Thursday, January 24, 2013

Chukkallara chuoopullara [చుక్కల్లార చూపుల్లార] - Aapadbhandhavudu

Title : Chukkallara Choopullara
Movie: Aapadbaandhavudu
Singers: S.P. Bala Subramanyam 
గారు ,  K.S. Chitra గారు 
Lyricist: Sirivennela SitaRaamasastry గారు 
Composer: M.M. Keeravaani గారు 
Director: K. Vishwanath గారు 

చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మా జాబిలి... మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండే దారికి 
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి.. విన్నవించరా వెండిమింటికి 
జోజో...లాలీ.. జోజో లాలీ 

మలిసంద్యవేళాయే చలిగాలివేణువాయే నిదురమ్మా ఎటుపోతివే 
మునిమాపువేళాయే కనుపాప నిన్నుకోరే కునుకమ్మా ఇటు చేరవే 
నిదురమ్మా ఎటుపోతివే ... కునుకమ్మా ఇటు చేరవే 
నిదురమ్మా ఎటుపోతివే ... కునుకమ్మా ఇటు చేరవే 
గోధూళివేళాయే గూళ్ళన్నీ కనులాయే....
గోధూళివేళాయే గూళ్ళన్నీ కనులాయే గువ్వల్ల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే 

జోలపాడవా బేలకళ్ళకీ వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ 
జోజో...లాలీ.. జోజో లాలీ 
జోజో...లాలీ.. జోజో లాలీ 

పట్టుపరుపులేల పండువెన్నెలేల.. అమ్మవొడి చాలదా బజ్జోవెతల్లి 
పట్టుపరుపులేలనే పండువెన్నెలేలనే.. అమ్మవొడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే 
నారదాదులేల నాదబ్రహ్మలేల... అమ్మలాలి చాలదా బజ్జోవెతల్లి 
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే ... అమ్మలాలి చాలునే నిను కమ్మంగ లాలించునే 
చిన్ని చిన్ని కన్నుల్లో.. ఎన్నివేల వెన్నెల్లో.. తీయనైన కలలెన్నో ఊయలూగు వెళల్లో 
అమ్మలాలపైడి కొమ్మల్లాల ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల కోటితందనాల ఆనందలాలా 
గోవుల్లాల పిల్లంగోవుల్లాల గొల్లభామల్లాల యాడనుంది ఆల నాటి నందనాల ఆనందలీల 
జాడచెప్పరా చిట్టితల్లికీ... వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ 
జోజో...లాలీ.. జోజో లాలీ 

చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మా జాబిలి... మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండే దారికి 
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి.. విన్నవించరా వెండిమింటికి 

English

chukkallAra chUpullAra ekkaDammA jAbili... mabbullAra maMchullAra tappukOMDE dAriki 
veLLanivvarA venneliMTiki.. vinnaviMcharA veMDimiMTiki 
jOjO...lAlI.. jOjO lAlI 

malisaMdyavELAyE chaligAlivENuvAyE nidurammA eTupOtivE 
munimApuvELAyE kanupApa ninnukOrE kunukammA iTu chEravE 
nidurammA eTupOtivE ... kunukammA iTu chEravE 
nidurammA eTupOtivE ... kunukammA iTu chEravE 
gOdhULivELAyE gULLannI kanulAyE....
gOdhULivELAyE gULLannI kanulAyE guvvalla rekkala painA rivvu rivvuna rAvE 

jOlapADavA bElakaLLakI veLLanivvarA venneliMTikI 
jOjO...lAlI.. jOjO lAlI 
jOjO...lAlI.. jOjO lAlI 

paTTuparupulEla paMDuvennelEla.. ammavoDi chAladA bajjOvetalli 
paTTuparupulElanE paMDuvennelElanE.. ammavoDi chAlunE ninnu challaMga jOkoTTunE 
nAradAdulEla nAdabrahmalEla... ammalAli chAladA bajjOvetalli 
nAradAdulElanE nAdabrahmalElanE ... ammalAli chAlunE ninu kammaMga lAliMchunE 
chinni chinni kannullO.. ennivEla vennellO.. tIyanaina kalalennO UyalUgu veLallO 
ammalAlapaiDi kommallAla EDi EvayyADu aMtulEDiyyAla kOTitaMdanAla AnaMdalAlA 
gOvullAla pillaMgOvullAla gollabhAmallAla yADanuMdi Ala nATi naMdanAla AnaMdalIla 
jADachepparA chiTTitallikI... veLLanivvarA venneliMTikI 
jOjO...lAlI.. jOjO lAlI 

chukkallAra chUpullAra ekkaDammA jAbili... mabbullAra maMchullAra tappukOMDE dAriki 
veLLanivvarA venneliMTiki.. vinnaviMcharA veMDimiMTiki 

