Showing posts with label feelgood. Show all posts
Showing posts with label feelgood. Show all posts

Friday, January 17, 2025

Aakulo Aakunai puvvulo puvvunai [ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై] - Meghasandesam

Song Name :Aakulo aakunai
Movie:Meghasandesam
Singers:P. Suseela  garu
Lyricist:Devulapalli Krishna sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

జలజలని పారు సెలపాటలో తేటనై  

పగడాల చిగురాకు తెరచాటు చేతినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై 

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

చదలెక్కి చలదంపు నీలంపు నిగ్గునై 

ఆకలా దాహమా చింతలా వంతలా  

ఈ కదలీ వెర్రినై ఏకతమా తిరుగాడ   

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా  

Thursday, January 16, 2025

తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులో - Male [Seetha Raamulu]

Song Name :Tholi sanja velalo
Movie:Seeta Raamulu
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Dasari Narayana Rao garu
Composer:Satyam garu
DirectorDasari Narayana Rao garu

తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులో 

తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం 

తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులో 

తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం 

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం

గడిచే ప్రతినిముషం ఎదిగే ప్రతిబింబం 

గడిచే ప్రతినిముషం ఎదిగే ప్రతిబింబం 

వెతికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం

ఆ హృదయం సంధ్యారాగం మేలుకొలిపే అనురాగం 

తొలి సంజ వేళలో ..

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యాసమయం

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యాసమయం

వచ్చే ప్రతి కెరటం.. చేరదు అది తీరం 

వచ్చే ప్రతి కెరటం.. చేరదు అది తీరం 

లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం..

ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం 

తొలి సంజ వేళలో తొలి పొద్దు పొడుపులో 

తెలవారె తూరుపులో వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం 

Sunday, November 3, 2024

జాబిలమ్మ నీకు అంత కోపమా (Pelli)

Song Name :Jaabilamma neeku antha kopama
Movie:Pelli
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:Sirivennela Seeta raama Sastry garu
Composer:S.A Rajkumar garu
DirectorKodi Ramakrishna garu

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

ఓ...ఓ..ఓ..

చిగురు పెదవిపైన, చిరునవ్వై చేరాలనుకున్నా 

చెలియ మనసులోన, సిరిమువ్వై ఆడాలనుకున్నా 

ఉన్నమాట చెప్పలేని గుండెలో, విన్నపాలు వినపడలేదా 

హారతిచ్చి స్వాగతించు కళ్ళలో, ప్రేమకాంతి కనపడలేదా

మరీ అంత దూరమా, కలలు కన్న తీరమా 

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

ఓ... ఓ..ఓ..

మనసు చూడవమ్మా, కొలువుందో లేదో నీ బొమ్మా 

మనవి ఆలకించి, మన్నిస్తే చాలే చిలకమ్మా 

ప్రాణమున్న పాలరాతి శిల్పమా, ప్రేమనీడ చేరుకోని పంతమా

తోడుకోరి దగ్గరైతె దోషమా, తీయ్యనైన స్నేహమంటె ద్వేషమా

ఒక్కసారి నవ్వుమా, నమ్ముకున్న నేస్తమా..

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదా రేయి ఆపుమ

జాబిలమ్మ నీకు అంత కోపమా.. జాజిపూల మీద జాలి చూపుమా..

Wednesday, September 25, 2024

చంద్రుళ్ళో వుండే కుందేలు (Nuvvostanante Nenoddantana)

Song Name :Chandrullo unde kundelu
Movie:Nuvvostanante Nenoddantaana
Singers:Shankar Mahadevan garu
Lyricist:Sirivennela Seeta rama sastry garu
Composer:Devi Sri Prasad garu
DirectorPrabhu deva garu

