Sunday, November 2, 2025

Malli malli idi raani roju [మళ్ళి మళ్ళి ఇది రానిరోజు] - Rakshasudu

Title :Malli malli idi raani roju
Movie:Rakshasudu
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kodanda Rami reddy  గారు


మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

జాబిలంటి ఈ చిన్నదాన్ని, చూడకుంటే నాకు వెన్నెలేది 

ఎదో అడగాలని, ఎంతో చెప్పాలని

రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమికాను

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 


చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం 

దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం

ఎండల్లో వెన్నెల్లో ఎంచేతో, ఒక్కరం ఇద్దరం అవుతున్నా 

వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది

గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది 

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా..

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 


కళ్ళనిండ నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం

దేహమున్న లేవు ప్రాణాలే నీవుకాదా నాకు ప్రాణం

సందిట్లో ఈ మొగ్గే పూయని, రాగాలే బుగ్గల్లో దాయని

గులాబీలు పూయిస్తున్నా, తేనెటీగ అథిదేడి 

సందెమబ్బులెన్నోస్తున్నా స్వాతిచినుకు తడుపేది

రేవులో నావలా నీ జతే కోరగా 

జాబిలంటి ఈ చిన్నదాన్నీ, చూడకుంటే నీకు వెన్నెలేదీ 

ఎదో అడగాలని, ఎంతో చెప్పాలని 

రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమికాను 

మళ్ళి మళ్ళి ఇది రానిరోజు, మల్లిజాజి అల్లుకున్న రోజు 

No comments:

Post a Comment