Showing posts with label devisriprasad. Show all posts
Showing posts with label devisriprasad. Show all posts

Wednesday, April 29, 2026

Kanulu terichina kanulu musina [కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల] - Aanandam

Title :Kanulu terichina 
Movie:Aanandam
Singers:Mallikharjuna గారు, Sumangali గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:Devi Sri Prasad (DSP) గారు
Director:Sreenu Vaitla గారు

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల

ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా, ఇదిగో ఇపుడే చూసా సరిగా

ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన

అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల

పెదవుల్లో ఈ దరహాసం నీ కోసం పూసింది

నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది

ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది

అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది 

దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది 

కానీ ఆ దూరమె నిన్ను దగ్గరే చేసింది

నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది 

నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని 

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల

ప్రతి నిముషం నా తలపంత నీ చుట్టూ తిరిగింది

ఎవరైన కనిపెడతారని కంగారుగ ఉంటొంది 

నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది 

నాక్కూడ ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది 

అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే 

నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే 

ప్రేమా ఈ కొత్తస్వరం అనుమానం కలిగింది

నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువు ఇయ్యమంది మరి 

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేల

నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేల

ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా, ఇదిగో ఇపుడే చూసా సరిగా

ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోన

అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా 

Saturday, March 28, 2026

Musuguveyyoddu manasu meeda [ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద] - Khadgam

Title :Musuguveyyoddu manasumida
Movie:Khadgam
Singers:Kalpana గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Devi sri prasad గారు
Director:Krishna vamsi గారు

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 

ఎవరి ఆనందం వారిదంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా 

మనసు చెప్పిందే మనకు వేదం కాదనేవారే లేరు రా 

మనకి తోచిందే చేసిచూద్దాం ఎవరు ఏమంటే ఏంటిరా 

హ ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 

సూర్యుడైన చూపగలడా రేయిచాటున్న రేపుని

చీకటైన ఆపగలదా వచ్చే కలల్ని వద్దని 

పిరికి పరద కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని 

దేవుడైన చెప్పగలడా సమస్యలరేరే రావని 

ఎన్నొ అందాలు స్వాగతిస్తు కళ్ళముందుండగా 

అందుకోకుండా ఆగిపోతు ఉసూరుమంటే ఎలా 

ఈ ఉడుకూ ఈ దుడుకూ ఈ వెనక్కి తిరగని పరుగు ఉండవుగా కడవరకు ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద 

ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫానువేగాలతో 

కొంతకాలం నేలకొచ్చాం అథిధులై ఉండి వెళ్ళగా  

కోటలైన కొంపలైన ఏవి స్తిరాస్థి కాదుగా 

కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా 

అంతకన్నా సొంతమంటూ ప్రపంచపటాన లేదుగా 

నిన్నలేమైన గురుతుకొస్తే తీపి అనిపించనీ 

ఉన్న కొన్నాళ్ళు గుండెనిండా సరదాలు పండించనీ 

నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసినడుద్దాం 

సావాసం సంతోషం ఇవి అందించి అందర్లో నవ్వు నింపుదాం 

ముసుగు వెయ్యొద్దు మనసుమీద వలలు వెయ్యొద్దు వయసుమీద  

Saturday, January 10, 2026

entha sakkagunnave [ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే] - Rangasthalam

Title :entha sakka gunnave
Movie:Rangasthalam
Singers:Devi Sri Prasad గారు
Lyricist:Chandrabose గారు
Composer:Devi Sri Prasad గారు
Director:Sukumar గారు

క్రింది పాటలో కోస్తాంధ్ర మాండలిక ప్రయోగాలని సాహిత్యంలో మార్చకుండ రాసాను.