చంద్రుళ్ళో వుండే కుందేలు కిందికొచ్చిందా ,కిందికొచ్చి నీలామారిందా

తందానే తందానే

చుక్కల్లో వుండే జిగేలూ, నిన్ను మెచ్చిందా నిన్నుమెచ్చి నీలో చేరిందా  

తందానే తందానే 

నువ్వలా సాగేత్రోవంతా నావలా తూగేనీవెంటా ఎవంటా   

నువ్వెళ్ళే దారేమారిందా నీవల్లే తీరేమారి ఏరైపారిందేమో నేలంతా  

చంద్రుళ్ళో వుండే కుందేలు కిందికొచ్చిందా ,కిందికొచ్చి నీలామారిందా

hai my name is santosh, may I know your name please 

stellaa, stellaa ohh what a beautiful name? 

can I have your phone number 

రేయ్ రేయ్ రేయ్ Oh...coming daad  

గువ్వాలాదూసుకువచ్చావే తొలియవ్వనమా తెలుసా ఎక్కడవాలాలో 

నవ్వులే తీసుకువచ్చావే ఈడు సంబరమా  తెలుసా ఎవ్వరికివ్వాలో  

హే గగగ రిగరిస సా సా నినిస గగగ రిగరిస సా 

కూచిపూడి అన్నపదం కొత్త ఆట నేర్చిందా  పాపలాంటి లేతపదం  పాఠశాలగా      

కూనలమ్మ జానపదం పల్లెదాటి వచ్చిందా జావలీల జానతనం పాటచూపగా         

 కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు   

మంచులో దాగే ఛైత్రాలు  బదులిచ్చేలా ఇంతలా ఎమోరాగాలు 

ఆకతాయి సందడిగా ఆగలేని  తొందరగా సాగుతున్న ఈపయనం  ఎంతవరకో 

రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం  ఎందుకొరకో   

మట్టికి మబ్బుకి ఈవేళా దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా  

రెంటినీఒక్కటిచేసేలా  తీరమేదంటే దిక్కులే తత్తరపడిపోవా  

Tuesday, September 10, 2024

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే (Manase padenula)

Song Name :Manase Paadenule
Movie:Sankeerthana
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:C Narayana reddy garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

సెలయేటి మలుపులా విరితోట పిలుపులా, ఏటి మలుపులా విరితోట పిలుపులా 

స్వరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

కోయిలలై పలికే, తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో..

కోయిలలై పలికే, తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో..

అందియలై మ్రోగె సంధ్యలోనె, అంచులు తాకె అందాలెవెవో 

జిలుగులొలుకు చెలి చెలువం, కొలను విడవని నవ కమలం 

జిలుగులొలుకు చెలి చెలువం, కొలను విడవని నవ కమలం 

అదిమీటె నాలో ఒదిగిన కవితల

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

సెలయేటి మలుపులా విరితోట పిలుపులా, ఏటి మలుపులా విరితోట పిలుపులా 

సరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

ధీంతరన ధిర ధిరన ధిరన ధిరన

ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా

తనన ధిర న ధిరిథాన న ధిరిథాన ధిరన 

తన నాధిరిధిరి నాధిరిధిరి నాధిరిధిరి  నంధిరిధిరి  

ధీం ధిరన ధిర ధిరన ధిరన ధిరనా

ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా

ఆ....

తొలకరి పరువం మెలికలు తిరిగిన అలకల కులుకుల అలిమేణి

సుమరమణీయ హిమకమనీయ సురుచిర రసభర కలవాణి.

తొలక్ అరి పరువం మెలికలు తిరిగిన అలకల కులుకుల అలిమేణి

సుమరమణీయ హిమకమనీయ సురుచిర రసభర కలవాణి.

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి తోంధిరిధిరి నంధిరి తోంధిరి తాంధిరి నంఢిరి 

నాధిరిధిరి తోంధిరిధిరి నంధిరి తోంధిరి తాంతరి నంఢరి 

తత్తోం తరిగిడతోం తత్తోం తరిగిడత తద్దిత్తరిగిట తత్తోం తరిగిటత తత్తోం  తరిగిడత తద్దిత్తరిటత 

ధీం ధిరన ధిర ధిరన ధిరన ధిరనా

ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా

ఆ...