Saturday, January 19, 2013

Ghallu Ghallu [ఘల్లు ఘల్లు] - Swana Kamalam

Title : Ghallu ghallu
Movie: Swarna Kamalam
Singers: S.P. Bala Subramanyam 
గారు , P. Suseela గారు 
Lyricist: Sirivennala Seetarama sastry గారు 
Composer: Illayaraja గారు 
Director: K. Vishwanath గారు 

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లు (2)
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు 
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగని తొలకరి అల్లర్లు (2)
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు

లయకే నిలయమై నీపాదం సాగాలి... మలయానిలగతిలో సుమబాలగ తూగాలి 
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి.. సెలయేటికి నటనం నేర్పించే గురువేడి 
తిరిగే కాలానికీ.... ఆ....ఆ....ఆ....ఆ....
తిరిగే కాలానికి తీరొకటుంది.... అదినీ పాఠానికి దొరకను అంది
నటరాజస్వామి ఝాటాఝూటిలోకి చేరకుంటే విరిచుకుపడు సురగంగకు విలువేముంది.. విలువేముంది  

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు

దూకేఅలలకు ఏ తాళం వేస్తారు... కమ్మని కలల పాట ఏ రాగం అంటారు 
అలలకు అందునా ఆశించిన ఆకాశం.. కలలా కరగడమా జీవితాన పరమార్ధం 
వద్దని ఆపలేరు.... ఆ... ఆ... ఆ... ఆ...
వద్దని ఆపలేరు ఉరికే ఊహని... హద్దులు దాటరాదు ఆశల వాహిని
అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ 
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు
నల్లమబ్బు చల్లని చల్లని చిరుఝల్లువెల్లువొచ్చి సాగని 
తొలకరి అల్లర్లుపల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు 
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పోంగు నింగి వొళ్ళు 

English

ghallu ghallu ghallumaMTu merupallE tuLLu 
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
nallamabbu challani challani chirujhallu (2)
pallaviMchani nElaku pachchani paravaLLu 

ghallu ghallu ghallumaMTu merupallE tuLLu 
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
velluvochchi sAgani tolakari allarlu (2)
ellalannavE erugani vEgaMtO veLLu

ghallu ghallu ghallumaMTu merupallE tuLLu 
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu

layakE nilayamai nIpAdaM sAgAli... malayAnilagatilO sumabAlaga tUgAli 
valalO odugunA vihariMchE chirugAli.. selayETiki naTanaM nErpiMchE guruvEDi 
tirigE kAlAnikI.... A....A....A....A....
tirigE kAlAniki tIrokaTuMdi.... adinI pAThAniki dorakanu aMdi
naTarAjaswAmi jhATAjhUTilOki chErakuMTE virichukupaDu suragaMgaku viluvEmuMdi.. viluvEmuMdi  
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu 
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu

dUkEalalaku E tALaM vEstAru... kammani kalala pATa E rAgaM aMTAru 
alalaku aMdunA ASiMchina AkASaM.. kalalA karagaDamA jIvitAna paramArdhaM 
vaddani ApalEru.... A... A... A... A...
vaddani ApalEru urikE Uhani... haddulu dATarAdu ASala vAhini
aluperugani ATalADu vasaMtAlu valadaMTe virivanamula paramaLamula viluvEmuMdI... viluvEmuMdI 

ghallu ghallu ghallumaMTu merupallE tuLLu 
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu
nallamabbu challani challani chirujhallu
velluvochchi sAgani tolakari allarlu
pallaviMchani nElaku pachchani paravaLLu
ghallu ghallu ghallumaMTu merupallE tuLLu 
jhallu jhallu jhalluna uppOMgu niMgi voLLu 

Bharata Vedamuga [భరతవేదముగ] - Pournami

Title : Bharata Vedamuga
Movie: Pournami
Singers: Chitra
Lyricist: Sirivennela SitaRama Sastry

Composer: Devi Sri Prasad

శంభో శంకరా.... హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
తద్దిందాధిం ధింధినీ ద్వనుల తాండవకేళీ తత్పర  
గౌరీమంజులషింజిని చతుర లాస్య వినోదవ శంకర 

భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంథరా జాలిపొందరా కరుణతొ నను గనరా 
నీలకంథరా శైనమందిరా మొరవిని బదులిడరా  
నగజా మనోజ జగదీశ్వరా బాలేందుశేఖర శంకర
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ

హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
ఆ......

