Showing posts with label ram miriyala. Show all posts
Showing posts with label ram miriyala. Show all posts

Friday, October 2, 2026

Naarayanamma [నారాయణమ్మ] - Aadarsa Kutumbam

Title :naarayanamma
Movie:Asdarsa Kutumbam
Singers:Ram Miriyala గారు, Prabha గారు
Lyricist:Rama jogayya sastry గారు
Composer:Thaman గారు
Director:Trivikram Srinivas గారు

ఏమని సెప్పను ఎన్నని సెప్పను తస్సలదియ్యా..

నా తింగరి మొగుడు తిక్కల చేష్టలు ఒకటా వెయ్యా

పుణ్ణెంకొద్దీ పురుషుడని అంటారుగానీ

నా కర్మ కాలి ఇట్టాంటోడికి పెళ్ళామైపొయ్యా

అయ్యో పాపం ఏంచేసాడేటి

రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే 

రాజనాల బియ్యమొండి బొమ్మిడాల పులుసు పెడితే 

రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ.. వేటకూరలేదని సణుగుతాడే నారాయణమ్మ

రాగిముద్దలడుగుతాడే నారాయణమ్మ.. వేటకూరలేదని సణుగుతాడే నారాయణమ్మ

సంకురాత్రి అల్లుడని మాఇంటోళ్ళు స్కూటరిత్తే

సంకురాత్రి అల్లుడని మాఇంటోళ్ళు స్కూటరిత్తే

బుర్రు బుర్రు గుంటూరుపొయ్యి నారాయణమ్మ.. ఆ రంగమణితో కులుకుతాడే నారాయణమ్మ 

బుర్రు బుర్రు గుంటూరుపొయ్యి నారాయణమ్మ.. ఆ రంగమణితో కులుకుతాడే నారాయణమ్మ 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

మందార చిందూర పూవ్వై జారే నీయే వన్నెల్లో 

ముంథిరి పంచిరి పెయ్యనుపోలే నీయే నిన్నల్లో 

అంబాడ చెంబాడ మేళం కాదల్ కేట్టల్లో 

విసిలు విలిచు ఆడిచు పోలిక్కు లేలో ఓలేలో 

తోడంగు తోడంగు తోడంగు తోడంగు లేలో ఓ లేలో 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

చేరే తారంగి చేరే తారంగి, కూడే తారంగి చేరే తారంగి 

ఆ.. ముచ్చటాటకుందమంటే మేడ పడకలేసినాను

ముద్దుకడ్డమొస్తదంటే ముక్కుపుడక తీసినాను

తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మ, ముక్కుపుడక లేదు వాడులేడు నారాయణమ్మ

తెల్లవారి చూసుకుంటే నారాయణమ్మ, ముక్కుపుడక లేదు వాడులేడు నారాయణమ్మ

ఎంత పని జరిగినాదే, ఎంత పని జరిగినాదే, ఎంత పని జరిగినాదే నారాయణమ్మ 

నీకు దొంగమొగుడు దొరికినాడే నారాయణమ్మ 

తాడిసెట్టు తల్లికాదే తగిలినోడు మొగుడూ కాదే 

ఈతసెట్టు ఇల్లుకాదే ఇయ్యనోడు దేవుడు కాదే 

వాడినింక వదిలిపెట్టే నారాయణమ్మ..

పుడకపాయే నారాయణమ్మ, పడకపాయే నారాయణమ్మ 

ఉడుకు ఈడు ఉరక పాయే నారాయణమ్మ 

పెద్దోళ్ళిచ్చిన కట్నంపాయే పెనిమిటి శాల్తీ పట్నంపాయే 

కాకులు పొడిచే కాపురమాయే నారాయణమ్మ 

All ok all ok all ok  

Saturday, February 7, 2026

Gira gira gira [గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే] - Champion

Title :Gira gira gira 
Movie:Champion
Singers:Ram Miriyala గారు
Lyricist:Shyam Kasarla గారు
Composer:Mickey J Meyer గారు
Director:Pradeep Advaitam గారు

గమనిక - పల్లెటూరి యాస మార్చకుండా సాహిత్యాన్ని రాయడం జరిగింది.

ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండిమేఘం మెరిసిందే 

పచ్చాని సీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం దిత్తాం దిత్తాం..

ఏ మబ్బు ఎనక, ఏ సినుకు ఉందో ఏడా రాలునో

ఏ తొవ్వలోన, ఏ మలుపు ఉందో, ఏడా ఆగునో..సాగునో..

ఏ ఎండల్లో దాగి ఏడురంగుల్లో ఆ హరివిల్లే పుట్టెనుకదా

ముళ్ళైన పూలైనాకొమ్మకు పూసె కదా

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండిమేఘం మెరిసిందే 

పచ్చాని సీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం దిత్తాం దిత్తాం..

