Sunday, November 23, 2025

Gundello emundo [గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది] - Manmadhudu

Title :Gundello emundo kallallo
Movie:Manmadhudu
Singers:Venu గారు, Sumangali గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Devi Sri prasad గారు
Director:Vijay bhaskar గారు

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

మనసా మనసా మనసా ఓ మనసా 


పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నదీ

నువ్వు ఇప్పుడన్నదీ నేనెప్పుడూ విననిదీ 

నిన్నిలా చూసి పైనించీ, వెన్నెలే చిన్నబోతోందీ 

కన్నులే దాటి కలలన్ని, ఎదురుగా వచ్చినట్టుంది 

ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది


ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నది

ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది

పరిమళం వెంట పయనించే, పరుగు తడబాటు పడుతోంది 

పరిణయం దాక నడిపించే పరిచయం తోడుకోరింది 

దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది 

గుండెల్లో ఎముందో కళ్ళల్లో తెలుస్తుంది

పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

నిలవదు కద హృదయం, నువ్వు ఎదురుగ నిలబడితే 

కదలదు కద సమయం, నీ అలికిడి వినకుంటే 

కలవరమో తొలివరమో తెలియని తరుణమిది 

మనసా మనసా మనసా ఓ మనసా 

No comments:

Post a Comment