| Title : | Aura ammakuchella aalakinchi |
| Movie: | Aapadhbandhavudu |
| Singers: | S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు |
| Lyricist: | Sirivennela Sitarama sastry గారు |
| Composer: | M.M. Keeravani గారు |
| Director: | K. Vishwanath గారు |
అమ్మల్లాల్ల పైడి కొమ్మల్లాల ఏడి ఏమయ్యాడే జాడలేడియ్యాల కోటి తందనాల ఆనందలాల
గోవుల్లాల పిల్లంగోవుల్లాల గొల్ల భామల్లాల ఏడనుండియ్యాల నాటి నందలాల ఆనందలీలా..
ఔరా అమ్మకుచెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంతవింత గాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించ వల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికి ఐనా అందడు ఎవ్వరికి
ఐనవాడే అందరికి ఐనా అందడు ఎవ్వరికి
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా.. తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకుచెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంతవింత గాధల్లో ఆనందలాల
ఊ..హు...నల్లరాతి కండలతో..హేయ్ కరుకైనవాడే
ఊ..హు...వెన్నముద్ద గుండెలతో..హోయ్ కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆనందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల
ఆయుధాలు పట్టను అంటూ, బావ బండి తోలిపెట్టే ఆనందలాల
జాణ జానపదాలతో జ్ఞానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా.. తెలిసేది ఎలా ఎలా చాంగుభళా
ఔరా అమ్మకుచెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంతవింత గాధల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించ వల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల
ఆలమంద కాపరిలా కనిపించ లీల ఆనందలాల
ఆలమందు కాలుడిలా అనిపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలుపటే ఆనందలాల
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల