా 

Saturday, April 25, 2026

Kita kita talupulu [కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం] - Manasanta Nuvve

Title :kita kita talupulu
Movie:Manasanta nuvve
Singers:K.S. Chitra గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:R.P. Patnaik గారు
Director:V.N. Aditya గారు

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా.. ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం


నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదరేరాక కమ్మని కలలో ఐనా నిను చూడలేదే  

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే 

నాకోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా, కాస్సేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా 

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం


కంటతడి నాడూ నేడు చెంపతడి నిన్నే చూడు చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా 

చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం ఐపోలేదా ఆవేదనంతా 

ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా 

ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా 

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

Manavude mahaniyudu [మానవుడే మహనీయుడు] - Bala Bharatam

Title :Manavude mahaniyudu
Movie:Bala bharatam
Singers:Ghantasala గారు
Lyricist:Aarudra గారు
Composer:Saluri Rajeswara rao గారు
Director:K. Koteswara Rao గారు

మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు

శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు.. మానవుడే మహనీయుడు

మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే 

ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే 

మానవుడే మహనీయుడు.. మానవుడే మహనీయుడు


దివిజ గంగ భువిదించిన భగీరథుడు మానవుడే 

సుస్థిర తారగ మారిన దృవుడుకూడ మానవుడే 

సృష్టికి ప్రతిసృష్టిచేయు విశ్వామిత్రుడు నరుడే 

జీవకోటి సర్వములో శ్రేష్టసముడు మానవుడే 

మానవుడే మహనీయుడు..మానవుడే మహనీయుడు


గ్రహరాశులనధిగమించి ఘనతారల పథమునుంచి

గ్రహరాశులనధిగమించి ఘనతారల పథమునుంచి

గగనాంతర రోదశిలో గంధర్వగోళ తతుల దాటి **

చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా  

చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా  

బొందితో జయించి మరల భూమికి తిరిగిరాగలిగే **

మానవుడే మహనీయుడు..శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు.. 

మానవుడే మహనీయుడు..మానవుడే మహనీయుడు 

Sunday, April 19, 2026

Veera vikrama dheera diggaja [వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు] - Adavi Donga

Title :Vira vikrama dheera diggaja
Movie:Adavi Donga
Singers:S.P. Balasubramanyam గారు, P.Suseela గారు
Lyricist:Veturi Sundara Rama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు 

వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు 

వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు

మహరాజులా మనసేలుకో, మహరాణిలా మనువాడుకో


వచ్చే వసంతకాలం విచ్చేసుమాల గంధం, నీకై తపించి నిన్నే జపించే అందం 

కవ్వించు తేనె దీపం కౌగిళ్ళ ప్రేమ శిల్పం, నేనై చలించి నిన్నే వరించె బంధం 

కొండరకి పండు ముద్దంటా, నా కొండమల్లి నువ్వంటా 

రసాలా నవరసాల యమ మసాలా వేడిలో  

లవ్‌బాయ్‌లా లాలించవా కౌబాయ్‌లా కవ్వించనా 

వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు 

వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు


వాటెయ్యకుంటే పాపం వయ్యారమెంత శాపం, పూచేటి సోకు దాచేసుకోకు నేరం

వలపన్నదెంత వేగం వలవేసిపట్టె మోహం, తీరేదికాదు నూరేళ్ళ దాహం 

నీరూపు నాకు చుక్కంటా, నాలేత బుగ్గకిమ్మంటా 

పెట్టించు లగ్గమెట్టించు ముద్దుపుట్టించే వేళలో 

జాంపండులా దొరికావులే జేంస్‌బాండులా కలిసావులే 

వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు 

వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు


కౌగిళ్ళు నీకు పంచే కసిఈడు కాస్త పెంచే, కవ్వింతలోన ఉన్నంత దోచిపోరా

మల్లెల్లో ఇల్లు కట్టి మసకల్లో కన్నుకొట్టి, దీపాలవేళ తాపాలు తీర్చి పోవే

చిలకంటి దాన్ని నేనంటా, అలకల్లొ ఉంది సోకంతా 

తందానా తన తందానా జంటతాళాలే సాగనీ

హీరోలకే హీరోవిరా హీమానులా ప్రేమించనా 

వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు 

వాలు చూపుల వన్నెలాడికి వయసే అంకితాలు

మహరాజులా మనసేలుకో, మహరాణిలా మనువాడుకో 

Saturday, April 11, 2026

Nenu puttanu lokam mecchindi [నేను పుట్టాను లోకం మెచ్చింది] - Prem nagar

Title :Nenu puttanu 
Movie:Prem nagar
Singers:Ghantasala గారు
Lyricist:Aatreya గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K.S. Prakasa Rao గారు

నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది

నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింక లోకంతో పని ఏముంది 

నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది

నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింక లోకంతో పని ఏముంది .. డోంట్ కేర్


నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి

నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి

నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి

నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి 

నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిసాయి 

తెల్లవారితే వెనకనజేరి నవ్వుకుంటాయి .. డోంట్ కేర్

నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది

నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింక లోకంతో పని ఏముంది 


మనసును దాచేటందుకె పైపై నవ్వులు ఉన్నాయి 

మనిషికి లేని అందం కోసమె రంగులు ఉన్నాయి 

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి  

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి  

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నయి 

.. డోంట్ కేర్

నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది

నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింక లోకంతో పని ఏముంది 


మనిషిని మనిషి కలిసేటందుకే పెదవులు ఉన్నాయి 

పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి 

బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయ్ 

బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయ్ 

అగ్గిపుల్లా గీచేసేయ్ నీలో సైతాన్ తరిమేసేయ్.. డ్రైవ్ దీ డెవిల్ అవుట్ ...  

Ni Navve chalu pubanti [నీ నవ్వేచాలు పూబంతీ చామంతి] - Peddarikam

Title :ni navve chalu 
Movie:Peddarikam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Raj-Koti గారు
Director:A.M. Rathnam గారు

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

ఆ మాటే చాలు నెలవంకా రా ఇక, ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక 

విలాసాల దారికాసా సరాగాల గాలమేసా 

కులాశాల పూలు కోసా వయ్యారాల మాల వేసా 

మరో నవ్వు రువ్వరాదటే ..

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి


మల్లెపూల మంచమేసి హుషారించనా, జమాయించి జాజిమొగ్గ నిషాచూడనా

తెల్లచీర టెక్కులేవో చెలాయించనా, విర్రవీగు కుర్రవాణ్ణి నిభాయించనా 

అతివకు ఆత్రము తగదటగా, తుంటరి చేతులు విడువవుగ మనసుపడే పడుచు ఒడి

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి


కోరమీసమున్నవాడి కసేచూడనా, దోర దోర జామపళ్ళ రుచే చూపనా 

కొంగుచాటు హంగులన్ని పటాయించనా, రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా 

పరువము పరుపుల పరమటగా, వయసున సరసము సులువటగా తధిగిణతోం మొదలెడదాం 


నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ప్రేమించా నిన్ను వాసంతీ మాలతి

విలాసాల దారికాసా సరాగాల గాలమేసా 

కులాశాల పూలు కోసా వయ్యారాల మాల వేసా 

మరో నవ్వు రువ్వరాదటే ..

నీ నవ్వేచాలు పూబంతీ చామంతి, ఆ మాటే చాలు నెలవంకా రా ఇక 

Sunday, April 5, 2026

Meghale taakindi [మేఘాలె తాకింది హై హైలెస్స] - Preminchukundam Raa

Title :Meghale taakindi
Movie:Preminchukundam raa
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Sita rama sastry గారు
Composer:Mani Sharma గారు
Director:Jayant C Paranji గారు

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నా మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిషా, చెలరేగాలి రమ్మంది 

హల్లో అంటూ వొళ్ళోవాలే అందాల అప్సరస 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిషా, అది నా శ్వాస చేరి

హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ 


తొలిసారి నిను చూసి మనసాగక, పిలిచానే చిలకమ్మ మెలమెల్లగా

తెలుగంత తీయ్యంగా, నువ్ పలికావే స్నేహంగా

చెలిమన్న వలవేసి నను లాగగా, చేరాను నీ నీడ చలచల్లగా 

గిలిగింత కలిగేలా, తొలివలపంటే తెలిసేలా

కునుకన్న మాటే నను చేరక 

తిరిగాను తెలుసా ఏం తోచక 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా


తొలిపొద్దు వెలుగంత చిరు వేడిగా, నిలువెల్ల పులకింత చిగురించగా 

దిగులేదో హాయేదో గుర్తుచెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కలఏదో మరిపించగా 

పగలేదో రేయేదో రెండుకలిసాయి నీ చెంత 

ప్రేమంటే ఇంతే ఏమోమరి

దానంతు ఏదో చూస్తే సరి 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిషా, అది నా శ్వాస చేరి

హల్లో అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ 

మేఘాలె తాకింది హై హైలెస్స, నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 

