Showing posts with label c. narayana reddy. Show all posts
Showing posts with label c. narayana reddy. Show all posts

Saturday, August 16, 2025

O bangaru rangula chilaka telugu lyrics [ఓ బంగరు రంగుల చిలక] - Thota Ramudu

Title :O bangaru rangula chilaka
Movie:Thota Ramudu
Singers:S.P. Balasubramanyam గారు, P. Suseela గారు
Lyricist:C. Narayana reddy గారు
Composer:Sathyam గారు
Director:B.V. Prasad గారు


ఓ బంగరు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ 

నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదని 

ఓ అల్లరి చూపుల రాజా పలకవా, ఓ బంగరు రంగుల చిలక ఏమనీ 

నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదని 


పంజరాన్ని దాటుకునీ, బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో 

మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా, నిరుపేదను వలచావెందుకే 

నీ చేరువలో ఈ చేతులలో పులకించేటందుకే .. 

ఓ బంగరు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ 

నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదని 


సన్నజాజి తీగుందీ, తీగమీద పూవ్వుందీ, పువ్వులోని నవ్వే నాదిలే 

కొంటె తుమ్మెదొచ్చిందీ ఝుంటితేనే కోరిందీ, అందించే భాగ్యం నాదిలే 

ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే..

ఓ అల్లరి చూపుల రాజా పలకవా, ఓ బంగరు రంగుల చిలక ఏమనీ 

నా మీద ప్రేమే ఉందనీ .. నా పైన అలకే లేదని 

 

Sunday, June 15, 2025

Sangeeta sahitya [సంగీత సాహిత్య సమలంకృతే] - Swathi Kiranam

Song Name :Sangita sahitya
Movie:Swathi Kiranam
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:K.V. Mahadevan garu
DirectorK. Viswanath garu 


సా రిగమపదనిసా నిదపమగరిసరీ ఆ...

సంగీత సాహిత్య సమలంకృతే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే 


వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసినీ, నాద నాదాంత పరివేషినీ ఆత్మ సంభాషినీ 

వ్యాస వాల్మీకి వాగ్ధాయిని, వ్యాస వాల్మీకి వాగ్ధాయిని జ్ఞానవల్లీ సముల్లసినీ..

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

సంగీత సాహిత్య సమలంకృతే


బ్రహ్మరసనాగ్ర సంచారిణీ ఆ..

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

బ్రహ్మరసనాగ్ర సంచారిణీ భవ్య ఫలకారిణీ, నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపినీ 

సకల సుకళా సమున్వేషిణీ, సకల సుకళా సమున్వేషిణి సర్వ రసభావ సంజీవినీ... 

 

సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే 

హే భారతీ మనసా స్మరామి 

శ్రీ భారతీ శిరసా నమామి 

సంగీత సాహిత్య సమలంకృతే..

Sunday, June 8, 2025

Sivaranjani navaragini [శివరంజని నవరాగిణి] - Thoorpu Padamara

Song Name :Sivaranjani navaragini
Movie:Thoorpu Padamara
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:C. Narayana reddy garu
Composer:Ramesh Naidu garu
DirectorDasari Narayana Rao garu 


శివరంజని నవరాగిణి వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహినీ ఆ..

శివరంజని నవరాగిణీ ఆ...


రాగాల శిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి 

రాగాల శిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి 

స్వర సుర ఝరీ తరంగానివీ

స్వర సుర ఝరీ తరంగానివీ, సరసహృదయ వీణా వాణివీ..

శివరంజని నవరాగిణీ ఆ...


ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు

ఆ కనులు పండు వెన్నెల ఘనులు, ఆ కురులు ఇంద్రనీలాల వనులు

ఆ.. వదనం అరుణోదయ కమలం 

ఆ.. అధరం సుమధుర మధుకలశం..

శివరంజని నవరాగిణీ ఆ...


జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహినీ జానకి

వేణుధరుని రథమారోహించిన  విదుషీమణి రుక్మిణీ 

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా 

లలిత లావణ్య భయత సౌందర్య కలిత చండికా 

రావే.. రావే నా శివరంజనీ ..

మనోరంజనీ.. రంజనీ నా రంజనీ 

నీవే నీవే నాలో పలికే నాదానివీ 

నీవే నా దానివి నా దానివీ .. నీవే నాదానివీ 

Tuesday, May 27, 2025

Manasu palike [మనసు పలికే మౌన గీతం] - Swathi Mutyam

Song Name :Manasu palike mouna gitam
Movie:Swathi Muthyam
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:C. Narayana Reddy garu
Composer:Illayaraja garu
DirectorK. Viswanadh garu 


మనసు పలికే .. మనసు పలికే repeat

మౌన గీతం .. మౌన గీతం repeat

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే మమతలొలికే repeat

స్వాతిముత్యం స్వాతిముత్యం Repeat

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

అణువు అణువు ప్రణయ మధువు 

అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ ధనువు

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే స్వాతిముత్యం నీవే..


