Showing posts with label rameshnaidu. Show all posts
Showing posts with label rameshnaidu. Show all posts

Saturday, February 28, 2026

Joru meeda unnavu tummeda [జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద] - Sivaranjani

Song Name :Joru midunnavu tummeda
Movie:Sivaranjani
Singers:P. Suseela garu
Lyricist:Dasam Gopala krishna garu
Composer:Ramesh naidu garu
DirectorDasari Narayana Rao garu 

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ వొళ్ళు జాగరతే తుమ్మెద

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ వొళ్ళు జాగరతే తుమ్మెద

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద

ముస్తాబు అయ్యవు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా

మసక ఎన్నెల్లోన తుమ్మెదా, మల్లెపందిరికాడ తుమ్మెదా

మాలకడుతున్నావు తుమ్మెదా, ఆ మాలెవరికోసమే తుమ్మెదా 

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా, గుత్తంగ కుట్టవు తుమ్మెదా

వత్తైన పరుపుపై తుమ్మెదా, అత్తర్లు చల్లావు తుమ్మెదా

పక్కవేసుంచావు తుమ్మెదా, ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా, నీ వొళ్ళు జాగరతే తుమ్మెద

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెద 

Na Sholapur cheppulu [షోలాపూర్ చెప్పులు పోయాయీ] - Mudda mandaram

Song Name :Na Sholapur cheppulu
Movie:Mudda Mandaram
Singers:Jith mohan mitra garu
Lyricist:Baban - Subbarao garu
Composer:Ramesh naidu garu
DirectorJandhyala garu 

షోలాపూర్ చెప్పులు పోయాయీ...

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి

మన రమణమూర్థ్య్ పెళ్ళి, ఇది రాదు మళ్ళి మళ్ళి, నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడెను మళ్ళి మళ్ళి 

మన రమణమూర్థ్య్ పెళ్ళి, ఇది రాదు మళ్ళి మళ్ళి, నవ్వాలి తుళ్ళి తుళ్ళి అని పాడెను మళ్ళి మళ్ళి 

ఆ సందట్లో కన్నేసి కాజేసాడెవడో 

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ

నా షోలా షోలా షోలా షోలా షోలాపూర్ పెళ్ళిలో చెప్పులు పోయాయి

ఇది షోలపూరు లెదరు, ఏస్ లైట్ యాస్ ఫెదరు, సూట్ ఎట్ ఎనీవెదరు దీన్ని తొడిగి చూడు బ్రదరు 

ఇది షోలపూరు లెదరు, ఏస్ లైట్ యాస్ ఫెదరు, సూట్ ఎట్ ఎనీవెదరు దీన్ని తొడిగి చూడు బ్రదరు  

అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడు 

షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి 

జత నంబరేమో ఆరు, వెలచూస్తే ఇరవఆరు, తొడిగేను ఒక్కమారు వెళ్ళేను పాతఊరు 

జత నంబరేమో ఆరు, వెలచూస్తే ఇరవఆరు, తొడిగేను ఒక్కమారు వెళ్ళేను పాతఊరు 

ఒక సారైన పాలిషు కొట్టంది కొట్టేశాడెవడో  

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలో పోయాయి, అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి

నా షోలాపూరు చెప్పులు పెళ్ళిలో పోయాయి, దొరికితే ఎవరైన ఎవ్వాలీ 

Monday, February 23, 2026

Kobbarinilla jalakaladi [కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి ] - Rendu Jalla seetha

Song Name :Kobbarinilla jalakaladi
Movie:Rendu Jalla seetha
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు 
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Ramesh Naidu గారు
DirectorJandhyala గారు 