Saturday, April 4, 2026

Dikkulu chudaku ramayya [దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా] - Kalpana

Title :Dikkulu chudaku ramayya
Movie:Kalpana
Singers:G. Anand గారు, P. Suseela గారు
Lyricist:Veturi sundara rama murthy గారు
Composer:Chakravarthi గారు
Director:K. Raghavendra Rao గారు

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా.. సీతమ్మా

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ 

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ 


ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగిఉంటావో

ఎదనే దాచుకుంటావో నా ఎదనే దాగిఉంటావో

కదలికలన్ని కధలుగ అల్లి కవితలే రాసుకుంటావో.. రామయ్యా

పొన్నలు పూచిన నవ్వు సిరి వెన్నెల దోచి నాకివ్వు 

పొన్నలు పూచిన నవ్వు సిరి వెన్నెల దోచి నాకివ్వు ..

ఆ వెన్నెలలో నీ కన్నులలో ...

ఆ వెన్నెలలో నీ కన్నులలో 

సన్నజాజులేరు కను సన్నజాజులేరు

సన్నజాజులేరు కను సన్నజాజులేరు.. సీతమ్మా.. సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ 


కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో..

కలలో మేలుకుంటావో నా కళలే ఏలుకుంటావో..

కలలిక మాని కలయికలో నా కనులలో చూసుకుంటావో .. రామయ్యా

వెల్లువలైనది సొగసు తొలి వేకువ నీ మనసు 

వెల్లువలైనది సొగసు తొలి వేకువ నీ మనసు 

ఆ వెల్లువలో నా పల్లవిలో 

ఆ వెల్లువలో నా పల్లవిలో 

రాగమే పలికించు అనురాగమై పులకించు 

రాగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మా సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్యా పక్కనె ఉన్నది సీతమ్మా

సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకురావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ  

Friday, April 3, 2026

Talachi talachi chuste [తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా] - 7G Brundavan Colony

Title :Talachi talachi chuste
Movie:7G Brundavan colony
Singers:Shreya Goshal గారు
Lyricist:Siva Ganesh గారు
Composer:Yuvan Shankar Raja గారు
Director:Selva Raghavan గారు

తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా.. 

నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని

తెరచి చూసి చదువు వేళ, కాలిపోయే లేఖ రాసా 

నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని


కొలువుతీరు తరువుల నీడ, చెప్పుకొనును మన కథనిపుడు 

రాలిపోయిన పూలగంధమా 

రాక తెలుపు మువ్వల సడిని, తలచుకొనును దారులు ఎపుడు 

పగిలిపోయిన గాజుల అందమా 

అరచేత వేడిని రేపే, చెలియ చేయి నీ చేత 

ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు 

తొలిస్వప్నం చాలులే ప్రియతమా.. కనులు తెరువుమా..


మధురమైన మాటలు ఎన్నో, కలసిపోవు నీ పలుకులలో

జగము కరుగు రూపే కరుగునా 

చెరిగిపోని చూపులు అన్నీ, రేయిపగలు నిలుచును నీలో 

నీదుచూపు నన్ను మరచునా 

వెంటవచ్చు నీడ బింబం, వచ్చి వచ్చి పోవు 

కళ్ళముందు సాక్ష్యాలున్నా తిరిగినేను వస్తా..

ఒకసారి కాదురా ప్రియతమా .. ఎపుడు పిలిచినా..


తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా.. 

నీకై నేను బ్రతికి ఉంటిని.. ఓ.. నీలో నన్ను చూసుకుంటిని 

Tolivalape tiyyanidi [తొలివలపే తీయ్యనిది ఆ బాధే తీరనిది] - Yuvaraju

Title :Tolivalape tiyyanidi
Movie:Yuvaraju
Singers:Hariharan గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Ramana Gogula గారు
Director:Y.V.S. Chowdary గారు

తొలివలపే తీయ్యనిది  ఆ బాధే తీరనిది

కాలంలా కరిగిపోనిది దానంలా తిరిపోదది


వేదంలాగా లిపి లేనిది

వేదిస్తున్నా సుఖమైనది

ఓడిస్తున్నా గెలుపే అది

ఓదార్చే ఓ పిలుపైనది

చుక్కలనే ఇరుపునది దిక్కులనే కలుపునది.. అకాశం తానే ఉన్నది

ఒక్కరిలో ఇద్దరది, ఇద్దరిలో ఒక్కటది నీకోసం నేనై ఉన్నది

తొలివలపే... ఆ బాధే...