ఏరుశెనగకోసం మట్టిని తవ్వితే ఎకంగా తగిలిన లంకెబిందెలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే, సేతికి అందిన చందమామలాగా  

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

మల్లెపూల మధ్య ముద్దబంతిలాగా ఎంత సక్కగున్నావే 

ముత్తైదువా మెళ్ళో పసుపుకొమ్ములాగా ఎంత సక్కగున్నావే 

సుక్కలసీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావే 

ఏరుశెనగకోసం మట్టిని తవ్వితే ఎకంగా తగిలిన లంకెబిందెలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే, సేతికి అందిన చందమామలాగా  

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

ఓ, రెండుకాళ్ళ సినుకువి నువ్వు, గుండేసేన్లో దూకేసినావు  

అలల మూటా ఇప్పేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

మబ్బులేని మెరుపువి నువ్వు నేలమీద నడిసేసినావు 

నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

సెరుకుముక్క నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే 

సెరుకుగెడకే తీపిరుసి తెలిపినావే ఎంత సక్కగున్నావే 

తిరనాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చినతల్లి సిరునవ్వులాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

గాలిపల్లకీలో ఎంకిపాటలాగా, ఎంకిపాటలోన తెలుగుమాటలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

కడవనువ్వు నడుమనబెట్టి కట్టమీదనడిసొత్తావుంటే, సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

కట్టెలమోపు తలకెత్తుకోని అడుగులోన అడుగేత్తావుంటే అడవినీకు గొడుగట్టినట్టు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

బురదసేలో వరినాటు ఏత్తావుంటే ఎంత సక్కగున్నావే 

భూమిబొమ్మకు నువ్వు ప్రాణంబోస్తునట్టు ఎంత సక్కగున్నావే 

ఏరుశెనగకోసం మట్టిని తవ్వితే ఎకంగా తగిలిన లంకెబిందెలాగా 

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే, సేతికి అందిన చందమామలాగా  

ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే 

Sunday, November 23, 2025

Gundello emundo [గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది] - Manmadhudu

Title :Gundello emundo kallallo
Movie:Manmadhudu
Singers:Venu గారు, Sumangali గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Devi Sri prasad గారు
Director:Vijay bhaskar గారు

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా ఓ మనసా 

పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నదీ

నువ్వు ఇప్పుడన్నదీ నేనెప్పుడూ విననిదీ 

నిన్నిలా చూసి పైనించీ, వెన్నెలే చిన్నబోతోందీ 

కన్నులే దాటి కలలన్ని, ఎదురుగా వచ్చినట్టుంది 

ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నది

ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది

పరిమళం వెంట పయనించే, పరుగు తడబాటు పడుతోంది 

పరిణయం దాక నడిపించే పరిచయం తోడుకోరింది 

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

మనసా మనసా మనసా ఓ మనసా 

Aakasavidhilo [ఆకాశవీధిలో..వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే] - Akasavidhilo

Title :Aakasavidhilo
Movie:Aakasavidhilo
Singers:Devi Sri Prasad గారు, Ganga గారు
Lyricist:bhuvana chandra గారు
Composer:M.M. Keeravani గారు
Director:Singeetam Srinivasarao గారు

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నీదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

మేఘాలె ముగ్గులుపెట్టే మేడల్లో, దేహాలె ఉగ్గులుకోరే నాదంలో 

చందమామే మంచం సర్దుకుందాం కొంచెం 

అహో రాత్రులు, ఒకే యాత్రలు, రహస్యాల రహదారిలో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నేనైతే, వెచ్చని అల్లరి నాదైతే 

భూదేవే బిత్తరపోయే వేగంలో, నాదేవే నిద్దురలేచే విరహంలో 

తొకచుక్కై చూస్తా, ఒహోహో సోకులెక్కే రాస్తా 

ముల్లోకాలకే ముచ్చెమటేయగా ముస్తాబంత ముద్దాడుకో 

ఆకాశవీధిలో..

వెన్నెల్లో ఆడపిల్ల నువ్వైతే, వెచ్చని అల్లరి నాదైతే 

ఊహలకేవో రెక్కలురాగా, ఎగిరిపోతుంటే ఆకాశవీధిలో..

Monday, September 1, 2025

Evaraina epudaina [ఎవరైన ఎపుడైనా సరిగా గమనించారా] - Aanandam / Anandam

Title :Evaraina epudaina
Movie:Aanandam
Singers:Pratap, K.S. Chitra గారు
Lyricist:Sirivennela Seetharamasastry గారు
Composer:Devi Sri Prasad గారు
Director:Srinu Vaitla గారు

ఎవరైన ఎపుడైనా సరిగా గమనించారా, చలిచెర అసలెప్పుడు వదిలిందో 

అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా, తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

చూస్తూనే ఎక్కడనుంచో ఛైత్రం కదిలొస్తుంది, పొగమంచును పోపొమ్మంటూ తరిమేస్తుంది

నేలంతా రంగులుతొడిగి సరికొత్తగ తోస్తుంది, తనరూపం తానేచూసి పులకిస్తుంది 

ఋతువెప్పుడు మారిందో బతుకెప్పుడు విరిసిందో, మనసెప్పుడు వలపుల వనమైందో 

ఓ...

ఎవరైన ఎపుడైనా సరిగా గమనించారా, చలిచెర అసలెప్పుడు వదిలిందో 

అణువణువు మురిసేలా చిగురాశలు మెరిసేలా, తొలి శకునం ఎప్పుడు ఎదురైందో

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా, నడిరాతిరి తొలివేకువ రేఖా 

నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే, ఒక చల్లని మదిపంపిన లేఖా 

గగానాన్నీ నేలని కలిపే వీలుందని చూపేలా, ఈ వింతల వంతెన ఇంకా ఎక్కడిదాకా 

చూసేందుకు అచ్చంగా మన భాషే అనిపిస్తున్నా, అక్షరమూ అర్థంకానీ ఈ విధిరాత 

కన్నులకే కనపడని ఈ మమతల మధురిమతో హృదయాలను కలిపే శుభలేఖ 

హో..

ఎవరైనా ఎపుడైనా ఈ చిత్రం చూసారా, నడిరాతిరి తొలివేకువ రేఖా 

నిదురించే రెప్పలపై ఉదయాలను చిత్రించే, ఒక చల్లని మదిపంపిన లేఖా  

Sunday, August 24, 2025

Ranga Ranga Rangasthalana [రంగా రంగ రంగస్థలానా] - Rangasthalam

Title :Ranga ranga rangastalana
Movie:Rangasthalam
Singers:Rahul Sipligunj
Lyricist:Chandrabose గారు
Composer:Devi Sri Prasad గారు
Director:Sukumar గారు

రంగా రంగ రంగస్థలానా...  ఊ..

రంగా రంగ రంగస్థలానా...  ఊ.. ఓ..హో.

వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండెహే ..

రంగా రంగ రంగస్థలానా రంగుపూసుకోకున్నా వేషమేసుకోకున్నా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

హే, రంగా రంగ రంగస్థలానా ఆటమొదలెట్టాకా మధ్యలోని ఆపలేని 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

కనపడని సెయ్యేదో ఆడిస్తున్నా ఆటబొమ్మలం అంటా

వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలుబొమ్మలం అంటా 

డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

హే.. డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

గంగంటే శివుడుగారి పెళ్ళామంటా, గాలంటే హనుమంతుడి నాన్నగారటా 

గాలిపీల్చడానికైన గొంతుతడవడానికైన వాళ్ళు కనికరించాలంట  

వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంటా, శూలమంటె కాళికమ్మ ఆయుధమంట 

పాటపాడడానికైన పోటుపొడవడానికైన వాళ్ళు ఆనతిస్తేనే అన్నీ జరిగేనంట 

రంగా రంగ రంగస్థలానా రంగుపూసుకోకున్నా వేషమేసుకోకున్నా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

పదితలలు ఉన్నోడు రావణుడంట, ఒక్కతలపుకూడ చెడులేదే రాముడికంట 

రామరావణులబెట్టి రామాయణమాటగట్టి మంచిచెడులమధ్య మనని పెట్టారంట 

ధర్మన్ని తప్పనోడు ధర్మరాజట, దయలేనివాడు యమధర్మరాజట  

వీడిబాట నడవకుంటె వాడివేటు తప్పదంటు ఈ బతుకును నాటకంగ ఆడిస్తున్నారంట 

రంగా రంగ రంగస్థలానా ఆడడానికంటెముందు సాధనంటుసెయ్యలేని 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