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా

ముద్దుతీర్చే సందిటికొస్తావా, ముద్దుతీర్చే సందిటికొస్తావా 

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తాలే

ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే 

ఆకాశవీణల్లో నేను అనురాగమే పాడుకుంటా

గోంగూరపచ్చట్లో నేను ఉల్లిపాయే నంజుకుంటా..నీరుల్లిపాయె నంజుకుంటా

ఆకాశవీణల్లో నేను అనురాగమే పాడుకుంటా

శృంగారవీధుల్లో నేను రసనాట్యమే ఆడుకుంటా ప్రేమరసనాట్యమే ఆడుకుంట 

మాటివ్వునాకు మనసిచ్చుకుంటా, వదిలేస్తే వంకాయ వండించుకుంటా

iam sorry వంకాయవంటి కూరయే పంకజముఖి సీతవంటి భార్యామణి అని అన్నారుకదండి, అందుకని అలపాడానన్నమాట .. ఒహో

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా

ముద్దుతీర్చే సందిటికొస్తావా, ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే

అమ్మవారి ఎదుటనేను, నీ కుంకుమే దిద్దుకుంటా, నీకోసమే కాచుకుంటా

అమ్మతో చెప్పినేనూ అప్పచ్చులే తెచ్చుకుంటా,  

అమ్మవారి ఎదుటనేను, నీ కుంకుమే దిద్దుకుంటా, నీకోసమే కాచుకుంటా

అసురసంధ్యవేళ నాను, ఆలయంలోవేచిఉంటా, నీ హారతే అందుకుంటా 

మాగాయల్లోనా పెరుగేసుకుంటా ... వదిలేస్తే నాదారి నేచూసుకుంటా

చూడండి, మాగాయ మాహాపచ్చడి పెరుగేస్తే మహత్తరి, అదివేస్తే అడ్డవిస్తరి మానిన్యామహాసుందరి.. అని అన్నారు కదండి అందుకే అలా పాడానన్నమాట 

కొబ్బరినీళ్ళా జలకాలాడి, కోనసీమ కొకాగట్టి 

పొద్దుటెండ తిలకాలెట్టి ముద్దపసుపు సందెలకొస్తావా

ముద్దుతీర్చే సందిటికొస్తావా, ముద్దుతీర్చే సందిలి ఇస్తాలే 

Thursday, February 19, 2026

Goruvecchani suridamma [ గోరువెచ్చని సూరీడమ్మా] - Jayasudha

Song Name :Goruvecchani suridamma
Movie:Jayasudha
Singers:P. Suseela గారు 
Lyricist:C. Narayana reddy (sinare) గారు
Composer:Ramesh Naidu గారు
DirectorK.V. Nandana rao గారు 

గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

వద్దన్నా రావద్దన్నా, గుండెల్లో గుడిసవేసి అది గుడిగాచేసి

ఆ గుడిలో దాగున్నాడమ్మా, ఆ గుడిలో దాగున్నాడమ్మ

గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

మిట్టమధ్యానం నడినెత్తిన వచ్చాడు 

మిట్టమధ్యానం నడినెత్తిన వచ్చాడు, ఒంటరిగా పోతుంటే వెంటెంట పడ్డాడు

వినకుండా పోతుంటే అరిసరిసీ పిలిచాడు ...ఆ...

పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు, యెతికి యెతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు 

ఆ ఏడిదిగాలంటే నా తోడుకావాలంట, నే తోడుఇస్తానంటే తను దిగివస్తాడంటా

గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

పొద్దుగూకేవేళ ఎదురుగా వచ్చాడు 

పొద్దుగూకేవేళ ఎదురుగా వచ్చాడు, వెనుతిరిగిపోతుంటే ఎనకెనకా పిలిచాడు 

పోనీ అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు ఆ...

ఆగి ఆగి ఆగలేక దిగివచ్చానన్నాడు, చూసి చూసి మత్తెక్కి పిచ్చెత్తిందన్నాడు 

ఆ పిచ్చిదిగాలంటే నా తోడుకావాలంట, నే తోడు ఇస్తానంటే పొమ్మన్నా పోడంట 

గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా

వద్దన్నా రావద్దన్నా, గుండెల్లో గుడిసవేసి అది గుడిగాచేసి

ఆ గుడిలో దాగున్నాడమ్మా, ఆ గుడిలో దాగున్నాడమ్మ

గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులో వచ్చాడమ్మా 

Wednesday, February 18, 2026

Masaka masaka chikatilo [మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల] - Devudu chesina manushulu

Song Name :Masaka masaka chikatilo
Movie:Devudu chesina manushulu
Singers:L.R. Eswari (Jikki) గారు 
Lyricist:Aarudra గారు
Composer:Ramesh Naidu గారు
DirectorV. Ramachandra Rao గారు 

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేళ కలుసుకో..

నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ... 

ఒకే.. యా.. యా యా యయయ్యా యా యా .. యా యా యయయ్యా యా యా ...ఓ

మాదేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా 

మాదేశం వచ్చినవాడా, మా బొమ్మలు మెచ్చినవాడా

తరతరాల అందాలా, తరగని తొలిచందాలా

తరతరాల అందాలా, తరగని తొలిచందాలా

ఈ భంగిమ నచ్చిందా ఆనందం ఇచ్చిందా అయితే..

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేళ కలుసుకో..

నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ... 

ఒకే.. యా.. యా యా యయయ్యా యా యా .. యా యా యయయ్యా యా యా ...ఓ

చోద్యాలు వెతికేవాడా, సొగసుచూసి మురిసేవాడా 

చోద్యాలు వెతికేవాడా, సొగసుచూసి మురిసేవాడా 

కళచేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల

కళచేతికి దొరకాలంటే నలుమూలలు తిరగాల

నీ ముందుకు రావాలా, నీ సొంతం కావాలా .. అయితే...

మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేళ కలుసుకో..

నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ... 

ఒకే.. యా.. యా యా యయయ్యా యా యా .. యా యా యయయ్యా యా యా ...ఓ 

Tuesday, February 17, 2026

chudu pinnamma paadu pilladu [చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు] - Chillara kottu chittemma

Song Name :Chudu pinnamma
Movie:Chillara kottu chittemma
Singers:S.P. Balasubramanyam గారు 
Lyricist:Dasam Gopalakrishna గారు
Composer:Ramesh Naidu గారు
DirectorDasari Narayana Rao గారు 

పాటలోని యాస మార్చకుండా రాయటం జరిగింది. ఈ పాటకి అదే అందం ఆభరణం.

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

బిందెతోటి నీళ్ళకెడితే ..

బిందెతోటి నీళ్ళకెడితే .. సందుకాసీ సైగసేత్తడు 

సందుకాసీ సైగసేత్తడు 

ఒంటరీగా.. ఒంటరీగా వస్తవుంటే.. అమ్మా.. వస్తవుంటే.. చీ పాడు ...ఈలవేసి గోలసేత్తడు 

ఒంటరీగా వస్తవుంటే, ఈలవేసి గోలసేత్తడు.. ఇంటిసుట్టూ తిరుగుతుంటడు

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

ఇదుగో అబ్బయా సోడా ఒకటీనాయనా..

చందమామా కిందనేనూ.. 

చందమామా కిందనేనూ, తడికచాటు చేసుకోని 

తడికచాటు చేసుకోని 

తలకి స్నానం.. నా తలకి స్నానం సేత్తవుంటే..అమ్మ సేత్తావుంటే.. హవ్వ పాడు... గోడ ఎక్కీ సూత్తవుంటడు 

తలకి స్నానం సేత్తవుంటే, గోడ ఎక్కీ సూత్తవుంటడు 

గొప్ప చిక్కులు పెడతవుంటడు 

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

బావగారు నమస్కారం.. తమరు కూర్చోవాలి

పందిరిమంచం పైన నేనూ..

పందిరిమంచం పైన నేనూ.. పండుకొంటే పాడుపిల్లడు 

పిల్లిల్లాగ..అమ్మ పిల్లిలాగ మెల్లగొచ్చి అబ్బో మెల్లగొచ్చి .. బుగ్గమీదా చిటికవేస్తడు 

పిల్లిలాగ మెల్లగొచ్చి, బుగ్గమీదా అమ్మ చిటికవేస్తడు 

గుబులులేపి జారుకుంటడు 

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

చూడు పిన్నమ్మా పాడుపిల్లడు పైన పైన పడతనంటడు 

చూడు పిన్నమ్మా చూడు పిన్నమ్మా అబ్బ చూడు పిన్నమ్మా 

Sunday, June 29, 2025

Manasa tullipadake telugu lyrics [మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే] - Srivaariki Premalekha

Song Name :Manasa tulli padake
Movie:Srivariki premalekha
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorJandhyala garu 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

ఏమంత అందాలు కలవనీ, వస్తాడు నిన్ను వలచి

ఏమంత సిరివుంది నీకనీ, మురిసేను నిన్ను తలచి

చదువా పదవా ఏముంది నీకు, తళుకూ కులుకూ ఏదమ్మ నీకు 

శృతిమించకే నీవు మనసా..

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

ఏ నోము నోచావు నీవనీ, దొరికేను ఆ ప్రేమ ఫలము

ఏ దేవుడిస్తాడు నీకనీ, అరుదైన అంత వరమూ 

మనసా వినవే అంత అందగాడు, తనుగా జతగా మనకందిరాడు

కలలాపవే కన్నె మనసా..

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే 

అతనికి నీవు నచ్చావొ లేదో, ఆ శుభగడియా వచ్చేనొ రాదో 

తొందర పడితే అలుసే మనసా తెలుసా 

మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే   

Thursday, June 19, 2025

Tolisaari mimmalni choosindi modalu [తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు] - Srivariki Premalekha

Song Name :Tolisari mimmalni chusindi modalu
Movie:Srivariki premalekha
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorJandhyala garu 

శ్రీమన్ మహారాజ మార్తాండతేజ ప్రియానందభోజ 

మీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ..

భయముతో భక్తితో అనురక్తితో శాయంగల విన్నపములూ 

సంధ్యారగం చంద్రహారతి పడుతున్నవేళ 

మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ 

ఓ శుభ ముహూర్తాన 

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు

జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామగోవిందా జో జో

నిదురపోని కనుపాపలకు జోల పాడలేక 

ఈలవేసి చంపుతున్న ఈడునాపలేక 

ఇన్నాళ్ళకు రాస్తున్న ఊహుహు.. ప్రేమలేఖ

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు

ఏ తల్లి కుమారులో తెలియదికానీ, ఎంతటి సుకుమారులో తెలుసునాకు 

ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ, నా మనసుని దోచిన చోరులు మీరు 

వలచి వచ్చిన వనితను చులకన చేయక, తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించి 

చప్పున బదులివ్వండీ, చప్పున బదులివ్వండీ

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు 

తలలోన తరుముకున్న తుంటరి మల్లే, తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే 

సూర్యుడు చుట్టూ తిరిగే భూమికి మల్లే, నా ఓర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే 

నీ జతనే కోరుకుని లతలాగ అల్లుకునె నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే 

ఇప్పుడే బదులివ్వండీ ... ఇప్పుడే బదులివ్వండీ 

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలూ ఎన్నెన్నో కథలు 

Sunday, June 8, 2025

Sivaranjani navaragini [శివరంజని నవరాగిణి] - Thoorpu Padamara

Song Name :Sivaranjani navaragini
Movie:Thoorpu Padamara
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu 

శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహినీ ఆ..

శివరంజని నవరాగిణీ ఆ...

రాగాల శిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి 

రాగాల శిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి 

స్వర సుర ఝరీ తరంగానివీ

స్వర సుర ఝరీ తరంగానివీ, సరసహృదయ వీణా వాణివీ..

శివరంజని నవరాగిణీ ఆ...

ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు

ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు

ఆ.. వదనం అరుణోదయ కమలం 

ఆ.. అధరం సుమధుర మధుకలశం..

శివరంజని నవరాగిణీ ఆ...

జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకి

వేణుధరుని రథమారోహించిన  విదుషీమణి రుక్మిణీ 

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా 

లలిత లావణ్య భయత సౌందర్య కలిత చండికా 

రావే.. రావే నా శివరంజనీ ..