శిరస్సుపై నీ గంగనై మరుల జలకాలాడనీ.. మరుల జలకాలాడనీ

సగము మేన గిరిజనై పగలు రేయీ ఒదగనీ .. పగలు రేయీ ఒదగనీ 

హృదయ మేళనలో మధుర లాలనలో 

హృదయ మేళనలో మధుర లాలనలో 

వెలిగిపోనీ రాగదీపం.. వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే స్వాతిముత్యం నీవే..


కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ.. ఓనమాలు దిద్దనీ 

పెదవిపై నీ ముద్దునై మొదటి తీపీ అద్దనీ.. మొదటి తీపీ 

లలిత యామినిలో కలల కౌముదిలో 

లలిత యామినిలో కలల కౌముదిలో 

కరిగిపోనీ కాలమంతా కరిగిపోనీ కాలమంతా.. కౌగిలింతలుగా..

మనసు పలికే .. మనసు పలికే repeat

మౌన గీతం .. మౌన గీతం repeat

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే మమతలొలికే repeat

స్వాతిముత్యం స్వాతిముత్యం Repeat

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

అణువు అణువు ప్రణయ మధువు 

అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ ధనువు

Sunday, September 15, 2024

కలికి మేనిలో కలిగే స్పందనం (kaliki menilo) - Sankeerthana

Song Name :Kaliki menilo
Movie:Sankeerthana
Singers:S.P. Bala subramanyam garu, S, Janaki garu
Lyricist:C Narayana reddy garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

కలికి మేనిలో కలిగే స్పందనం..

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 


రంగుల కలగ మెరిసే అకాశం, ముంగిట తానే నిలిచే

తోటకు వరమై దొరికే మధుమాసం, గూటిని తానే వలచే

గర్భగుడిని దాటి కదిలింది దేవతా, 

గర్భగుడిని దాటి కదిలింది దేవతా, చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జతా

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 


పెదవుల వలలో పెరిగే ఏకాంతం ప్రేమకు తేరై ఎగసే

తలపుల ఒడిలో ఒదిగే అనురాగం తలుపులు తానే తెరిచే 

తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి 

తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి, వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలీ 

కలికి మేనిలో కలిగే స్పందనం

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 


Sunday, April 28, 2013

Kalise Prati sandhyalo [కలిసె ప్రతిసంధ్యలో ] - Alaapana


Title :Kalise PratiSansdhyalo
Movie:Aalaapana
Singers:S.P. Balasubramanyam గారు, S. Janaki
Lyricist:Dr C. Narayana Reddy గారు
Composer:Illayaraja గారు
Director:Vamsy గారు


కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ (2)
నాట్యాలన్ని కరగాలి నీలొ నేనె మిగలాలి.. (2)
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. చేరుకోదా చంద్ర హౄదయం నీటికి (2) 
శౄష్టిలోన ఉంది ఈ బంధమే.. అల్లుకుంది అంతట అందమే..
తొణికే బిడియం తొలగాలి.. వణికే అధరం పిలవాలి ....
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 

మేనితోనె ఆగుతాయి ముద్రలు. గుండెదాక సాగుతాయి ముద్దులు (2)
వింతతీపి కొంతగా పంచుకో.. వెన్నెలంత కళ్ళలో నింపుకో..
బ్రతుకే జతగా పారాలి.. పరువం తీరం చేరాలి ....

కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 
కలిసె ప్రతిసంధ్యలో పలికె ప్రతి అందెలొ 
నాట్యాలెన్నొ ఎదగాలి నాలొ నేనె మిగలాలి.. (2)   
కలిసె ప్రతిసంధ్యలో కలిగె పులకింతలొ


English

kalise pratisaMdhyalO kalige pulakiMtalo (2)
nATyAlanni karagAli nIlo nEne migalAli.. (2)
kalise pratisaMdhyalO palike prati aMdelo 

poMgipOdA sAgarAtma niMgiki.. chErukOdA chaMdra hRudayaM nITiki (2) 
SRushTilOna uMdi I baMdhamE.. allukuMdi aMtaTa aMdamE..
toNikE biDiyaM tolagAli.. vaNikE adharaM pilavAli ....
kalise pratisaMdhyalO palike prati aMdelo 

mEnitOne AgutAyi mudralu. guMDedAka sAgutAyi muddulu (2)
viMtatIpi koMtagA paMchukO.. vennelaMta kaLLalO niMpukO..
bratukE jatagA pArAli.. paruvaM tIraM chErAli ....

kalise pratisaMdhyalO palike prati aMdelo 
kalise pratisaMdhyalO palike prati aMdelo 
nATyAlenno edagAli nAlo nEne migalAli.. (2)   
kalise pratisaMdhyalO kalige pulakiMtalo