Showing posts with label k. Vishwanath. Show all posts
Showing posts with label k. Vishwanath. Show all posts

Saturday, August 16, 2025

Merise taaraladerupam [మెరిసే తారలదేరూపం] - Sirivennela

Title :Merise taaraladerupam
Movie:Sirivennela
Singers:S.P. Balasubramanyam గారు
Lyricist:Sirivennela Sitaraama sastry గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K. Viswanath గారు

మెరిసే తారలదేరూపం, విరిసే పూవులదేరూపం 

అది నాకంటికి శూన్యం..

మనసున కొలువై మమతల నెలవై, వెలసిన దేవిది ఏ రూపం

నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం 

ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో 

ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా 

ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు వూగేనో 

ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా..

నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం.. అపురూపం 

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా 

ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా 

వెదురును మురళిగ మలచి, ఈ వెదురును మురళిగ మలచి 

నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణస్పందనా, నీకే నా హృదయనివేదన 

మనసున కొలువై మమతల నెలవై, వెలసిన దేవిది ఏ రూపం

నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం.. 

Sunday, June 15, 2025

Nemaliki Nerpina [నెమలికి నేర్పిన నడకలివి] - Saptapadi

Song Name :Nemaliki nerpina
Movie:Saptapadi
Singers:S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివీ 

శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నా నాట్యలీలా 

కలహంసలకిచ్చెను పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు  

కలహంసలకిచ్చెను పదగతులు, ఎలకోయిల మెచ్చిన స్వరజతులు   

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ, ఏవేవో కన్నుల కిన్నెరలూ 

ఎన్నెన్నో వన్నెల వెన్నెలలూ, ఏవేవో కన్నుల కిన్నెరలూ 

కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన 

కాళిదాసు కమనీయ్య కల్పనా  మల్పశిల్ప మణిమేఖలనూ శకుంతలను 

నెమలికి నేర్పిన నడకలివి

చిరునవ్వులు అభినవ మల్లికలూ, సిరిమువ్వలు అభినయ దీపికలూ

చిరునవ్వులు అభినవ మల్లికలూ, సిరిమువ్వలు అభినయ దీపికలూ

నీలాల కన్నుల్లో తారకలూ, తారాడే చూపుల్లో చంద్రికలూ 

నీలాల కన్నుల్లో తారకలూ, తారాడే చూపుల్లో చంద్రికలూ 

కురులు విరిసి, మరులు కురిసి మురిసిన

రవివర్మ చిత్రలేఖనాలేఖ్య సరస సౌందర్య రేఖనూ.. శశిరేఖను 

నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పలుకులివీ 

శృంగార సంగీత నృత్యాభినయవేళ చూడాలి నా నాట్యలీలా 

నెమలికి నేర్పిన నడకలివి 

Sangeeta sahitya [సంగీత సాహిత్య సమలంకృతే] - Swathi Kiranam

Song Name :Sangita sahitya
Movie:Swathi Kiranam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

సా రిగమపదనిసా నిదపమగరిసరీ ఆ...

సంగీత సాహిత్య సమలంకృతే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే 

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వ్యాస వాల్మీకి వాగ్ధాయిని, వ్యాస వాల్మీకి వాగ్ధాయిని జ్ఞానవల్లీ సముల్లసినీ..

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ ఆ..

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

సకల సుకళా సమున్వేషిణీ, సకల సుకళా సమున్వేషిణి సర్వ రసభావ సంజీవినీ... 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే..

Wednesday, May 28, 2025

Jhummandi Naadam [ఝుమ్మంది నాదం సయ్యంది పాదం] - Siri Siri Muvva

Song Name :Jhummandi Naadam
Movie:Siri Siri muvva
Singers:S.P. Balasubramanyam garu, P. Suseela garu
Lyricist:Veturi Sundararama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanadh garu 

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం 

తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాశలీల 

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం 

తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాశలీల 

ఎదలోని సొదలా ఎలఏటి రొదలా, కదిలేటి నదిలా కలల వరదలా 

ఎదలోని సొదలా ఎలఏటి రొదలా, కదిలేటి నదిలా కలల వరదలా 

చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా స్వరమధురిమలొలికించగా 

సిరి సిరి మువ్వలు పులకించగా 

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం 

తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాశలీల 

నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశీ నటియించు నీవని తెలిసీ 

నటరాజ ప్రేయశీ నటనాల ఊర్వశీ నటియించు నీవని తెలిసీ 

ఆకాశమై పొంగె ఆవేశం, కైలాశమే వొంగె నీకోసం 

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం 

మెరుపుంది నాలో, అది నీ మేని విరుపూ 

ఉరుముంది నాలో, అది నీ మూగ పిలుపూ 

చినుకు చినుకులో చిందు లయలతో, కురిసింది తొలకరి జల్లు

విరిసింది అందాల హరివిల్లు, ఈ పొంగులే ఏడు రంగులుగా 

ఝుమ్మంది నాదం సయ్యంది పాదం 

తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాశలీల  

Tuesday, May 27, 2025

Manasu palike [మనసు పలికే మౌన గీతం] - Swathi Mutyam

Song Name :Manasu palike mouna gitam
Movie:Swathi Muthyam
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:C. Narayana Reddy garu
Composer:Illayaraja garu
DirectorK. Viswanadh garu 