మనోరంజనీ.. రంజనీ నా రంజనీ 

నీవే నీవే నాలో పలికే నాదానివీ 

నీవే నా దానివి నా దానివీ .. నీవే నాదానివీ 

Sunday, March 30, 2025

Nilaalu kaarena kaalaalu maarena (నీలాలు కారేనా కాలాలు మారేనా) - Mudda Mandaram

Song Name :Nilalu kaarena 
Movie:Mudda Mandaram
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh naidu garu
DirectorJandhyala garu 

నీలాలు కారేనా కాలాలు మారేనా 

నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా

జాజీ పూసేవేళ జాబిల్లి వేళ పూలాడోల నేనుకానా 

నీలాలు కారేనా కాలాలు మారేనా 

నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే

జాజీ పూసేవేళ జాబిల్లి వేళ పూలాడోల నేనుకానా 

సూరీడు నెలరేడు సిరిగల దొరలే కారులే, పూరిగుడిసెల్లో పేదమనసుల్లో వెలిగేటి దీపాలులే 

ఆ నింగి ఈ నేల కొనగల సిరులే లేవులే, కలిమి లేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేద లోగిళ్ళులే 

నీలాలు కారేనా కాలాలు మారేనా 

నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా

జాజీ పూసేవేళ జాబిల్లి వేళ పూలాడోల నేనుకానా 

ఈగాలిలో తేలి వెతలను మరిచే వేళలో, కలికీ వెన్నెల్లో కలలా కన్నుల్లో కలతారిపోవాలిలే 

ఆ తారలే చేరి తళ తళ మెరిసే రేయిలో, ఒడిలో నువ్వుంటే ఒదిగీ పోతుంటే, కడతేరిపోవాలిలే 

నీలాలు కారేనా కాలాలు మారేనా 

నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా

జాజీ పూసేవేళ జాబిల్లి వేళ పూలాడోల నేనుకానా 

నీలాలు కారేనా కాలాలు మారేనా 

నీ జాలి నే పంచుకోనా, నీ లాలి నే పాడలేనా

జాజీ పూసేవేళ జాబిల్లి వేళ పూలాడోల నేనుకానా 

Friday, January 17, 2025

Aakulo Aakunai puvvulo puvvunai [ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై] - Meghasandesam

Song Name :Aakulo aakunai
Movie:Meghasandesam
Singers:P. Suseela  garu
Lyricist:Devulapalli Krishna sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

జలజలని పారు సెలపాటలో తేటనై  

పగడాల చిగురాకు తెరచాటు చేతినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై 

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

చదలెక్కి చలదంపు నీలంపు నిగ్గునై 

ఆకలా దాహమా చింతలా వంతలా  

ఈ కదలీ వెర్రినై ఏకతమా తిరుగాడ   

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా  

Sunday, December 29, 2024

ఆకాశదేశానా ఆషాఢ మాసానా (Megha Sandesam)

Song Name :Akasa desana 
Movie:Meghasandesam
Singers:K.J. Yesudas garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

ఆకాశదేశానా ఆషాఢ మాసానా.. 

మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా 

విరహమో దాహమో విడలేని మోహమో..

వినిపించు నా చెలికీ మేఘసందేసం .. మేఘసందేసం 

వానకారు కోయిలనై, తెల్లవారి వెన్నెలనై 

వానకారు కోయిలనై, తెల్లవారి వెన్నెలనై 

ఈ యెడారి దారులలో ఎడదనేను పరిచానని కడిమిఓలె నిలిచానని

ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో 

విన్నవించు నా చెలికీ, విన్న వేదనా నా విరహ వేదన..

ఆకాశదేశానా ఆషాఢ మాసానా.. 

మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా 

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై..

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై..

ఈ నిషీధి నీడలలో నివురులాగ మిగిలానని సిధిల జీవినైనానని 

తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరభాష్ప జల ధారలతో..

విన్నవించు నా చెలికీ మనో వేదనా నా మరణ యాతనా 

ఆకాశదేశానా ఆషాఢ మాసానా.. 

మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా 

విరహమో దాహమో విడలేని మోహమో.. 