ఆటబొమ్మలం అంట మనమంతా తోలుబొమ్మలం అంటా 

హే.. డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

డుంగురూ డుంగురూ డుంగురూ డుముకో డుంగురూ డుంగురూ డుంగురూ 

Saturday, March 8, 2025

Uppenanta ee premaki [ఉప్పెనంత ఈ ప్రేమకి] - Aarya 2

Song Name :Uppenanta ee Premaki
Movie:Aarya 2
Singers:K.K garu
Lyricist:Balaji
Composer:Devi Sri Prasad garu
DirectorSukumar (Sukku) garu 

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో

రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో 

నిన్ను చూసే ఈ కళ్ళకీ లోకమంత ఇంక ఎందుకో 

రెండు అక్షరాల ప్రేమకి ఇన్ని సెక్షన్లెందుకో

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

కనులలోకొస్తావు కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావూ

మంచులా ఉంటావు మంట పెడుతుంటావు, వెంటపడి నా మనస్సు మసిచేస్తావూ

తీసుకుంటె నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి

గుచ్చుకోకు ముళ్ళులా మరి గుండెల్లో సరాసరీ..

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో

చినుకులే నిను తాకి మెరిసిపోతానంటే, మబ్బులే పోగేసి కాల్చేయ్యనా 

చీలకలే నీ పలుకు తిరిగి పలికాయంటే, తొలకరే లేకుండా పాతెయ్యనా 

నిన్నుకోరి పూలు తాకితే నరుకుతాను పూలతోటనే 

నిన్ను చూస్తే ఉన్న చోటనే తోడెస్తా ఆ కళ్ళనే  

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా 

ఐ లవ్యూ నా ప్రాణం పోయినా

ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెండంత గుండె ఏమిటో 

చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో 

Saturday, February 22, 2025

Siva Siva Shankara (శివ శివ శంకర హర హర శంకర) - Dhamarukam

Song Name :Siva siva shankara
Movie:Dhamarukam
Singers:Shankar mahadevan garu
Lyricist:Jonnavittula Rama lingeswara rao garu
Composer:Devi Sri Prasad garu
DirectorSrinivasa reddy 

సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద  కర్పూరప్రభ అర్పింతుము శంకరా 
సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
ఓం పరమేశ్వరాపరా ఓం నిఖిలేశ్వరా హరా ఓం జీవేశ్వరేస్వరా కనరారా 
ఓం మంత్రేశ్వరా స్వరా ఓం యంత్రేశ్వరా స్థిరా ఓం తంత్రేశ్వరా వరా రావేరా  
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 

ఆకాశ లింగమై ఆవహించరా, ఢమ ఢమ ఢమ మని ఢమరుకధ్వని సలిపి చడతని వదిలించరా 
శ్రీ వాయులింగమై సంచరించరా ఆణువణువణువున తనతనువున నిలిచి చలనమె కలిగించరా 
భస్మం చేసై అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా 
వరమై వశమై ప్రభలమౌ భూలింగమై వరమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వరా కరుణించరా 
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 

విశ్వేశలింగమై కనికరించరా, విధిలిఖితమునిక పరపరపర చెరిపీ అమృతమే కురిపించరా 
రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయములిడి హితము సతతము అందించరా 
గ్రహణం నిదనం బాపరా కాళహస్తిలింగేశ్వరా ప్రాణం నీవై ఆలింగనమ్మీరా   
యదలో కొలువై హర హర ఆత్మలింగమై  నిలబడరా 
ద్రుతివై గతివై సర్వజీవలోకేశ్వరా రక్షించరా 
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
శివ శివ హర హర జయ జయ
శివ శివ హర హర జయ జయ దిగిరారా 
ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా

సర్పప్రావిత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా, దిక్పూరప్రద కర్పూరప్రభ అర్పింతుము శంకరా 