మనసు పలికే .. మనసు పలికే repeat

మౌన గీతం .. మౌన గీతం repeat

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే మమతలొలికే repeat

స్వాతిముత్యం స్వాతిముత్యం Repeat

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

అణువు అణువు ప్రణయ మధువు 

అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ ధనువు

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

శిరస్సుపై నీ గంగనై మరుల జలకాలాడనీ.. మరుల జలకాలాడనీ

సగము మేన గిరిజనై పగలు రేయీ ఒదగనీ .. పగలు రేయీ ఒదగనీ 

హృదయ మేళనలో మధుర లాలనలో 

హృదయ మేళనలో మధుర లాలనలో 

వెలిగిపోనీ రాగదీపం.. వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ.. ఓనమాలు దిద్దనీ 

పెదవిపై నీ ముద్దునై మొదటి తీపీ అద్దనీ.. మొదటి తీపీ 

లలిత యామినిలో కలల కౌముదిలో 

లలిత యామినిలో కలల కౌముదిలో 

కరిగిపోనీ కాలమంతా కరిగిపోనీ కాలమంతా.. కౌగిలింతలుగా..

మనసు పలికే .. మనసు పలికే repeat

మౌన గీతం .. మౌన గీతం repeat

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే మమతలొలికే repeat

స్వాతిముత్యం స్వాతిముత్యం Repeat

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

అణువు అణువు ప్రణయ మధువు 

అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ ధనువు

Friday, May 23, 2025

Omkara naadhanu [ఓంకారనాదానుసంధానమౌ గానమే.. ] - Shankarabharanam / Sankaraabharanam

Song Name :Omkaara naadhanusandhanumou
Movie:Shankarabharanam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanadh garu 

ఓంకారనాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణమూ 

ఓంకారనాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణమూ శంకరాభరణమూ 

శంకర గళనిగళమూ శ్రీహరి పదకమలమూ.. 

శంకర గళనిగళమూ శ్రీహరి పదకమలమూ.. 

రాగరత్న మాలికా తరళమూ శంకరాభరణమూ 

శారదవీణా...ఆ.. ఆ...ఆ...

శారదవీణా... రాగచంద్రికా పులకిత శారదరాత్రము

శారదవీణా... రాగచంద్రికా పులకిత శారదరాత్రము 

నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము

నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము 

రశికులకనురాగమై రసగంగలోకానమై...

రశికులకనురాగమై రసగంగలోకానమై...

పల్లవించు సామ వేద మంత్రము శంకరాభరణమూ శంకరాభరణమూ 

అధ్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ..

అధ్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమూ..

సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణమూ 

సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణమూ 

త్యాగరాజ హృదయమై..రాగరాజ నిలయమై..

త్యాగరాజ హృదయమై..రాగరాజ నిలయమై..

ముక్తినొసగు భక్తియోగమార్గము మృతియేలేని సుధారాగస్వర్గము  

శంకరాభరణమూ 

ఓంకారనాదానుసంధానమౌ గానమే.. శంకరాభరణమూ 

పా దా ని శంకరాభరణమూ 

పమగరీ గమపదని శంకరాభరణమూ 

సరిసా నిదపా రిసనీ దపమా దరిదా పమగా పమదపనిదసనిగరి శంకరాభరణమూ .. ఆహా..

దప దమ మాపాదపా మాపాదపా..

దప దమ మదపామగా మదపామగా 

గమ మద దని నిరి - మద దని నిరి రిగ - నిరి రిగ గమ మగ - గరి రిస సని నిద దప - శంకరాభరణమూ

రీససాస రిరిసాస రీసా ససరిసరీ రిసరీస నీసనీదనీ నీ నీ.. 

దాదనీని దదనీ దానీని దరిస దనిస దనిగగరిసా నిదపదా దా దా 

గరిగ మమగ గరిగ మమగ గరిమపగ గామపద మాదపమగరి సనిసరిగసరీ 

గరి మగ పమ దప - మగ పమ దప నిద - పమ దప నిద సని - దప నిద సని రిస - 

గ.రీ.సా.. గరిసనిగ రీ.సా.. రిసనిదప సా.. గరిసనిద 

రిసనిదప సనిదపమ 

రీ.సా.నీ.. రిసనిదప నీ.దా.. సనిదపమ పా.. రిసనిదప 

సనిదపమ దపమగరి 

గ.మ.దా.. నిసనిపద మ.పా.. రిసనిదప రీ.. దపమగరి 

రిసనిదప పమరిసని 

శంకరాభరణమూ

శంకరాభరణమూ

Sankara naada sarira para [శంకరా.... నాదశరీరాపరా... ] - Sankarabharanam / Shankarabharanam

Song Name :Sankara nada sarirapara
Movie:Shankarabharanam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanadh garu 

శంకరా.... నాదశరీరాపరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా..

