Sunday, March 3, 2013

Vidhata talapuna [విధాత తలపున] - Sirivennela

Title :Vidhata talapuna
Movie:Sirivennela
Singers:S.P. Bala Subramanyam గారు , P. Suseela గారు
Lyricist:Sirivennela Sitaraama sastry గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Viswanath గారు


విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం..... 
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆదిప్రణవనాదం ఓం.....
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం 
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...
అ...అ...ఆ....

సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది (2)
నే పాడిన జీవన గీతం ... ఈ గీతం 
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం 

ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన  
జాగౄత విహంగతతులె వినీల గగనపు వేదికపైన 

ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన  
జాగౄత విహంగతతులె వినీల గగనపు వేదికపైన 
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ 
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం 

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం 
చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం  
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం 
చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం  
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ సాగిన శౄష్టి విలాసమునే 
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం 

నా ఉఛ్ఛ్వాసం కవనం  నా నిస్స్వాసం గానం (2)
సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది 
నే పాడిన జీవన గీతం ... ఈ గీతం 
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం 

English
vidhAta talapuna prabhaviMchinadi anAdi jIvana vEdaM OM..... 
prANanADulaku spaMdananosagina AdipraNavanAdaM OM.....
kanula kolanulO pratibiMbiMchina viSwarUpa vinyAsaM 
edakanumalalO pratidhwaniMchina viriMchi vipaMchi gAnaM...
a...a...A....

sarasaswara SuracharI gamanamou sAmavEda sAramidi (2)
nE pADina jIvana gItaM ... I gItaM 
viriMchinai virachiMchitini I kavanaM... vipaMchinai vinipiMchitini I gItaM 

prAgdhiSha vINiya paina dinakara mayUkhataMtrula paina  
jAgRuta vihaMgatatule vinIla gaganapu vEdikapaina 

prAgdhiSha vINiya paina dinakara mayUkhataMtrula paina  
jAgRuta vihaMgatatule vinIla gaganapu vEdikapaina 
palikina kilakila twanamula swaragati jagatiki SrIkAramu kAga viSwakAryamunakidi bhAShyamuga 
viriMchinai virachiMchitini I kavanaM... vipaMchinai vinipiMchitini I gItaM 
 
janiMchu prati SiSu gaLamuna palikina jIvananAda taraMgaM 
chEtana poMdina spaMdana dhwaniMchu hRudaya mRudaMga dhwAnaM  
janiMchu prati SiSu gaLamuna palikina jIvananAda taraMgaM 
chEtana poMdina spaMdana dhwaniMchu hRudaya mRudaMga dhwAnaM  
anAdi rAgaM Adi tALamuna anaMta jIvana vAhiniga sAgina SRushTi vilAsamunE 
viriMchinai virachiMchitini I kavanaM... vipaMchinai vinipiMchitini I gItaM 

nA uChChwAsaM kavanaM  nA nisswAsaM gAnaM (2)
sarasaswara SuracharI gamanamou sAmavEda sAramidi 
nE pADina jIvana gItaM ... I gItaM 

25 comments:

  1. Namaskaram... pls post meaning words in song also so that new generation finds it interesting to learn language.

    ReplyDelete
    Replies
    1. you can find meaning in the below site:
      https://telugutuntari.wordpress.com/2016/12/28/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A4-%E0%B0%A4%E0%B0%B2%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8%E0%B0%A6%E0%B0%BF/

      Delete
    2. Wonderful song by Sirivennela garu 🙏🙏

      Delete
  2. KVM garu one of the best music directors inthe world..Amazing track..P Susheela amma no words to say..

    ReplyDelete
  3. RIP సిరివెన్నెలగారు

    ReplyDelete
  4. Sirivennala garu, ilaanti vaallu Malli raaru anipistundi, Rip

    ReplyDelete
  5. Chakkati Bhava vyaktikarana by Shastry garu.i have no words to express my gratitude to everyone who contributed to present this song.

    RIP Shastry Garu 🙏

    ReplyDelete
  6. Very nice song 🙏shasrtry gariki

    ReplyDelete
  7. Adbhutamayina lyrics hatsoff to sirivennela garu

    ReplyDelete
  8. Is it "Surachari" or "Surachari"... Any one pls confirm it...pls

    ReplyDelete
  9. Sirivennela gaaru maamulu paatala rachayita maathrame kaadhu oka goppa vignana sasthravettha ani ee paata ki ardham,saaramsam telusukunnake naaku ardhamaindhi.....hats off Sirivennela gaaru....we miss u

    ReplyDelete
  10. సిరివెన్నెల,కె.వి.మహదేవన్,బాలు,సుశీల ల అద్భుతగీతం

    ReplyDelete
  11. A great song which will be remembered for years to come

    ReplyDelete
  12. ఈ గీతం ఏ రాగంలో స్వరపరిచినదో ఎవరికైనా తెలిస్తే చెప్పండి....

    ReplyDelete

  13. ఈ గీతం ప్రపంచ రికార్డ్ గెలుచుకున్న అతి తక్కువకాలం లో వ్రాయబడిన అతిపెద్ద నవల (ప్రబంధ కావ్యం) భారతవర్ష లోనిది. రెండు లక్షల పదాలతో , 200 వృత్తపద్యాలతో 2000 ఉపమానాలతో వ్రాసిన సరళ గ్రాంధిక కావ్యం భారతవర్షలో సంస్కృత కీర్తనలు , అనేక గీతాలు ఉన్నాయి. అందులో ఒకటి మీకోసం ఇక్కడుంచుతున్నాను- రచయిత బహుభాషి , పూలబాల


    సనాతనీ విద్యామాతే సర్వశాస్త్ర పరంజ్యోతి
    జ్ఞానప్రదా యనీదేవీ వేదాగ్రణి నమోస్తుతే (శ్లోకం)

    మితభుద్ది ఏవం పరిమిత శుద్ధి, ధనం పరితః పరి భ్రమణం నిత్యం
    నివసితి ఏవ బహు అల్ప ప్రపంచం కదాపి చేతతి ప్రత్యక్ష ప్రపంచం

    లేఖిక భుద్ది లోక ప్రసిద్ధి ఉదారబుద్ధి వాగ్దేవి బద్దం
    సుశబ్ద శోభిత సుందర కోసం భారత వర్షం అనేకవర్ణం

    రసిక రంజకం దుఃఖ భంజకం పండిత ప్రభవ కవితా తరంగం
    పండిత పారంగత గీర్వాణ కావ్యం, కారు కృత కావ్యం వాణి సంభూతం

    చారు సందేశం అమృత భాండం బహు దుఃఖ వారణం ఆనంద సాగరం
    భువనైక సుందర మాంగళ్య తోరణం. భారత వర్షం సర్వతీ పుత్రం

    సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం
    కష్టాని క్లేశాని నిర్భర లోకం, దుర్హిత దుష్కృత అవరోధక లోకం

    అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.
    భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం
    గీర్వాణ నిర్వాణ రాగ సంకీర్ణం… భారత వర్షం భారత వర్షం

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. Too much addicted to this song

    ReplyDelete