Showing posts with label mohanbabu. Show all posts
Showing posts with label mohanbabu. Show all posts

Saturday, December 27, 2025

Kunti Kumari [కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం] - Rowdy gari pellam

Title :Kunti kumari
Movie:Rowdy gari pellam
Singers:K.J. Yesudas గారు
Lyricist:Jaladi గారు
Composer:Bappi Lahari గారు
Director:K.S. Prakasha Rao గారు

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం

కన్యాకుమారి తన కాలుజారి చేసింది నా జీవితం

క్షణకాలపాపం కనుమాయ చేసి తనపేగు తెంచిందిరా 

లోకాలుపుట్టే ఆ మురికితొట్టే నను కన్న కడుపాయెరా..

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం


నీలాలుకారె నా కళ్ళనిండా నీరెండె మిగిలిందిరా 

పాలారబోసె పశిగుండెలోన పగనిండిపోయిందిరా 

లోకాలుతిరిగే ఏకాకిలాగా శోకాన్నిదాచానురా 

గతమంత మరిచే గరళాన్నితాగి బతుకీడ్చుతున్నానురా

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం


నడివీధిరాళ్ళె గుడిలోనపెట్టి దేవుణ్ణిచేసారురా 

ననుకన్నవాళ్ళే ననువీధినేసి నగుబాటుచేసారురా 

ఏ దేవుడైన నాలాగ పుడితే ఈ బాధ తెలిసేదిరా 

దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా..

కుంతికుమారి తన నోరుజారి రాసింది ఒక భారతం

కన్యాకుమారి తన కాలుజారి చేసింది నా జీవితం

Monday, September 9, 2024

కదిలే కాలమా కాస్సేపు ఆగవమ్మా (Kadile kaalama)

Song Name :Kadile kaalama
Movie:Pedaraayudu
Singers:K J Yesudasu garu , K.S. Chitra garu
Lyricist:Sai sri harsha garu
Composer:Koti garu
Director:Raviraja Pinisetti garu


కదిలే కాలమా కాస్సేపు ఆగవమ్మా.. జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా..

పేగే కదలగా శీమంతమాయలే ప్రేమదేవతకు నేడే.. 

కదిలే కాలమా కాస్సేపు ఆగవమ్మా.. 


లాలించే తల్లీ.. పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ..

కానున్న అమ్మా నీకంటి చెమ్మా.. నేచూడలేనమ్మా

కన్నీళ్ళలో చెలికాడినే..నీ కడుపులో పశివాడినే, 

ఏనాడు తోడును నీడను వీడనులే..

కదిలే కాలమా కాస్సేపు ఆగవమ్మా.. పేగే కదలగా శీమంతమాయలే ప్రేమదేవతకు నేడే.. 

జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా..


తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పశిరూపం 

నీ రాణి తనము నా రాచగుణము ఒకటైన చిరుదీపం 

పెరిగేనులే నా అంశము, వెలిగేనులే మా వంశము..

ఎన్నెన్నో తరములు తరగని యశములకు 


ఎన్నో నోములే గతమందు నోచి వుంటా, నీకే భార్యనై ప్రతి జన్మనందు వుంటా 

నడిచే దైవమా, నీ పాద ధూళులే పసుపుకుంకుమలు నాకు

ఎన్నో నోములే గతమందు నోచి వుంటా.. 

Sunday, July 8, 2012

Naa Paata Panchaamrutam


Movie : Allari Mogudu [అల్లరి మొగుడు]
Language : Telugu
Music Dir: M. M. Keeravaani
Singer: S.P. Balasubramanyam
Artists: Mohanbabu

నా పాట పంచామృతం 
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం 

వల్లకి మీటగ పల్లవ పాడి అంగుళి చేయన పల్లవినీ
వల్లకి మీటగ పల్లవ పాడి అంగుళి చేయన పల్లవినీ
శారద స్వరముల సంచారానికి
శారద స్వరముల సంచారానికి చరణములనందించనా...
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం 

గళము కొలను కాగా, ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదాపీఠి కాగా
శృతిలయలు మంగళహారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం
గగనము వెలువగ గమకగతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరసులూగా.... ఆ....ఆ..... నా పాట పంచామృతం

దా..నిసనిదమా  దనిదమగా మదమగసా సనిసగమదానిసా...గమాదానిసగా..మగసానిదమగా...నా పాట పంచామృతం
నీ ..దనిసగనిగసనిదమగగాసనిదదాని.. సాదాద మానీని దగాగ నిగదసమనిదగ .........నా పాట పంచామృతం
ససగమసని.. సాగామాగ..సమగస నినిగసనిస నిసగమస నిసగమదని సగమదని గమదనిస గసనిదమ ..నా పాట పంచామృతం
సా పా సా..... సనిపమగసనిపసా....
సగమపమగ సగమపమగ మపమపనీపమపా...
సరిగపదప గపదాపగదాపగ గపదసరిదరీ
సా రిమపనిస రెమపనిస.. మపనిసరి మారిపమారిసరీ
సామసామసా..మపదసరిరీ సాదపమా.... మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా...
పమపదసా..పమపదరీ... సరిరి సరిరి సరిరి సరిరి సరిస దసరి పదసరి రిమపదసరి సరిమపదసరి పనిస గపద రిమప సగమగ సమగసనిద..
నా పాట పంచామృతం నా గానాల గీర్వాణి స్నానాలు సాగించ
నా పాట పంచామృతం


Saturday, July 4, 2009

Musi musi - Brahmma

Movie : Brahmma
Language : Telugu
Music Dir: K. V. Mahadevan
Singer: K. J. Yesudas

ఆ.. ఆ....ఆ...ఆ....
ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన (2)
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తిలిసి ఫలితమొసగే వాడు...
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడినా అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడినా
అభిమానమున్నవాన్ని అవమానపరచినా ఎదలోని చీకటంతా వెన్నలగా మార్చినా
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

అనురాగజీవితాన పెనుగాలి రేగినా తనవారుకానరాక కనుపాపేడ్చినా
కడగళ్ళు బతుకులోనా వడగళ్ళురాల్చినా సుడిగుండమైన నావ ఏ దరికి చేర్చినా
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన

ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తిలిసి ఫలితమొసగే వాడు...
బ్రహ్మ ఒక్కడే.. పరబ్రహ్మ ఒక్కడే..ముసి ముసి నవ్వుల్లలొన కురిసిన పువ్వుల వాన