శంకరా.... నాదశరీరాపరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా..

శంకరా...

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమే గానమనీ

మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమనీ 

ప్రాణము నీవని గానమె నీదని ప్రాణమే గానమనీ

మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమనీ 

నాదోపాశన చేసినవాడను నీవాడను నేనైతే

నాదోపాశన చేసినవాడను నీవాడను నేనైతే

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రశిత కంధరా నీలకంధరా

క్షుద్రులెరుగనీ రుద్రవీణ నిర్నిద్ర గానమిది అవతరించరా విని తరించరా 

శంకరా.... నాదశరీరాపరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా..

శంకరా....

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలూ 

ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ 

మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలూ 

ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలూ 

పరవశాన శిరసూగంగా.. ధరకు జారెనా శివగంగా..

పరవశాన శిరసూగంగా, ధరకు జారెనా శివగంగా..

నా గానలాహరి నువ్ మునుగంగా... ఆనందవృష్టినే తడవంగా...

ఆ.... 

శంకరా.... నాదశరీరాపరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా..

శంకరా...

శంకరా... 

శంకరా...

Friday, February 21, 2025

Sri Gananadham bhajamyaham [శ్రీ గణనాధం భజామ్యహం ] - Sruthilayalu

Song Name :Sri gananadham
Movie:Sruthilayalu
Singers:Purna chander garu, Vani Jayaram garu
Lyricist:Tyaagaraaya keerthana
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం...ఆ...

శ్రీ గురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీ కంఠాత్మజం శ్రితసామ్రాజ్యం

శ్రీ కంఠాత్మజం శ్రితసామ్రాజ్యం

శ్రీ గణనాధం భజామ్యహం 

రంజిత నాటకరంగతోషణం, శింజితవర మణిమయ భూషణం

రంజిత నాటకరంగతోషణం, శింజితవర మణిమయ భూషణం

రంజిత నాటకరంగతోషణం

ప ద ప రంజిత నాటకరంగతోషణం

గ మ ప రంజిత నాటక 

ప ద ని స ని ద ప రంజిత నాటక 

గ మ గ ప మ ద ప రంజిత నాటకరంగతోషణం

ద ప మ ప మ గ మ గ రి స రి గ రంజిత 

పా ని దా ప పా మ గా రి సా రి గ రంజిత నాటకరంగ

ప ద ని స నీ స ని ద ప రంజింత నాటక

గ మ ప ద ని స రి స ని ద ప మ గా రి స రి గ రంజిత నాటకరంగతోషణం 

ప ద ని స రి స్సా ని ద ప, మ ప దా ప మ గ, గ మ పా మ గ రి, సా రి గ

ప ద ని ని స, స రి ప మ గ రి స, ని స రి స నీ ద ప మ ప గ రి స రి స రంజిత నాటకరంగతోషణం 

ప ద ని ని సా, ని స రి స రీ, స ని ద ప మా, ద ప మ గ రీ 

ప ద ని ని సా, ని స రి స రీ, స ని ద ప మా, ద ప మ గ రీ 

సా రి గ రి - గ రి రి గ - మ గ గ మ - ప మ మ ప - ద ప ద ని ద ని సా - ని స రీ - స రి గ మ గ - రి గ రి రి స ని స్స నీ ద రి గ ద ప మ గా మ్మ గా రి - స రి గ మ ప రంజిత నాటకరంగతోషణం , శింజితవర మణిమయ భూషణం

ఆంజనేయావతారం 

ఆంజనేయావతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజతోషణం 

శ్రీ గణనాధం భజామ్యహం 

శ్రీకరం చింతితార్ధ ఫలదం 

శ్రీ గణనాధం భజామ్యహం 

Sunday, January 19, 2025

Maunamelanoyi ee marapurani reyi [మౌనమేలనోయి ఈ మరపురానిరేయి] - Saagara sangamam

Song Name :Mounamelanoyi
Movie:Sagarasangamam
Singers:S.P. Balasubramanyam garu, S.p. Sailaja garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK Viswanath garu

మౌనమేలనోయి 

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి, మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

ఎదలో వెన్నెల వెలీగే కన్నుల, ఎదలో వెన్నెల వెలీగే కన్నుల

తారాడే హాయిలో 

ఇంత మౌనమేల్నోయి ఈ మరపురాని రేయి

పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవీ వెనకాల ఏవిటో..

కలిసే మనసులా విరిసే వయసులా, కలిసే మనసులా విరిసే వయసులా

నీలి నీలి ఊసులూ లేతగాలి బాసలూ, ఏమేమొ అడిగినా ..

