| Title : | naarayanamma |
| Movie: | Asdarsa Kutumbam |
| Singers: | Ram Miriyala గారు, Prabha గారు |
| Lyricist: | Rama jogayya sastry గారు |
| Composer: | Thaman గారు |
| Director: | Trivikram Srinivas గారు |
ఏమని సెప్పను ఎన్నని సెప్పను తస్సలదియ్యా..
నా తింగరి మొగుడు తిక్కల చేష్టలు ఒకటా వెయ్యా
పుణ్ణెంకొద్దీ పురుషుడని అంటారుగానీ
నా కర్మ కాలి ఇట్టాంటోడికి పెళ్ళామైపొయ్యా
అయ్యో పాపం ఏంచేసాడేటి
రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే
రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే
రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ.. వేటకూరలేదని సణుగుతాడే నారాయణమ్మ
రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ.. వేటకూరలేదని సణుగుతాడే నారాయణమ్మ
సంకురాత్రి అల్లుడని మాఇంటోళ్ళు స్కూటరిత్తే
సంకురాత్రి అల్లుడని మాఇంటోళ్ళు స్కూటరిత్తే
బుర్రు బుర్రు గుంటూరుపొయ్యి నారాయణమ్మ.. ఆ రంగమణితో కులుకుతాడే నారాయణమ్మ
బుర్రు బుర్రు గుంటూరుపొయ్యి నారాయణమ్మ.. ఆ రంగమణితో కులుకుతాడే నారాయణమ్మ
చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి
చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి
మందార చిందూర పూవ్వై జారే నీయే వన్నెల్లో
ముంథిరి పంచిరి పెయ్యనుపోలే నీయే నిన్నల్లో
అంబాడ చెంబాడ మేళం కాదల్ కేట్టల్లో
విసిలు విలిచు ఆడిచు పోలిక్కు లేలో ఓలేలో
తోడంగు తోడంగు తోడంగు తోడంగు లేలో ఓ లేలో
చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి
చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి
ఆ.. ముచ్చటాటకుందమంటే మేడ పడకలేసినాను
ముద్దుకడ్డమొస్తదంటే ముక్కుపుడక తీసినాను
తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మ, ముక్కుపుడక లేదు వాడులేడు నారాయణమ్మ
తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మ, ముక్కుపుడక లేదు వాడులేడు నారాయణమ్మ
ఎంత పని జరిగినాదే, ఎంత పని జరిగినాదే, ఎంత పని జరిగినాదే నారాయణమ్మ
నీకు దొంగమొగుడు దొరికినాడే నారాయణమ్మ
తాడిసెట్టు తల్లికాదే తగిలినోడు మొగుడూ కాదే
ఈతసెట్టు ఇల్లుకాదే ఇయ్యనోడు దేవుడు కాదే
వాడినింక వదిలిపెట్టే నారాయణమ్మ..
పుడకపాయే నారాయణమ్మ, పడకపాయే నారాయణమ్మ
ఉడుకు ఈడు ఉరక పాయే నారాయణమ్మ
పెద్దోళ్ళిచ్చిన కట్నంపాయే పెనిమిటి శాల్తీ పట్నంపాయే
కాకులు పొడిచే కాపురమాయే నారాయణమ్మ
All ok all ok all ok

No comments:
Post a Comment