పల్లే తల్లిలా కొంగునే సాపినాదే, ఒళ్ళో గువ్వలా దాచినాదే

ఊరే స్నెహమే ఊరిన ఊటసెలిమాయే, 

చుట్టూపక్క ఏ గోడల్ అడ్డేలేని ఈ వాడల్ 

ముద్దుగున్నాయె హత్తుకున్నాయె మనసుతోనె అందరు సొంతమనే 

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

రాలే సుక్కలే గాజులా సప్పుడాయే, లేనీ హాయిలో ముంచినాయే 

దూరం చూడగా దారిలో దగ్గరైపోయే, చల్లారని సంతోషం తెల్లారక ఉండాలని 

పంచుకున్నాయె పెంచుకున్నాయె తెలవకనే తెలిసిన చుట్టంలా 

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

Monday, June 23, 2025

Ooru palletooru telugu lyrics [ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మతీరు] - Balagam

Song Name :Ooru palletooru
Movie:Balagam
Singers:Ram miriyala, Mangli
Lyricist:Kasarla Shyam
Composer:Bheems Cecirolio garu
DirectorVenu Yeldandi garu 

ఓరి వారీ, ఇంకా పిండుతున్నావురా పాలు ఇకెప్పుడుపోతావురా ఊర్లోకు నీహ్ యక్కా 

ఇహ పొద్దుపొద్దునే మొదలెట్టినావు. నిహ్ పాసుగాల 

కోలో నా పల్లే కోడికూతల్లే, ఒళ్ళిరుసుకుందే కోడె లాగల్లే

యాపపుల్లలా షేదునమిలిండే రామ రామ రామా 

తలకుపోసుకుండె నా నేలతల్లే, అలికి పూసుకుండె ముగ్గు సుక్కల్లే 

సద్దిమూటల్లే సగబెట్టుకుందే బాయిగిరక నా పల్లే 

తెల్లా తెల్లని పాలధారల్లల్ల పల్లే తెల్లారుతుంటాదిరా 

గుళ్ళోని గంటలు కాడెడ్లమెడలోన జంటగమోగుతు ఉంటయిరా 

నాగలి భుజాన పెట్టూకుంటె దోస్తులు చెయ్యేసినట్టేరా 

గొడ్డూ గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా 

సల్లగాలి మోసుకొచ్చెరా సేనుసిలకలా ముచ్చట్లు

దారిపొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లూ  

గడ్డిమోపులు కాల్వగట్టులు సెమటసుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల 

ఆ.. ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మతీరు, కొంగులోనా దాసిపెట్టీ కొడుకుకిచ్చే ప్రేమ వేరు 

ఊరూ పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కళ్ళముందే ఎదుగుతున్నా సంబరాలా పంట పైరు  

ఆ.. వంద గడపలా మంద నా పల్లే గోదకట్టనీ గూడు నా పల్లే

చెహ్రువుల్ల తుల్లేటి జల్ల చాపోలే రామ రామ రామా..

మావా ఒ ధంపడదాం రా, యేలాపాళా లేదానై.. కానీండి కానీండి (Dialogue)

మావా అత్త బావ బాపు వరసల్లే, ఊరంత సుట్టాల ముల్లేలాపల్లే

దారంల ఒదిగీన పూలదండల్లే రంగుల సింగిడి పల్లే 

(Dialogue)

అగో..ఎమయ్యె బావ ఎటో పోతాండవ్.. ఒత్తవ పిల్ల నాతోటి 

సిగ్గులేదు నీకు ఇంకా అత్తరు నీతోటి 

పైసలీయ్.. రాస్కో.. ఎయ్..ఎయ్.. సూపియ్ ... సూడు 

(Dialogue)

ఆలుమగలు ఆడే ఆటలూ అత్తకోడండ్ల కొట్లాటలూ

సదిరి సెప్పాలేని మగని తిప్పలే తిప్పలూ 

రచ్చాబండ మీద ఆటలూ చాయ బండికాడ మాటలూ 

వచ్చి పోయెటోళ్ళ మందలించికునె సంగతే గమ్మత్తీ  

తట్టబుట్టలల్ల కూర తొక్కులూ, సుట్టపట్టాలల్ల బీడి కట్టలూ 

చేతనైన సాయంచేసె మనుషులూ, మావిపూతగాసినట్టే మనసులూ 

ఊరంటే రొజు ఊగాది సచ్చేదాక ఉంటది అది  

ఊరూ నా ఊరు దీని తీరే అమ్మతీరు, కొంగులోన దాసిపెట్టీ కొడుకుకిచ్చే ప్రేమవేరు 

ఊరూ పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కండ్లముందే ఎందుగుతున్నా సంబరాల పంటపైరు