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

హిమమే కురిసే చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట 

ఇవీ ఏడడుగుల వలపూ మడుగుల, ఇవీ ఏడడుగుల వలపూ మడుగుల

కన్నెఈడు ఉలుకులూ కంటిపాప కబురులు, ఎంతెంతొ తెలిసినా

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి, ఇంత మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

ఎదలో వెన్నెల వెలీగే కన్నుల, ఎదలో వెన్నెల వెలీగే కన్నుల

తారాడే హాయిలో 

ఇంత మౌనమేల్నోయి ఈ మరపురాని రేయి 

Tuesday, November 5, 2024

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా (Swayamkrushi)

Song Name :Sinni sinni
Movie:Swayamkrushi
Singers:S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎవరికి తెలియని కథలివిలే ..ఎవరికి తెలియనీ కథలివిలే ..

ఎవరో చెప్పాగ ఇక ఏలే..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

సందిటనేసిన చెలువములే.. సందిటనేసిన చెలువములే.. 

సుందరమూర్తికి చేలములూ...

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

కలల ఒరుపులే కస్తురిగా.. వలపు వందనపు తిలకాలూ..

వలపు వందనపు తిలకాలూ..

అంకము చేరిన పొంకాలే.. అంకము చేరిన పొంకాలే 

శ్రీవేంకట పతికికా.. వేడుకలు..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ (SwayamKrushi)

Song Name :Siggu Poobanti
Movie:Swayamkrushi
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki, S.P. Sailaja garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

విరజాజి.. పూలబంతి అతసేతా మోయలేని

విరజాజి పూలబంతి అతసేతా మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా..

శివునివిల్లు మోసిన జాణ.. ఈ సిన్నదేనా..

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

సూసీ అలకలొచ్చిన కలికీ 

సూసీ అలకలొచ్చిన కలికీ, ఏసినాది కులుకుల మలికి 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా.. సిలకమ్మ కొనసూపు సౌరూ..

బొండుమల్లె సెండు జోరు 

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

మెరిసే నల్లమబ్బైనాదీ 

మెరిసే నల్లమబ్బైనాదీ, వలపుజల్లు వరదైనాది

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా 

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి 

Friday, October 18, 2024

రాగాల పల్లకిలో కోయిలమ్మా (Subhalekha)

Song Name :Raagaala Pallakilo 
Movie:Subhalekha
Singers:S.P. BalaSubramanyam garu, P. Suseela gru
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu

ల ల ల ల ల ల ల ల లా

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళా ఎందుకమ్మా ... 

నా ఉద్యోగం పోయిందండి... తెలుసు.. అందుకే

రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలె మూగబోయినందుకమ్మా 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళా ఎందుకమ్మా 

రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలె మూగబోయినందుకమ్మా 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళా ఎందుకమ్మా ఎందుకమ్మా 

పిలిచినా రాగమె పలికినా రాగమే కూనలమ్మకీ, మూగతీగ పలికించే వీణలమ్మకీ 

పిలిచినా రాగమె పలికినా రాగమే కూనలమ్మకీ, మూగతీగ పలికించే వీణలమ్మకీ 

బహుశా అది తెలుసో ఎమో 

బహుశా అది తెలుసో ఎమో,  జాణ కోయిల రాలేదు ఈ తోటకి ఈ వేళ 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈవేళా అందుకేనా అందుకేనా  

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు, కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు 

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు, కంటిపాప జాలికి లాలి పాడినప్పుడు 

బహుశా తను ఎందుకనేమో  

బహుశా తను ఎందుకనేమో గడుసు కోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేల నీవుంటే కూనలమ్మా 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేల నీవుంటే కూనలమ్మా 

Wednesday, September 25, 2024

నాదవినోదము నాట్యవిలాసము (Saagara Sangamam)

Song Name :Nada vinodam 
Movie:Sagara Sangamam
Singers:S.P. Balasubramanyam garu, S.P. Sailaja garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Viswanath garu

వాగర్థావివసంపృక్తౌ  వాగర్థప్రతిపత్తయే 

జగతహః పితరౌవందే.. పార్వతీపరమేశ్వరౌ..వందే పార్వతీప రమేశ్వరౌ

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము

భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో..ఆ.. గమకములో..ఆ..

భావములో భంగిమలో గానములో గమకములో

ఆంగికమౌ తపమీగతి సేయగ నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదము

ఆ... అ... ఆ... ఆ.. అ..అ...అ

నీ ని మదనీని మదనిస నీ రిసనిదని మదమదాద్ద గమామ్మ రిగస

కైలాశాన కార్థీకాన శివరూపం.. ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం 

కైలాశాన కార్థీకాన శివరూపం.. ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం 

నవరస నటనం దనిసరిసనిస జతియుతగమనం దనిసరిసనిస 

నవరస నటనం దనిసరిసనిస జతియుతగమనం దనిసరిసనిస 

సితగిరిచలనం సురనదిపయనం

భరతమైన నాట్యం.. బ్రతుకు నిత్యనృత్యం 

భరతమైన నాట్యం.. బ్రతుకు నిత్యనృత్యం 

తపనుని కిరణం తామస హరణం 

తపనుని కిరణం తామస హరణం 

శివుని నయన త్రయలాశ్యం 

ధిరన ధిరననన తకిట తకిటధిమి 

ధిరన ధిరననన నాట్యం, 

ధిరన ధిరననన తకిట తకిటధిమి 

ధిరన ధిరననన లాశ్యం

నమక చమక సహజం (ఝం) నటః ప్రకృతీ పాదఝం (ఝం) 

నర్తనమే శివకవచం నటరాజపాద సుమరజం 

ధిరనన ధిరనన ధిరనన ధిరనన

ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర 

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరమూ

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమపదమూ 

Saturday, September 21, 2024

శివానీ భవానీ శర్వాణీ (Swathi Kiranam)

Song Name :Sivaani Bhavaani
Movie:   SwathiKiranam
Singers:Vaani jayaram garu, S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela garu
Composer:K.V. Mahadevan garu
Director:K Vishwanath garu

శివానీ భవానీ శర్వాణీ 

గిరినందిని శివరంజని భవభంజని జననీ

గిరినందిని శివరంజని భవభంజని జననీ 

శతవిధాల శ్రుతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ  

శృంగారం తరంగించు సౌందర్యలహరివని        

శృంగారం తరంగించు సౌందర్యలహరివనీ   

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ

కరుణజిలుగు సిరినగవుల కనకధార నీవనీ 

నీ దరహాసమె దాసులదరిచేర్చే దారియనీ  

శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేనియని నీ సుతుడనే శివానీ   

శివానీ భవానీ శర్వాణీ 

శివానీ భవానీ శర్వాణీ 

గిరినందిని శివరంజని భవభంజని జననీ

గిరినందిని శివరంజని భవభంజని జననీ 

శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేనియని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ

శృంగారం తరంగించు సౌందర్యలహరివనీ  

శృంగారం తరంగించు సౌందర్యలహరివనీ  

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ   

కరుణచిలుకు సిరినగవుల కనకధార నీవనీ, నీ దరహాసమె దాసులదరిచెర్చే దారియనీ 

శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేనియని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ 

రౌద్రవీర రసోద్విక్త భద్రకాళి నీవనీ   

ధ్వీతామహభక్తాళికి అభయపాణి నీవనీ  

రౌద్రవీర రసోద్విక్త భద్రకాళి నీవనీ  

ధ్వీతామహభక్తాళికి అభయపాణి నీవనీ  

భీభస్థానలకీలవు భీషనాస్త్రకేళివనీ      

భీభస్థానలకీలవు భీషనాస్త్రకేళివనీ భీషనాస్త్రకేళివనీ       

అద్భుతమౌ అతులితమౌ లీలజూపినావనీ  

గిరినందిని శివరంజని భవభంజని జననీ 

శతవిధల శృతివిధాన స్తుతులు సలుపలెని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ         

Wednesday, September 18, 2024

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ (Saptapadi)

Title :Akhilandeswari chaamundeswari
Movie:Saptapadi
Singers:P. Suseela గారు , S.P. Balasubramanyam గారు 
Lyricist:Veturi Sundara Raama murthy గారు
Composer:K.V. Mahadevan గారు
Director:K Viswanath గారు

ఓంకార పంజర శుకీం, ఉపనిషద్ ఉద్యానకేళి కళకంఠీం   

ఆగమ విపిన మయూరీం, ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం

తాంతక ఝంతరిజ తధిగిటతోం తకతరి ఝంతరితా 

తధిగిటతోం తాంతకఝం తకతరిఝం తఝ్ఝం 

తదిగిటతోం తదిగిటతోం తదిగిటతోం  

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తాం తధ్ధీం తధ్ధీం తకధిమి తకఝను తకధిమి తకఝను 

తాం తధ్ధీం తధ్ధీం తకధిమి తకఝను తకధిమి తకఝను

తాం ధీం తోం నం తరికిటతోం తరికిటతోం తరికిటతోం  

శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్ధగాత్రీ    

శుభగాత్రి గిరిరాజపుత్రీ అభినేత్రి శర్వార్ధగాత్రీ 

సర్వార్దసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తీ

సర్వార్దసంధాత్రి జగదేకజనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తీ    

చతుర్బాహుసంరక్షిత శిక్షిత చతుర్భశాంతరభువనపాలినీ  

కుంకుమరాగశోభినీ కుసుమబాణసంశొభీనీ, మౌనసుహాసిని గానవినోదిని భగవతి పార్వతీ దేవీ 

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తధీం తత్తఝం తకఝం తకఝం తరిగిటతోం తరిగిటతోం 

తధీం తత్తఝం తకఝం తకఝం తరిగిటతోం తరిగిటతోం 

తకధీన్న తకధీన్న తకతరీత త తకధిమి తఝ్ఝణుతా  

శ్రీహరి ప్రణయాంబురాశీ  శ్రీపాదవిచలిత క్షీరాంబురాశీ   

శ్రీహరి ప్రణయాంబురాశీ  శ్రీపాదవిచలిత క్షీరాంబురాశీ    

శ్రీపీఠసంవర్ధిని డోలాసురమర్ధినీ  

శ్రీపీఠసంవర్ధిని డోలాసురమర్ధినీ    

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి

ఆదిలక్ష్మి విద్యాలక్ష్మీ గజలక్ష్మీ సంతానలక్ష్మి  

సకలభోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవీ        

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

తకధిమి తకఝను తకధిమి తకఝను తా

తకఝను తకధిమి తకఝను తకధిమి తోం  

ఇందువదనే కుందరదనే వీణాపుస్తకధారిణే  

ఇందువదనే కుందరదనే వీణాపుస్తకధారిణే

శుకశౌనకాది వ్యాసవాల్మికి మునిజనపూజిత శుభచరణే   

శుకశౌనకాది వ్యాసవాల్మికి మునిజనపూజిత శుభచరణే 

సరససాహిత్య స్వరససంగీత స్థనయుగళే, తక తధీంధీంత 

సరససాహిత్య స్వరససంగీత స్థనయుగళే (తకతధీం తకఝణుత తకధిమిత )

వరదే అక్షరరూపిణే  శారదే దేవీ 

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ

వింధ్యాటవీవాసినే యోగసంధ్యాసముద్భాసినే   

సింహాసనస్థాయినే దుష్టహరరంక్రియాశాలినే      

విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామప్రియే ధర్మసమరప్రియే     

హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణీ హే విళంబితకేశపాసినే  

మహిషమర్దనశీల మహితగర్జనలోల భయతనర్తనకేళికే   కాళికే దుర్గమాగమదుర్గ పాహియే దుర్గే దేవే..  

posted by Santoshalakshmi@gmail.com 

Monday, September 16, 2024

హైలెస్సొ హైలెస్సొ (Subha sankalpam)

Title :Hailessa hailessa
Movie:SubhaSankalpam
Singers:S.P. Balasubramanyam garu , Chitra గారు, M.D. Pallavi 
Lyricist:Veturi గారు
Composer:M.M. Keeravaani గారు
Director:K. Viswanath గారు

హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో... హైలెస్సా..

హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో... హైలెస్సా..

సూర్యుడైన, సలవ సెంద్రుడైన, కోటి సుక్కలైన, అష్టదిక్కులైన 

నువ్వైన, అహ నేనైన, అహ రేవైన, అహ నావైన..

సంద్రాన మీనాల సందమే.. హైలెస్సొ హైలెస్సొ హైలెస్సో... హైలెస్సా..

నీలాల కన్నుల్లొ సంద్రమే హైలెస్సో..ఓ..ఓ..హైలెస్సా

నింగి నీలవంతా సంద్రమే హైలెస్సో..ఓ..ఓ..హైలెస్సా

నీలాల కన్నుల్లొ సంద్రమే, నేల కరిగిపోతె సంద్రమే..ఏ..ఓ..ఓ..

నేల కరిగిపోతె సంద్రమే, నీటిబొట్టు పెరిగిపోతె సంద్రమే 

నేల కరిగిపోతె సంద్రమే, నీటిబొట్టు పెరిగిపోతె సంద్రమే 

నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలవంతా సంద్రమే 

Life is a holiday jolly day హైలొ హైలెస్స

spend it away in a fabulous way హైలొ హైలెస్స

you.. need a break why, dont you take me.. eat a piece of cake హైలొ హైలెస్స

you.. need a break why, dont you take me.. eat a piece of cake హైలొ హైలెస్స

twinkle little star, i know what you are జానె భీ దొ యార్ గొళి తో మార్

twinkle little star, i know what you are జానె భీ దొ యార్ గొళి తో మార్

హైలెస్సో హైలెస్స life is a తమాష, you sing it హమేషా

i dont know సా పా సా  

నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలవంతా సంద్రమే 

హైలెస్సో..ఓ..ఓ..హైలెస్సా

ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల 

ఆకతాయి పరువాల కొంటెగోల కోటి సంబరాల

ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల

ఆపకండి ఈ వేళ కూనలాల కొత్త వానలాల 

కోటి సంబరాల కొత్త వానలాల, కోటి సంబరాల కొత్త వానలాల  

చెంగుమంటు గంగ పొంగులెత్తువేళ ఆ..అ..ఆ..అ..

చెంగుమంటు గంగ పొంగులెత్తువేళ, వొళ్ళు మరచిపోవలి నింగి నేల 

వొళ్ళు మరచిపోవలి నింగి నేల 

Saturday, September 7, 2024

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది - Saptapadi

Song Name :Ee kulamu nee dante
Movie:Saptapadi
Singers:S.P. BalaSubramanyam garu,S Janaki garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:K V Mahadevan garu
Director:K. Vishwanath garu

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

ఏడు వర్ణాలు కలిసీ.. ఇంధ్రధనశ్శౌతాదీ.. అన్నీ వర్ణాలకు ఒకటే.. ఇహము పరముంటాది..