వినిపించు నా చెలికీ మేఘసందేసం .. మేఘసందేసం 

సిగలో అవి విరులో (Meghasandesam)

Song Name :Sigalo avi virulo
Movie:Meghasandesam
Singers:K.J. Yesudas garu
Lyricist:Devulapalli Venkata Krishna sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో 

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు 

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు 

మదిలోన గదిలోన మదిలోన గదిలోన 

మత్తిలిన కొత్త కోరికలు 

నిలువనీవు నా తలపులు 

మరీ మరీ ప్రియా.. ప్రియా.. నిలువనీవు నా తలపులు 

నీ కనుల ఆ పిలుపులూ ..

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో 

జరిగి ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి

జరిగి ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి

చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగీ

చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగీ

మరలిరాఅలేవు నా చూపులూ మరీ మరీ ప్రియా.. ప్రియా..

మరలిరాఅలేవు నా చూపులూ మధువుకై మెదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో 

Tuesday, November 5, 2024

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా (Swayamkrushi)

Song Name :Sinni sinni
Movie:Swayamkrushi
Singers:S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎవరికి తెలియని కథలివిలే ..ఎవరికి తెలియనీ కథలివిలే ..

ఎవరో చెప్పాగ ఇక ఏలే..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

సందిటనేసిన చెలువములే.. సందిటనేసిన చెలువములే.. 

సుందరమూర్తికి చేలములూ...

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

కలల ఒరుపులే కస్తురిగా.. వలపు వందనపు తిలకాలూ..

వలపు వందనపు తిలకాలూ..

అంకము చేరిన పొంకాలే.. అంకము చేరిన పొంకాలే 

శ్రీవేంకట పతికికా.. వేడుకలు..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ (SwayamKrushi)

Song Name :Siggu Poobanti
Movie:Swayamkrushi
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki, S.P. Sailaja garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

విరజాజి.. పూలబంతి అతసేతా మోయలేని

విరజాజి పూలబంతి అతసేతా మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా..

శివునివిల్లు మోసిన జాణ.. ఈ సిన్నదేనా..

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

సూసీ అలకలొచ్చిన కలికీ 

సూసీ అలకలొచ్చిన కలికీ, ఏసినాది కులుకుల మలికి 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా.. సిలకమ్మ కొనసూపు సౌరూ..

బొండుమల్లె సెండు జోరు 

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

మెరిసే నల్లమబ్బైనాదీ 

మెరిసే నల్లమబ్బైనాదీ, వలపుజల్లు వరదైనాది

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా 

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి 

Wednesday, April 15, 2020

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా [Alaka Paanupu]

Song Name :Alaka paanupu yekkanela
Movie:Srivari Shobhanam
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:Ramesh naidu garu
Director:Jandhyala garu

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక
నాకలకేవిటే...నీ మొహం...ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక
సీతాకాలం...సాయంకాలం....
సీతాకాలం...సాయంకాలం....అటు అలిగిపోయెవేల ..చలి కొరికి చంపె వేళ..
అందుకే ..లోపలికి పొతానే ..తల్లి..నన్నొదులు..
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక

రామ రామ శబరి బామ .. నిద్దరేపోదు ..
హు..నువ్విట్టా..ఇంత గొంతుకేసుకుని పాడితె .. నిద్దరెట్టా  పడుతుందే..
రాతిరంతా..చందమామ .. నిదరపోనీదూ
కంటికబురా..పంపలేనూ... ఇంటి గడపా దాటలేనూ..
ఆ దోర నవ్వూ.. దాచకే ..నా నేరమింక ఎంచకే..
ఆ దోర నవ్వూ.. దాచకే ..ఈ నవ్వు నవ్వి చంపకే..
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా... అలక చాలింక

రాసిఉన్న నొసటి గీత చెరపనేలేరు..రాయని ఆ నుదిటి రాత రాయనూ లేరు..
ఆ రాతే రాసుంటే ఇంట్లోనే వెచ్చగా నిదరపోయేదాన్నిగా..
రాసిఉన్న నొసటి గీత చెరపనేలేరు..రాయని ఆ నుదిటి రాత రాయనూ లేరు..
నచ్చిన మహరాజు నీవు...  నచ్చితే మహరాణి నేను..
ఆ మాట యెదో తెలిపితె  .. నీ నోటి ముత్యం రాలునా...
నులక పానుపు నల్లి బాధ..పిల్ల చిలకమ్మ  అల్లరాపమ్మా..
సీతాకాలం...సాయంకాలం....
సీతాకాలం...సాయంకాలం....నను చంపకే తల్లి..జోకొట్టకే గిల్లీ...

