Showing posts with label Swathikiranam. Show all posts
Showing posts with label Swathikiranam. Show all posts

Sunday, June 15, 2025

Sangeeta sahitya [సంగీత సాహిత్య సమలంకృతే] - Swathi Kiranam

Song Name :Sangita sahitya
Movie:Swathi Kiranam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 


సా రిగమపదనిసా నిదపమగరిసరీ ఆ...

సంగీత సాహిత్య సమలంకృతే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే 


వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వ్యాస వాల్మీకి వాగ్ధాయిని, వ్యాస వాల్మీకి వాగ్ధాయిని జ్ఞానవల్లీ సముల్లసినీ..

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే


బ్రహ్మరసనాగ్ర సంచారిణీ ఆ..

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

సకల సుకళా సమున్వేషిణీ, సకల సుకళా సమున్వేషిణి సర్వ రసభావ సంజీవినీ... 

 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే..

Saturday, September 21, 2024

శివానీ భవానీ శర్వాణీ (Swathi Kiranam)

Song Name :Sivaani Bhavaani
Movie:   SwathiKiranam
Singers:Vaani jayaram garu, S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela garu
Composer:K.V. Mahadevan garu
Director:K Vishwanath garu


శివానీ భవానీ శర్వాణీ 

గిరినందిని శివరంజని భవభంజని జననీ

గిరినందిని శివరంజని భవభంజని జననీ 

శతవిధాల శ్రుతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ  


శృంగారం తరంగించు సౌందర్యలహరివని        

శృంగారం తరంగించు సౌందర్యలహరివనీ   

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ

కరుణజిలుగు సిరినగవుల కనకధార నీవనీ 

నీ దరహాసమె దాసులదరిచేర్చే దారియనీ  

శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేనియని నీ సుతుడనే శివానీ   

శివానీ భవానీ శర్వాణీ 


శివానీ భవానీ శర్వాణీ 

గిరినందిని శివరంజని భవభంజని జననీ

గిరినందిని శివరంజని భవభంజని జననీ 

శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేనియని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ


శృంగారం తరంగించు సౌందర్యలహరివనీ  

శృంగారం తరంగించు సౌందర్యలహరివనీ  

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ

శాంతం మూర్తీభవించు శివానందలహరివనీ   

కరుణచిలుకు సిరినగవుల కనకధార నీవనీ, నీ దరహాసమె దాసులదరిచెర్చే దారియనీ 

శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేనియని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ 


రౌద్రవీర రసోద్విక్త భద్రకాళి నీవనీ   

ధ్వీతామహభక్తాళికి అభయపాణి నీవనీ  

రౌద్రవీర రసోద్విక్త భద్రకాళి నీవనీ  

ధ్వీతామహభక్తాళికి అభయపాణి నీవనీ  

భీభస్థానలకీలవు భీషనాస్త్రకేళివనీ      

భీభస్థానలకీలవు భీషనాస్త్రకేళివనీ భీషనాస్త్రకేళివనీ       

అద్భుతమౌ అతులితమౌ లీలజూపినావనీ  

గిరినందిని శివరంజని భవభంజని జననీ 

శతవిధల శృతివిధాన స్తుతులు సలుపలెని నీ సుతుడనే శివానీ 

శివానీ భవానీ శర్వాణీ         

Thursday, November 27, 2014

Pranathi Pranathi song from Swathi Kiranam movie [ప్రణతి ప్రణతి ప్రణతీ]

Song Name:Pranathi Pranathi
Movie:Swathi Kiranam
Singers:S.P.Balu, Vani Jayaram
Lyricist:Sirivennela Seetarama Sasthri
Composer:K.V.Mahadevan
Director:K.Viswanath





ఆలాపన:
సా రీ.. గ మ ప మ గ మ సరిరీసా..
పమగమసరిసా... రీ
గ మ పనిసని పమగమ సరిరీసా.. 