ఏడు వర్ణాలు కలిసీ.. ఇంధ్రధనశ్శౌతాదీ.. అన్నీ వర్ణాలకు ఒకటే.. ఇహము పరముంటాది..

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

ఆది నుంచి ఆకాశం మూగదీ.. అనాదిగా తల్లి ధరణి మూగదీ..

ఆది నుంచి ఆకాశం మూగదీ.. అనాదిగా తల్లి ధరణి మూగదీ..

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులూ..

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులూ..

ఈ నడమంత్రపు మనుషులకే మాటలూ.. ఇన్ని మాటలూ..

ఏ కులము నీదంటే.. గోకులము నవ్వింది.. మాధవుడు..యాదవుడు.. మా కులమే లెమ్మందీ..

Monday, August 14, 2023

కంచికి పోతావ కృష్ణమ్మా .. [Kanchiki potava krishnamma]

Song Name:Kanchiki Potava
Movie:
Subhodayam
Singers:S.P. BalaSubramanyam garu, P. Suseela garu
Lyricist:Veturi Sundara Rama Murthy garu
Composer:K.V Mahadevan garu
Director:K. Vishwanadh garu

కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతావ కృష్ణమ్మా..

త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ.. రాగమేదొ తీసినట్టు ఉందమ్మా
త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ.. రాగమేదొ తీసినట్టు ఉందమ్మా
ముసి ముసి నవ్వులు పువ్వులు పూసిందీకొమ్మ..
మువ్వ గోపాలా.. మువ్వ గోపాలా.. మువ్వ గోపాలాన్నట్టుందమ్మా..
అడుగుల్ల సవళ్ళు కావమ్మా.. అవి ఎడదళ్ళ సందళ్ళు లేవమ్మా
అడుగుల్ల సవళ్ళు కావమ్మా.. అవి ఎడదళ్ళ సందళ్ళు లేవమ్మా
కంచికి పోతావ కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ
కంచికి పోతావ కృష్ణమ్మా..

రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేళకంత నిదర రాదమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా.. రాతిరేళకంత నిదర రాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మ.. ముద్దు మురిపాలా మువ్వగోపాలా నీవురావేలా అన్నట్టుందమ్మా  
మనసు దోచుకున్నా ఓయమ్మా ..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ...
మనసు దోచుకున్నా ఓయమ్మా ..నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా ...

కంచికి పోతావ కృష్ణమ్మా.. (ముద్దు మురిపాలా..)
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. (మువ్వ గోపాలా..)
కంచిలొ ఉన్నది బొమ్మా.. అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ..
నీవు రావేలా.. కృష్ణమ్మా...

Listen here

kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma
kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma
kanchiki pOtAva kRShNammA..

tyaagaraaja kIrtanallE unnAdI bomma.. rAgamEdo tIsinaTTu undammaa
tyaagaraaja kIrtanallE unnAdI bomma.. rAgamEdo tIsinaTTu undammaa
musi musi navvulu puvvulu poosindiikomma..
muvva gOpAlA.. muvva gOpAlA.. muvva gOpAlAnnaTTundammA..
aDugulla savaLLu kAvammA.. avi eDadaLLa sandaLLu lEvammA
aDugulla savaLLu kAvammA.. avi eDadaLLa sandaLLu lEvammA
kanchiki pOtAva kRShNammA.. A kanchi vaartalEmi kRShNammA
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma
kanchiki pOtAva kRShNammA..

rAsalIla sAginAka rAdha nIvEnammA.. rAtirELakanta nidara rAdammA
rAsalIla sAginAka rAdha nIvEnammA.. rAtirELakanta nidara rAdammA
musirina chIkaTi mungiTa vEchindI komma.. muddu muripAlA muvvagOpAlA nIvurAvElA annaTTundammA  
manasu dOchukunnA OyammA ..nI manasu dAchukOku bullemmA ...
manasu dOchukunnA OyammA ..nI manasu dAchukOku bullemmA ...

kanchiki pOtAva kRShNammA.. (muddu muripAlA..)
A kanchi vaartalEmi kRShNammA.. (muvva gOpAlA..)
kanchilo unnadi bommA.. adi bomma kAdu muddugumma..
nIvu rAvElA.. kRShNammA...

Sunday, August 11, 2019

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ... [Siva Poojaku chivurinchina]

Song Name :Siva Poojaku
Movie:SwarnaKamalalm
Singers:S.P. Bala Subramanyam garu, P Suseela garu
Lyricist:Sirivennala garu
Composer:Illayaraja
Director:K Vishwanath garu

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ...

