Showing posts with label romantic. Show all posts
Showing posts with label romantic. Show all posts

Friday, September 5, 2025

Vaana vallappa vallappa [వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా] - Annayya

Title :Vaana vallappa vollappaginchey
Movie:Annayya
Singers:Hariharan గారు, Sujata గారు
Lyricist:Veturi Sundararama murthy గారు
Composer:Mani sharma గారు
Director:Mutyala Subbayya గారు

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

ఆషాఢమాసంలో నీటి అందాలముసురుల్లో

మేఘాలదేశంలో కొత్తబంధాల మెరుపుల్లో 

ఆడబిడ్డా వొంటినిట్టా ఈడుకుంపట్లుగా చేసే 

జారిపడ్డా జారిపడ్డ నీ కౌగిట్లో దాచేసేయ్

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా 

వేసంగివానల్లో నను వేధించు వయసుల్లో

పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో

అమ్మదొంగా సుబ్బరంగా  మొగ్గ అందించు మోహంగా 

అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

ప్రేమరాగం తేమతాళం జంటకచ్చేరి చేస్తుంటే 

మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే 

వాన వల్లప్ప వల్లప్ప వొళ్ళప్పగించేయ్ సామిరంగా

ఆపు నీగొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా

Tuesday, May 27, 2025

Manasu palike [మనసు పలికే మౌన గీతం] - Swathi Mutyam

Song Name :Manasu palike mouna gitam
Movie:Swathi Muthyam
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:C. Narayana Reddy garu
Composer:Illayaraja garu
DirectorK. Viswanadh garu 

మనసు పలికే .. మనసు పలికే repeat

మౌన గీతం .. మౌన గీతం repeat

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే మమతలొలికే repeat

స్వాతిముత్యం స్వాతిముత్యం Repeat

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

అణువు అణువు ప్రణయ మధువు 

అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ ధనువు

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

శిరస్సుపై నీ గంగనై మరుల జలకాలాడనీ.. మరుల జలకాలాడనీ

సగము మేన గిరిజనై పగలు రేయీ ఒదగనీ .. పగలు రేయీ ఒదగనీ 

హృదయ మేళనలో మధుర లాలనలో 

హృదయ మేళనలో మధుర లాలనలో 

వెలిగిపోనీ రాగదీపం.. వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

కానరానీ ప్రేమకే ఓనమాలు దిద్దనీ.. ఓనమాలు దిద్దనీ 

పెదవిపై నీ ముద్దునై మొదటి తీపీ అద్దనీ.. మొదటి తీపీ 

లలిత యామినిలో కలల కౌముదిలో 

లలిత యామినిలో కలల కౌముదిలో 

కరిగిపోనీ కాలమంతా కరిగిపోనీ కాలమంతా.. కౌగిలింతలుగా..

మనసు పలికే .. మనసు పలికే repeat

మౌన గీతం .. మౌన గీతం repeat

మనసు పలికే మౌన గీతం.. నీదే

మమతలొలికే మమతలొలికే repeat

స్వాతిముత్యం స్వాతిముత్యం Repeat

మమతలొలికే స్వాతిముత్యం నీవే..

అణువు అణువు ప్రణయ మధువు 

అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమ ధనువు

Saturday, April 19, 2025

Sanna jaaji padaka [సన్నజాజి పడక మంచెకాడా పడక ] - Kshatriya putrudu

Song Name :Sannajaji padaka
Movie:Kshatriya putrudu
Singers:S.P. Bala subramanyam garu, S. Janaki garu
Lyricist:Vennelakanti garu
Composer:Illayaraja garu
DirectorBarathan garu 

సన్నజాజి పడక మంచెకాడా పడక చల్లగాలి పడక మాటవినకుంది ఎందుకే

మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది మాయని ఊసే ఉంది పాటై రావే 

సన్నజాజి పడక మంచెకాడా పడక చల్లగాలి పడక మాటవినకుంది ఎందుకే

కొండ మల్లి పూవులన్నీ గుండెల్లోని నవ్వులన్నీ దండేకట్టి కాచుకున్నా నీ కొరకే 

పండు వెన్నెలంటి ఈడూ ఎండల్లోన చిన్నబోతే పండించగా చేరుకున్న నీ దరికే 

అండా దండా నీవేనని పండాగంతా నాదేననీ వుండి వుండి వుగిందీ నా మనసే 

కొండ పల్లి బొమ్మ ఇక పండు చెండు దోచేయ్యనా దిండే పంచే వేళైనది రావే

దిండే పంచే వేళైనది రావే 

సన్నజాజి పడక మంచెకాడా పడక చల్లగాలి పడక మాటవినకుంది ఎందుకే

సన్నజాజి పడక మంచెకాడా పడక చల్లగాలి పడక మాటవినకుంది ఎందుకే

అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసిందీ మొగ్గలా బుగ్గే కంది పోయే 

సన్నజాజి పడక మంచెకాడా పడక చల్లగాలి పడక మాటవినకుంది ఎందుకే 

Monday, March 31, 2025

Yamaho ni yama yama andam [యమహో నీ యమా యమా అందం] - Jagadeka Veerudu Atiloka Sundari

Song Name :Yamaho ni yama yama 
Movie:Jagadeka Veerudu Atiloka sundari
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK. Raghavendra Rao garu 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

ఫొజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి

అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటీ ప్రాయం

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

నల్లని కాటుక పెట్టి, గాజులు పెట్టి, గజ్జా కట్టీ 

గుట్టుగ సెంటే కొట్టి వడ్డాణాలే వంటికి పెట్టి

తెల్లనీ చీరా కట్టి మల్లెలు చుట్టీ కొప్పున పెట్టి

పచ్చనీ పాదాలకే ఎర్రని బొట్టూ పరాణెట్టి

చీకటింట దీపామెట్టీ చీకుచింత పక్కానెట్టి 

నిన్ను నాలొ దాచిపెట్టీ, నన్ను నీకు దోచీపెట్టీ 

పెట్టూ పోతా వద్దే చిట్టెంకీ, చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి 