గుండెల్లోన గూడే ఇది

గుచ్చే రోజామాలే అది

మాటల్లోన మౌనం అది

మనసుల్లోన ధ్యానం అది 

ఏ రుణమో తెలియనది ఏ వరమో అడగనిది, ఏ మజిలి చేరేనో అది

ఎప్పటిదో ఎరుగనిది ఎన్నటికి మరువనిది ఓ కథలా చేరే కంచికి


తొలివలపే తీయ్యనిది  ఆ బాధే తీరనిది

ఎదకన్నా లోతుగుంటది బతుకల్లే తోడు ఉంటది 

Sunday, March 29, 2026

kasta nannu nuvvu [కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే] - Student No 1

Title :Kasta nannu nuvvu
Movie:Student No 1
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Chandrabose గారు
Composer:M.M. Keeravani గారు
Director:S.S. Rajamouli గారు

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే 

రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే, మంటచుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే  

నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది 

పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది 

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే 

రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే, మంటచుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే  

నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది 

పెదాల్లో నవ్వు కెవ్వు పువ్వై పూస్తుంది 


అమ్మడూ నీ యెవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే 

కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే 

పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే 

మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే 

చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్ కన్నెదాని వన్నెప్రాసనవ్వలోయ్ 

అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్ అందగాడి గోటిముద్ర కావాలోయ్ 

ఓ....

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే, కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే 

చేరుకున్న చోట ఉన్న దీపమారుతుంటే, ఆరుతున్నవేళ  కన్నె కాలుజారుతుంటే 

నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది 

పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది 


మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే 

గుట్టిగా నీ బంగారం తలకు తగులుతుంటే 

కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలౌతుంటే 

పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే 

బుగ్గలోన పండుతుంది జాంపండు, పక్కలోన రాలుతుంది ప్రేంపండు 

రాతిరేళ వచ్చిపోర రాంపండు బంతులాడి పుచ్చుకోర భాంపండు

ఓ...

కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే

ఆపలేక నేను నిన్ను జాలిచూపమంటే 

చూపనంటు నేను తీపి ఆస రేపుతుంటే

రేపుతుంటె నేను రేపుకాదు ఇప్పుడంటే 

నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది 

పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది 

నరాల్లో లవ్వు గివ్వు జివ్వు పుడుతుంది 

పెదాల్లో నవ్వు గివ్వు పువ్వై పూస్తుంది 

Malli kooyave guvva [మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ] - Itlu Sravani subramanyam

Title :malli kooyave guvva
Movie:Itlu sravani subramanyam
Singers:Hariharan గారు, Kousalya గారు
Lyricist:Kandikonda గారు
Composer:Chakri గారు
Director:Puri Jagannadh గారు

మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

విధివరమే నీవేగా నీవేగా కలనిజమై పూచేగా పూచేగా 

జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ

జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ జువ్వా జువ్వా

మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా


సిరి సిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతిపదమున నీ గానమే 

సిరి సిరి మువ్వలా చిరుసడి వింటే స్మృతిపదమున నీ గానమే 

పొంగిపారే ఏటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే

సోకేటి పవనం నువ్వు మురిపించే గగనం 

కోనేటి కమలం లోలోని అరళం 

కలత నిదురలో కలలాగా జారిపోకె జవరాలా 

నీలిసంద్రమున అల లాగా హృదయలోగిలిలో నువ్వా నువ్వా నువ్వా 

మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా


తీయ్యనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీకోసమే 

తీయ్యనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీకోసమే 

సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులో తగిలెను నీ మృదుపాదమె

ఎగిసేటి కెరటం చేరేలే తీరం

చీకటిలో పయనం నువ్వేలే అరుణం 

వలపు వరదలో నదిలాగా తడిపిపో జడివానలా 

మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో నువ్వా నువ్వా నువ్వా 


మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా

విధివరమే నీవేగా నీవేగా కలనిజమై పూచేగా పూచేగా 

జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ

జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువ్వ జువ్వా జువ్వా

మళ్ళికూయవే గువ్వా మోగిన అందెల మువ్వ

తుళ్ళిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా 

Saturday, March 28, 2026

Musuguveyyoddu manasu meeda [ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద] - Khadgam

Title :Musuguveyyoddu manasumida
Movie:Khadgam
Singers:Kalpana గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Devi sri prasad గారు
Director:Krishna vamsi గారు