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వ..  సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
నటనాంజలితొ బ్రతుకును తరించనీవ.. సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ

పరుగాపక పయనించవె తలపుల నావ..కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదురించిన సుడిగాలిని జయించినావ ..మదికోరిన మధుసీమలు వరించి రావా
పరుగాపక పయనించవె తలపుల నావ..కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై ..
తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించె  కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ..
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ .. నిదురించిన హృదయరవళి  ఓంకారం కానీ

శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ

తనవేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా .. ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా..
అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా.. ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా..
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా.. వెన్నెల కిన్నెర గానం నీకుతోడుగా...
పరుగాపక పయనించవె తలపుల నావ..కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

చలిత చరణ జనితం నీ సహజ విలాసం  .. జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం ...
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం ...
గగన సరసి హృదయంలో...  వికసిత శతదళ శోభల సువర్ణకమలం
పరుగాపక పయనించవె తలపుల నావ..కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
పరుగాపక పయనించవె తలపుల నావ..కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదురించిన సుడిగాలిని జయించినావ ..మదికోరిన మధుసీమలు వరించి రావా

WATCH & LISTEN HERE

English

SivapUjaku chivuriMchina sirisiri muvva...

SivapUjaku chivuriMchina sirisiri muvva... sirisiri muvva..sirisiri muvva
mRdumaMjula padamaMjari pUchina puvvaa... sirisiri muvva..sirisiri muvva
yatirAjuki jatiswaramula parimaLamivva..  sirisiri muvva..sirisiri muvva
naTanAMjalito bratukunu tariMchanIva.. sirisiri muvva..sirisiri muvva

parugApaka payaniMchave talapula nAva..keraTAlaku talavaMchite taragadu trOva
eduriMchina suDigAlini jayiMchinAva ..madikOrina madhusImalu variMchi rAvA
parugApaka payaniMchave talapula nAva..keraTAlaku talavaMchite taragadu trOva

paDamara paDagalapai merisE tAralakai
paDamara paDagalapai merisE tAralakai rAtrini variMchakE saMdhyA suMdari
tUrupu vEdikapai vEkuva nartakivai ..
tUrupu vEdikapai vEkuva nartakivai dhAtrini muripiMche  kAmtulu chiMdani
nI kadalika chaitanyapu SrIkAraM kAnI ..
nI kadalika chaitanyapu SrIkAraM kAnI .. niduriMchina hRdayaravaLi  OMkAraM kAnI

SivapUjaku chivuriMchina sirisiri muvva... sirisiri muvva..sirisiri muvva
mRdumaMjula padamaMjari pUchina puvvaa... sirisiri muvva..sirisiri muvva

tanavELLE saMkeLLai kadalalEni mokkalA .. Amanikai eduruchUstu AgipOku ekkaDA..
avadhilEni aMdamuMdi avaniki naludikkulA.. AnaMdapu gAlivAlu naDapanI ninnilA..
pratirOjoka navagItika sWAgatiMchagA.. vennela kinnera gAnaM nIkutODugA...
parugApaka payaniMchave talapula nAva..keraTAlaku talavaMchite taragadu trOva

chalita charaNa janitaM nI sahaja vilAsaM  .. jwalita kiraNa kalitaM souMdarya vikAsaM
nI abhinaya ushOdayaM tilakiMchina ravinayanaM ...
nI abhinaya ushOdayaM tilakiMchina ravinayanaM ...
gagana sarasi hRdayaMlO...  vikasita SatadaLa SObhala suvarNakamalaM
parugApaka payaniMchave talapula nAva..keraTAlaku talavaMchite taragadu trOva
eduriMchina suDigAlini jayiMchinAva ..madikOrina madhusImalu variMchi rAvA

Thursday, November 27, 2014

Pranathi Pranathi song from Swathi Kiranam movie [ప్రణతి ప్రణతి ప్రణతీ]

Song Name:Pranathi Pranathi
Movie:Swathi Kiranam
Singers:S.P.Balu, Vani Jayaram
Lyricist:Sirivennela Seetarama Sasthri
Composer:K.V.Mahadevan
Director:K.Viswanath

ఆలాపన:
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా..
పమగమసరిసా... రీ
గ మ పనిసని పమగమ సరిరీసా.. 

పల్లవి:
ప్రణతి ప్రణతి ప్రణతీ 
పమప మగమ సరి సా.. 
ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..
మమప మమప మప నీ..
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ
ప్రధమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

చరణం1:
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా...
సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం..
ఐంకారమా...
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా...
సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం..
ఐంకారమా... 
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా...
హ్రీంకారమా...
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా..
శ్రీంకారమా..
ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) 

ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

చరణం2:
పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన 
అది కవనమా..
మగ మపాపపప మపాపాపపప  నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా..
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా..
అది నటనమా..
అది నటనమా..
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా..
అది చిత్రమా..
అది చిత్రమా..
ఆ.ఆ..ఆ. 
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన..
అది శిల్పమా..
అది శిల్పమా..
అది శిల్పమా..
అది శిల్పమా..
ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. 

ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ.
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ 
ప్రధమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ ...
ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ...