Saturday, August 8, 2020

ఇందువదన కుందరదన .. [Induvadana kundaradana]

Song Name :Induvadana kundaradana
Movie:   Challenge
Singers:S.P. BalaSubramanyam garu,S. Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Illayaraja garu
Director:A Kodanda rami reddy garu

ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే
తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనె చెలి చిగురు తొదిగె వగల మొగ్గేలనె
ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక...
ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక...
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే

కవ్వించె కన్నులలొ .. కాటేసే కలలెన్నో..
పకపక నవ్వులలో పండిన వెన్నెలవై .. నన్నందుకో..
కసికసి చూపులతో.. కొసకొస మెరుపులతొ.. నన్నల్లుకో..
గుభుళించె పెదవుల్లో మురిపాలు..ఋతువుల్లో మధువంత సగపాలు..
సాహోరే.. భామ హొయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే
తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనె చెలి చిగురు తొదిగె వగల మొగ్గేలనె
ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక...
ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక...

మీసంలొ మిసమిసలు.. మోసాలే చేస్తుంటె.. విడిచిన కౌగిలిలొ సొగసరి మీగడలె దోచెసుకో..
రుసరుస వయసులతొ యెడదల దరువులతొ ముద్దాడుకో..
చలిపుట్టె ఎండల్లో సరసాలు..పగపట్టె పరువంతొ ప్రణయాలూ..
జోహారే.. ప్రేమ హొయ్..

ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే
తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనె చెలి చిగురు తొదిగె వగల మొగ్గేలనె
ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక...
ఐలవ్యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక...
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన ఝఘన సొగసులలనవే

Watch & Listen

English transcript. [used Lekhini.org]

iMduvadana kuMdaradana maMdagamana madhuravachana gagana JhaGhana sogasulalanavE
iMduvadana kuMdaradana maMdagamana madhuravachana gagana JhaGhana sogasulalanavE
tolivalape telipe chilipi siggElane cheli chiguru todige vagala moggElane
ailavyU O hArika nI prEmakE jOhArika...
ailavyU O hArika nI prEmakE jOhArika...
iMduvadana kuMdaradana maMdagamana madhuravachana gagana JhaGhana sogasulalanavE

kavviMche kannulalo .. kATEsE kalalennO..
pakapaka navvulalO paMDina vennelavai .. nannaMdukO..
kasikasi chUpulatO.. kosakosa merupulato.. nannallukO..
gubhuLiMche pedavullO muripAlu..RtuvullO madhuvaMta sagapAlu..
sAhOrE.. bhaama hoy
iMduvadana kuMdaradana maMdagamana madhuravachana gagana JhaGhana sogasulalanavE
tolivalape telipe chilipi siggElane cheli chiguru todige vagala moggElane
ailavyU O hArika nI prEmakE jOhArika...
ailavyU O hArika nI prEmakE jOhArika...

mIsaMlo misamisalu.. mOsAlE chEstuMTe.. viDichina kougililo sogasari mIgaDale dOchesukO..
rusarusa vayasulato yeDadala daruvulato muddADukO..
chalipuTTe eMDallO sarasAlu..pagapaTTe paruvaMto praNayAlU..
jOhArE.. prEma hoy..

iMduvadana kuMdaradana maMdagamana madhuravachana gagana JhaGhana sogasulalanavE
tolivalape telipe chilipi siggElane cheli chiguru todige vagala moggElane
ailavyU O hArika nI prEmakE jOhArika...
ailavyU O hArika nI prEmakE jOhArika...
iMduvadana kuMdaradana maMdagamana madhuravachana gagana JhaGhana sogasulalanavE

Saturday, August 1, 2020

వొయ్యారి గోదారమ్మ .. [Voyyari Godaramma]

Song Name :Voyyari Godaramma    
Movie:   Preminchu Pelladu
Singers:S.P. BalaSubramanyam garu,S. Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Illayaraja garu
Director:Vamsi garu

వొయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం 
కడలి వొడిలొ కలిసిపోతె కల వరం  
ఇన్ని కలలిక ఎందుకో .. కన్నె కలయిక కోరుకొ కలవరింతే కౌగిలింతై 
వొయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం 

నిజము నా స్వప్నం .. హ హ కలలో .. లేనొ..
నీవు నా సత్యం..హ హ .. ఔనో .. కానొ..
ఊహ నీవె.. ఉసురు కారాదా.. మోహమల్లె.. ముసురుకోరాదా..
నవ్వేటి నక్షత్రాలు.. మువ్వల్ని ముద్దాడంగ.. మువ్వగొపాలుని రాధికా 
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా..

వొయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం 

తందాన తాననాన తందన తాననానా
తందాన తాననాన తందన తాననాన

తాకితే తాపం.. హొ హొ కమలం..హొ హొ భ్రమరం .. హొ హొ 
సోకితే  మైకం హొ హొ అధరం..హొ హొ అధరం.. హొ హొ 
ఆటవెలదీ.. ఆడుతూరావే.. తేటగీతి..తేలిపోనీవే..
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్నీ.. యెవ్వనాలకు కానుక..
చుంబించుకున్న బింబాధరానా... సూర్యోదయాలే పండెటివేళ..

వొయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం 
కడలి వొడిలొ కలిసిపోతె కల వరం 
ఇన్ని కలలిక ఎందుకో .. కన్నె కలయిక కోరుకొ కలవరింతే కౌగిలింతై 
వొయ్యారి గోదారమ్మ వొళ్ళంత ఎందుకమ్మ కలవరం  

voyyAri gOdAramma voLLaMta eMdukamma kalavaraM 
kaDali voDilo kalisipOte kala varaM  
inni kalalika eMdukO .. kanne kalayika kOruko kalavariMtE kougiliMtai 
voyyAri gOdAramma voLLaMta eMdukamma kalavaraM 

nijamu nA swapnaM .. ha ha kalalO .. lEno..
nIvu nA satyaM..ha ha .. ounO .. kAno..
Uha nIve.. usuru kArAdA.. mOhamalle.. musurukOrAdA..
navvETi nakshatrAlu.. muvvalni muddADaMga.. muvvagopAluni rAdhikA 
AkASavINa gItAlalOna AlApanai nE karigipOnA..

voyyAri gOdAramma voLLaMta eMdukamma kalavaraM 

taMdAna tAnanAna taMdana tAnanAnA
taMdAna tAnanAna taMdana tAnanAna

tAkitE tApaM.. ho ho kamalaM..ho ho bhramaraM .. ho ho 
sOkitE maikaM ho ho adharaM..ho ho adharaM.. ho ho 
ATaveladI.. ADutUrAvE.. tETagIti..tElipOnIvE..
punnAga kOvellOna pUjAri dOsiLLannI.. yevvanAlaku kAnuka..
chuMbiMchukunna biMbAdharAnA... sUryOdayAlE paMDeTivELa..

voyyAri gOdAramma voLLaMta eMdukamma kalavaraM 
kaDali voDilo kalisipOte kala varaM 
inni kalalika eMdukO .. kanne kalayika kOruko kalavariMtE kougiliMtai 
voyyAri gOdAramma voLLaMta eMdukamma kalavaraM  

Sunday, April 19, 2020

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ... [Chetilona cheyyesi cheppeyyava]

Song Name :Chetilona cheyyesi
Movie:Bombayi Priyudu
Singers:S.P. BalaSubramanyam garu,Prathima Rao
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:M.M. Keeravani garu
Director:K. Raghavendra rao garu

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని
ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా .. తలరాతకు తలవంచదు ప్రేమా..
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని

నీవునేనులే మనస్సు ఒక్కటే.. ఇద్దరైన ఈ మమకారం లో..
నీవునేననె..పదాలులేవులె .. ఏకమైన ఈ ప్రియమంత్రం లో...
నా గుండెలొ కోయిలా.. నీ గొంతు లొ పాడగా..
నా జన్మ ఓ పూవులా.. నీ కొమ్మలో పూయగా..
కలా ఇలా కౌగిలై ..కనే కలే వెన్నెలై ...చెయి కలిపిన చెలిమె అనురాగం.
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని

నిన్ను తాకితె దేవతార్చన ..పూజలందుకో పులకింతల్లో
వాలు చూపులే వరాల దీవెనా .. నన్ను దాచుకొ కనుపాపల్లో
నా ప్రేమ గీతానికి  ..నీవెలే తొలి అక్షరం ..
నా ప్రేమ పుట్టింటికీ .. నీవేలే దీపాంకురం..
రసానికో రాగమై రచించనీ కావ్యమై ..చెయి కలిపిన చలవే అనుభంధం ..

చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని
ప్రేమమీద ఒట్టేసి చెప్పేయ్యవా ..నను వీడనీ జత నీవని
ప్రతి క్షణం ప్రేమలో పరీక్షలే వచ్చినా .. తలరాతకు తలవంచదు ప్రేమా..
చేతిలోన చెయ్యేసి చెప్పేయ్యవా ...నను ఎన్నడు విడిపోనని .

Watch & Listen Here

English transcript

chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani
chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani
prati kShaNam prEmalO parIkShalE vachchinA .. talarAtaku talavaMchadu prEmA..
chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani

nIvunEnulE manassu okkaTE.. iddaraina I mamakAraM lO..
nIvunEnane..padAlulEvule .. Ekamaina I priyamaMtraM lO...
nA guMDelo kOyilA.. nI goMtu lo pADagA..
nA janma O pUvulA.. nI kommalO pUyagA..
kalA ilA kougilai ..kanE kalE vennelai ...cheyi kalipina chelime anurAgaM.
chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani

ninnu tAkite dEvatArchana ..pUjalaMdukO pulakiMtallO
vAlu chUpulE varAla dIvenA .. nannu dAchuko kanupApallO
nA prEma gItAniki  ..nIvelE toli akSharaM ..
nA prEma puTTiMTikI .. nIvElE dIpAMkuraM..
rasAnikO rAgamai rachiMchanI kAvyamai ..cheyi kalipina chalavE anubhaMdhaM ..

chEtilOna cheyyEsi cheppEyyavA ...nanu ennaDu viDipOnani
prEmamIda oTTEsi cheppEyyavA ..nanu vIDanI jata nIvani

Wednesday, April 15, 2020

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా [Alaka Paanupu]

Song Name :Alaka paanupu yekkanela
Movie:Srivari Shobhanam
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Ramesh naidu garu
Director:Jandhyala garu

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక
నాకలకేవిటే...నీ మొహం...ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక
సీతాకాలం...సాయంకాలం....
సీతాకాలం...సాయంకాలం....అటు అలిగిపోయెవేల ..చలి కొరికి చంపె వేళ..
అందుకే ..లోపలికి పొతానే ..తల్లి..నన్నొదులు..
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక

రామ రామ శబరి బామ .. నిద్దరేపోదు ..
హు..నువ్విట్టా..ఇంత గొంతుకేసుకుని పాడితె .. నిద్దరెట్టా  పడుతుందే..
రాతిరంతా..చందమామ .. నిదరపోనీదూ
కంటికబురా..పంపలేనూ... ఇంటి గడపా దాటలేనూ..
ఆ దోర నవ్వూ.. దాచకే ..నా నేరమింక ఎంచకే..
ఆ దోర నవ్వూ.. దాచకే ..ఈ నవ్వు నవ్వి చంపకే..
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక

రాసిఉన్న నొసటి గీత చెరపనేలేరు..రాయని ఆ నుదిటి రాత రాయనూ లేరు..
ఆ రాతే రాసుంటే ఇంట్లోనే వెచ్చగా నిదరపోయేదాన్నిగా..
రాసిఉన్న నొసటి గీత చెరపనేలేరు..రాయని ఆ నుదిటి రాత రాయనూ లేరు..
నచ్చిన మహరాజు నీవు...  నచ్చితే మహరాణి నేను..
ఆ మాట యెదో తెలిపితె  .. నీ నోటి ముత్యం రాలునా...
నులక పానుపు నల్లి బాధ..పిల్ల చిలకమ్మ  అల్లరాపమ్మా..
సీతాకాలం...సాయంకాలం....
సీతాకాలం...సాయంకాలం....నను చంపకే తల్లి..జోకొట్టకే గిల్లీ...

Watch & Listen Here

English transcript

alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka
nAkalakEviTE...nI mohaM...UrukO...
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka
sItAkAlaM...sAyaMkAlaM....
sItAkAlaM...sAyaMkAlaM....aTu aligipOyevEla ..chali koriki chaMpe vELa..
aMdukE ..lOpaliki potAnE ..talli..nannodulu..
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

rAma rAma Sabari bAma .. niddarEpOdu ..
hu..nuvviTTA..iMta goMtukEsukuni pADite .. niddareTTA  paDutuMdE..
rAtiraMtA..chaMdamAma .. nidarapOnIdU
kaMTikaburA..paMpalEnU... iMTi gaDapA dATalEnU..
A dOra navvU.. dAchakE ..nA nEramiMka eMchakE..
A dOra navvU.. dAchakE ..I navvu navvi chaMpakE..
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

rAsiunna nosaTi gIta cherapanElEru..rAyani A nudiTi rAta rAyanU lEru..
A rAtE rAsuMTE iMTlOnE vechchagA nidarapOyEdAnnigA..
rAsiunna nosaTi gIta cherapanElEru..rAyani A nudiTi rAta rAyanU lEru..
nachchina maharAju nIvu...  nachchitE maharANi nEnu..
A mATa yedO telipite  .. nI nOTi mutyaM rAlunA...
nulaka pAnupu nalli bAdha..pilla chilakamma  allarApammA..
sItAkAlaM...sAyaMkAlaM....
sItAkAlaM...sAyaMkAlaM....nanu chaMpakE talli..jOkoTTakE gillI...
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka