Showing posts with label shyam kasarla. Show all posts
Showing posts with label shyam kasarla. Show all posts

Saturday, March 14, 2026

Aaya sher [ఆయా షేర్] - Paradise

Song Name :ఆయా షేర్
Movie:Paradise
Singers:Addula Jangireddy గారు 
Lyricist:Kasarla Shyam గారు 
Composer:Anirudh Ravichandran గారు
DirectorSrikanth Odela గారు

హేయ్ నీ అయ్యాజాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇగ జడ్తీయ్యాలే జుంబలికే ఆయాషేర్ 

హేయ్ ఏ డర్‌కా సుల్తానే మా ఘర్‌కా సైతానే చల్ షికార్ చెయ్యా జుంబలికే ఆయాషేర్ 

పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ 

బూడిదల గడ్డ ఇది ఆయా షేర్, మాకో రాయబడ్డ కథేఇది ఆయా షేర్ 

జడలురో జడలురో హడలురో దడలురో కొడతరో తొడలురో తీస్తరో తోలురో

సవారీకి దొరుకుబిడ్డ శవాలే లేస్తయ్ బిడ్డ, పేగుల్‌తీసి మెడలొయేసి ఆడుతం బిడ్డ

ఆడుతం బిడ్డ..

ఆడ ఈడ ఏడజూడు బిడ్డ, వణుకే పుట్టలింక పడితెనే నా నీడా 

బొందపెడత మాలిక్‌నైనకూడా, వాని సావురాసుకొచ్చిన దేవునికాడా   

చల్ ఉడుకుతుంది సార బట్టిలో మాకంటతడే జుంబలికే ఆయా ఆయా షేర్ 

ఇక రాలుతది బొట్టు బొట్టూలో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్  

జడలురో జడలురో హడలురో దడలురో కొడతరో తొడలురో తీస్తరో తోలురో

సవారీకి దొరుకుబిడ్డ శవాలే లేస్తయ్ బిడ్డ, పేగుల్‌తీసి మెడలొయేసి ఆడుతం బిడ్డ

ఆడుతం బిడ్డ.. 

హేయ్ బరిబత్తాలుణ్ణోన్రా బర్‌బాదేఅయిణోన్రా నను పీకుతవా జుంబలికే ఆయా షేర్ 

హేయ్ మొల్దారంలేణొన్రా నీకన్నా మొండోండ్రా ఇక పీకుతవా జుంబలికే ఆయా షేర్ 

బొట్టు బొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్ 

పేరు పతా లేణోన్నిరా ఆయా షేర్, సూస్కో ప్యారడైసెకే అడ్రస్సైతా ఆయా షేర్ 

బొట్టు బొట్టు ఆకలుంది ... మెట్టు మెట్టు ఎక్కుతరా 

పేరు పతా లేణోన్నిరా ... సూస్కో ప్యారడైసెకే అడ్రస్సైతా 

Saturday, February 7, 2026

Gira gira gira [గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే] - Champion

Title :Gira gira gira 
Movie:Champion
Singers:Ram Miriyala గారు
Lyricist:Shyam Kasarla గారు
Composer:Mickey J Meyer గారు
Director:Pradeep Advaitam గారు

గమనిక - పల్లెటూరి యాస మార్చకుండా సాహిత్యాన్ని రాయడం జరిగింది.

ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండిమేఘం మెరిసిందే 

పచ్చాని సీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం దిత్తాం దిత్తాం..

ఏ మబ్బు ఎనక, ఏ సినుకు ఉందో ఏడా రాలునో

ఏ తొవ్వలోన, ఏ మలుపు ఉందో, ఏడా ఆగునో..సాగునో..

ఏ ఎండల్లో దాగి ఏడురంగుల్లో ఆ హరివిల్లే పుట్టెనుకదా

ముళ్ళైన పూలైనాకొమ్మకు పూసె కదా

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

ఎర్రెర్ర బొట్టు దిద్ది ఎండిమేఘం మెరిసిందే 

పచ్చాని సీర కట్టి పంటసేనే మురిసిందే

పరదాలే తీసేద్దాం దిగిదిగిదిత్తాం దిత్తాం దిత్తాం..

పల్లే తల్లిలా కొంగునే సాపినాదే, ఒళ్ళో గువ్వలా దాచినాదే

ఊరే స్నెహమే ఊరిన ఊటసెలిమాయే, 

చుట్టూపక్క ఏ గోడల్ అడ్డేలేని ఈ వాడల్ 

ముద్దుగున్నాయె హత్తుకున్నాయె మనసుతోనె అందరు సొంతమనే 

గిర గిర గిర గింగిరాగిరే, సర సర సర బొంగారానివే

జర జర జర చుట్టు తిరిగెలే, అందాలా భూమి సూర్యుణిలా 

గిర గిర గిర గింగిరాగిరే, తుర్రు తుర్రు తుర్రు తోకపిట్టవే

జర్ర జర్ర జర్ర ఎగిరిపోవులే, రయ్యంటూ రాయి వొడిసెల్లా 

రాలే సుక్కలే గాజులా సప్పుడాయే, లేనీ హాయిలో ముంచినాయే 

దూరం చూడగా దారిలో దగ్గరైపోయే, చల్లారని సంతోషం తెల్లారక ఉండాలని 

పంచుకున్నాయె పెంచుకున్నాయె తెలవకనే తెలిసిన చుట్టంలా 