Showing posts with label manasantha nuvve. Show all posts
Showing posts with label manasantha nuvve. Show all posts

Saturday, April 25, 2026

Kita kita talupulu [కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం] - Manasanta Nuvve

Title :kita kita talupulu
Movie:Manasanta nuvve
Singers:K.S. Chitra గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:R.P. Patnaik గారు
Director:V.N. Aditya గారు

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా.. ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదరేరాక కమ్మని కలలో ఐనా నిను చూడలేదే  

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే 

నాకోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా, కాస్సేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా 

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

కంటతడి నాడూ నేడు చెంపతడి నిన్నే చూడు చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా 

చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం ఐపోలేదా ఆవేదనంతా 

ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా 

ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా 

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

Monday, September 16, 2024

చెప్పవే ప్రేమ (manasantaa nuvve)

Song Name :Cheppave Prema
Movie:Manasantha nuvve
Singers:R.P Patnaik, Usha 
Lyricist:Sirivennela seeta rama sastry garu
Composer:R.P. Patnaikgaru
Director:V.N. Aditya garu

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

మనసంతా నువ్వే మనసంత నువ్వె మనసంత నువ్వే నా మనసంత నువ్వే

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఏపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని, 

ఇపుడూ నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని... నేస్తమా నీకు తెలిసేదెలా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా,ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా,ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా వున్నదే ఈ రోజే చూడాలని, గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ   

ఆశగా వున్నదే ఈ రోజే చూడాలని, గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ   

నీ తలపులు చినుకు చినుకుగా దాచిన  బరువెంత పెరిగిన 

నిను చేరేవరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగ, స్నేహమా  నీకు తెలిపేదెలా  

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా 

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా 

మనసంతా నువ్వే, మనసంత నువ్వె, మనసంత నువ్వే, నా మనసంత నువ్వే