Showing posts with label veturisundararamamurty. Show all posts
Showing posts with label veturisundararamamurty. Show all posts

Friday, September 25, 2026

Janaki kala ganaledu [జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు] - Rajkumar

Title :Janaki kalaganaledu
Movie:Rajkumar
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela  గారు
Lyricist:Veturi sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Gutta Raamineedu గారు

జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం మన జీవన పారాయణం 

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

చెలిమనసే శివధనుస్సైనది తొలిచూపుల వశమైనది

వలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏది

ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని చిర యశమైనది

శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి

తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే

తుదిదాకా నీవే మరుజన్మకు నీవే

జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం 

ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం 

సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం

ప్రతిరోజూ ఒక శ్రీకారం పరవశ శృంగారం 

గతమంటే నీవే కథ కానిది నీవే 

కలలన్నీ నావే కలకాలం నీవే 

రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు 

జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు

ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది

ఆ రామాయణం మన జీవన పారాయణం  

Saturday, August 1, 2026

Sasivadane sasivadane [శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా] - Iddaru

Title :Sasivadane sasivadane
Movie:Iddaru
Singers:Unni Krishnan గారు, Bombay jayashree  గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:A.R. Rahman గారు
Director:Mani Rathnam గారు

శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా

అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట

శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

మదనమోహిని చూపులోన మాండురాగమేలా

మదనమోహిని చూపులోన మాండురాగమేలా

పడుచువాడు నీ కన్ను వీక్షణ పంచదార కాదా

కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం 

కలా ఇలా మేఘమాసం క్షణానికో తోడిరాగం 

చందనం కలిసిన ఊపిరిలో, కరిగే మేఖల కటినివిల్లే

శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా

చందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా

నెయ్యం వియ్యం ఏదేదైనా తనువు నిలువదేలా

నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా

ఒకే ఒక ఛైత్రవేళ పురేవిడి పూతలాయె

ఒకే ఒక ఛైత్రవేళ పురేవిడి పూతలాయె

అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జతచేరే 

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట

శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా

అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా 

Sunday, July 26, 2026

Oh paapa laali [ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి] - Geetanjali

Title :Oh paapa laali
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తియ్యగా

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి.. పాడనా 

నా జోలలా లీలగా తాకాలని, గాలినే కోరనా జాలిగా 

నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక

కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో 

తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో

చిరు చేపల కనుపాపలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తియ్యగా.. ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి, గాలిలో తేలిపో వెళ్ళిపో

ఓ కోయిలా పాడవే నా పాటని, తీయ్యనీ తేనెలే చల్లిపో

ఇరు సందెలు కదలాడే ఎదఊయల ఒడిలో

సెలయేరుల అలపాటే వినిపించని గదిలో 

చలిఎండకు సిరివెన్నెలకిది నా మనవి

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి... పాడనా తియ్యగా 

ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి.. పాడనా.. ఓ పాపా లాలి 

Amani paadave hayiga [ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ ] - Geetanjali

Title :Amani paadave haayiga
Movie:Geetanjali
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Mani Rathnam గారు

ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ 

రాలేటిపూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో 

మంచు తాకి కోయిలా మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా .. ఆమనీ పాడవే హాయిగా 

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా 

మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక 

పదాల నా ఎద స్వరాల సంపద 

తరాల నా కథ క్షణాలదే కదా 

గతించిపోవు గాథ నేననీ...

ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ.. రాలేటిపూలా రాగాలతో 

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం 

దివి భువి కలా నిజం స్పృసించిన మహోదయం

మరో ప్రపంచమే మరింత చేరువై 

నివాళి కోరిన ఉగాదివేళలో 

గంతించిపోని గాథ నేననీ... 

