Monday, April 29, 2013

Aa Kanulalo [ఆ.. కనులలొ కలల నా చెలి] - Aalaapana

Title :Aa kanulalo
Movie:Aalaapana
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై 
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా 
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై 

దిద్దితై కిటతై ధిమితై తక 
దిద్దితై కిటతై ధిమితై తక  .. 
ఆ..
దిద్దితై కిటతై ధిమితై తక 
దిద్దితై కిటతై ధిమితై తక 
తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు - తకధిమి తకఝణు 
తత్ తరికిట తత్ తరికిట తత్ తరికిట తకిట తకిట తకిట తకధిమి 

నిదురించు వేళ.. దసనిస దసనిస దనిదనిమ హౄదయాంచలాన.. ఆ..ఆ.. ఆఆ...
అలగా పొంగెను నీ భంగిమా గగసనిస.. అదిరూపొందిన స్వర మధురిమ సనిదనిస
ఆ రాచ నడక రాయంచకెరుక.. 
ఆ రాచ నడక రాయంచకెరుక.. 
ప్రతి అడుగు శౄతిమయమై కణకణమున రసధునులను మీటిన..
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై 
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా 
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై 

మగసా.. ఆ.. సనిదమగ మగసా.. ఆ..
గసనిదమ దనిసా.. ఆ.. మదని.. ఆ.. సానిదనిసగ మాగసగమగ నిదసనిదమగ గమపసగమగని 

నీ రాకతోనె ఆ.. ఈ లోయలోనె దసనిస దసనిస దనిదనిమా..
అణువులు మెరిసెను మణిరాసులై.. ఆ.. మబ్బులు తేలెను వలువన్నెలై..
ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని 
ఆ వన్నెలన్ని.. ఆ చిన్నెలన్ని 
ఆకౄతులై సంగతులై అణువణువున పులకలు మొలిపించిన ..
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై 
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా 
గొంతులోన గుండెపిలుపులా.. సంధ్యలోన అందె మెరుపులా 
ఆ.. కనులలొ కలల నా చెలి.. ఆలాపనకు ఆదిమంత్రమై 

Watch and Listen

English

A.. kanulalo kalala nA cheli.. AlApanaku AdimaMtramai 
goMtulOna guMDepilupulA.. saMdhyalOna aMde merupulA 
goMtulOna guMDepilupulA.. saMdhyalOna aMde merupulA 
A.. kanulalo kalala nA cheli.. AlApanaku AdimaMtramai 

didditai kiTatai dhimitai taka 
didditai kiTatai dhimitai taka  .. 
A..
didditai kiTatai dhimitai taka 
didditai kiTatai dhimitai taka 
takadhimi takajhaNu - takadhimi takajhaNu - takadhimi takajhaNu - takadhimi takajhaNu 
tat tarikiTa tat tarikiTa tat tarikiTa takiTa takiTa takiTa takadhimi 

niduriMchu vELa.. dasanisa dasanisa danidanima hRudayAMchalAna.. A..A.. AA...
alagA poMgenu nI bhaMgimA gagasanisa.. adirUpoMdina swara madhurima sanidanisa
A rAcha naDaka rAyaMchakeruka.. 
A rAcha naDaka rAyaMchakeruka.. 
prati aDugu SRutimayamai kaNakaNamuna rasadhunulanu mITina..
A.. kanulalo kalala nA cheli.. AlApanaku AdimaMtramai 
goMtulOna guMDepilupulA.. saMdhyalOna aMde merupulA 
goMtulOna guMDepilupulA.. saMdhyalOna aMde merupulA 
A.. kanulalo kalala nA cheli.. AlApanaku AdimaMtramai 

magasA.. A.. sanidamaga magasA.. A..
gasanidama danisA.. A.. madani.. A.. sAnidanisaga mAgasagamaga nidasanidamaga gamapasagamagani 

nI rAkatOne A.. I lOyalOne dasanisa dasanisa danidanimA..
aNuvulu merisenu maNirAsulai.. A.. mabbulu tElenu valuvannelai..
A vannelanni.. A chinnelanni 
A vannelanni.. A chinnelanni 
AkRutulai saMgatulai aNuvaNuvuna pulakalu molipiMchina ..
A.. kanulalo kalala nA cheli.. AlApanaku AdimaMtramai 
goMtulOna guMDepilupulA.. saMdhyalOna aMde merupulA 
goMtulOna guMDepilupulA.. saMdhyalOna aMde merupulA 
A.. kanulalo kalala nA cheli.. AlApanaku AdimaMtramai 

Sunday, April 28, 2013

Kalise Prati sandhyalo [కలిసె ప్రతిసంధ్యలో ] - Alaapana

Title :Kalise PratiSansdhyalo
Movie:Aalaapana
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki
Lyricist:Dr C. Narayana Reddy గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ (2)
నాట్యాలన్ని కరగాలి నీలొ నేనె మిగలాలి.. (2)
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. చేరుకోదా చంద్ర హౄదయం నీటికి (2) 
శౄష్టిలోన ఉంది ఈ బంధమే.. అల్లుకుంది అంతట అందమే..
తొణికే బిడియం తొలగాలి.. వణికే అధరం పిలవాలి ....
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 

మేనితోనె ఆగుతాయి ముద్రలు. గుండెదాక సాగుతాయి ముద్దులు (2)
వింతతీపి కొంతగా పంచుకో.. వెన్నెలంత కళ్ళలో నింపుకో..
బ్రతుకే జతగా పారాలి.. పరువం తీరం చేరాలి ....

కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 
నాట్యాలెన్నొ ఎదగాలి నాలొ నేనె మిగలాలి.. (2)   
కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ

English

kalise pratisaMdhyalO kalige pulakiMtalo (2)
nATyAlanni karagAli nIlo nEne migalAli.. (2)
kalise pratisaMdhyalO palike prati aMdelo 

poMgipOdA sAgarAtma niMgiki.. chErukOdA chaMdra hRudayaM nITiki (2) 
SRushTilOna uMdi I baMdhamE.. allukuMdi aMtaTa aMdamE..
toNikE biDiyaM tolagAli.. vaNikE adharaM pilavAli ....
kalise pratisaMdhyalO palike prati aMdelo 

mEnitOne AgutAyi mudralu. guMDedAka sAgutAyi muddulu (2)
viMtatIpi koMtagA paMchukO.. vennelaMta kaLLalO niMpukO..
bratukE jatagA pArAli.. paruvaM tIraM chErAli ....

kalise pratisaMdhyalO palike prati aMdelo 
kalise pratisaMdhyalO palike prati aMdelo 
nATyAlenno edagAli nAlo nEne migalAli.. (2)   
kalise pratisaMdhyalO kalige pulakiMtalo

Idi Aangika [ఇది ఆంగిక వాచిక] - Alaapana

Title :idi Aangika
Movie:Aalaapana
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైతయ తైతయు తైతకతై
తక తయ్యా తైయ్యు తయ్యత్తైతక తైయ్యత్తై తైయ్యత్తై తకతై 
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ.. భంగీలసిత రసాంగ తరంగిత 
ఇది ఆంగిక వాచిక సాత్వికాభినయ.. భంగీలసిత రసాంగ తరంగిత భావరాగతాళ త్రిపుటీకౄత భరతనాట్యం 

ధింతా ధింతా ధింతా దిత్తా.. ధింతా ధింతా ధింతా దిత్తా.. ధింతా ధింతా ధింతా దిత్తా..
ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే.. ధింతా ధింతా ధింతా దిత్తా.. ధింతా ధింతా ధిం..
ఇది మనసున పూచే మధుమయ పణిపులు.. ఆ.. తనువున వీచే తరగలుగా.. ఆ..
అణువణువున ఎగసే అభినయ రసఝరి మణిపురి.. 

తక్కిటధీం.. తధిగిటధీం.. తత్తధికిట తకధిమి తరికిట తరికిటధీం తరికిటధీం తత్తధికిట తరికిట తరికిటధీం 
ఇది రాగ మనోహర రమ్య వికాసం లలిత లయాత్మక లాశ్యవిషేషం   
ఇది రాగమనోహర రమ్యవికాసం లలిత లయాత్మక లాశ్యవిషేషం ఊహలు కిన్నెర తీవెలుమీటే ఒడిశ్శీ 

ఇది పదపదమున లయనదములు కదలే గమనగతుల భువనములు చలించే  
ఇది పదపదమున లయనదములు కదలే గమనగతుల భువనములు చలించే కళామయోద్ధత విలాస వీచిక కథక్ 

ఆవేదన.. ఒక ఆరాధన.. ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన 
ఆవేదన... ఆరాధన..
ఆవేదన.. ఒక ఆరాధన.. ఏ శక్తులు శాశించిన సాగే ఈ తపన తెలియని ఆవేదన 

English

tayyA taiyyu tayyattaitaka taitaya taitayu taitakatai
taka tayyA taiyyu tayyattaitaka taiyyattai taiyyattai takatai 
idi AMgika vAchika sAtvikAbhinaya.. bhaMgIlasita rasAMga taraMgita 
idi AMgika vAchika sAtvikAbhinaya.. bhaMgIlasita rasAMga taraMgita bhAvarAgatALa tripuTIkRuta bharatanATyaM 

dhiMtA dhiMtA dhiMtA dittA.. dhiMtA dhiMtA dhiMtA dittA.. dhiMtA dhiMtA dhiMtA dittA..
dhiMtA dhiMtA dhiM..
idi manasuna pUchE.. dhiMtA dhiMtA dhiMtA dittA.. dhiMtA dhiMtA dhiM..
idi manasuna pUchE madhumaya paNipulu.. A.. tanuvuna vIchE taragalugA.. A..
aNuvaNuvuna egasE abhinaya rasajhari maNipuri.. 

takkiTadhIM.. tadhigiTadhIM.. tattadhikiTa takadhimi tarikiTa tarikiTadhIM tarikiTadhIM tattadhikiTa tarikiTa tarikiTadhIM 
idi rAga manOhara ramya vikAsaM lalita layAtmaka lASyavishEshaM   
idi rAgamanOhara ramyavikAsaM lalita layAtmaka lASyavishEshaM Uhalu kinnera tIvelumITE oDiSSI 

idi padapadamuna layanadamulu kadalE gamanagatula bhuvanamulu chaliMchE  
idi padapadamuna layanadamulu kadalE gamanagatula bhuvanamulu chaliMchE kaLAmayOddhata vilAsa vIchika kathak 

AvEdana.. oka ArAdhana.. E Saktulu SASiMchina sAgE I tapana teliyani AvEdana 
AvEdana... ArAdhana..
AvEdana.. oka ArAdhana.. E Saktulu SASiMchina sAgE I tapana teliyani AvEdana 

Friday, April 26, 2013

Jaanavule Varavinavule [నెరజాణవులే వరవీణవులే] - Aditya 369

Title :Jaanavule varavinavule
Movie:Aditya 369
Singers:Jikki గారు, S.P. Balasubramanyam గారు, S.P. Sailaja
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Singeetam Sreenivasa rao గారు

నెరజాణవులే వరవీణవులే గిలిగించితాలలొ.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. 
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 

మోమటుదాచి మురిపెం పెంచే లాహిరిలొ అహహహా... 
మూగవుగానే మురళినివూదే వైఖరిలొ 
చెలివొంపులలొ హంపికళ వూగే ఉయ్యాల.. చెలి పైయెదలొ తుంగ అలా పొంగే ఈ వేళ 
మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా..
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. 
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
నెరజాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ  

చీకటికోపం చెలిమికి లాభం కౌగిలిలో.. అహహాహహా.. ఒహొహోహొహో..
వెన్నెలతాపం వయసుకు ప్రాణం ఈ చలిలొ..
చెలి నారతిలా హారతిల నవ్వాలీవేళ.. తొలిసోయగమే ఓసగమై ఇవ్వాలీవేళ 
పరువానికి పగవానికి ఒకన్యాయమింక సాగున..

జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 
కన్నులలొ సరసపు వెన్నెలలే.. సన్నలలొ గుసగుస తెమ్మెరలే..
మోవిగని మొగ్గగని మోజుపడిన వేళలో.. 
జాణవులే వరవీణవులే గిలిగించితాలలో.. అహహహా.. 
జాణవులే మౄదుపాణివిలే మధుసంతకాలలొ 

Watch and Listen

English

nerajANavulE varavINavulE giligiMchitAlalo.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO.. 
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 

mOmaTudAchi muripeM peMchE lAhirilo ahahahA... 
mUgavugAnE muraLinivUdE vaikharilo 
chelivoMpulalo haMpikaLa vUgE uyyAla.. cheli paiyedalo tuMga alA poMgE I vELa 
maryAdaku viripAnupu savariMchavEmirA..
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO.. 
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
nerajANavulE mRudupANivilE madhusaMtakAlalo  

chIkaTikOpaM chelimiki lAbhaM kougililO.. ahahAhahA.. ohohOhohO..
vennelatApaM vayasuku prANaM I chalilo..
cheli nAratilA hAratila navvAlIvELa.. tolisOyagamE Osagamai ivvAlIvELa 
paruvAniki pagavAniki okanyAyamiMka sAguna..

jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 
kannulalo sarasapu vennelalE.. sannalalo gusagusa temmeralE..
mOvigani moggagani mOjupaDina vELalO.. 
jANavulE varavINavulE giligiMchitAlalO.. ahahahA.. 
jANavulE mRudupANivilE madhusaMtakAlalo 

Thursday, April 25, 2013

Raasaleela vela [రాసలీలవేళ] - Aditya 369

Title :Raasaleela vela
Movie:Aditya 369
Singers:S Janaki గారు, S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:Singeetam Sreenivasa rao గారు

రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల..
రాసలీలవేళ రాయభారమేల 

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నల..తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల..
మోజులన్ని పాడగ జాజిపూల జావళి.. కందెనేమొ కౌగిట అందమైన జాబిలి..
తేనెవానలోన చినికె తీయనైన స్నేహము.. 
మేనివీణ లోని పలికె సోయగాల రాగము..
నిదురరాని కుదురులేని ఎదలలోని సొదలుమారి .. రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల.. 
రాసలీలవేళ రాయభారమేల 

మాయజేసి దాయకు సోయగాల మల్లెలు.. మోయలేని తీయ్యని హాయిపూల జల్లులు..
చేరదీసి పెంచకు భారమైన యెవ్వనం.. దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం 
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా..
చూపుముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా..
చెలువ సోకు చలువ రేకు.. చలువసోకి నిలివనీదు.. రాసలీలవేళ రాయభారమేల మాటే మౌనమై మాయజేయనేల..
రాసలీలవేళ రాయభారమేల
రాసలీలవేళ రాయభారమేల

Watch and Listen

English

rAsalIlavELa rAyabhAramEla mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla 

kougiliMta vEDilO karige vanne vennala..tellabOyi vEsavi challe pagaTi vennela..
mOjulanni pADaga jAjipUla jAvaLi.. kaMdenEmo kougiTa aMdamaina jAbili..
tEnevAnalOna chinike tIyanaina snEhamu.. 
mEnivINa lOni palike sOyagAla rAgamu..
nidurarAni kudurulEni edalalOni sodalumAri .. rAsalIlavELa rAyabhAramEla mATE mounamai mAyajEyanEla.. 
rAsalIlavELa rAyabhAramEla 

mAyajEsi dAyaku sOyagAla mallelu.. mOyalEni tIyyani hAyipUla jallulu..
chEradIsi peMchaku bhAramaina yevvanaM.. dOrasiggu tuMchaku UrukOdu I kshaNaM 
chEpakaLLa sAgarAla alala UyalUganA..
chUpumuLLu OpalEnu kalala talupu tIyanA..
cheluva sOku chaluva rEku.. chaluvasOki nilivanIdu.. rAsalIlavELa rAyabhAramEla mATE mounamai mAyajEyanEla..
rAsalIlavELa rAyabhAramEla
rAsalIlavELa rAyabhAramEla