అంతకాంత నీసతి అగ్నితప్తమైనది - మేనుత్యాగమిచ్చి నీలో లీనమైనది 
ఆదిశక్తి ఆకౄతి అత్రిజాత పార్వతి - తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది 

భవుని భువికి తరలించేలా తరళి దివిని తలపించేల 
రసతరంగిణి లీల యతిని నౄత్యరతుని చేయగలిగె ఈ వేళ
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ 

జంగమసావర గంగార్చితశిరమౄదమండితకర పురహరా 
భక్తశుభంకర బమదాశంకర స్వరహరదక్షా ద్వరహరా 
బాలవిలోచన పాలితజణగణ కాలకాలవిశ్వేస్వర 
ఆశుతోష అగనాసతిషాశన జయగిరీష బ్రిహదీశ్వరా 
హరహర మహాదేవ హరహర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరిపరసుత ప్రేమపాశమున పిలువంగ 
యోగివేష నీ మనసునకలగద రాగలేసమైనా 
హే మహేష నీ భయదపదాహతి దైత్యషొషనము జరుపంగ 
భోగిభూష భ్వనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా 
పలుకుతున్న ప్రాణానా ప్రణవనాధ ప్రధమనాట శౄతివినరా 
హరహర మహాదేవ 

English

SaMbhO SaMkarA.... harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva
taddiMdAdhiM dhiMdhinI dwanula tAMDavakELI tatpara
gowrImaMjulashiMjini chatura lAsya vinOdava SaMkara

bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa
nIlakaMtharA jAlipoMdarA karuNato nanu ganarA
nIlakaMtharA SainamaMdirA moravini baduliDarA
nagajA manOja jagadISwarA bAlEMduSEkhara SaMkara
bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa

harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva
A......

aMtakAMta nIsati agnitaptamainadi - mEnutyAgamichchi nIlO lInamainadi
AdiSakti AkRuti atrijAta pArvati - tANuvaina prANadhavuni cheMtaku chErukunnadi

bhavuni bhuviki taraliMchElA taraLi divini talapiMchEla
rasataraMgiNi lIla yatini nRutyaratuni chEyagalige I vELa
bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa

jaMgamasAvara gaMgArchitaSiramRudamaMDitakara puraharA
bhaktaSubhaMkara bamadASaMkara swaraharadakShA dwaraharA
bAlavilOchana pAlitajaNagaNa kAlakAlaviSwEswara
ASutOSha aganAsatiShASana jayagirISha brihadISwarA
harahara mahAdEva harahara mahAdEva

vyOmakESa ninu himagiriparasuta prEmapASamuna piluvaMga
yOgivESha nI manasunakalagada rAgalEsamainA
hE mahESha nI bhayadapadAhati daityaShoshanamu jarupaMga
bhOgibhUSha bhvanALini nilupava abhayamudralOna
namaka chamakamula nAdAnA yamaka gamakamula yOgAnA
palukutunna prANAnA praNavanAdha pradhamanATa SRutivinarA
harahara mahAdEva

Saturday, January 12, 2013

Nee Navvu cheppindi [నీ నవ్వు చెప్పింది] - Antham

Title : Nee Navvu cheppindi
Movie: Antham
Singers: S.P. BalaSubramanyam
Lyricist: Sirivennela SeetaaRaama Sastry
Composer: R. D. Burman

నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో.. (2)

నాకై చాచిన నీచేతిలో చదివాను నా నిన్ననీ  (2)
నాతో సాగిన నీ అడుగులో చూసాను మన రేపుని
పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని
ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ (2)
వెన్నెల పేరే వినిపించనీ నడిరేయి కరిగించనీ 
నా పెదవి లోనూ ఇలగే చిరునవ్వు పుడుతుందని
నీ సిగ్గు నాజీవితాన తొలిముద్దు పెడుతుందని

ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో (2)
తనవు మనసూ చెరిసగమని పంచాలి అనిపించునో  
సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు 
మనమే మరోకొత్త జన్మం పొందేటి బంధాలకు 

నీ నవ్వు చెప్పింది నాతొ నేనెవ్వరో ఏమిటో.. నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో

English

nI navvu cheppiMdi nAto nEnevvarO EmiTO.. nI nIDa chUpiMdi nAlO innALLalOTEmiTO.. (2)

nAkai chAchina nIchEtilO chadivAnu nA ninnanI  (2)
nAtO sAgina nI aDugulO chUsAnu mana rEpuni
paMchEMdukE okarulEni batukeMta baruvO ani
E tODuki nOchukOni naDakeMta alupO ani

nallani nI kanupApalalO udayAlu kanipiMchanI (2)
vennela pErE vinipiMchanI naDirEyi karigiMchanI 
nA pedavi lOnU ilagE chirunavvu puDutuMdani
nI siggu nAjIvitAna tolimuddu peDutuMdani

EnADaitE I jIvitaM reTTiMpu baruvekkunO (2)
tanavu manasU cherisagamani paMchAli anipiMchunO  
sarigA adE SubhamuhUrtaM saMpUrNamayyEMduku 
manamE marOkotta janmaM poMdETi baMdhAlaku 

nI navvu cheppiMdi nAto nEnevvarO EmiTO.. nI nIDa chUpiMdi nAlO innALLalOTEmiTO

Tuesday, January 8, 2013

Kalakaanidi Viluvainadi [కల కానిది విలువైనది] - Velugu Needalu

Title : Kalakaanidi Vilivainadi
Movie: Velugu Needalu
Singers: Ghantasaala
Lyricist: Sree Sree
Composer: Pendaayala NageshwaraRao

కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
జాలివీడి అటులే దాని వదలివైతువా ఓ..ఓ..ఓ...ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా 
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
కలతలకే లొంగిపోయీ కలువరించనేలా ఓ..ఓ..ఓ...ఓ.. సాహసమను జ్యొతినీ చేకొనేసాగిపో 
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే 
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే సోకాలమరుగున దాగీ సుఖమున్నదిలే 
ఏదీ తనంతతానై నీదరికి రాదూ సోదించి సాదించాలి అదియే ధీరగుణం  
కల కానిది విలువైనది బ్రతుకూ కన్నీటిధారలలోనే బలిచేయకు

English
kala kAnidi viluvainadi bratukU kannITidhAralalOnE balichEyaku
kala kAnidi viluvainadi bratukU kannITidhAralalOnE balichEyaku

gAlivIchi pUvulatIga nElavAlipOgA
gAlivIchi pUvulatIga nElavAlipOgA
jAlivIDi aTulEdAni vadalivaituvA O..O..O...O.. chEradIsi nIrupOsi chiguriMchanIyavA 
kala kAnidi viluvainadi bratukU kannITidhAralalOnE balichEyaku

alamukonna chIkaTilOnE alamaTiMchanElA 
alamukonna chIkaTilOnE alamaTiMchanElA 
kalatalakE loMgipOyI kaluvariMchanElA O..O..O...O.. sAhasamanu jyotinI chEkonEsAgipO 
kala kAnidi viluvainadi bratukU kannITidhAralalOnE balichEyaku

agAdhamou jalanidhilOnA ANimutyamunnaTulE sOkAlamaruguna dAgI sukhamunnadilE 
agAdhamou jalanidhilOnA ANimutyamunnaTulE sOkAlamaruguna dAgI sukhamunnadilE 
EdI tanaMtatAnai nIdariki rAdU sOdiMchi sAdiMchAli adiyE dhIraguNaM  
kala kAnidi viluvainadi bratukU kannITidhAralalOnE balichEyaku

Sunday, January 6, 2013

Aaru rutuvula [ఆరురుతువుల] - Aalapana

Title : Aaru rutuvula
Movie: Aalapana
Singers: S.P. Balu
Lyricist: Veturi
Composer: Illayaraja

ఆరురుతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా 
ప్రకౄతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా ఏకం తదేకం రసైకం నాట్యాత్మా

తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝణు తకధీం 
ధీం తోం నం ధీంకిట తకధిమి తకఝణు తకధిధిత్తాం 
తకతకిట తకధిమితత్తాం తకతకిట తకధిమి 
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక ధీం కిటకతరికితతక తరికిట తరికిట 
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక ధీం కిటకతరికితతక తరికిట తరికిట తా

తరికిట తోకిట నంకిట ధిత్తరికిట తొంకిట నంకిట 
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట 
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తాం...

నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన (2)
నాట్యసుధానిధి అర్పించనా 
నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 

తకధిమితాం కిటతకథాం తకథజం దిమిథజం జణుథజం తరికితతకథాం 
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి .. నెలకొన్న లలితేందు మౌళి (2)
గళసీమ నాగేంద్రహారావళి .. తన కీర్తి తారావళి (2)
నగముదదర నభములదర జలధులెగుర జగతిచెదర 
హరహరయని సురముని తటికుదు వధింగిణతోం తధీంగిణతోం తధీంగిణతోం  
నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన (2)
నాట్యసుధానిధి అర్పించనా 
నటరాజు నయనాలు దీవించగా ఆ నటరాజు నయనాలు దీవించగా 

తకధిమి తకఝణు తకిటతంతం త్రిభువన భూర్నిత ఢమరునాదం 
ఝణుతక ధిమితక కిటతధీంధిం ముఖరిత రజత గిరీంద్రమూర్ధం 
తకిట తంతం చలిత చరణం ఝణుత తంతం జ్వలిత నయనం 
తకిటధీం లయధరం తకిటధీం భయకరం 
తకిటధీం భయకరం తకిటధీం భయకరం భయకరం 
చండ విజ్రుంభిత శాంభవబింబం శైలసుతా పరితోషిత రూపం 
ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ యఘణధం 
ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ థగణఝం 
యణగణ ధణఘణ పఘణఝం ..యణగణ పణఘణ రగణఝం 
యగణమగణం జగణగగనం ఖగనపగణం రగణజగణం 
యగమగ జగగన తగఫగ రగజన 
యగణ మగణ జగణ ఖగణ ఫగణగఝం 

నగరాజ నందినీ అభవార్ధ భాగినీ (2)
రుధిరాప్థ జిహ్వికా రుక్షరుద్రాక్షికా (2)
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ (2)
మదమోహకామప్రమోదదుర్ధమచిత్త మహిషరాక్షసమర్ధినీ మహిషరాక్షసమర్ధినీ మహిషరాక్షసమర్ధినీ 

 English

Arurutuvula bhramaNamunnA akhaMDaM kAlAtmA 
prakRutI purushula midhunamunnA atItaM paramAtmA
enni bahumukha rItulunnA EkaM tadEkaM rasaikaM nATyAtmA

tAM dhIM tOM takkiTa takadhimi takajhaNu takadhIM 
dhIM tOM naM dhIMkiTa takadhimi takajhaNu takadhidhittAM 
takatakiTa takadhimitattAM takatakiTa takadhimi 
takkiTataka tOMkiTataka naM kiTakatarikitataka dhIM kiTakatarikitataka tarikiTa tarikiTa 
takkiTataka tOMkiTataka naM kiTakatarikitataka dhIM kiTakatarikitataka tarikiTa tarikiTa tA

tarikiTa tOkiTa naMkiTa dhittarikiTa toMkiTa naMkiTa 
dhittarikiTa toMkiTa naMkiTa tadhdhittarikiTa toMkiTa naMkiTa 
dhittarikiTa toMkiTa naMkiTa tadhdhittarikiTa toMkiTa naMkiTa tadhdhittarikiTa toMkiTa naMkiTa tAM...

naTarAju nayanAlu dIviMchagA A naTarAju nayanAlu dIviMchagA 
nA yOga phalamaina nA jIva dhanamaina (2)
nATyasudhAnidhi arpiMchanA 
naTarAju nayanAlu dIviMchagA A naTarAju nayanAlu dIviMchagA 

takadhimitAM kiTatakathAM takathajaM dimithajaM jaNuthajaM tarikitatakathAM 
niluvella tulalEni tudilEni jAli .. nelakonna lalitEMdu mauLi (2)
gaLasIma nAgEMdrahArAvaLi .. tana kIrti tArAvaLi (2)
nagamudadara nabhamuladara jaladhulegura jagatichedara 
haraharayani suramuni taTikudu vadhiMgiNatOM tadhIMgiNatOM tadhIMgiNatOM  
naTarAju nayanAlu dIviMchagA A naTarAju nayanAlu dIviMchagA 
nA yOga phalamaina nA jIva dhanamaina (2)
nATyasudhAnidhi arpiMchanA 
naTarAju nayanAlu dIviMchagA A naTarAju nayanAlu dIviMchagA 