పల్లవి:
ప్రణతి ప్రణతి ప్రణతీ 
పమప మగమ సరి సా.. 
ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..
మమప మమప మప నీ..
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ
ప్రధమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

చరణం1:
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా...
సుప్రభాత వేదిక పై.. శుకపికాది కలరవం..
ఐంకారమా...
పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమరరవం..
ఓంకారమా...
సుప్రభాత వేదిక పై.. (పసససాస పానిపమా..)శుకపికాది కలరవం..
ఐంకారమా... 
పైరు పాపలకు జోలలు పాడే గాలుల సవ్వడి హ్రీంకారమా...
హ్రీంకారమా...
గిరుల శిరసులను జారే ఝరుల నడల అలజడీ శ్రీంకారమా..
శ్రీంకారమా..
ఆ బీజాక్షర విఘటికీ అర్పించే జ్యోతలివే.. (ఓం ఐం హ్రీం శ్రీం) 

ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ..ఈ ఈ ఈ..

చరణం2:
పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన 
అది కవనమా..
మగ మపాపపప మపాపాపపప  నిపప నిపపప నిపాపాపపమ మపమపమ గా..
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేలనా..
అది నటనమా..
అది నటనమా..
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా..
అది చిత్రమా..
అది చిత్రమా..
ఆ.ఆ..ఆ. 
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన..
అది శిల్పమా..
అది శిల్పమా..
అది శిల్పమా..
అది శిల్పమా..
ఆ లలిత కళా సృష్ఠికీ అర్పించే జ్యోతలివే.. 

ప్రణతి ప్రణతి ప్రణతీ 
ప్రణవనాద జగతికీ.
ప్రణుతి ప్రణుతి ప్రణుతీ 
ప్రధమ కళా సృష్టికీ..
ప్రణతి ప్రణతి ప్రణతీ ...
ప్రణవనాద జగతికీ.ఈ.ఈ.ఈ...

Wednesday, December 17, 2008

Aanati neeyyara [ఆనతినీయరా హరా] - Swathi Kiranam

Song Name :Aanati Neeyara
Movie:   SwathiKiranam
Singers:Vaani jayaram garu
Lyricist:Sirivennala garu
Composer:K.V. Mahadevan garu
Director:K Vishwanath garu

ఆ..
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా..సన్నిది చేరగా
ఆనతి నీయరా హరా

నీ ఆన లేనిదే గ్రహింప జాలున వేదాల వాణితో  విరించి విశ్వనాటకం  
నీ సైగ కానిదే జగాన సాగున ఆయోగమాయకో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులును గా సదా.. సదాశివ

ఆనతినీయరా హరా..

ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
అచలనాట అర్చింతును రా ఆనతినీయరా
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస మగసని ఆనతినీయరా
జంగమ దేవర సేవలు గొనరా మంగళ దాయక దీవెనలిడరా శాష్టాంగముగ దండము సేతు ర
ఆనతినీయరా
సానిప గమపనిపమ
గమగ పప పప మపని పప పప
గగమ గస సస నిసగ సస సస
సగ గస గప పమ పస నిస గసని
సాగ సాగ సని సాగ సాగ పగ
గగ గగ సని సగ గ గసగ గ పద గస గ మ స ని పమగ గ
ఆనతినీయరా
శంకర శంకించకుర
వంక జాబిలిని జడను ముడుచుకొని
ఇశపు నాగులను చంకనెత్తుకొని
నిలకడనెరుగని గంగనేలి
యే వంకనేలి నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేమి ని
కింకరునిగ సేవించుకొందుర
ఆనతినీయరా

పపా పమప నిని పమ గస గగా
పపా పమప నిని పమ గస గ గా గా
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా పా గా మా స
పపా పమప నిని పమ గస గగా
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా పా గా మా స
పపా పమప నిని పమ గస గగా

గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పపా పమప నిని పమగస గ గా
గామపని గమాపాని స మపానిసగని సని పని మ ప గ మ స గ మ
పపా పమప నిని పమగస గ ఆ
గా గగ మమ పప నిగ - తక తకిట తకదిమి
మమ పప నినిసమ - తక తకిట తకదిమి
పపనినిసస గని - తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పపా పమప నిని పమగస గ గా
రక్ష ద్వర సిక్షా దీక్ష ధక్షా విరూపక్షా
నీ క్రుపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష సేయక పరీక్ష సేయక రఖ్స రక్ష యను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా
సన్నుతి సేయగ సమ్మతి నీయర దొరా
సన్నిది చేరగా ఆనతి నీయరా హరా 


aa..
aanatineeyaraa haraa sannuti sEyagaa sammati neeyaraa doraa..sannidi chEragaa
aanatineeyaraa haraa sannuti sEyagaa sammati neeyaraa doraa..sannidi chEragaa
aanati neeyaraa haraa

nee aana lEnidE grahimpa jaaluna vEdaala vaaNitO  virinchi viSvanaaTakam 
nee saiga kaanidE jagaana saaguna aayOgamaayakO muraari divyapaalanam
vasumatilO prati kshaNam paSupati nee adheenamai
vasumatilO prati kshaNam paSupati nee adheenamai
kadulunu gaa sadaa.. sadaaSiva

aanatineeyaraa haraa..

ni ni sa ni pa nii pa ma ga sa ga aanatineeyaraa
achalanaaTa archintunu raa aanatineeyaraa
pama pani pama pani pama pani gama pani
sani saga sani saga sani saga pani saga
gamagasaa nipama gamagasa magasani aanatineeyaraa
jaMgama dEvara sEvalu gonaraa mangaLa daayaka deevenaliDaraa SaashTaamgamuga daMDamu sEtu ra
aanatineeyaraa
saanipa gamapanipama
gamaga papa papa mapani papa papa
gagama gasa sasa nisaga sasa sasa
saga gasa gapa pama pasa nisa gasani
saaga saaga sani saaga saaga paga
gaga gaga sani saga ga gasaga ga pada gasa ga ma sa ni pamaga ga
aanatineeyaraa
SaMkara SankiMchakura
vanka jAbilini jaDanu muDuchukoni
iSapu naagulanu chankanettukoni
nilakaDanerugani ganganEli
yE vankanEli naa vankanokka kaDaganTi choopu paDaneeyavEmi ni
kinkaruniga sEvinchukondura
aanatineeyaraa

papaa pamapa nini pama gasa gagaa
papaa pamapa nini pama gasa ga gA gaa
gamapani gaa
mapanisa maa
panisaga nI sa paa ni maa paa gaa maa sa
papaa pamapa nini pama gasa gagaa
gamapani gaa
mapanisa maa
panisaga nI sa paa ni maa paa gaa maa sa
papaa pamapa nini pama gasa gagaa

gamapani gamapani sa mapanisagani
gamapani gamapani sa mapanisagani
sa pani ma pa ga ma saa gaa ma
papaa pamapa nini pamagasa ga gaa
gaamapani gamaapaani sa mapaanisagani sani pani ma pa ga ma sa ga ma
papaa pamapa nini pamagasa ga aaa
gaa gaga mama papa niga - taka takiTa takadimi
mama papa ninisama - taka takiTa takadimi
papaninisasa gani - taka takiTa takadimi
sapani mapa gama sagama
papaa pamapa nini pamagasa ga gaa
raksha dvara sikshaa deeksha dhakshaa viroopakshaa
nee krupaaveekshaNaapEkshita prateekshaNupEksha sEyaka pareeksha sEyaka rakhsa raksha yanu praardhana vinaraa
aanatineeyaraa haraaa
sannuti sEyaga sammati neeyara doraa
sannidi chEragaa aanati neeyaraa haraaa