ఆమనీ పాడవే హాయిగా మూగవైపోకు ఈ వేళ 

రాలేటిపూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో 

మంచు తాకి కోయిలా మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా 

Wednesday, July 8, 2026

sarigamapadani rasa nasa [సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస] - Marana Mrudangam

Title :Sarigama padanisa rasa nasa
Movie:Marana Mrudangam
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Kondanda Rami Reddy గారు

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

రెండు హృదయాల పిట్టపోరు తీరనంటుంది ఎందుకో 

దొంగయోగాల కొంగ గారు గాలమేసేది ఎందుకో 

చేతికందాక జాబిలి చుక్కతో నాకు ఏంపని 

తట్టుకున్నాక కౌగిలి ఏమికావాలో చెప్పనీ

కస్సుమన్నదాని సోకు కసిగా ఉంటుంది

తుమ్మెదొచ్చి వాలినాకా పువ్వేమంటుంది 

సిగ్గో చీనీలపండు బుగ్గో బత్తాయిపండు అల్లో నేరేడుపండు నాదీ 

అరె నా నా నా నా నా.. నేనే కాదంటున్నానా ..

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

వయసు వడగళ్ళ వాన నీరు, వంటపట్టింది పిండుకో 

నన్ను దులిపేసి వలపు గాలి, నిన్ను తాకింది తట్టుకో 

లేత అందాల దోపిడి ఇప్పుడే కాస్త ఆపనీ 

ఆపినా ఆగి చావదు అందచందాల ఆ పని 

ఇంతదాక వచ్చినాకా ఇంకేమౌతుంది 

లబ్జు లబ్జు మోజు మీద లంకే అవుతుంది 

అబ్బో నా బోయ్‌ఫ్రెండు ముద్దిస్తే నోరు పండు వాటేస్తే వొళ్ళుపండునమ్మా 

అరె నా నా నా నా నా.. నేనే కాదంటున్నానా ..

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

ముద్దుపెట్టు ముద్దుపెట్టు పద, ముద్దులేక పొద్దుపోని కథ

ముద్దుకాటు పడ్డ కన్నె ఎద, విచ్చుకున్న ముద్దబంతి కద

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస

సరిగమపదనిస రస నస ఇది కనివిని ఎరుగని గుస గుస 

Saturday, July 4, 2026

Punnami rathri [పున్నమి రాత్రి పువ్వుల రాత్రి] - Punnami Nagu

Title :punnami ratri
Movie:punnami nagu
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthi గారు
Director:Rajasekhar గారు

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి

మగువ సోకులే మొగలి రేకులై మత్తుగ పిలిచే రాత్రి

మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి

ఈ వెన్నెలలో ఆ వేదనలో 

ఈ వెన్నెలలో ఆ వేదనలో, నాలో వయసుకు నవరాత్రి 

కలగా మిగిలే కడరాత్రి 

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి

కోడె నాగుకై కొదమ నాగిని కన్నులు మూసే రాత్రి

కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి 

నా కౌగిలిలో ఈ రాగిణితో 

నా కౌగిలిలో ఈ రాగిణితో తొలకరి వలపుల తొలిరాత్రి 

ఆఖరి పిలుపుల తుదిరాత్రి 

పున్నమి రాత్రి పువ్వుల రాత్రి, వెల్లువ నాలో పొంగిన వెన్నెల రాత్రి 

Friday, July 3, 2026

Swara raga ganga pravahame [స్వరరాగ గంగా ప్రవాహమే] - Sarigamalu

Title :swara raga ganga pravahame
Movie:Sarigamalu
Singers:K.J. Yesudas గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Bombay Ravi గారు
Director:Kranthi Kumar గారు

ప్రవాహమే... గంగా ప్రవాహమే  

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే

కొండలలోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి 

పిల్లనగ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి 

మట్టింటి రాయే మాణిక్యమైపోయే, సంగీత రత్నాకరానా 

స్వరసప్తకాలే కెరటాలుకాగా, ఆ గంగ పొంగింది లోన 

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక 

స్వరరాగ గంగా ప్రవాహమే

చైతన్య వర్ణాల ఈ చైత్రసుమగీతి వినిపించు రాగాలనంతాలులే

ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే 

పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలులే 

మలిసంధ్య దీపాలు గుడిగంట నాదాలు మౌనాక్షరీ గాన వేదాలులే 

స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే 

ప్రాప్తేవ సంతేతికాలికే పలికే కుహుగీతికా.. గానసరసీ రుహమాలిక

స్వరరాగ గంగా ప్రవాహమే

స్వరరాగ గంగా ప్రవాహమే 

Friday, June 26, 2026

kaastanduko darakhastanduko [కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో] - Rendu rellu Aaru

