Showing posts with label saptapadi. Show all posts
Showing posts with label saptapadi. Show all posts

Sunday, June 15, 2025

Nemaliki Nerpina [నెమలికి నేర్పిన నడకలివి] - Saptapadi

Song Name :Nemaliki nerpina
Movie:Saptapadi
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివీ 

శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నా నాట్యలీలా 

కలహంసలకిచ్చెను పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు  

కలహంసలకిచ్చెను పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు   

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ, ఏవేవో కన్నుల కిన్నెరలూ 

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ, ఏవేవో కన్నుల కిన్నెరలూ 

కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన 

కాళిదాసు కమనీయ్య కల్పనా  మల్పశిల్ప మణిమేఖలనూ శకుంతలను 

నెమలికి నేర్పిన నడకలివి

చిరునవ్వులు అభినవ మల్లికలూ, సిరిమువ్వలు అభినయ దీపికలూ

చిరునవ్వులు అభినవ మల్లికలూ, సిరిమువ్వలు అభినయ దీపికలూ

నీలాల కన్నుల్లో తారకలూ, తారాడే చూపుల్లో చంద్రికలూ 

నీలాల కన్నుల్లో తారకలూ, తారాడే చూపుల్లో చంద్రికలూ 

కురులు విరిసి, మరులు కురిసి మురిసిన

రవివర్మ చిత్రలేఖనాలేఖ్య సరస సౌందర్య రేఖనూ.. శశిరేఖను 

నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివీ 

శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నా నాట్యలీలా 

నెమలికి నేర్పిన నడకలివి 

Wednesday, September 18, 2024

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ (Saptapadi)

Title :Akhilandeswari chaamundeswari
Movie:Saptapadi
Singers:P. Suseela గారు , S.P. Balasubramanyam గారు 
Lyricist:Veturi Sundara Raama murthy గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K Viswanath గారు

ఓంకార పంజర శుకీం, ఉపనిషద్ ఉద్యానకేళి కళకంఠీం   

ఆగమ విపిన మయూరీం, ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం

తాంతక ఝంతరిజ తధిగిటతోం తకతరి ఝంతరితా 

తధిగిటతోం తాంతకఝం తకతరిఝం తఝ్ఝం 

తదిగిటతోం తదిగిటతోం తదిగిటతోం  

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తాం తధ్ధీం తధ్ధీం తకధిమి తకఝను తకధిమి తకఝను 

తాం తధ్ధీం తధ్ధీం తకధిమి తకఝను తకధిమి తకఝను

తాం ధీం తోం నం తరికిటతోం తరికిటతోం తరికిటతోం  

శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్ధగాత్రీ    

శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్ధగాత్రీ 

సర్వార్దసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తీ

సర్వార్దసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తీ    

చతుర్బాహుసంరక్షిత శిక్షిత చతుర్భశాంతరభువనపాలినీ  

కుంకుమరాగశోభినీ కుసుమబాణసంశొభీనీ, మౌనసుహాసిని గానవినోదిని భగవతి పార్వతీ దేవీ 

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తధీం తత్తఝం తకఝం తకఝం తరిగిటతోం తరిగిటతోం 

తధీం తత్తఝం తకఝం తకఝం తరిగిటతోం తరిగిటతోం 

తకధీన్న తకధీన్న తకతరీత త తకధిమి తఝ్ఝణుతా  

శ్రీహరి ప్రణయాంబురాశీ  శ్రీపాదవిచలిత క్షీరాంబురాశీ   

శ్రీహరి ప్రణయాంబురాశీ  శ్రీపాదవిచలిత క్షీరాంబురాశీ    

శ్రీపీఠసంవర్ధిని డోలాసురమర్ధినీ  

శ్రీపీఠసంవర్ధిని డోలాసురమర్ధినీ    

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి

ఆదిలక్ష్మి విద్యాలక్ష్మీ గజలక్ష్మీ సంతానలక్ష్మి  

సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ        

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తకధిమి తకఝను తకధిమి తకఝను తా

తకఝను తకధిమి తకఝను తకధిమి తోం  

ఇందువదనే కుందరదనే వీణాపుస్తకధారిణే  

ఇందువదనే కుందరదనే వీణాపుస్తకధారిణే

శుకశౌనకాది వ్యాసవాల్మికి మునిజనపూజిత శుభచరణే   

శుకశౌనకాది వ్యాసవాల్మికి మునిజనపూజిత శుభచరణే 

సరససాహిత్య స్వరససంగీత స్థనయుగళే, తక తధీంధీంత 

సరససాహిత్య స్వరససంగీత స్థనయుగళే (తకతధీం తకఝణుత తకధిమిత )

వరదే అక్షరరూపిణే  శారదే దేవీ 

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

వింధ్యాటవీవాసినే యోగసంధ్యాసముద్భాసినే   

సింహాసనస్థాయినే దుష్టహరరంక్రియాశాలినే      

విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే     

హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణీ హే విళంబితకేశపాసినే  

మహిషమర్దనశీల మహితగర్జనలోల భయతనర్తనకేళికే   కాళికే దుర్గమాగమదుర్గ పాహియే దుర్గే దేవే..  

posted by Santoshalakshmi@gmail.com 

Saturday, September 7, 2024

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది - Saptapadi

Song Name :Ee kulamu nee dante
Movie:Saptapadi
Singers:S.P. BalaSubramanyam garu,S Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:K V Mahadevan garu
Director:K. Vishwanath garu

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

ఏడు వర్ణాలు కలిసీ.. ఇంధ్రధనశ్శౌతాదీ.. అన్నీ వర్ణాలకు ఒకటే.. ఇహము పరముంటాది..

ఏడు వర్ణాలు కలిసీ.. ఇంధ్రధనశ్శౌతాదీ.. అన్నీ వర్ణాలకు ఒకటే.. ఇహము పరముంటాది..

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

ఆది నుంచి ఆకాశం మూగదీ.. అనాదిగా తల్లి ధరణి మూగదీ..

ఆది నుంచి ఆకాశం మూగదీ.. అనాదిగా తల్లి ధరణి మూగదీ..

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులూ..

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులూ..

ఈ నడమంత్రపు మనుషులకే మాటలూ.. ఇన్ని మాటలూ..

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

Sunday, April 21, 2013

Vrepalliya yeda jhalluna [వ్రేపల్లియ యెదఝల్లున] - Saptapadhi

Title :Vrepalliya yeda jhalluna
Movie:Saptapadhi
Singers:S.P. Balu గారు, P. Suseela గారు
Lyricist:Veturi గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Viswanath గారు

వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి... 
ఇదేనా.. ఇదేనా ఆ మురళి.. మోహన మురళి..ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి... 
ఇదేనా ఆ మురళి.. మోహన మురళి..ఇదేనా ఆ మురళి

కాళింది మడుగున కాళీయుని పడగలా.. ఆబాల గొపాల మా బాలగోపాలుని 
కాళింది మడుగున కాళీయుని పడగలా.. ఆబాల గొపాల మా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి.. 
ఇదేనా.. ఇదేనా ఆ మురళి.. 

అనగల రాగమై తొలుత వీనులలరించి.. అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి..
అనగల రాగమై తొలుత వీనులలరించి.. అనలేని రాగమై మరలా వినిపించి మరులే కురిపించి..
జీవన రాగమై బౄందావన గీతమై.. ఆ.. జీవన రాగమై బౄందావన గీతమై..
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి.. ఇదేనా.. ఇదేనా ఆ.. మురళి..

వేణుగానలోలుని మురిపించిన రవళి.. నటనల సరళి ఆ నందన మురళి..
ఇదేనా.. ఆ.. మురళి.. మువ్వల మురళి.. ఇదేనా ఆ.. మురళి..
మధురానగరిలో.. యమునా లహరిలో.. ఆ రాధ ఆరాధనాగీతి పలికించి 
మధురానగరిలో.. యమునా లహరిలో.. ఆ రాధ ఆరాధనాగీతి పలికించి 
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై..  ఆ... ఆ... ఆ...
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై.. రాశలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా.. ఇదేనా.. ఆ.. మురళి
వ్రేపల్లియ యెదఝల్లున పొంగిన రవళి.. నవరస మురళి.. ఆ నందన మురళి... 
ఇదేనా ఆ మురళి.. మోహన మురళి..ఇదేనా ఆ మురళి

English
vrEpalliya yedajhalluna poMgina ravaLi.. navarasa muraLi.. A naMdana muraLi... idEnA..
idEnA A muraLi.. mOhana muraLi..idEnA A muraLi
vrEpalliya yedajhalluna poMgina ravaLi.. navarasa muraLi.. A naMdana muraLi... 
idEnA A muraLi.. mOhana muraLi..idEnA A muraLi

kALiMdi maDuguna kALIyuni paDagalA.. AbAla gopAla mA bAlagOpAluni 
kALiMdi maDuguna kALIyuni paDagalA.. AbAla gopAla mA bAlagOpAluni
achcheruvuna achcheruvuna vichchina kannulajUDa
achcheruvuna achcheruvuna vichchina kannulajUDa
tAMDavamADina saraLi guMDelanUdina muraLi.. 
idEnA.. idEnA A muraLi.. 

anagala rAgamai toluta vInulalariMchi.. analEni rAgamai maralA vinipiMchi marulE kuripiMchi..
anagala rAgamai toluta vInulalariMchi.. analEni rAgamai maralA vinipiMchi marulE kuripiMchi..
jIvana rAgamai bRuMdAvana gItamai.. A.. jIvana rAgamai bRuMdAvana gItamai..
kannela kannula kaluvala vennela dOchina muraLi.. idEnA.. idEnA A.. muraLi..

vENugAnalOluni muripiMchina ravaLi.. naTanala saraLi A naMdana muraLi..
idEnA.. A.. muraLi.. muvvala muraLi.. idEnA A.. muraLi..
madhurAnagarilO.. yamunA laharilO.. A rAdha ArAdhanAgIti palikiMchi 
madhurAnagarilO.. yamunA laharilO.. A rAdha ArAdhanAgIti palikiMchi 
saMgIta nATyAla saMgama sukhavENuvai..  A... A... A...
saMgIta nATyAla saMgama sukhavENuvai.. rASalIlakE UpiripOsina aMdela ravaLi
idEnA.. idEnA.. A.. muraLi
vrEpalliya yedajhalluna poMgina ravaLi.. navarasa muraLi.. A naMdana muraLi... 
idEnA A muraLi.. mOhana muraLi..idEnA A muraLi