Showing posts with label meghasandesam. Show all posts
Showing posts with label meghasandesam. Show all posts

Friday, January 17, 2025

Aakulo Aakunai puvvulo puvvunai [ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై] - Meghasandesam

Song Name :Aakulo aakunai
Movie:Meghasandesam
Singers:P. Suseela  garu
Lyricist:Devulapalli Krishna sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu


ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 


గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

గలగలని వీచు చిరుగాలిలో కెరటమై 

జలజలని పారు సెలపాటలో తేటనై  

పగడాల చిగురాకు తెరచాటు చేతినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై 

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 


తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల 

చదలెక్కి చలదంపు నీలంపు నిగ్గునై 

ఆకలా దాహమా చింతలా వంతలా  

ఈ కదలీ వెర్రినై ఏకతమా తిరుగాడ   

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా

ఈ అడివి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా


ఆకులో ఆకునై పువ్వులో పూవ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై 

ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా 

ఎటులైనా ఇచటనే ఆగిపోనా  

Sunday, December 29, 2024

ఆకాశదేశానా ఆషాఢ మాసానా (Megha Sandesam)


Song Name :Akasa desana 
Movie:Meghasandesam
Singers:K.J. Yesudas garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

ఆకాశదేశానా ఆషాఢ మాసానా.. 

మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా 

విరహమో దాహమో విడలేని మోహమో..

వినిపించు నా చెలికీ మేఘసందేసం .. మేఘసందేసం 


వానకారు కోయిలనై, తెల్లవారి వెన్నెలనై 

వానకారు కోయిలనై, తెల్లవారి వెన్నెలనై 

ఈ యెడారి దారులలో ఎడదనేను పరిచానని కడిమిఓలె నిలిచానని

ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో 

విన్నవించు నా చెలికీ, విన్న వేదనా నా విరహ వేదన..

ఆకాశదేశానా ఆషాఢ మాసానా.. 

మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా 


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై..

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై..

ఈ నిషీధి నీడలలో నివురులాగ మిగిలానని సిధిల జీవినైనానని 

తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరభాష్ప జల ధారలతో..

విన్నవించు నా చెలికీ మనో వేదనా నా మరణ యాతనా 


ఆకాశదేశానా ఆషాఢ మాసానా.. 

మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా 

విరహమో దాహమో విడలేని మోహమో.. 

వినిపించు నా చెలికీ మేఘసందేసం .. మేఘసందేసం 




సిగలో అవి విరులో (Meghasandesam)


Song Name :Sigalo avi virulo
Movie:Meghasandesam
Singers:K.J. Yesudas garu
Lyricist:Devulapalli Venkata Krishna sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో 


ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు 

ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు 

మదిలోన గదిలోన మదిలోన గదిలోన 

మత్తిలిన కొత్త కోరికలు 

నిలువనీవు నా తలపులు 

మరీ మరీ ప్రియా.. ప్రియా.. నిలువనీవు నా తలపులు 

నీ కనుల ఆ పిలుపులూ ..

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో 


జరిగి ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి

జరిగి ఇటు ఒరిగి.. పరవశాన ఇటులే కరిగి

చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగీ

చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగీ

మరలిరాఅలేవు నా చూపులూ మరీ మరీ ప్రియా.. ప్రియా..

మరలిరాఅలేవు నా చూపులూ మధువుకై మెదలు తుమ్మెదలు

సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో 

మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో 

సిగలో అవి విరులో