Friday, July 24, 2009

Agniskalana - Chatrapati

Movie : Chatrapati
Language : Telugu
Music Dir: M.M. Keeravaani
Singer: M.M. Keeravani, Mathangi, Mangari
Lyrics : Siva Shakti datta

అగ్ని స్ఖలన సంధగ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి
మధ్యంధిన సముధ్యత్ కిరణ విధ్యుధ్ధుమణి ఖని ఛత్రపతి
తజ్జంతజణు తధింధిరణ ధింధిం తకిట నట ఛత్రపతి
ఉర్వీ వలయ సంభావ్యవర స్వచ్చందనుమతి

కుంభీ నికర కుంభస్థగురు కుంభీ వలయ పతి ఛత్రపతి
ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రిసమ దృతి ఛత్రపతి
ఛండప్రబల దుర్ధండజిత దుర్ధండభట తథి ఛత్రపతి
శత్రుప్రకర విఛ్ఛేదకర భీమార్జునప్రతీ (2)

ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద ఘంటారవ తుసిథ ఛత్రపతి
సంఘస్వజన విద్రోహిగణ విద్వంసవ్రతమతి ఛత్రపతి
ఆర్తత్రాణ దుష్టద్యుమ్న క్షాత్రస్పూర్తి ధిధితి భీమాక్షమపతి శిక్షాశ్మృతి స్తపతి

Monday, July 13, 2009

Raalipoye puvva - Maathrudevobhava

Movie : Maathrudevobhava
Language : Telugu
Music Dir: M.M. Keeravaani
Lyrics: Veturi
Singer: M.M. Keeravaani

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికీ రాచిలకా పాడకు నిన్నటి నీ రాగం
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే

చెదిరింది నీ గూడు గాలిగా చిలకా గొరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లొ చేరగ మనసు మాంగళ్యాలు జారగా సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే

అనుభంధమంటేనే అప్పులే కరిగే భంధాలన్ని మబ్బులే హేమంతరాగాల చేమంతులే వాడిపోయే
తనరంగుమార్చింది రక్తమే తనతఒ రానంది పాశమే దీపాల పండక్కి దీపాలుకొండెక్కి పొయే
పగిలేఆకాశము నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగతెగే వీణియవై
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే తొటమాలినీ తోడులేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే లొకమెన్నడో చీకటాయెలే

Saturday, July 4, 2009

Musi musi - Brahmma

Movie : Brahmma
Language : Telugu
Music Dir: K. V. Mahadevan
Singer: K. J. Yesudas

ఆ.. ఆ....ఆ...ఆ....
ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన (2)
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తిలిసి ఫలితమొసగే వాడు...
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్నవాన్ని అవమానపరచినా ఎదలోని చీకటంతా వెన్నలగా మార్చినా
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

అనురాగజీవితాన పెనుగాలి రేగినా తనవారుకానరాక కనుపాపేడ్చినా
కడగళ్ళు బతుకులోనా వడగళ్ళురాల్చినా సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తిలిసి ఫలితమొసగే వాడు...
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

Sogasuchoodatarama - Mr.Pellam

Movie : Mr. Pellam
Language : Telugu
Music Dir: M.M.Keeravani
Singer: S.P.Bala subhramanyam
Artists: Rajendraprasad, Aamani
Lyrics: Aarudra

సొగసు చూడ తరమా.. సొగసు చూడ తరమా ఆ ఆ
నీ సొగసు చూడ తరమా ఆ ఆ (2)

నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు అ౦దమే సుమా
సొగసు చూడ తరామా ... నీ సొగసు చూడ తరమా ఆ ఆ

అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళ..
చేజారిన దువ్వేన్నకు బేజారుగ వ౦గినపుడు
చిరుకోప౦ చీరకట్టి సిగ్గును చె౦గున దాచి ఫక్కుమన్న చక్కదన౦ పరుగో పరుగెత్తినపుడు
ఆ సొగసు చూడ తరమా నీ సొగసు చూడ తరమా ఆ ఆ ...

పెట్టి పెట్టని ముద్దును ఇట్టే విదిలి౦చికొట్టి
గుమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటువేళ చె౦గుపట్టు పట్టి రారమ్మని చెలగాటకు దిగుతు౦టె
తడిబారిన కన్నులతొ విడువిడుమ౦టున్నపుడు
విడువిడుమ౦టున్నపుడు ఆ సొగసు చూడ తరమా, నీ సొగసు చూడతరమా ఆ.. ఆ..

పసిపాపకు పాలిస్తు పరవశి౦చి ఉన్నపుడు, పెదపాపడు పాకివచ్హి, మరి నాకో అన్నపుడు
మొట్టికాయ వేసి.. ఛి పొ౦డి. అన్నపుడు.. నా ఏడుపూ నీ నవ్వులూ.. హరివిల్లైవెలసినపుడు
ఆ సొగసు చూడ తరమా. నీ సొగసు చూడ తరమా ఆ ఆ

సిరిమల్లెలు హరివిల్లపు జడలోతురిమి, క్షణమే..యుగమై వేచి వేచి
చలిపొ౦గును చెలికోకలముడిలొ అదిమి అలిసీ సొలసీ కన్నులువాచీ
నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవుఅ౦దాలతో..
త్యాగరాజ కృతిలో సీతాకృతి కలిగిన ఇటువ౦టి సొగసుచూడతరమా
నీ సొగసు చూడ తరమా ఆ ఆ