Tuesday, April 23, 2013

Raayinaina Kaakapotini [రాయినైన కాకపోతిని] - Gorantha Deepam

Title :Raayinaina kaakapothini
Movie:Gorantha Deepam
Singers:P. Suseela గారు
Lyricist:Aarudra గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Baapu గారు

రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ.. 
కడవనైన కాకపోతిని స్వామికార్యము తీర్చగ.. పాదుకైన కాకపోతిని భక్తిరాజ్యమునేలగ..

అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా.. అందువలనా రామచంద్రుని అమిత కరుణను నోచనా..
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయన.. కాలమెల్ల రామభద్రుని నీలిగురుతులు మోయన  
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ.. 

కాకినైన కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ.. గడ్డీ పోచను శరముచెసి ఘనత రాముడు చూపగ..
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగ.. మనిషినై జన్మించినాను మత్సరమ్ములు రేపగ.. మదమత్సరమ్ములు రేపగ...
రాయినైన కాకపోతిని రామపాదము శోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ.. 

Watch and Listen

English

rAyinaina kAkapOtini rAmapAdamu SOkaga.. bOyanaina kAkapOtini puNyacharitamu pADaga.. 
kaDavanaina kAkapOtini swAmikAryamu tIrchaga.. pAdukaina kAkapOtini bhaktirAjyamunElaga..

aDavilOpala pakShinaitE ativa sItanu kAchanA.. aMduvalanA rAmachaMdruni amita karuNanu nOchanA..
kaDali gaTTuna uDatanaitE buData sAyamu chEyana.. kAlamella rAmabhadruni nIligurutulu mOyana  
rAyinaina kAkapOtini rAmapAdamu SOkaga.. bOyanaina kAkapOtini puNyacharitamu pADaga.. 

kAkinaina kAkapOtini ghAtukammunu chEyuchU.. gaDDI pOchanu Saramuchesi ghanata rAmuDu chUpaga..
mahini alpajIvulE I mahimalanni nOchaga.. manishinai janmiMchinAnu matsarammulu rEpaga.. madamatsarammulu rEpaga...
rAyinaina kAkapOtini rAmapAdamu SOkaga.. bOyanaina kAkapOtini puNyacharitamu pADaga.. 

Sunday, April 21, 2013

Vrepalliya yeda jhalluna [వ్రేపల్లియ యెదఝల్లున] - Saptapadhi

Title :Vrepalliya yeda jhalluna
Movie:Saptapadhi
Singers:S.P. Balu గారు, P. Suseela గారు
Lyricist:Veturi గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Viswanath గారు

వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి... 
ఇదేనా.. ఇదేనా ఆ మురళి.. మోహన మురళి..ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి... 
ఇదేనా ఆ మురళి.. మోహన మురళి..ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగలా.. ఆబాల గొపాల మా బాలగోపాలుని 
కాళింది మడుగున కాళీయుని పడగలా.. ఆబాల గొపాల మా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి.. 
ఇదేనా.. ఇదేనా ఆ మురళి.. 

అనగల రాగమై తొలుత వీనులలరించి.. అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి..
అనగల రాగమై తొలుత వీనులలరించి.. అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి..
జీవన రాగమై బౄందావన గీతమై.. ఆ.. జీవన రాగమై బౄందావన గీతమై..
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి.. ఇదేనా.. ఇదేనా ఆ.. మురళి..

వేణుగానలోలుని మురిపించిన రవళి.. నటనల సరళి ఆ నందన మురళి..
ఇదేనా.. ఆ.. మురళి.. మువ్వల మురళి.. ఇదేనా ఆ.. మురళి..
మధురానగరిలో.. యమునా లహరిలో.. ఆ రాధ ఆరాధనాగీతి పలికించి 
మధురానగరిలో.. యమునా లహరిలో.. ఆ రాధ ఆరాధనాగీతి పలికించి 
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై..  ఆ... ఆ... ఆ...
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై.. రాశలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా.. ఇదేనా.. ఆ.. మురళి
వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి... 
ఇదేనా ఆ మురళి.. మోహన మురళి..ఇదేనా ఆ మురళి

English
vrEpalliya yedajhalluna poMgina ravaLi.. navarasa muraLi.. A naMdana muraLi... idEnA..
idEnA A muraLi.. mOhana muraLi..idEnA A muraLi
vrEpalliya yedajhalluna poMgina ravaLi.. navarasa muraLi.. A naMdana muraLi... 
idEnA A muraLi.. mOhana muraLi..idEnA A muraLi

kALiMdi maDuguna kALIyuni paDagalA.. AbAla gopAla mA bAlagOpAluni 
kALiMdi maDuguna kALIyuni paDagalA.. AbAla gopAla mA bAlagOpAluni
achcheruvuna achcheruvuna vichchina kannulajUDa
achcheruvuna achcheruvuna vichchina kannulajUDa
tAMDavamADina saraLi guMDelanUdina muraLi.. 
idEnA.. idEnA A muraLi.. 

