Showing posts with label gira. Show all posts
Showing posts with label gira. Show all posts

Saturday, February 7, 2026

Gira gira gira [గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే] - Champion

Title :Gira gira gira 
Movie:Champion
Singers:Ram Miriyala గారు
Lyricist:Shyam Kasarla గారు
Composer:Mickey J Meyer గారు
Director:Pradeep Advaitam గారు

గమనిక - పల్లెటూరి యాస మార్చకుండా సాహిత్యాన్ని రాయడం జరిగింది.

ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండిమేఘం మెరిసిందే 

పచ్చాని సీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం దిత్తాం దిత్తాం..

ఏ మబ్బు ఎనక, ఏ సినుకు ఉందో ఏడా రాలునో

ఏ తొవ్వలోన, ఏ మలుపు ఉందో, ఏడా ఆగునో..సాగునో..

ఏ ఎండల్లో దాగి ఏడురంగుల్లో ఆ హరివిల్లే పుట్టెనుకదా

ముళ్ళైన పూలైనాకొమ్మకు పూసె కదా

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండిమేఘం మెరిసిందే 

పచ్చాని సీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం దిత్తాం దిత్తాం..

పల్లే తల్లిలా కొంగునే సాపినాదే, ఒళ్ళో గువ్వలా దాచినాదే

ఊరే స్నెహమే ఊరిన ఊటసెలిమాయే, 

చుట్టూపక్క ఏ గోడల్ అడ్డేలేని ఈ వాడల్ 

ముద్దుగున్నాయె హత్తుకున్నాయె మనసుతోనె అందరు సొంతమనే 

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

రాలే సుక్కలే గాజులా సప్పుడాయే, లేనీ హాయిలో ముంచినాయే 

దూరం చూడగా దారిలో దగ్గరైపోయే, చల్లారని సంతోషం తెల్లారక ఉండాలని 

పంచుకున్నాయె పెంచుకున్నాయె తెలవకనే తెలిసిన చుట్టంలా 