Watch & Listen Here

English transcript

alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka
nAkalakEviTE...nI mohaM...UrukO...
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka
sItAkAlaM...sAyaMkAlaM....
sItAkAlaM...sAyaMkAlaM....aTu aligipOyevEla ..chali koriki chaMpe vELa..
aMdukE ..lOpaliki potAnE ..talli..nannodulu..
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

rAma rAma Sabari bAma .. niddarEpOdu ..
hu..nuvviTTA..iMta goMtukEsukuni pADite .. niddareTTA  paDutuMdE..
rAtiraMtA..chaMdamAma .. nidarapOnIdU
kaMTikaburA..paMpalEnU... iMTi gaDapA dATalEnU..
A dOra navvU.. dAchakE ..nA nEramiMka eMchakE..
A dOra navvU.. dAchakE ..I navvu navvi chaMpakE..
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

rAsiunna nosaTi gIta cherapanElEru..rAyani A nudiTi rAta rAyanU lEru..
A rAtE rAsuMTE iMTlOnE vechchagA nidarapOyEdAnnigA..
rAsiunna nosaTi gIta cherapanElEru..rAyani A nudiTi rAta rAyanU lEru..
nachchina maharAju nIvu...  nachchitE maharANi nEnu..
A mATa yedO telipite  .. nI nOTi mutyaM rAlunA...
nulaka pAnupu nalli bAdha..pilla chilakamma  allarApammA..
sItAkAlaM...sAyaMkAlaM....
sItAkAlaM...sAyaMkAlaM....nanu chaMpakE talli..jOkoTTakE gillI...
alaka pAnupu ekkanEla chilipi gOriMkA... alaka chAliMka

Saturday, January 5, 2013

Pilichina Muraliki [పిలిచిన మురళికి] - Aananda bhairavi

Title : Pilichina Muraliki
Movie: Aananda Bhairavi
Singers: S.P. Balu, S. Janaki
Lyricist: Veturi 
Composer: Ramesh Naidu

పిలిచిన మురళికి వలచిన మువ్వకి యెదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి యెదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం

కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే 
కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే 
మనసే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచె 
యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై 
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం

ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే
ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే
హౄదయం లయమై పోయినది లయమే ప్రియమై జీవితమై
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం

English

pilichina muraLiki valachina muvvaki yedalO okaTe rAgaM.. adi AnaMdabhairavi rAgaM
murisina muraLiki merisina muvvaki yedalO prEma parAgaM madi AnaMdabhairavi rAgaM

kulikEmuvvala alikiDi viMTE kaLalE nidduralEchE
kulikEmuvvala alikiDi viMTE kaLalE nidduralEchE
manasE muraLi AlApanalO madhurAnagariga tOche
yamunA nadilA poMginadi swaramE varamai saMgamamai
murisina muraLiki merisina muvvaki edalO prEma parAgaM madi AnaMdabhairavi rAgaM
pilichina muraLiki valachina muvvaki EdalO okaTe rAgaM.. adi AnaMdabhairavi rAgaM

evarI gOpika padalaya viMTE yedalO aMdiya mrOgE
evarI gOpika padalaya viMTE yedalO aMdiya mrOgE
padamE padamai madilO vuMTE praNayAlApana sAgE
hRudayaM layamai pOyinadi layamE priyamai jIvitamai
murisina muraLiki merisina muvvaki edalO prEma parAgaM madi AnaMdabhairavi rAgaM
pilichina muraLiki valachina muvvaki EdalO okaTe rAgaM.. adi AnaMdabhairavi rAgaM