anagala rAgamai toluta vInulalariMchi.. analEni rAgamai maralA vinipiMchi marulE kuripiMchi..
anagala rAgamai toluta vInulalariMchi.. analEni rAgamai maralA vinipiMchi marulE kuripiMchi..
jIvana rAgamai bRuMdAvana gItamai.. A.. jIvana rAgamai bRuMdAvana gItamai..
kannela kannula kaluvala vennela dOchina muraLi.. idEnA.. idEnA A.. muraLi..

vENugAnalOluni muripiMchina ravaLi.. naTanala saraLi A naMdana muraLi..
idEnA.. A.. muraLi.. muvvala muraLi.. idEnA A.. muraLi..
madhurAnagarilO.. yamunA laharilO.. A rAdha ArAdhanAgIti palikiMchi 
madhurAnagarilO.. yamunA laharilO.. A rAdha ArAdhanAgIti palikiMchi 
saMgIta nATyAla saMgama sukhavENuvai..  A... A... A...
saMgIta nATyAla saMgama sukhavENuvai.. rASalIlakE UpiripOsina aMdela ravaLi
idEnA.. idEnA.. A.. muraLi
vrEpalliya yedajhalluna poMgina ravaLi.. navarasa muraLi.. A naMdana muraLi... 
idEnA A muraLi.. mOhana muraLi..idEnA A muraLi

Saturday, April 20, 2013

Ve Vela gopemmala [వే వేల గోపెమ్మల] - Saagara Sangamam

Title :Ve Vela Gopemmala
Movie:Saagara Sangamam
Singers:S.P. Balu గారు, S.P. Sailajaగారు
Lyricist:Veturi గారు
Composer:Illayaraja గారు
Director:K. Viswanath గారు

వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే.. మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే..
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నలు దోచాడే..
వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే

మన్ను తిన్న చిన్నవాడే.. మిన్ను కన్న వన్నెకాడే.. (2)
కన్నతోడు లేనివాడే.. కన్నె తోడు ఉన్నవాడే.. 
మోహనాల వేణువూదే మోహనాంగుడితడెనే... (2) 
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడె.. పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె 
మా మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే

వేయిపేరులున్నవాడే.. వేలతీరులున్నవాడే.. (2)
రాసలీలలాడినాడే.. రాయబారమేగినాడే..
గీతార్ధసారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే..  (2)
నీలమై నిఖిలమయ్యి కాలమై నిలిచాడే..వరదయ్య గానాలా వరదలై పొంగాడే..
మా మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే.. మది వెన్నలు దోచాడే.. (2)
వే వేల గోపెమ్మల మువ్వాగోపాలుడే మా ముద్దుగోవిందుడే

Watch and Listen

English

vE vEla gOpemmala muvvAgOpAluDE mA muddugOviMduDE.. muvvAgOpAluDE mA muddugOviMduDE..
aha annula minnala kannula vennela vENuvulUdADE.. madi vennalu dOchADE..
vE vEla gOpemmala muvvAgOpAluDE mA muddugOviMduDE

mannu tinna chinnavADE.. minnu kanna vannekADE.. (2)
kannatODu lEnivADE.. kanne tODu unnavADE.. 
mOhanAla vENuvUdE mOhanAMguDitaDenE... (2) 
chIralanni dOchi dEha chiMtalanni tIrchinADe.. pOtanna kaitalanni pOtapOsukunnADe 
mA muvvAgOpAluDE mA muddugOviMduDE
vE vEla gOpemmala muvvAgOpAluDE mA muddugOviMduDE

vEyipErulunnavADE.. vElatIrulunnavADE.. (2)
rAsalIlalADinADE.. rAyabAramEginADE..
gItArdhasAramichchI gItalenno mArchEnE..  (2)
nIlamai nikhilamayyi kAlamai nilichADE..varadayya gAnAlA varadalai poMgADE..
mA muvvAgOpAluDE mA muddugOviMduDE
vE vEla gOpemmala muvvAgOpAluDE mA muddugOviMduDE
aha annula minnala kannula vennela vENuvulUdADE.. madi vennalu dOchADE.. (2)
vE vEla gOpemmala muvvAgOpAluDE mA muddugOviMduDE

Sunday, April 14, 2013

Chukkalu Temmannaa [చుక్కలు తెమ్మన్నా] - April 1 Vidudala

Title :Chukkalu Temmanna
Movie:April 1 Vidudala
Singers:Mano, Chitra గారు
Lyricist:Sirivennela Sitaraama Sastry గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

షోలే ఉందా..ఇదిగో ఇంద... చాల్లే ఇది జ్వాలకాదా.. తెలుగులొ తీసారే బాలా..
ఖైదీ ఉందా.. ఇదిగో ఇంద.. ఖైదీకన్నయ్య కాదే.. వీడికి అన్నయ్య వాడే..
జగదేక వీరుడి కధ ఇది పాత పిక్చరు కద.. అతిలోక సుందరి తల అతికించి ఇస్తా పద..
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

ఒకటా రెండా.. పదులా వందా.. బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా..
మెదడే ఉందా.. మతిపోయిందా..చాల్లే మీ కాకి గోలా.. వెళాపాళంటూ  లేదా...
ఎమైంది భాగ్యం కధ.. కదిలిందాలేదా కధ.. వ్రతమేదో చేస్తుందట అందాక ఆగాలట..
లౌఖ్యంగా బ్రతకాలి.. సౌఖ్యాలే పొందాలి..

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..
నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మ ఎట్టాగైనా..
చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా.. చూస్తావా నా మైనా.. చేస్తానే ఎమైనా..

English

chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..
ninnE meppistAnu nannE arpistAnu vastAnamma eTTAgainA..
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..

ShOlE uMdA..idigO iMda... chAllE idi jwAlakAdA.. telugulo tIsArE bAlA..
KhaidI uMdA.. idigO iMda.. KhaidIkannayya kAdE.. vIDiki annayya vADE..
jagadEka vIruDi kadha idi pAta pikcharu kada.. atilOka suMdari tala atikiMchi istA pada..
E mAya chEsainA oppiMchE tIrAli...
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..

okaTA reMDA.. padulA vaMdA.. bAkI egavEyakuMDA.. badulE tIrchEdi uMdA..
medaDE uMdA.. matipOyiMdA..chAllE mI kAki gOlA.. veLApALaMTU  lEdA...
emaiMdi bhAgyaM kadha.. kadiliMdAlEdA kadha.. vratamEdO chEstuMdaTa aMdAka AgAlaTa..
louKyaMgA bratakAli.. souKyAlE poMdAli..

chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..
ninnE meppistAnu nannE arpistAnu vastAnamma eTTAgainA..
chukkalu temmannA teMchuku rAnA.. chUstAvA nA mainA.. chEstAnE emainA..

Sunday, April 7, 2013

Vana bhojanam [వనభోజనం] - Pelli Pustakam

Title :vana bhojanam
Movie:Pelli Pustakam
Singers:S.P. Balu  గారు
Lyricist: గారు
Composer:K.V. Mahadevan గారు
Director:Baapu గారు

ప ప ప ప ప పప్పు దప్పళం 
ప ప ప ప ప పప్పు దప్పళం 
అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన్నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి 
వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి పప్పు దప్పళం కలిపి కొట్టడం ...
భొజనం వనభోజనం.. వనభోజనం జనరంజనం 
తల్లి తోడు.. పిల్ల మేక .. ల ల...
తల్లి తోడు.. పిల్ల మేక.. ఆలు మగలు.. అత్తా కోడలు.. బాసు బంటు.. ఒకటేనంటు కలవడం..
భొజనం వనభోజనం.. భొజనం.... వనభోజనం

మన వయసుకు నచ్చినట్టి ఆటలు.. మన మనసుకు వచ్చినట్టి పాటలు..ఆ...
మన వయసుకు నచ్చినట్టి ఆటలు.. మన మనసుకు వచ్చినట్టి పాటలు..పసనిస పనిదని మదపదమప  సగమమ దమమగరి పాడితే
రంజనం జనరంజనం రా రా ర రంజనం జనరంజనం 

మేరు స.. స స... మేరు రి.. రి రి.. తమరు గ.. గ గ.. 
మేము ప ప ప ప ప వేరిగుడ్ .. మేము ద ద ద ద ద..శభాష్
ని ని ని ని ని.. మరల సా....
వేరిగుడ్  బావుంది బావుంది బావుంది 
ఆ ఇప్పుడు నేను ఎవర్ని చూపిస్తె వాళ్ళ స్వరం పాడాలి.. ఏ.. ఊం... రెడియా..
సరిగ..సారిగ మ మ మ మ .. రిగమ రీగమా ప ప ప ప 
తక్కిట తకధిమి తరికిటతక తరికిటతక 
మసాలా గారెలో మామా 
జిలేబి బాదుషా పాపా 
సమోసా తీసుకో దాదా 
పొటాటో చిప్సుతోనా నీనీ 
మిఠాయి కావురే యేడం .. 
పకోడి తిందువ పా ప 
మలాయి పెరుగిది మ మ 
టొమాటో ఛట్నితొ ద ద 
పసందు పూర్ణమూ భూరి 
నంజుకో కారప్పూసా... 

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్కు మిరపకాయల బజ్జి కొరికి చూడు.. 
గోంగూర పచ్చడి.. గొడ్డు కారపు ముద్ద మినపట్టు ముక్కతో మింగి మెసవి చూడూ...
ఉల్లిపాయల మధ్య అల్లమ్ము చల్లిన పెసరట్టు ఉప్మతో మెసవి చూడూ 
గసగసాల్ మిరియాలు కారాలవంగాలు నాణ్యమౌ యాలకులు నమిలి చూడూ...
తెలుగుతనమున్న తిండిని తిన్నవాడు తనకు తెలియక హాయిగా తనువు వూగ పాట పాడును తప్పక ఆటలాడు డాన్సు రానట్టి వారైన డాన్సు సేయూ... ఆ.. ఆ... 

శ్రీమన్ మహాదోమ నీ కుట్టడం మండ ఘీ పెట్టడం ఎండ నీ గోల ఉద్వేల కోలహలాభీల హాలాహలజ్వాల గీరాకరాళాగ్ని విఘ్నం హుఘ్నం కావాలి 
నా రెండు కర్ణాల నీ మొండి గానాల నాలించగా నేను.. ఆ.. నీవేమి ట్రాన్సిస్టరా లేక దాన్ సిస్టరా.. 
నీదు అంగికౄతంగాని సంగీతమున్నీవు .. డామిట్టు.. డామిట్టు.. స్టాపిట్టు.. స్విచ్చాఫు..
నాపాలి భూతంబ ఆపాలి ఘాతంబు శాకిని ఢాకిని గాలి దెయ్యంబా..
చి చి ఓసే పాతకి ఘాతకీ ఇదే చూడవే ఘాత నీ రాత నా చేత పట్టిచ్చెనే.. 
నిన్ను తోల్తొన్న పేల్తావు వెంటడి వెంటాడి గీపెట్టి చంపేయుచున్నావూ..
ఈ చేత నిన్ బట్టి ఆ చేతితొ కొట్టి కిందెట్టి మీదెట్టి రెట్టించి దట్టించి నవ్వేతునే..
పాడు దోమ హరామ గులామ అయ్యో రామ రామా...సమాప్తం ..సమాప్తం..సమాప్తం...... సమాప్తం...

జింతన తన తన.. జిం జింతన తన తన 
అరిశెలు భూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు 
కరకరలాడు జంతికలు.. కమ్మని ఘుంమ్మని నేతి చిప్సులు ..
సరిగమ పదమప గమగరి సరి సససససా...
అరిశెలు భూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు 
కరకరలాడు జంతికలు.. కమ్మని ఘుంమ్మని నేతి చిప్సులు ..
కరమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు ఫిష్ కబాబులు. ష్... అమ్మమ్మామ్మమ్మా....
కరమగు నోరు ఊరగల కారపు పచ్చడి తీపి జాంగిరి..
త్వరత్వర సర్వు చేయమని తైతకలాడగ పిక్కునిక్కులు 
త్వరత్వర సర్వు చేయమని తైతకలాడగ పిక్కునిక్కులు 
తైతక తైతక తైతక తై తై తై...

తకధిన్నధిన్న తకధిన్నధిన్న తాంగిటతక తిరికిటతక ధిగి ధిగి ధిగి 
తకతకిట తకతకిట తకతకిట తదిగిణతోం తదిగిణతోం తదిగిణతోం 
ఆ..
తాంగిటతక తరికిటతకధిమి తాంగిటతక తరికిటతకధిమి తాంగిటతక తరికిటతకధిమి  త త త త ..
ధిం తనకధిన ధిం తనకధిన ధిధిం తనకధిన ధిం తనకధిన తకధిమి తకధిమి తకధిమి తకధిమి తకధిమి 
అహా.. ఓహో.. అహా.. తరికిట తరికిట తరికిట తరికిట.. 
ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన..
ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన.. ధిధిధిధి నకధిన..
తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిట
ధిత్తాంగి తరికిట థా...

Watch and Listen

English

pa pa pa pa pa pappu dappaLaM 
pa pa pa pa pa pappu dappaLaM 
annaM neyyi vEDi annaM kAchinneyyi vEDi vEDi annaM mIda kammani pappu kAchinneyyi 
vEDi vEDi annaM mIda kammani pappu kAchinneyyi pappu dappaLaM kalipi koTTaDaM ...
bhojanaM vanabhOjanaM.. vanabhOjanaM janaraMjanaM 
talli tODu.. pilla mEka .. la la...
talli tODu.. pilla mEka.. Alu magalu.. attA kODalu.. bAsu baMTu.. okaTEnaMTu kalavaDaM..
bhojanaM vanabhOjanaM.. bhojanaM.... vanabhOjanaM

mana vayasuku nachchinaTTi ATalu.. mana manasuku vachchinaTTi pATalu..A...
mana vayasuku nachchinaTTi ATalu.. mana manasuku vachchinaTTi pATalu..pasanisa panidani madapadamapa  sagamama damamagari pADitE
raMjanaM janaraMjanaM rA rA ra raMjanaM janaraMjanaM 

mEru sa.. sa sa... mEru ri.. ri ri.. tamaru ga.. ga ga.. 
mEmu pa pa pa pa pa vEriguD .. mEmu da da da da da..SabhASh
ni ni ni ni ni.. marala sA....
vEriguD  bAvuMdi bAvuMdi bAvuMdi 
A ippuDu nEnu evarni chUpiste vALLa swaraM pADAli.. E.. Um... reDiyA..
sariga..sAriga ma ma ma ma .. rigama rIgamA pa pa pa pa 
takkiTa takadhimi tarikiTataka tarikiTataka 
masAlA gArelO mAmA 
jilEbi bAdushA pApA 
samOsA tIsukO dAdA 
poTATO chipsutOnA nInI 
miThAyi kAvurE yEDaM .. 
pakODi tiMduva pA pa 
malAyi perugidi ma ma 
TomATO ChaTnito da da 
pasaMdu pUrNamU bhUri 
naMjukO kArappUsA... 

asalaina sisalaina AMdhratwa TrEDmArku mirapakAyala bajji koriki chUDu.. 
gOMgUra pachchaDi.. goDDu kArapu mudda minapaTTu mukkatO miMgi mesavi chUDU...
ullipAyala madhya allammu challina pesaraTTu upmatO mesavi chUDU 
gasagasAl miriyAlu kArAlavaMgAlu nANyamou yAlakulu namili chUDU...
telugutanamunna tiMDini tinnavADu tanaku teliyaka hAyigA tanuvu vUga pATa pADunu tappaka ATalADu DAnsu rAnaTTi vAraina DAnsu sEyU... A.. A... 

SrIman mahAdOma nI kuTTaDaM maMDa ghI peTTaDaM eMDa nI gOla udwEla kOlahalAbhIla hAlAhalajwAla gIrAkarALAgni vighnaM hughnaM kAvAli 
nA reMDu karNAla nI moMDi gAnAla nAliMchagA nEnu.. A.. nIvEmi TrAnsisTarA lEka dAn sisTarA.. 
nIdu aMgikRutaMgAni saMgItamunnIvu .. DAmiTTu.. DAmiTTu.. sTApiTTu.. swichchAphu..
nApAli bhUtaMba ApAli ghAtaMbu SAkini DhAkini gAli deyyaMbA..
chi chi OsE pAtaki ghAtakI idE chUDavE ghAta nI rAta nA chEta paTTichchenE.. 
ninnu tOltonna pEltAvu veMTaDi veMTADi gIpeTTi chaMpEyuchunnAvU..
I chEta nin baTTi A chEtito koTTi kiMdeTTi mIdeTTi reTTiMchi daTTiMchi navvEtunE..
pADu dOma harAma gulAma ayyO rAma rAmA...samAptaM ..samAptaM..samAptaM...... samAptaM...

jiMtana tana tana.. jiM jiMtana tana tana 
ariSelu bhUrelu vaDalu AvaDa bOMDalu kajjikAyalu 
karakaralADu jaMtikalu.. kammani ghuMmmani nEti chipsulu ..
sarigama padamapa gamagari sari sasasasasA...
ariSelu bhUrelu vaDalu AvaDa bOMDalu kajjikAyalu 
karakaralADu jaMtikalu.. kammani ghuMmmani nEti chipsulu ..
karamagu nOru Uragala kakkalu mukkalu phish kabAbulu. Sh... ammammaammammaa....
karamagu nOru Uragala kArapu pachchaDi tIpi jAMgiri..
twaratwara sarvu chEyamani taitakalADaga pikkunikkulu 
twaratwara sarvu chEyamani taitakalADaga pikkunikkulu 
taitaka taitaka taitaka tai tai tai...

takadhinnadhinna takadhinnadhinna tAMgiTataka tirikiTataka dhigi dhigi dhigi 
takatakiTa takatakiTa takatakiTa tadigiNatOM tadigiNatOM tadigiNatOM 
A..
tAMgiTataka tarikiTatakadhimi tAMgiTataka tarikiTatakadhimi tAMgiTataka tarikiTatakadhimi  ta ta ta ta ..
dhiM tanakadhina dhiM tanakadhina dhidhiM tanakadhina dhiM tanakadhina takadhimi takadhimi takadhimi takadhimi takadhimi 
ahA.. OhO.. ahA.. tarikiTa tarikiTa tarikiTa tarikiTa.. 
dhidhidhidhi nakadhina.. dhidhidhidhi nakadhina.. dhidhidhidhi nakadhina..
dhidhidhidhi nakadhina.. dhidhidhidhi nakadhina.. dhidhidhidhi nakadhina..
tarikiTa tarikiTa tarikiTa tarikiTa tarikiTa tarikiTa tarikiTa tarikiTa
dhittAMgi tarikiTa thA...

Are Emaindi [అరె ఏమైంది] - Aaraadhana

Title :Are emaindi
Movie:Aaraadhana [Chiranjeevi]
Singers:S.P. Balu  గారు, and S. Janaki  గారు
Lyricist:Aacharya Aatreya గారు
Composer:Illayaraja గారు
Director:Bhaarathi Raaja

అరె ఏమైంది.....
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది.. 

నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది..
పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు 
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ...ల ల ల

బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది 
గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు 
రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ.. 

అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
అది ఏమైంది.. 

Watch and Listen

English

are EmaiMdi.....
are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi..
adi EmaiMdi.. tana manishini vedukutu ikkaDochchi vAliMdi..
kalagAni kalaEdo kaLLeduTe nilichiMdi..adi nIlo mamatanu niddura lEpiMdi..
are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi..
adi EmaiMdi.. 

niMgi vaMgi nElatOTi nEstamEdo kOriMdi.. nEla poMgi niMgi kOsam pUladOsilichchiMdi..
pUlu nEnu chUDalEnu - pUjalEvi chEyalEnu.. nElapaina kALLulEvu - niMgivaipu chUpulEdu 
kannepilla kaLLalOki ennaDaina chUsAvo kAnarAni guMDelOki kannamEsi vachchAvu.. adi dOchAvU...la la la

bIDulOna vAna chinuku.. pichchi molaka vEsiMdi.. pADalEni goMtulOna pATaEdo palikiMdi 
guMDe okkaTunna chAlu.. goMtu tAne pADagaladu.. mATalanni dAchukuMTe pATa nIve rAyagalavu 
rAta rAnivADi rAta dEvuDEmi rAsADO.. chEtanaite mArchichUDu vIDu mAripOtADu.. maniShoutADU.. 