Saturday, February 28, 2026

Kitukulu telisina chitapata [కిటుకులు తెలిసిన చిటపట చినుకులు] - Gharana Mogudu

Song Name :Kitikulu telisina chitapata chinukulu
Movie:Gharana mogudu
Singers:నాగూర్ బాబు (మనో) గారు, చిత్ర గారు 
Lyricist:భువనచంద్ర గారు 
Composer:M.M. కీరవాణి గారు
DirectorK.రాఘవేంద్ర రావు గారు

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తళుకులు

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులుకావవి మగసిరి పిలుపులు 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

రివ్వున కొట్టిన ఓ చినుకు కసిగా పదమంటే 

రైకలు కట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే 

హత్తుకుపోయిన ఓ చినుకు వగలే వొలికిస్తే 

చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే 

కురిసే వయ్యారి వాన, మెరిసే నీ కన్నుల జాణ

కురిసే వయ్యారి వాన, మెరిసే నీ కన్నుల జాణ

ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులుకావవి మగసిరి పిలుపులు 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

హద్దులుమీరిన ఆవేశం తలుపే తడుతుంటే 

అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే 

తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు

కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు 

వొడిలో బంగారుచేప పడితే నీకంతటి ఊపా 

వొడిలో బంగారుచేప పడితే నీకంతటి ఊపా 

తడిలో అందాలపాప పడితే పులుసౌతది చేపా 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులుకావవి మగసిరి పిలుపులు 

అహ అహ అహ అహ అబ్బా.. ఇది ఏమి వాన అబ్బబ్బా ఇది ఏమి వాన 

No comments:

Post a Comment