Showing posts with label vijayabaapineedu. Show all posts
Showing posts with label vijayabaapineedu. Show all posts

Thursday, May 28, 2026

Ni daari pula daari [నీ దారి పూలదారి పోవోయి బాటసారి] - Maga maharaju

Title :Ni dari pula daari
Movie:Maga maharaju
Singers:S.P. Balasubramanyam గారు,  గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Chakravarthy గారు
Director:Vijaya Baapineedu గారు

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా, సాగాలీ జైత్రరథం వడివడిగా 

మలుపులెన్ని ఉన్నా గెలుపునీదిరన్నా, సాధించు మనోరథం మనిషిగా 

నరుడివై హరుడివై నారాయణుడే నీవై 

నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి  

నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి 

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

కాళరాత్రి ముగిసే కాంతిరేఖ మెరిసే, ఈ మండిన గుండెల నిట్టూర్పులలో 

చల్లగాలి విసిరే తల్లిచేయి తగిలే నీకోసం నిండిన ఓదార్పులతో 

విజయమో విలయమో విధివిలాసమేదైనా, నీ రక్తమే జ్వలించగా  జయించు ఆత్మశక్తి 

నీ రక్తమే జ్వలించగా  జయించు ఆత్మశక్తి 

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

దిక్కులన్ని కలిసే దైవమొకటి వెలసే నీ రక్తం అభిషేకం చేస్తుంటే 

మతములన్ని కరిగే మమత దివ్వె వెలిగే నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే 

వీరుడివై ధీరుడివై విక్రమార్కుడివి నీవై, నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి 

నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి 

నీ దారి పూలదారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

Saturday, May 31, 2025

Vaana vaana velluvaye [వానా వానా వెల్లువాయె] - Gangleader

Song Name :Vana vana velluvaye
Movie:Gangleader
Singers:S.P. Bala subramanyam garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana chandra garu
Composer:Bappilahari garu
DirectorVijaya baapineedu garu 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ప్రియుని శ్వాశలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

చక్కని చెక్కిలి చిందే అందపు గంధం

పక్కన చేరిన మగమహరాజుకి సొంతం 

హో..తొలకరి చిటపట చినుకులలో మకరందం

చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం 

చివురుటాకులా చలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా..

ఒడిలో రేగెను ఎదో తెలియని జ్వాలా..

ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా

బిగిసిన కౌగిట కరిగించెను పరువాలా 

కలవరింతలే పలకరింపులై పదునుమీరగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి 

వానా వానా వెల్లువాయె, కొండా కోన తుళ్ళిపోయె

ప్రియుని శ్వాశలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి