| Title : | Danchave menatta kutura |
| Movie: | Mangamma gari manavadu |
| Singers: | S.P. Balasubramanyam గారు, P. Suseela గారు |
| Lyricist: | C. Narayana reddy గారు |
| Composer: | K.V. Mahadevan గారు |
| Director: | Kodi Ramakrishna గారు |
దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదర
దంచు దంచు బాగా దంచు
హా దంచు దంచు బాగా దంచు
దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా
దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగా దంచు
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ
దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా
పోటుమీదా పోటువెయ్యి పూత వయసు పొంగనియ్యి
ఎడమచేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
పోటుమీదా పోటువెయ్యి పూత వయసు పొంగనియ్యి
ఎడమచేత ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి
ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి
కొట్టీనా నువ్వే పెట్టినా నువ్వే, పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా దంచుతా మంగమ్మ మనవడా.. ఓయె
నేను దంచితే నీ గుండె దడ దడా
దంచుతా మంగమ్మ మనవడా.. ఓయె హొయ్
నేను దంచితే నీ గుండె దడ దడా
కోరమీసం దువ్వబోకు కోకచుట్టు తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకూ
కోరమీసం దువ్వబోకు కోకచుట్టు తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకూ
ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి
ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి
నువ్వు పుట్టంగనే బట్ట కట్టంగనే, నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్, వడ్లు దంచవే నా గుండెలదరదరదర అదరా
హా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ గుండె దడదడా

No comments:
Post a Comment