| Title : | goruvanka valagane |
| Movie: | Gandeevam |
| Singers: | S.P. Balasubramanyam గారు, Srikumar గారు |
| Lyricist: | Veturi Sundararama murthy గారు |
| Composer: | M.M. Keeravani గారు |
| Director: | Priyadarsan గారు |
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా
ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లొమల్లో ఆకశాన చుక్కల్లు
అమ్మాయంటి జాబిల్లమ్మ అబ్బాయంటి సూరీడమ్మ ఇంటిదీపాలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికివారే...యమునకు నీరే
రేవునీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా
ప్రేమ రుతువులు పూలు తొడిగిన తేనెమనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెరిగిన మాలసొగసుల మాటల్లో
ముగ్గందాల ఇళ్ళునవ్వే సిగ్గందాల పిల్లనవ్వే బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చెలు నవ్వే, పేరంటాలా పూలు నవ్వే, గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో
పరవశమేదో ...పరిమళమాయే
పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మనవ్వే పాడుతుంటే
గోరువంక వాలగానె గోపురానికి స్వరాల గణగణా గంటలే మోగనేల
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే వరాల వాంచలన్ని పల్లవించగా
నదుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై

No comments:
Post a Comment