Saturday, February 1, 2025

Oh bujjitalli - Thandel [ఓ బుజ్జితల్లీ]

Song Name :Oh bujji talli
Movie:Thandel
Singers:Javed Alo
Lyricist:Sree Mani
Composer:Devi Sri Prasad garu
DirectorChandu Mondeti garu

గాలిలొ ఊగిసలాడే దీపంలా, ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం

నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా, చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం 

సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా 

నీ కోసం వేచుందే, నా ప్రాణం .. ఓ బుజ్జితల్లీ   

నా కోసం ఓ మాటైన, మాటాడే నా బుజ్జితల్లీ..

నీరులేని చేపల్లే, తారలేని నింగల్లే 

జీవమేది నాలోనా నువ్వు మాటాలాడందే 

మళ్ళియేళకొస్తానే కాళ్ళాయేళ్ళా పడతానే

లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే 

ఉప్పు నీటి ముప్పునికూడా గొప్పగదాటే గట్టోణ్ణే 

నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే 

నీ కోసం వేచుందే, నా ప్రాణం .. ఓ బుజ్జితల్లీ  

నా కోసం ఓ మాటైన, మాటాడే నా బుజ్జితల్లీ..

ఇన్నినాళ్ళ మన దూరం, తీయ్యనైన ఓ విరహం 

చేదులాగ మారిందే అందిరాక నీ గారం 

దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే 

బెట్టు నువ్వు దించేలా లంచమేంటి కావాలే 

గాలి వాన జాడేలేదే రవ్వంతైనా నాచుట్టూ 

ఐన మునిగిపోతున్నానే దారే చూపెట్టూ 

నీ కోసం వేచుందే, నా ప్రాణం .. ఓ బుజ్జితల్లీ  

నా కోసం ఓ మాటైన, మాటాడే నా బుజ్జితల్లీ..

Tuesday, September 24, 2024

సంథింగ్ సంథింగ్ (Nuvvostanante Nenoddantaana)

Song Name :something something..
Movie:Nuvvostanante Nenoddantaana
Singers:Tippu
Lyricist:Sirivennela Seeta rama sastry garu
Composer:Devi Sri Prasad garu
DirectorPrabhu deva garu

సంథింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్, 

సంథింగ్ సంథింగ్ దేర్ ఈస్ సంథింగ్.. కమాన్ 

అందర్లోను ఉంది సంథింగ్, అర్థం కాని ఎదో ఫీలింగ్ 

లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా, పారాకాసి (పహారా) ఆరాతీసి ఇట్టే బైట పెట్టనా

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ అజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ అజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

అందర్లోను ఉంది సంథింగ్, అర్థం కాని ఎదో ఫీలింగ్ 

ఓ.. కొంటె కల.. ఆ.. పంతమేల

రా ముందుకిలా కం నియర్ ఇలా

చెయ్యందిస్తా చంద్రకళ సందేహిస్తావ్ ఎందుకలా 

సంకెళ్ళేవి లేవుకదా వై ఫియర్ అలా

చిలిపి చిటికె తలపు తడితె నిదరపోకె ఇంక, మసక తెరల ముసుగు చాటుగా 

ఎలాంటి అలుపులేక ఆహాడమంది వేళ, మాయదారి హాయి గోల

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ అజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ అజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

నీ కాలివెంట ఈ నేల అంతా, ఏం తుళ్ళెనంట క్యా కమాల్ అనేలా

ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుంద, సంతోషానికి సంతకంలా ఈ క్షనం నవ్వెలా 

తకిట తధిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ, ఉలికిపడద తళుకు తారకా 

మహానంద లీల సాగుతుందీవేళ కాలమంత ఆగిపోదా 

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ అజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ అజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ ఆజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

అ అ అ ఆజా అ అ అ ఆజా, తుఝే హజారుబారు పిలిచినా కదా

సునో సరోజ ఆజారె ఆజా, జవాబు జాడలేదు క్యా కరే ఖుదా 

Saturday, January 19, 2013

Bharata Vedamuga [భరతవేదముగ] - Pournami

Title : Bharata Vedamuga
Movie: Pournami
Singers: Chitra
Lyricist: Sirivennela SitaRama Sastry

Composer: Devi Sri Prasad

శంభో శంకరా.... హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
తద్దిందాధిం ధింధినీ ద్వనుల తాండవకేళీ తత్పర  
గౌరీమంజులషింజిని చతుర లాస్య వినోదవ శంకర 

భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ
నీలకంథరా జాలిపొందరా కరుణతొ నను గనరా 
నీలకంథరా శైనమందిరా మొరవిని బదులిడరా  
నగజా మనోజ జగదీశ్వరా బాలేందుశేఖర శంకర
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ

హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ
ఆ......

అంతకాంత నీసతి అగ్నితప్తమైనది - మేనుత్యాగమిచ్చి నీలో లీనమైనది 
ఆదిశక్తి ఆకౄతి అత్రిజాత పార్వతి - తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది 

భవుని భువికి తరలించేలా తరళి దివిని తలపించేల 
రసతరంగిణి లీల యతిని నౄత్యరతుని చేయగలిగె ఈ వేళ
భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది ఈశా
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేశ 

జంగమసావర గంగార్చితశిరమౄదమండితకర పురహరా 
భక్తశుభంకర బమదాశంకర స్వరహరదక్షా ద్వరహరా 
బాలవిలోచన పాలితజణగణ కాలకాలవిశ్వేస్వర 
ఆశుతోష అగనాసతిషాశన జయగిరీష బ్రిహదీశ్వరా 
హరహర మహాదేవ హరహర మహాదేవ

వ్యోమకేశ నిను హిమగిరిపరసుత ప్రేమపాశమున పిలువంగ 
యోగివేష నీ మనసునకలగద రాగలేసమైనా 
హే మహేష నీ భయదపదాహతి దైత్యషొషనము జరుపంగ 
భోగిభూష భ్వనాళిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా 
పలుకుతున్న ప్రాణానా ప్రణవనాధ ప్రధమనాట శౄతివినరా 
హరహర మహాదేవ 

English

SaMbhO SaMkarA.... harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva
taddiMdAdhiM dhiMdhinI dwanula tAMDavakELI tatpara
gowrImaMjulashiMjini chatura lAsya vinOdava SaMkara

bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa
nIlakaMtharA jAlipoMdarA karuNato nanu ganarA
nIlakaMtharA SainamaMdirA moravini baduliDarA
nagajA manOja jagadISwarA bAlEMduSEkhara SaMkara
bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa

harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva harahara mahAdEva
A......

aMtakAMta nIsati agnitaptamainadi - mEnutyAgamichchi nIlO lInamainadi
AdiSakti AkRuti atrijAta pArvati - tANuvaina prANadhavuni cheMtaku chErukunnadi

bhavuni bhuviki taraliMchElA taraLi divini talapiMchEla
rasataraMgiNi lIla yatini nRutyaratuni chEyagalige I vELa
bharatavEdamuga niratanATyamuga kadilina padamidi ISA
Siva nivEdanaga avani vEdanaga palikenu padamu parESa

jaMgamasAvara gaMgArchitaSiramRudamaMDitakara puraharA
bhaktaSubhaMkara bamadASaMkara swaraharadakShA dwaraharA
bAlavilOchana pAlitajaNagaNa kAlakAlaviSwEswara
ASutOSha aganAsatiShASana jayagirISha brihadISwarA
harahara mahAdEva harahara mahAdEva

vyOmakESa ninu himagiriparasuta prEmapASamuna piluvaMga
yOgivESha nI manasunakalagada rAgalEsamainA
hE mahESha nI bhayadapadAhati daityaShoshanamu jarupaMga
bhOgibhUSha bhvanALini nilupava abhayamudralOna
namaka chamakamula nAdAnA yamaka gamakamula yOgAnA
palukutunna prANAnA praNavanAdha pradhamanATa SRutivinarA
harahara mahAdEva