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 

ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా 

మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరు రా 

మనకి తోచిందే చేసిచూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా 

హ ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 


సూర్యుడైన చూపగలడా రేయిచాటున్న రేపుని

చీకటైన ఆపగలదా వచ్చే కలల్ని వద్దని 

పిరికి పరద కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని 

దేవుడైన చెప్పగలడా సమస్యలరేరే రావని 

ఎన్నొ అందాలు స్వాగతిస్తు కళ్ళముందుండగా 

అందుకోకుండా ఆగిపోతు ఉసూరుమంటే ఎలా 

ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు ఉండవుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 


కొంతకాలం నేలకొచ్చాం అథిధులై ఉండి వెళ్ళగా  

కోటలైన కొంపలైన ఏవి స్తిరాస్థి కాదుగా 

కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా 

అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటాన లేదుగా 

నిన్నలేమైన గురుతుకొస్తే తీపి అనిపించనీ 

ఉన్న కొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ 

నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసినడుద్దాం 

సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం 

 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద  

Chilakapaccha koka [చిలకపచ్చకోక పెట్టినాదికేక ] - Narasimha Nayudu/Naidu

Title :Chilakapaccha koka
Movie:Narasimha naidu
Singers:Nagur babu (Mano) గారు, Radhika గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Mani sharma గారు
Director:B. Gopal గారు

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

చిలకపచ్చకోక హ పెట్టినాదికేక 


చంపకమాలా చంపకే బేలా చాటుముద్దుల్లోనే ఉంది ఘాటుమసాలా 

కొంటెగోపాలా ఆపరగోలా సరసానికి ఉందిరయ్యో వేళాపాళా 

వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోద ఒసే తూగుటుయ్యాలా 

వద్దు వద్దన్నా ముద్దుపెట్టేసే మగసిరినీకుందిగా మురళిలోలా 

పిల్లచూస్తె జామకాయలే దీంతస్సదియ్య కొరకబోతె మిరపకాయలే 

చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే 

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 


నిన్నుచూసాకే వెన్నుమీటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో 

చెనుపట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో 

పాలుకావాలా పళ్ళుకావాలా పళ్ళుపాలతోటి పడుచుపిల్ల కావాలా 

చెంతచేరాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే 

ఏడూళ్ళా అందగత్తిని నీసోకుమాడ పట్టుకుంటె అత్తిపత్తిని 

హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి 


చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా హొయ్ 

Satamaanamannadi le chelime [హే శతమానమన్నదిలే చెలిమే ] - Mrugaraju

Title :He satamaanamannadi le
Movie:Mrugaraju
Singers:Hari haran గారు, Saadhana Sargam గారు
Lyricist:Veturi Sundara rama murthy గారు
Composer:Mani sharma గారు
Director:Guna sekhar గారు

హే శతమానమన్నదిలే చెలిమే 

చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే

కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల

హే శతమానమన్నదిలే చెలిమే 

పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా 

నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా హల

హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే 

వంక జాబిల్లి వలపులు జల్లే


విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే

కన్నానులే నీ కన్నుల్లోన కల్లలే కన్న సావాసమే 

కోకిలలా కిలకిలలే మన పూదోటలో 

తేనెలలా వెన్నెలలే వేసవిపూటలో 

ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన 

హే శతమానమన్నదిలే చెలిమే 

పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా 


చూడాలని చలి కాటేపడని చోటే గిచ్చి చూడాలని 

చెప్పాలని నీ చూపేసోకని సోకే అప్పజెప్పాలని 

మరి పదవి విరి పొదకే చెలి మర్యాదగా

యెదకడిగే ఎదురడిగా సిరిదోచెయ్యగా  

వీణవో జాణవో రతి ముఖ సుఖ శృతిలోన

  

హే శతమానమన్నదిలే చెలిమే 

చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే

కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల

హే శతమానమన్నదిలే చెలిమే 

పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా 

నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా హల 

Navami dasami [నవమి దశమి తగిన రోజులు ] - Bavagaru baagunnara

Title :Navami dasami
Movie:Bavagaru bagunnara
Singers:Hari haran గారు, Sujata గారు
Lyricist:Chandraboase గారు
Composer:Mani sharma గారు
Director:Jayanth C Paranji గారు

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు

మకరం మిథునం వృషభ రాశులు అనుకూలించును రసికులకు

దొరికినది సమయం ఓ, విరహముతో సమరం

సాయం అందించు ఆలించు పాలించు

బిడియం చాలించు చుంబించు చిగురించు

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు


ప్రాయం పెరటిలో లతలు అడిగే తొలకరి చినుకువు నువ్వే

సాయం సంధ్యలో స్వాగతించే పడమర ప్రమిధవు నువ్వే

చెంగావి రంగుల్లో చీరని, కంగారు రాగాలో తీయనీ

దీపం వెలిగించు ఒడిపంచు చలిదించు

తాపం వివరించు వినిపించు వికసించు

నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు


స్వర్గం దారిలో పరుగుతీసే పరువపు పరబరి** నీదే

సర్వం దోచంగా ఎదురుచూసే మదనుడి ఒరవడి నీదే

కావేరి పొంగుల్లో మునగనీ, కస్తూరి తిలకాలే కరగనీ

మైకం కలిగించు కవ్వించు కరుణించు 

మంత్రం పలికించు పులకించు పవళించు


నవమి దశమి తగిన రోజులు యువతి యువకుల తమపనలకు

మకరం మిథునం వృషభ రాశులు అనుకూలించును రసికులకు

దొరికినది సమయం ఓ, విరహముతో సమరం

సాయం అందించు ఆలించు పాలించు

బిడియం చాలించు చుంబించు చిగురించు 

urike chilaka [ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు] - Bombay

Title :urike chilaka 
Movie:Bombay
Singers:Hari haran గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy  గారు
Composer:A.R. Rahman గారు
Director:Mani rathnam గారు

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు 

చెలివై సఖివై రెండుహృదయాల కథలువిను

బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను 

కాటుకా కళ్ళతో కాటువేసావు నన్ ఎపుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు


నీరాక కోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే 

మనసంటి మగువ ఏ జామురాక చితిమంటలే రేపే 

నా కడ ప్రాణం పోనివ్వు కథమాసిపోదు అది కాదు నా వేదనా

విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కృంగి పోయేనులే 

మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా 

ఉరికే చిలకే వచ్చివాలింది కలతవిడి

చెలిగా సఖిలా తానుచేరింది చెలుని ఒడి 

నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 

కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడి 

కాటుకా కళ్ళతో కాటువేసావు నన్ ఎపుడో, కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా వెల్లువైనావే ఎదవరకు


తొలిప్రాణమైన ఒకనాటిప్రేమ మాసేదికాదు సుమా 

ఒక కంటి గీతం జలపాతమైతే మరుకన్ను నవ్వదమ్మా 

నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయెలే 

నే పురివిప్పి పరుగెత్తి గాలల్లేవచ్చా నీ వేణుగానానికి 

అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే 

ఉరికే చిలక వేచిఉంటాను కడవరకు, కురిసే చినుకా ఎల్లువైనావే ఎదవరకు 

చెలివై సఖివై రెండుహృదయాల కథలువిను

మోహమో మైకమో రెండు మనసుల్లో విరిసినది, పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది


ఉరికే చిలకే వచ్చివాలింది కలతవిడి

చెలిగా సఖిలా తానుచేరింది చెలుని ఒడి 

నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి 

Thursday, March 26, 2026

Rama rama raghurama ani padutunna [రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ] - Sri Anjaneyam

Title :rama rama raghurama ani padutunna
Movie:Sri Anjaneyam
Singers:Mallikarjun గారు
Lyricist:Sirivennela sitarama sastry  గారు
Composer:Manisharma గారు
Director:Krishna Vamsi గారు

రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ

అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా

సరదాగా నా గాలిపాట వినుమ, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా

గాలికిపుట్టా గాలికిపెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతోఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా

రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ

అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా


అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ, నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ, నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ

ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా, ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం

అన్నీ సొంతైళ్ళే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం

బతుకంతా ఈది తీరే రుణమా..

రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ

అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా


ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మ, ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా 

ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచికార్యం జరిపించు దైవం 

ప్రభాదివ్యఖాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీఆంజనేయం 

నా వెంటే నువ్వుంటే భయమా ...

రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ

అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా

సరదాగా నా గాలిపాట వినుమ, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా

గాలికిపుట్టా గాలికిపెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతోఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా 

Wednesday, March 25, 2026

Manaseriginavadu ma devudu sriramudu [మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు] - Pantulamma

Title :Manaseriginavadu ma devudu
Movie:Pantulamma
Singers:P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Rajan Nagendra గారు
Director:Singeetam Srinivasarao గారు

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు 

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు 

మధుర మధుర తర శుభనాముడు సునధాముడు 

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు 


ఎరిగినవారికి ఎదలోఉన్నాడు, ఎరుగనివారికి ఎదుటేఉన్నాడు 

మానవుడైపుట్టి మాధవుడైనాడు ..