takadhimi takajhaNu takiTataMtaM tribhuvana bhUrnita DhamarunAdaM 
jhaNutaka dhimitaka kiTatadhIMdhiM mukharita rajata girIMdramUrdhaM 
takiTa taMtaM chalita charaNaM jhaNuta taMtaM jwalita nayanaM 
takiTadhIM layadharaM takiTadhIM bhayakaraM 
takiTadhIM bhayakaraM takiTadhIM bhayakaraM bhayakaraM 
chaMDa vijruMbhita SAMbhavabiMbaM SailasutA paritOshita rUpaM 
ghaNa ghaNa ghaNa ghaNa ghaNa ghaNa ghaNa ghaNa yaghaNadhaM 
dhaNa dhaNa dhaNa dhaNa dhaNa dhaNa dhaNa dhaNa thagaNajhaM 
yaNagaNa dhaNaghaNa paghaNajhaM ..yaNagaNa paNaghaNa ragaNajhaM 
yagaNamagaNaM jagaNagaganaM khaganapagaNaM ragaNajagaNaM 
yagamaga jagagana tagaphaga ragajana 
yagaNa magaNa jagaNa khagaNa phagaNagajhaM 

nagarAja naMdinI abhavArdha bhAginI (2)
rudhirAptha jihvikA rukSharudrAkshikA (2)
kShudrapraNAShinI bhadhrapradAyinI (2)
madamOhakAmapramOdadurdhamachitta mahisharAkShasamardhinI mahisharAkShasamardhinI mahisharAkShasamardhinI 

Saturday, January 5, 2013

Parugulu teey [పరుగులుతీయ్] - Maryada Raamanna

Title : Parugulu Teey
Movie: Maryada Raamanna [2010]
Singers: S.P. Balu
Lyricist: Sirivennela SeethaaRaama Sastry
Composer: M.M. Keeravaani

హరోం హరోం హర హరహర హరహర (2)
పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర
చర చర చర చర పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర
దడ దడ దడ దడలాడే ఎదసడి ఢమరుకమై 
వడి వడి వడి వడిదూకే పదగతి తాండవమై
పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై 
ముంచుకువచ్చు మౄత్యువుకందని మార్కండేయుడవై 
పరుగులుతీయ్ ఉరకలువేయ్ పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర
బిరబిర బిరబిర బిరబిర బిరబిర చరచర చరచర చరచర చరచర
బిరబిర చరచర బిరబిర చరచర 

గుత్తుకకోసే కత్తికొనలు .. కత్తికొనలు
గుత్తుకకోసే కత్తికొనలు దరిదాపుకుచేరని దూకుడువై
ఆయువుతీసే ఆపద కూడా అలసటతో ఆగేలాచేయ్ 
మట్టిలో తనగిట్టలతో నిను తొక్కేయ్యాలని వచ్చే కాలాశ్వముపై శ్వారీచేయ్ 
పరుగులుతీయ్ బిర బిర బిర బిర ఉరకలువేయ్ చర చర చర చర (2)

ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటలధారలుపోయ్ 
నిస్సత్తువతో నిలబడనీయ్యక ఒక్కోఅడుగు ముందుకువేయ్ 
వందయేళ్ళ నీ నిండు జీవితం గండిపడదనే నమ్మకమై 
శతకోటి సమస్యల ఎదుర్కొనేందుకు బతికివుండగల సాహసానివై 
పరుగులుతీయ్ పరుగులుతీయ్ .... ఉరకలువేయ్ ఉరకలువేయ్ 
పరుగులు పరుగులు పరుగులుతీయ్ .. ఉరకలు ఉరకలు ఉరకలువేయ్

బిరబిర చరచర బిరబిర చరచర ... బిరబిర చరచర బిరబిర చరచర 
హరోం హరోం హర హరహర హరహర (3)

English

harOM harOM hara harahara harahara (2)
parugulutIy bira bira bira bira urakaluvEy chara chara chara chara
chara chara chara chara parugulutIy bira bira bira bira urakaluvEy chara chara chara chara
daDa daDa daDa daDalADE edasaDi Dhamarukamai 
vaDi vaDi vaDi vaDidUkE padagati tAMDavamai
paMchaprANamula paMchAkSharitO Sivuni piluchu saMkalpamai 
muMchukuvachchu mRutyuvukaMdani mArkaMDEyuDavai 
parugulutIy urakaluvEy parugulutIy bira bira bira bira urakaluvEy chara chara chara chara
birabira birabira birabira birabira charachara charachara charachara charachara
birabira charachara birabira charachara 

guttukakOsE kattikonalu .. kattikonalu
guttukakOsE kattikonalu daridApukuchErani dUkuDuvai
AyuvutIsE Apada kUDA alasaTatO AgElAchEy 
maTTilO tanagiTTalatO ninu tokkEyyAlani vachchE kAlASwamupai SwArIchEy 
parugulutIy bira bira bira bira urakaluvEy chara chara chara chara (2)

eDAridArula taDAripOyina ASaku chemaTaladhAralupOy 
nissattuvatO nilabaDanIyyaka okkOaDugu muMdukuvEy 
vaMdayELLa nI niMDu jIvitaM gaMDipaDadanE nammakamai 
SatakOTi samasyala edurkonEMduku batikivuMDagala sAhasAnivai 
parugulutIy parugulutIy .... urakaluvEy urakaluvEy 
parugulu parugulu parugulutIy .. urakalu urakalu urakaluvEy

birabira charachara birabira charachara ... birabira charachara birabira charachara 
harOM harOM hara harahara harahara (3)

Pilichina Muraliki [పిలిచిన మురళికి] - Aananda bhairavi

Title : Pilichina Muraliki
Movie: Aananda Bhairavi
Singers: S.P. Balu, S. Janaki
Lyricist: Veturi 
Composer: Ramesh Naidu

పిలిచిన మురళికి వలచిన మువ్వకి యెదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి యెదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం

కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే 
కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే 
మనసే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచె 
యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై 
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం

ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే
ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే
పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే
హౄదయం లయమై పోయినది లయమే ప్రియమై జీవితమై
మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం

English

pilichina muraLiki valachina muvvaki yedalO okaTe rAgaM.. adi AnaMdabhairavi rAgaM
murisina muraLiki merisina muvvaki yedalO prEma parAgaM madi AnaMdabhairavi rAgaM

kulikEmuvvala alikiDi viMTE kaLalE nidduralEchE
kulikEmuvvala alikiDi viMTE kaLalE nidduralEchE
manasE muraLi AlApanalO madhurAnagariga tOche
yamunA nadilA poMginadi swaramE varamai saMgamamai
murisina muraLiki merisina muvvaki edalO prEma parAgaM madi AnaMdabhairavi rAgaM
pilichina muraLiki valachina muvvaki EdalO okaTe rAgaM.. adi AnaMdabhairavi rAgaM

evarI gOpika padalaya viMTE yedalO aMdiya mrOgE
evarI gOpika padalaya viMTE yedalO aMdiya mrOgE
padamE padamai madilO vuMTE praNayAlApana sAgE
hRudayaM layamai pOyinadi layamE priyamai jIvitamai
murisina muraLiki merisina muvvaki edalO prEma parAgaM madi AnaMdabhairavi rAgaM
pilichina muraLiki valachina muvvaki EdalO okaTe rAgaM.. adi AnaMdabhairavi rAgaM

Friday, January 4, 2013

Ninnu kori vachcha [నిన్ను కోరి వచ్చా రాజశేఖరా]

Title : Ninnu Kori Vachcha
Movie: Aagraham 
Singer: Susheela
Lyricist: Sirivennela Seetaraama Sastry
Composer: Koti
Artists: Rajasekhar, Amala

నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా
సరిగమలో సమశ్రుతిలా .. ఘుమఘుమలో స్వరజతిలా.. సరసాల రాసలీల కానీరా...
నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా

మోజుతీర పాలలో నీరులా కలిసిపోరా.. మోహనాల డొలలొ సోయగాల ఊయలూపవా 
ఆశతీర కమ్మగా ప్రేమగ కౌగిలించుకోరా.. జావళీల జాణతొ చందనాల క్రీడలాడవా 
వెన్నకాగిపోనీరా వన్నెచిన్నెలే.. కొత్తహాయికానీరా కళ్ళమూతలే 
బరిదాటే విరిబొణి బిడియాలే విగిపోనీ జిగినక మదనక వదలక కదలికలో 
నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా

ఒక్క ముద్దు నీదిగా నిండుగా నాకుదక్కనీరా.. నా నరాల తీగలో మోహరాగవీణమోగగా 
ఒక్క పొద్దు జంటగా వెంటగా వెన్నలాడుకోరా.. నా వరాల కోరికే తేనెదారిలోన తీరగా 
పారిజాత పూలన్నీ మాలవేయనీ... ఓ... శొభనాల రేరాణి మేను కందనీ 
ఇది నీదే అలివేణి జతలోని చలిపోని అమలక విమలక యమసుఖ ఢమరుకలో 

నిన్ను కోరి వచ్చా రాజశేఖరా... కన్నెసోకులిస్తా తీయతీయగా
సరిగమలో సమశ్రుతిలా .. ఘుమఘుమలో స్వరజతిలా.. సరసాల రాసలీల కానీరా...