Title :Kaastanduko darakhaastanduko
Movie:Rendu rellu aaru
Singers:గానగంధర్వ  S.P. Balasubramanyam గారు,
S. Janaki 
 గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Rajan Nagendran గారు
Director:హాస్యబ్రహ్మ  Jandhyala గారు

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో

దగ్గర చేరి దస్ఖతుచేసి ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు 

చిరుగాలి దరఖాస్తు లేకుంటె కరిమబ్బు 

మెరుపంత నవ్వునా చినుకైన రాలునా

జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు 

జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు 

వరదల్లే పొంగునా కడలింక చేరునా 

శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే 

కాస్తందుకో దరఖాస్తందుకో భామ దరఖాస్తందుకో

చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే 

చలిగాలి దరఖాస్తు తొలి ఈడు వినకుంటే 

చెలి జంట చేరునా, చెలిమల్లే మారునా

నెలవంక దరఖాస్తు, లేకుంటే చెక్కిళ్ళు 

నెలవంక దరఖాస్తు, లేకుంటే చెక్కిళ్ళు 

ఎరుపెక్కి పోవునా ఎన్నెల్లు పండూనా 

దరిచేరు కూడా దరఖాస్తులేలా 

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో

దగ్గర చేరి దస్ఖతుచేసి ప్రేయసి కౌగిలి అందుకో

కాస్తందుకో దరఖాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో 

Saturday, June 20, 2026

Aaku chaatu pinde tadise [ఆకుచాటు పిందె తడిసే] - Vetagadu

Title :Aakuchaatu pinde tadise
Movie:Vetagadu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthi గారు
Director:K. Raghavendra Rao గారు

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది

గూడుచాటు గువ్వ తడిసే, గుండెమాటు గుట్టు తడిసే

గూడుచాటు గువ్వ తడిసే, గుండెమాటు గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే.. అహ అహ అహ అహ

చిగురాకు పాదాలా సిరిమువ్వ అవుతుంటే.. అహ అహ అహ అహ

ఓ చినుకు నినుతాకి తడి ఆరిపోతుంటే 

ఓ చినుకు నినుతాకి తడి ఆరిపోతుంటే 

ఓ చినుకు నీ మెడలో నగలాగా నౌతుంటే 

నీ మాట విని మబ్బు మెరిసే, ఆహా 

జడివానలే కురిసి కురిసి, వొళ్ళు తడిసీ వెల్లి విరిసి 

చిలిపి చినుకుల్లో తలదాచు కోవాలి .. అహ అహ ఆహ అహ అహ ఆహ 

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే.. అహ అహ అహ అహ

ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే.. అహ అహ అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే 

ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే 

ఆహ.. నీ ఫట విని మెరుపులొచ్చి

ఆహ.. నీ విరుపులే ముడుపులిచ్చి 

చలిని పెంచి చెలిమి పంచి, తలలు వెచ్చంగ తడి ఆర్చుకోవాలి .. అహ అహ ఆహ అహ అహ ఆహ 

ఆకుచాటు పిందె తడిసే.. అహ అహ అహ అహ

కొమ్మచాటు పువ్వు తడిసే.. అహ అహ అహ అహ

ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది

గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది 

Friday, June 19, 2026

Aaresukoboyi paaresukunnanu [ఆరేసుకోబోయి పారేసుకున్నాను ] - Adavi Ramudu

Title :Aresukoboyi
Movie:Adavi Ramudu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Raghavendra Rao గారు

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలి

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి,చలి చలి  చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నవు అరె అరె అరె అరె

నీ ఏత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి 

హరి హరి హరి హరి

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరే అరే 

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ 

ఓ.. నాపాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలిపొంగుల 

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ 

ఓ.. నాపాట ఈ పూట నీ పైటలా దాచేసుకోనీ తొలిపొంగుల 

నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి 

ఆ.. నీ చూపు సోకాలి, నా ఊపిరాడాలి 

నీ జంట నా తీపి చలిమంట కావాలి 

నీ వింత కవ్వింతకే కాగిపోవాలి 

నీ కౌగిలింతలోనే దాగిపోవాలి 

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె, కోకెత్తుకెళ్ళింది కొండగాలి

నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి, హరి హరి హరి హరి

నీ వొంపులో సొంపులే హరివిల్లు, నీ చూపులో రాపులే విరిజల్లు

నీ రాక నా వలపు ఏరువాక, నిను తాక నీలిమబ్బు నా కోక 

నే రేగిపోవాలి, నేనూగిపోవాలి 

నే రేగిపోవాలి, నేనూగిపోవాలి 

చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి

ఈ జోడు పులకింతలే నాపాట కావాలి 

ఆ పాట పూబాటగా నినుచేరుకోవాలి 

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలి

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి,చలి చలి  చలి చలి

పారేసుకోవాలనారేసుకున్నవు అరె అరె అరె అరె

నీ ఏత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతోంది హరి హరి 

హరి హరి హరి హరి 

Sirimalle puvva [సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా చిన్నారి చిలకమ్మా] - Padahaarella vayasu

Title :Sirimalle puvva
Movie:Padaharella vayasu
Singers:S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా ...

తెల్లారబోతుంటే నా కల్లోకివస్తాడే

కళ్ళారా చూదామంటే నా కళ్ళు మూస్తాడే

ఆ అందగాడు నా ఈడూ జోడు ఏడే

ఈ సందేకాడ నా చందమామ రాడే

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా 

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కోయిల

ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెద

వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే 

పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే 

చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా.. చిన్నారి చిలకమ్మా 

నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే 

సిరిమల్లేపువ్వా.. సిరిమల్లేపువ్వా సిరిమల్లేపువ్వా..  

Wednesday, June 17, 2026

Elluvocchi godaramma [ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో] - Devatha

Title :Elluvocchi godaaramma
Movie:Devata / Devatha
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:K. Raghavendra Rao గారు

ఈ గీతంలో వాడిన తెలుగు మాండలికాన్ని (తూర్పు) మార్చకుండా రాయడం జరిగింది. (రచయిత వ్ బదులుగా యాసలొ య/ఎ ని వాడారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే, 

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు

వాటేసుకుంటే వందేళ్ళపంట వద్దంటే విందమ్మ నవ్వు

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

చెయ్యేస్తే చేమంతి బుగ్గ, చెంగావి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటవు గూడు 

కౌగిళ్ళలో నన్ను కూడు, ఆకళ్ళ కుంటాది కూడు

గుండెల్లో చోటుంది చూడు 

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే

ఓరయ్యో రావయ్యో 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

నీ కళ్ళుసోక, నా తెల్లకోక అయ్యిందిలే గళ్ళకోక 

నీ మాటవిన్న నా జారుపైట పాడిందిలే గాలిపాట 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

కళ్ళల్లో ఉన్నయి ముళ్ళు, నేకోరినా మూడు ముళ్ళు 

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టేయ్యనా తాళిబొట్టు 

నా మాటకీఏరు తోడు, ఏరెండీనా ఊరు తోడు 

నీ తోడులో ఊపిరాడు  

ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలొచ్చి రెల్లుపూలే ఎండీగిన్నేలయ్యేనమ్మో 

కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే..

ఓలమ్మో రావమ్మో  

ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు, ఆగడాల పిల్లోడైనా నీవోడు 

ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా, మీగడంతా నీదేలే నా బుల్లోడా 

Sunday, June 14, 2026

Omkareswari [ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరీ] - Badrinath

Title :Omkareswari sriharinagari
Movie:Badrinath
Singers:Shankar Mahadevan గారు
Lyricist:Veturi Sundararamamurthuy  గారు
Composer:M.M. Keeravani గారు
Director:V.V. Vinayak గారు

హరిఓం హరిఓం హరిఓం హరిఓం (2) 

ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరీ 

వైకుంఠేశ్వరి సిరికినగరి అదిగో మహిమగిరి

ఈ కొండపై మాకండగా ఆ విష్ణుపాదమే వెలసింది 

వేదాలనే విభజించిన శ్రీవ్యాసపీఠమై నిలిచింది 

అలకనంద జలసంగీతం శ్రీహరి నామం 

ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం 

జ్ఞానం మోక్షం ఒసగే వైకుంఠం 

ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరీ 

వైకుంఠేశ్వరి సిరికినగరి అదిగో మహిమగిరి

జైబోలో బద్రినాథ్ జైబోలో బోల్...(2)

హరిపాదం అడుగున గంగ కలిపాపం తను కడగంగ 

హరిపాదం అడుగున గంగ కలిపాపం తను కడగంగ 

కనులే కనలేని విరజానది ఇల దిగిరాగా 

కలలా కనిపించే జలధార సరస్వతి పొంగా 

సుడులు తిరిగి వడిగ ఉరుకులెత్తగ, చెడులు కడిగి పుణ్యఫలము నివ్వగ 

శృతులు కృతులు జతులు గతులు చెలరేగా 

ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరీ 

వైకుంఠేశ్వరి సిరికినగరి అదిగో మహిమగిరి

కర్మలకే బ్రహ్మకపాలం, జన్మలకే పాపవినాశం 

కర్మలకే బ్రహ్మకపాలం, జన్మలకే పాపవినాశం 

వ్యాసం ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచించంగా 

ఘంఠం గణపతిదై కురుచరితం విరచించంగా 

యజుసామరుగ్అథర్వ శాఖలుగా..

ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరీ 

వైకుంఠేశ్వరి సిరికినగరి అదిగో మహిమగిరి

ఈ కొండపై మాకండగా ఆ విష్ణుపాదమే వెలసింది 

వేదాలనే విభజించిన శ్రీవ్యాసపీఠమై నిలిచింది 

అలకనంద జలసంగీతం శ్రీహరి నామం 

ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం 

జ్ఞానం మోక్షం ఒసగే వైకుంఠం  

ఓంకారేశ్వరి శ్రీహరినగరి ఇదిగోరా బదరీ 

వైకుంఠేశ్వరి సిరికినగరి అదిగో మహిమగిరి

జైబోలో బద్రినాథ్ జైబోలో బోల్...(2) 

Sunday, June 7, 2026

Kila kila manE [కిల కిల మనే కళావరు రాణి] - Coolie No 1

Title :Kila kila mane 
Movie:Coolie No 1
Singers:S.P. Balasubramanyam గారు, K.S. Chitra గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:K. Raghavendra Rao గారు

కిల కిల మనే కళావరు రాణి, ఘల్లు ఘల్లు మనే కథాకళి కానీ 

కళ్ళెంలేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని 

ఛల్ మోహనాంగ శుఖాలకు బోణీ, చలి గిలి అన్ని పొలోమని పోనీ 

సిగ్గేలేని సింగారాన్ని చిందించనీ ఛలో హనీ..

మదనుడి పాలైపోనీ ముదిరిన భవాలన్నీ 

మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ 

కిల కిల మనే కళావరు రాణి, ఘల్లు ఘల్లు మనే కథాకళి కానీ 

కళ్ళెంలేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని 

బరువుగా విరివిగా కాపుచూపె కద ఏపుగా గోపిక

చొరవగా కరువుగా కాపువేసె కద కైపుగా కోరిక

వాలే పరువాలే తగువేలే గనుకా 

కాలే తమకాలే గమకాలే పలుకా 

కాంక్షలో శృతీ గతీ పెంచి, కాల్చదా చుట్టూ కట్టే కంచే .. ఈ మైకం 

ఈడులో అతీ గతీ లేని, వేడికో దిక్కూ మొక్కూ పంచే ఈ రాగం 

ఆదమరిచిన ఈడులో ఈతలాడనీ..

ఛల్ మోహనాంగ శుఖాలకు బోణీ, చలి గిలి అన్ని పొలోమని పోనీ 

సిగ్గేలేని సింగారాన్ని చిందించనీ ఛలో హనీ..

ఒడుపుగా వొలుచుకో ఓపలేనుకద ఒంటిలో అవసరం 

చిలిపిగా దులుపుకో మోయలేవుకద నడుములో కలవరం

తాపం తెరతీసి తరిమేసే తరుణం 

తాళం తలుపేసి విరబూసే సమయం 

వీలుగా గుట్టు మట్టు మీటీ లీలగా ఇట్టే పుట్టే వేడి .. యాడాడో.. 

ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయ్యాలి .. ఏ నీడో 

జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ..

కిల కిల మనే కళావరు రాణి, ఘల్లు ఘల్లు మనే కథాకళి కానీ 

కళ్ళెంలేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని 

ఛల్ మోహనాంగ శుఖాలకు బోణీ, చలి గిలి అన్ని పొలోమని పోనీ 

సిగ్గేలేని సింగారాన్ని చిందించనీ ఛలో హనీ..

మదనుడి పాలైపోనీ ముదిరిన భవాలన్నీ 

మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ 

కిల కిల మనే కళావరు రాణి

ఛల్ మోహనాంగ శుఖాలకు బోణీ

కళ్ళెంలేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని 

Mila mila merisenu taara [మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా] - Nirnayam

Title :Mila mila merisenu taara
Movie:Nirnayam
Singers:Nagur babu (Mano) గారు, S. Janaki గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Illayaraja గారు
Director:Priyadarshan గారు

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా she loves you, she loves you

చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నులా he loves you, he loves you 

గాలిలో లాలిలా గానమై ఇలా 

లాలించెలే నన్నే ఓ పాపలా she loves you

వేధించెలే నన్నే నీ నీడలా he loves you

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా she loves you, she loves you

hey you.. love him love him love him 

వెచ్చనైన గుండె గిన్నెలో he loves you వెన్నలింక దాచి ఉంచకు she loves you 

పొన్నచెట్టు లేని తోటలో she loves you కన్నె వేణువాలపించకు he loves you

ప్రేమ అన్నదే ఓ.. పల్లవైనది she loves you, she loves you

పెదవి తాకితే ఓ.. పాటలే అది he loves you, he loves you

ఆమని ప్రేమని పాడేకోయిల .. 

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా she loves you, she loves you

చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నులా he loves you, he loves you 

గాలిలో లాలిలా గానమై ఇలా 

లాలించెలే నన్నే ఓ పాపలా she loves you

వేధించెలే నన్నే నీ నీడలా he loves you

hey you.. love him love him love him 

మౌనమైన మాధవీలత she loves you, మావికొమ్మనల్లుకున్నది he loves you

ఎల్లువైన రాగమిప్పుడే he loves you ఏకతాళమందుకున్నది  she loves you 

తోచదాయనే.. ఓ.. తోడులేనిదే he loves you 

కౌగిలింతలే.. ఓ.. కావ్యమాయలే she loves you 

ఎన్నడూ లేనిది ఎందుకో ఇలా..

మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా she loves you, she loves you

చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నులా he loves you, he loves you 

గాలిలో లాలిలా గానమై ఇలా 

లాలించెలే నన్నే ఓ పాపలా she loves you

వేధించెలే నన్నే నీ నీడలా he loves you 

Saturday, May 30, 2026

Andam Hindolam [అందం హిందోళం అధరం తాంబూలం] - Yamudiki Mogudu

Title :Andam hindolam
Movie:Yamudiki Mogudu
Singers:S.P. Balasubramanyam గారు,  P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj-Koti గారు
Director:Raviraja Pinisetty గారు

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

సంధ్యారాగాలెన్నో పెదవుల దాగినవేళ

వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళ 

అందనిది అందాల నిది అందగనే సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే .. హ 

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

చలిలో దుప్పటికెత్తిన ముద్దుల పంటలలో 

తొలిగా ముచ్చెమటారెను ముచ్చెలి గుంటలలో 

గుమ్మెత్తే కొమ్మమీద గుమ్మళ్ళే కాయగా

పైటమ్మే మానుకుంది పరువాలే దాయగా 

ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హా

మొటిమలపై మొగమెరుపై జతకలిపే హా

తీయ్యనిది తెర తీయ్యనిది తీరా నీ చేజిక్కినది  

మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే.. హా

అందం హిందోళం.. అధరం తాంబూలం..

అసలే చలికాలం.. తగిలే సుమబాణం..

వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో 

వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో 

గిచ్చుళ్ళ వీణమీద కృతులెన్నో పాడగా 

చిచ్చుళ్ళ హాయిమీద నిదరంతా మాయగా 

తొలిఉడూకే ఒడిదుడుకై చలి చినుకై హా.. 

పెనవేసి పెదవడిగే ప్రేమలతో హేయ్

ఇచ్చినది కడునచ్చినది రేపంటే నను గిచ్చినది 

అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే 

అందం హిందోళం అధరం తాంబూలం

అసలే చలికాలం తగిలే సుమబాణం 

సంధ్యారాగాలెన్నో పెదవుల దాగినవేళ

వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళ 

అందనిది అందాల నిది అందగనే సందేళకది

నా శృతి మించెను నీ లయ పెంచెను లే .. హ   

Ekku Bandekku mava [ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ] - Yamudiki Mogudu

Title :Ekku bandekku mava
Movie:Yamudiki Mogudu
Singers:Nagur babau (mano) గారు,  P. Suseela గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Raj-Koti గారు
Director:Raviraja Pinisetty గారు

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో రామా

గువ్వ గూడెక్కె మావ గుండే వేడెక్కె మావ గూట్లో చాటుంది రారా అయ్యో రామా 

ఇదిగున్నది ఈడొచ్చాకా అది ఆగదు మనసిచ్చాకా 

నేను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా 

లేచి రమ్మంటే ముందుకు జున్నంటి ముద్దుకు చంటివాడా 

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో  రామా 

కన్నే కొట్టేసి చూడు చెయ్యే పట్టేసి చూడు ఘాటుగా కాస్త ఘాటుగా 

నన్నే చుట్టేసి చూడు చుట్టుకొలతెంతో చూడు చాటుగా చెట్టు చాటుగా 

ఊళ్ళో పాపిష్ఠి కళ్ళు చేలో పాపిష్ఠి ముళ్ళు వొళ్ళంత గుచ్చుకోవా

నాకే ఇచ్చేసి వొళ్ళు నాలో కట్టేసి ఇల్లు రేయంత రెచ్చిపోకా 

నీ మగసిరితోటే బేరం నా సొగసే నీకిక లాభం 

గుత్తి వంకాయ కూరలా గుమ్మెత్తి పోయెరా వన్నెలాడి 

కొత్త నాటావకాయలా చిర్రెత్తినప్పుడే నువ్వు జోడీ..

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో 

గువ్వ గూడెక్కె మావ గుండే వేడెక్కె మావ గూట్లో చాటుంది రారా అయ్యో రామా 

రవ్వ లడ్డెట్టుకుంట రాత్రి ముద్దెట్టుకుంట నేర్పవా దారి చూపవా

ఈడే తెడ్డేసుకుంటా ఈదీ బొడ్డందుకుంటా తగ్గవా చేత చిక్కవా 

ఉప్పూకారాలు తిన్న ఊపే నీదగ్గరుంటే నీ జంట కట్టుకోనా 

ఉలకాతాడంటి నిన్ను ముద్దు పోకంటి నీలో ముప్పూట వండుకోనా 

నీ తట్టలు నే దులిపేస్తా నీ పిట్టకు నే వలవేస్తా 

ఎంత బాలాకుమారుడే లీలా వినోదుడే పిల్లవాడు 

అబ్బ నందాకిశోరుడే అందాలచోరుడే చిన్నవాడు 

ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించు మావ చుక్క చూరెక్కిపోయే అయ్యో రామా

గువ్వ గూడెక్కె భామ గుండే వేడెక్కె భామ గూట్లో రూపాయి బిళ్ళ నాదే భామా

ఇదిగున్నది ఈడొచ్చాకా అది ఆగదు మనసిచ్చాకా 

నిను రమ్మంటే విందుకు మోమాటమెందుకు అందగాడా 

లేచి రమ్మంటే ముందుకు వచ్చాను అందుకు ముద్దులాడా 

Thursday, May 28, 2026

Ni daari pula daari [నీ దారి పూలదారి పోవోయి బాటసారి] - Maga maharaju

Title :Ni dari pula daari
Movie:Maga maharaju
Singers:S.P. Balasubramanyam గారు,  గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:Vijaya Baapineedu గారు

