Showing posts with label sankeerthana. Show all posts
Showing posts with label sankeerthana. Show all posts

Sunday, July 27, 2025

Vevela varnala telugu lyrics [వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా] - Sankeerthana - #250

Song Name :VeVela varnala
Movie:Sankeerthana
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Sirivennela Seetharama sastry garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

అలలూ శిలలూ తెలిపే కథలు, పలికే నాలో గీతాలై  

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

ఓ గంగమ్మా పొద్దెక్కిపొతంది తొరగా రాయే 

ఓ.. తల్లి గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి పల్లె పల్లే పచ్చాని పందిరి .. పల్లె పల్లే పచ్చాని పందిరి 

నిండు నూరేళ్ళు పండు ముత్తైదువల్లె ఉండు పంటలకేమి సందడి, పట్ట పంటాలకేమి సందడి 

తందైన తందత్తైన తందైన తందత్తైన తందైన తందత్తయ్యనా తయ్య తందైన తందత్తయ్యనా  

వానవేలితోటి నేల వీణ మీటె, నీలినింగి పాటే ఈ చేలట 

కాళిదాసులాటి ఈ తోటరాసుకున్నా కమ్మనైన కవితలే ఈ పూలట  

ప్రతి కదలికలో నాట్యమె కాదా, ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా 

ఎదకే కనులుంటే 

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

అలలూ శిలలూ తెలిపే కథలు, పలికే నాలో గీతాలై  

వేవేలా వర్ణాలా ఈ నేలా కావ్యానా 

Sunday, September 15, 2024

కలికి మేనిలో కలిగే స్పందనం (kaliki menilo) - Sankeerthana

Song Name :Kaliki menilo
Movie:Sankeerthana
Singers:S.P. Bala subramanyam garu, S, Janaki garu
Lyricist:C Narayana reddy garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

కలికి మేనిలో కలిగే స్పందనం..

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 

రంగుల కలగ మెరిసే అకాశం, ముంగిట తానే నిలిచే

తోటకు వరమై దొరికే మధుమాసం, గూటిని తానే వలచే

గర్భగుడిని దాటి కదిలింది దేవతా, 

గర్భగుడిని దాటి కదిలింది దేవతా, చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జతా

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 

పెదవుల వలలో పెరిగే ఏకాంతం ప్రేమకు తేరై ఎగసే

తలపుల ఒడిలో ఒదిగే అనురాగం తలుపులు తానే తెరిచే 

తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి 

తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి, వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలీ 

కలికి మేనిలో కలిగే స్పందనం

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 

Wednesday, September 11, 2024

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో (Ye naavade teeramo) - Sankeerthana

Song Name :Manase Paadenule
Movie:Sankeerthana
Singers:K J Yesudas garu
Lyricist:Aatrya garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో

కలగానో.. కధగానో.. మిగిలేదీ నీవే ఈ జన్మలో..

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో

నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు

నాలోని నీవే నేనైనాను, నీలోని నేనే నీవైనావు

విన్నావా ఈ వింతలూ, అన్నారా ఎవరైననూ

విన్నావా ఈ వింతలూ, అన్నారా ఎవరైననూ నీకూ నాకే చెల్లిందనూ

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో

ఆకాశమల్లే నీవున్నావు, నీ నీలిరంగై నేనున్నాను

ఆకాశమల్లే నీవున్నావు, నీ నీలిరంగై నేనున్నాను

కలిసేది ఊహేనను, ఊహల్లో కలిశామను 

కలిసేది ఊహేనను, ఊహల్లో కలిశామని ఊరేనే సాక్ష్యాలను 

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో

కలగానో.. కధగానో.. మిగిలేదీ నీవే ఈ జన్మలో..

ఏ నావదేతీరమో ఏ నేస్తమేజన్మ వరమో

Tuesday, September 10, 2024

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే (Manase padenula)

Song Name :Manase Paadenule
Movie:Sankeerthana
Singers:S.P. Bala subramanyam garu
Lyricist:C Narayana reddy garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

సెలయేటి మలుపులా విరితోట పిలుపులా, ఏటి మలుపులా విరితోట పిలుపులా 

స్వరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

కోయిలలై పలికే, తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో..

కోయిలలై పలికే, తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో..

అందియలై మ్రోగె సంధ్యలోనె, అంచులు తాకె అందాలెవెవో 

జిలుగులొలుకు చెలి చెలువం, కొలను విడవని నవ కమలం 

జిలుగులొలుకు చెలి చెలువం, కొలను విడవని నవ కమలం 

అదిమీటె నాలో ఒదిగిన కవితల

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

సెలయేటి మలుపులా విరితోట పిలుపులా, ఏటి మలుపులా విరితోట పిలుపులా 

సరసరాగ సంకీర్తనగా నేడే

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

మనసే పాడెనులే.. మైమరచి మనసే పాడెనులే 

ధీంతరన ధిర ధిరన ధిరన ధిరన

ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా

తనన ధిర న ధిరిథాన న ధిరిథాన ధిరన 

తన నాధిరిధిరి నాధిరిధిరి నాధిరిధిరి  నంధిరిధిరి  

ధీం ధిరన ధిర ధిరన ధిరన ధిరనా

ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా

ఆ....

తొలకరి పరువం మెలికలు తిరిగిన అలకల కులుకుల అలిమేణి

సుమరమణీయ హిమకమనీయ సురుచిర రసభర కలవాణి.

తొలక్ అరి పరువం మెలికలు తిరిగిన అలకల కులుకుల అలిమేణి

సుమరమణీయ హిమకమనీయ సురుచిర రసభర కలవాణి.

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి నోంధిరిధిరి నంధిరిధిరి  ధిరన ధీంతరథాని 

నాధిరిధిరి తోంధిరిధిరి నంధిరి తోంధిరి తాంధిరి నంఢిరి 

నాధిరిధిరి తోంధిరిధిరి నంధిరి తోంధిరి తాంతరి నంఢరి 

తత్తోం తరిగిడతోం తత్తోం తరిగిడత తద్దిత్తరిగిట తత్తోం తరిగిటత తత్తోం  తరిగిడత తద్దిత్తరిటత 

ధీం ధిరన ధిర ధిరన ధిరన ధిరనా

ధిరన ధిర ధీం ధిరన ధిర ధిర ధిరన ధిరన ధిరనా

ఆ...