తలచినవారికి తారకనాముడు పిలిచినపలికే చెలికాడు సైదోడు 

కొలువైఉన్నాడు కోదండరాముడు మనతోడుగా నీడగా రాముడు

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు 

మధుర మధుర తర శుభనాముడు సునధాముడు 

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు 


కరకుబోయను ఆది కవిని చేసినపేరు, గరళకంఠునినోట తరలివచ్చిన పేరు 

ఇహపరసాధనకు ఇరవైనపేరు 

శబరి ఎంగిలిగంగ తానమాడినపేరు, హనుమ ఎదలో భక్తి ఇనుమడించినపేరు 

రామ రామా అంటే కామితమే తీరు, కలకాలము మము కాపాడు పేరు 

మనసెరిగినవాడు మా దేవుడు శ్రీరాముడు 

మధుర మధుర తర శుభనాముడు సునధాముడు  

Tuesday, March 24, 2026

Andala ada bomma [అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ] - Samarasimha reddy

Title :Andala ada bomma
Movie:Samarasimha reddy
Singers:Udit Narayan గారు, Sujata గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Manisharma గారు
Director:B. Gopal గారు

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

కుచ్చిళ్ళ కోనలోన కన్నెచిక్కుకుంది రక్షించు నన్ను చప్పున

గుప్పిళ్ళుదాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 


చెప్పుకుంటే తప్పులేదే ఉప్పుతిన్న నీ ఒంటియాతన

తప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి ఈ కొంటెవేదన

నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా 

కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగ వేచింది వన్నె కన్నె తీగ 

వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించనా 

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 


సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా 

నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతపెట్టనా 

ఒంపుల్ని లెక్కపెట్టి ఒక్కొక్క ముద్దుపెట్టి నీ ప్రేమనారు నాటిపోవా 

ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంత పూతపట్టి నిలువెల్ల మల్లెతోటకావా 

గంధాలు చిందేలా అందాలు పండించవా 

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

కుచ్చిళ్ళ కోనలోన కన్నెచిక్కుకుంది రక్షించు నన్ను చప్పున

గుప్పిళ్ళుదాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

Thursday, March 19, 2026

Akasam kindundi [ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది] - Seshu

Title :Akasam kindundi
Movie:Seshu
Singers:Tippu గారు
Lyricist:Chandrabose గారు
Composer:Yuvan Shankar Raja గారు
Director:Jeevitha Rajasekhar గారు

రేయ్ చియ్యాన్ ఇంకేం నీ లవ్ అప్లికేషన్లో ఆ అమ్మాయి సంతకం చేసిందిరోయ్ 

ఉమ్మ్. ఉహూ.. మామూలు ఇంకుతో కాదురా పిచ్చోడా గ్రీన్ఇంకుతో చేసింది 

అయితే బాడీ గాల్లోతేలిపోతున్నట్టు కళ్ళువాలిపోతునట్టు, వొళ్ళు చలిచలిగాఉన్నట్టు అనిపిస్తోందిరా 

ఛ ఛ అవన్నీ మలేరియా సింప్టంస్ రా.. ఇది లవ్వేరియా

దీని లక్షణాలు ఇదిగో ఇలా ఉల్టా పల్టాగా ఉంటాయి రండి 


ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది

హుషారుగా షికారుగా అటూ ఇటూ తిరిగే నాకు 

హఠాత్తుగా లవ్వేరియ ఫీవరే వచ్చింది

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది


ఒరేయ్ చియ్యన్ మొత్తానికి నీకు ఆ అమ్మయి పడింది, నువ్వా అమ్మయికి పడ్డవ్.. ఇద్దరు కలిసి లవ్లో పడ్డారు .. జాగ్రత్తరోయ్ ఇంకా ఎక్కడెక్కడ పడతారో 