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా, సాగాలీ జైత్రరథం వడివడిగా 

మలుపులెన్ని ఉన్నా గెలుపునీదిరన్నా, సాధించు మనోరథం మనిషిగా 

నరుడివై హరుడివై నారాయణుడే నీవై 

నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి  

నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి 

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

కాళరాత్రి ముగిసే కాంతిరేఖ మెరిసే, ఈ మండిన గుండెల నిట్టూర్పులలో 

చల్లగాలి విసిరే తల్లిచేయి తగిలే నీకోసం నిండిన ఓదార్పులతో 

విజయమో విలయమో విధివిలాసమేదైనా, నీ రక్తమే జ్వలించగా  జయించు ఆత్మశక్తి 

నీ రక్తమే జ్వలించగా  జయించు ఆత్మశక్తి 

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

దిక్కులన్ని కలిసే దైవమొకటి వెలసే నీ రక్తం అభిషేకం చేస్తుంటే 

మతములన్ని కరిగే మమత దివ్వె వెలిగే నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే 

వీరుడివై ధీరుడివై విక్రమార్కుడివి నీవై, నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి 

నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి 

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

Saturday, May 16, 2026

Andamga lena [అందంగాలేనా అస్సలేం బాలేనా] - Godavari

Title :Andamga lena
Movie:Godavari
Singers:Sunita Upadrashta గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:K.M. Radhakrishna గారు
Director:Sekhar Kammula గారు

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అలుసైపోయానా అస్సలేమీకానా వేషాలూ చాల్లేపొమ్మనా 

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా.. 

కనులుకలపవాయే మనసుతెలుపవాయే పెదవికదపవాయే మాటవరసకి  

కలికి చిలకలాయే కొలత నిదురలాయే మరవలేక నిన్నే మదనపడితినే 

ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వోచ్చి అడగాలి అన్నట్టు నేబెట్టు చేసాను ఇన్నాళ్ళుగా  

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

నీకు మనసుఇచ్చా, ఇచ్చినపుడే నచ్చా, కనుల కబురుతెచ్చా తెలుసు నీకది

తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు, మహాతెలియనట్టు నటనలే అదీ 

వెన్నెల్లో గోదారి తెన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా 

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా..

అలుసైపోయానా అస్సలేమీకానా వేషాలూ చాల్లేపొమ్మనా 

అందంగాలేనా అస్సలేం బాలేనా నీ ఈడు జోడూ కాననా.. 

Preminche premava [ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా] - Nuvvu Nenu Prema

Title :Preminche premava
Movie:Nuvvu nenu prema
Singers:Shreya Goshal గారు, Naresh Ayyar గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:A.R. Rahman గారు
Director:Obeli N. Krishna గారు

ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా 

ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే 

నే నేనా అడిగా నన్ను నేనే, నే నీవే హృదయం అన్నదే 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి 

సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల విందులు 

పువ్వైనా పూస్తున్నా నీ పరువంగా నే పుడతా 

మధుమాసపు మాలల మంటలు రగిలించే.. ఉసురై..

నీవే నా మదిలో ఆడా నేనే నీ నటనై రాగా 

నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్ధం.. ఉందే.. హో 

తోడై దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మేనం...

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..

నే నేనా అడిగా నన్ను నేనే

నే నేనా అడిగా నన్ను నేనే

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..

నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా

నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా..

తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా 

నే ఒదిగి ఎదపై ఎవరో నిదురించ తరమా 

నీవు సంద్రము చేరే గలగల పారే నది తెలుసా 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..ప్రేమించే ప్రేమవా పూవల్లే పుష్పించే 

నే నేనా అడిగా నన్ను నేనే, నే నీవే హృదయం అన్నదే 

ప్రేమించే నా ప్రేమవా ఊరించే ఊహవా..ప్రేమించే నా ప్రేమవా పూవల్లే పూవల్లే..

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల విందులు 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి గాజుల సవ్వడి ఘల్ ఘల్ 

రంగో రంగోలి గోరింటే నువ్‌పెట్టే రంగే పెట్టిన రేఖలు విరిసి సుందరి కన్నులు చందనమద్దిన చల్లని పున్నమి వెన్నెల విందులు