English

ninnu kOri vachchA rAjaSEkharA... kannesOkulistA tIyatIyagA
sarigamalO samaSrutilA .. ghumaghumalO swarajatilA.. sarasAla rAsalIla kAnIrA...
ninnu kOri vachchA rAjaSEkharA... kannesOkulistA tIyatIyagA

mOjutIra pAlalO nIrulA kalisipOrA.. mOhanAla Dolalo sOyagAla ooyalUpavA 
ASatIra kammagA prEmaga kougiliMchukOrA.. jAvaLIla jANato chaMdanAla krIDalADavA 
vennakAgipOnIrA vannechinnelE.. kottahAyikAnIrA kaLLamUtalE 
baridATE viriboNi biDiyAlE vigipOnI jiginaka madanaka vadalaka kadalikalO 
ninnu kOri vachchA rAjaSEkharA... kannesOkulistA tIyatIyagA

okka muddu nIdigA niMDugA nAkudakkanIrA.. nA narAla tIgalO mOharAgavINamOgagA 
okka poddu jaMTagA veMTagA vennalADukOrA.. nA varAla kOrikE tEnedArilOna tIragA 
pArijAta pUlannI mAlavEyanI... O... SobhanAla rErANi mEnu kaMdanI 
idi nIdE alivENi jatalOni chalipOni amalaka vimalaka yamasukha DhamarukalO 

ninnu kOri vachchA rAjaSEkharA... kannesOkulistA tIyatIyagA
sarigamalO samaSrutilA .. ghumaghumalO swarajatilA.. sarasAla rAsalIla kAnIrA...

Thursday, January 3, 2013

Urvasi Glou Haa - Maharshi ( ఊర్వశి గ్లౌం హా)

Movie Maharshi
Song: Oorvasi / Urvasi
Lyrics: Jonnavittula
Music: Illayaraja
Singer(s): SP Balu

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా  (2)

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా
లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ
షుంబద్ ప్రమోద ఝుంబద్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ
లసత్ చమత్క్రుతి నటత్ ప్రతిద్యుతి ఘనత్ హరిత్మని త్వంయేవ
షుంబద్ ప్రమోద ఝుంబద్ ప్రవాహ ధవళ గగనధుని త్వంయేవ

అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)
త్వంయేవ త్వంయేవ ఏవ
ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

భజే భజే భజరే భజే భజే - భజే భజే భజరే భజే భజే
భజరే భజించరే - జపరే జపించరే (2)
భజ భజ భజ భజ - జప జప జప జప (2)
నమ్రామ్రద్రుమ థమ్రణవోద్యమ స్వరభుత్సుకసఖి త్వంయేవ
నికట ప్రకట ఘట ఘటిత త్రిపుట స్పుట నినద నిదానం త్వంయేవ
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)
త్వంయేవ త్వంయేవ ఏవ
ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా
అస్మత్ విద్వత్ విద్యుత్ దీపిక త్వంయేవ - రసవత్ విలసత్ విభవత్ గీతిక త్వంయేవ (2)

ఊర్వశి గ్లౌం భా ప్రేయశి హ్రీం మా (2)

oorvaSi glouM bhA prEyaSi hrIM mA  (2)

asmat vidvat vidyut dIpika tvaMyEva - rasavat vilasat viBhavat gItika tvaMyEva (2)

oorvaSi glouM bhA prEyaSi hrIM mA
lasat chamatkruti naTat pratidyuti ghanat haritmani tvaMyEva
shumbad pramOda JuMbad pravAha dhavaLa gaganadhuni tvaMyEva

tvaMyEva tvaMyEva Eva
oorvaSi glouM bhA prEyaSi hrIM mA

bhajE bhajE bhajarE bhajE bhajE - bhajE bhajE bhajarE bhajE bhajE
bhajarE bhajiMcharE - japarE japiMcharE (2)
bhaja bhaja bhaja bhaja - japa japa japa japa (2)
namrAmradruma thamraNavOdyama svarabhutsukasakhi tvaMyEva
nikaTa prakaTa ghaTa ghaTita tripuTa spuTa ninada nidAnaM tvaMyEva
asmat vidvat vidyut dIpika tvaMyEva - rasavat vilasat viBhavat gItika tvaMyEva (2)
tvaMyEva tvaMyEva Eva
oorvaSi glouM bhA prEyaSi hrIM mA

oorvaSi glouM bhA prEyaSi hrIM mA
asmat vidvat vidyut dIpika tvaMyEva - rasavat vilasat viBhavat gItika tvaMyEva (2)

oorvaSi glouM bhA prEyaSi hrIM mA (2)

P.S: This lyrics might not be completely correct. We have put our best effort to get to this shape. Thanks to our contributor Raja.