చూడరా నువ్వు ఏం చెప్పిన వినబడట్లేదు.. అస్సలు ఏమి కనబడట్లేదు రా ఆ అమ్మయి తప్ప


రోడ్డుపై నడిచెళుతుంటే పోస్టరై కనిపించింది

రూములో పడుకునిఉంటే ఫ్యానులా తిరుగుతు ఉంది 

ఎవరికో ఫోన్ చేస్తుంటే లినులో తానొచ్చింది 

చివరికి భోంచేస్తుంటే ముద్దలా మురిపించింది 

అమ్మడి రూపమే అంతటా వ్యాపించే 

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది


రేయ్ వీడు చాల డీప్లోకి వెళ్ళిపోయాడురా.. ఇంకీడు పైకిరావడం కష్టం రా 

ఛ నువ్ నోర్ముయ్యిరా .. నువ్వు చెప్పరా చియ్యన్

మిల మిలా మిణుగురులొచ్చి మనసునే మురిపించాయి

కిల కిలా చిలకలు వచ్చి కితకితలు పెడుతున్నాయి 

పగటిలో చీకటివచ్చి కలలనే రప్పించింది 

కలలలో అమ్మాయొచ్చి కలకలం తెప్పించింది  

కొత్తగా వింతగా ఉన్నది ఈ ప్రేమే 

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

అమ్మాయే అవునంది నాకంతా తలకిందౌతుంది

హుషారుగా షికారుగా అటూ ఇటూ తిరిగే నాకు 

హఠాత్తుగా లవ్వేరియ ఫీవరే వచ్చింది

ఆకాశం కిందుంది ఈ నేలేమో ఇక పైనుంది 

Wednesday, March 18, 2026

Idi cheragani premaku srikaaram [ఇది చెరగని ప్రేమకు శ్రీకారం] - Ankusam

Title :Idi cheragani premaku 
Movie:Ankusam
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Mallemaala గారు
Composer:Chakravarthy గారు
Director:Kodi Ramakrishna గారు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు

కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..

కలకాలం వైభోగమస్తు


ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు

కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..

కలకాలం వైభోగమస్తు


కళ్యణ గంధాలు కౌగిలికి తెలుసు, రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు 

పారాణి మిసమిసలు పదములకు తెలుసు, పడటింటి గుసగుసలు పానుపుకి తెలుసు 

చిగురుటాశల చిలిపి చేతలు, పసిడి బుగ్గల పలకరింపులు 

పడుచు జంటకే తెలుసు..

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు

కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..

కలకాలం వైభోగమస్తు


ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం, శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం 

మింటికి పున్నమి జాబిల్లి అందం, ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం 

జన్మజన్మల పుణ్యఫలముగా, జాలువారు పశిపాప నవ్వులే ఆలుమగలకు అందం 

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం

పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు

కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..

కలకాలం వైభోగమస్తు 

Eduta nilichindi chudu [ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో] - Vaana

Title :Eduta nilichindi chudu
Movie:Vaana
Singers:Karthik గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Kamalakar గారు
Director:M.S. Raju గారు

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో 

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమే

మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే.. వానవీణలా..

ఎదుట నిలిచింది చూడు ...


నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి

కలేఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి

ఔనో కాదో అడగకంది నా మౌనం

చెలివో శిలవో తెలియకుంది నీ రూపం

చెలి నీ బంధమల్లుకుందే జన్మఖైదులా..

ఎదుట నిలిచింది చూడు ...


నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ

వినేవారులేక విసుక్కుంది నా కేక 

నీదో కాదో రాసున్న చిరునామా 

ఉందో లేదో ఆ చోట నా ప్రేమ 

వరం లాంటి శాపమేదో సొంతమైందిలా..

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో 

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమే

మైమరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే.. వానవీణలా..

ఎదుట నిలిచింది చూడు ...  

Monday, March 16, 2026

Chanduruni takinadi [చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా] - Rakshakudu

Title :Chanduruni takinadi
Movie:Rakshakudu
Singers:Hari Haran గారు, Sujata గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:A.R. Rahman గారు
Director:Praveen Gandhi గారు

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా 

చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

చందురుని తాకినది నీవేగా అరె నీవేగా 

వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా

వయస్సు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శృతిలయల శృంగారం 


ఓ, పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే 

ఓ, పువ్వులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే 

పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే 

ఓ, తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా తనువుని పొదువుకొని ప్రియుని కలుసుకున్నా 

తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్న, మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా

కోరికల కోవలలో కర్పూరమౌతున్నా ...చందురుని 

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా 

చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం


రమ్మనే పిలుపువిని రేగుతోంది యెవ్వనమే, ఏకమైపోదమంటూ జల్లుతోంది చందనమే 

నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా, కోరుకున్న ప్రియసఖుడే కౌగిలికి భారమౌనా

చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్ల

పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల 

ఓ, అలిగిన మగతనమే పగబడితే వీడదే .. చందురునీ 

చందురుని తాకినది ఆర్మ్‌స్ట్రాంగా అరె ఆర్మ్‌స్ట్రాంగా 

చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం

కలల దేవతికి పెదవి తాంబూళం ఇమ్మంది శృంగారం