పెట్టేదీ మూడే ముళ్ళమ్మీ, నువ్ పుట్టిందీ నాకోసమమ్మి  

ఇక నీ సొగసూ నా వయసూ పేనుకొనే ప్రేమలలో 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

పట్టెమంచమేసీ పెట్టీ పాలుబెట్టీ పండూబెట్టీ 

పక్కమీద పూలూకొట్టీ పక్కాపక్కాలొళ్ళూ పెట్టీ 

ఆకులో వక్కాలెట్టి సున్నాలెట్టి చిలకాచుట్టీ 

ముద్దుగా నోట్లోపెట్టీ పరువాలన్నీ పండాబెట్టి 

చీరగుట్టు సారేబెట్టీ సిగ్గులన్నీ ఆరాబెట్టీ 

కళ్ళలోన వొత్తూలెట్టీ కౌగిలింత మాటూబెట్టీ 

వొట్టేపెట్టి వొగ్గేసాకా మావా నిను వొళ్ళో బెట్టీ లాలించేదే ప్రేమా 

పెట్టేయీ సందెసీకట్లోనా నను తట్టేయి కౌగిలింతల్లోన 

ఇక ఆ గొడవ ఈ చొరవా ఆగవులే అలజడిలో 

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

నమహో నీ ఝమా ఝమా వాటం, సుడి రేగింది ఎడా పెడా తాళం 

ఫొజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి

అల్లారు ముద్దుల్లో గాయం, విరబూసింది పువ్వంటీ ప్రాయం

యమహో నీ యమా యమా అందం, చెలరేగింది ఎగా దిగా తాపం

Monday, January 27, 2025

Priya Ragale gundelona - ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా [Hello Brother]

Song Name :Priya ragale gundelona
Movie:Hello Brother
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Bhuvana Chandra garu
Composer:Raj - Koti garu
DirectorE.V.V Satyanarayana garu

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం.

తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం 

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంట

వేకువపూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతీ లయా నేనౌతా

కలకాలం కౌగిలై నినేచేరుకోని, కనురెప్పల నీడలో కలే ఒదిగిపోనీ 

ఓ ప్రియా... ఓ..దరిచేరితే దాచుకోనా, తొలిప్రేమలే దోచుకోనా

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

సవ్వడి చేయని యెవ్వనవీణలు  అలా అలా సవరించు పదే పదే పలికించు 

వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించు సుఖాలలో తేలించు 

పెదవులతొ కమ్మనీ కధే రాసుకోన 

వొడిచేరి వెచ్చగా చలే కాసుకోన 

ఓ ప్రియా ఓ.. పరువాలనే పంచుకోనీ, పడుచాటలే సాగిపోనీ 

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా..

ప్రియగానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళా

చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం. 

తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం 

ఓ.. ఓ.. ఓ...

Sunday, January 19, 2025

Maunamelanoyi ee marapurani reyi [మౌనమేలనోయి ఈ మరపురానిరేయి] - Saagara sangamam

Song Name :Mounamelanoyi
Movie:Sagarasangamam
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Illayaraja garu
DirectorK Viswanath garu

మౌనమేలనోయి 

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి, మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

ఎదలో వెన్నెల వెలీగే కన్నుల, ఎదలో వెన్నెల వెలీగే కన్నుల

తారాడే హాయిలో 

ఇంత మౌనమేల్నోయి ఈ మరపురాని రేయి

పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవీ వెనకాల ఏవిటో..

కలిసే మనసులా విరిసే వయసులా, కలిసే మనసులా విరిసే వయసులా

నీలి నీలి ఊసులూ లేతగాలి బాసలూ, ఏమేమొ అడిగినా ..

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

హిమమే కురిసే చందమామ కౌగిట, సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట 

ఇవీ ఏడడుగుల వలపూ మడుగుల, ఇవీ ఏడడుగుల వలపూ మడుగుల

కన్నెఈడు ఉలుకులూ కంటిపాప కబురులు, ఎంతెంతొ తెలిసినా

మౌనమేలనోయి ఈ మరపురానిరేయి, ఇంత మౌనమేలనోయి ఈ మరపురానిరేయి

ఎదలో వెన్నెల వెలీగే కన్నుల, ఎదలో వెన్నెల వెలీగే కన్నుల

తారాడే హాయిలో 

ఇంత మౌనమేల్నోయి ఈ మరపురాని రేయి 

Tuesday, November 5, 2024

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా (Swayamkrushi)

Song Name :Sinni sinni
Movie:Swayamkrushi
Singers:S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎరిగిన మనసుకు ఎరలేలే..ఏలిక శెలవిక శెరణేలే..

ఎవరికి తెలియని కథలివిలే ..ఎవరికి తెలియనీ కథలివిలే ..

ఎవరో చెప్పాగ ఇక ఏలే..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

నెలత తలపులే నలుగులుగా..కలికి కనులతో జలకాలూ..

సందిటనేసిన చెలువములే.. సందిటనేసిన చెలువములే.. 

సుందరమూర్తికి చేలములూ...

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

కలల ఒరుపులే కస్తురిగా.. వలపు వందనపు తిలకాలూ..

వలపు వందనపు తిలకాలూ..

అంకము చేరిన పొంకాలే.. అంకము చేరిన పొంకాలే 

శ్రీవేంకట పతికికా.. వేడుకలు..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిన్నీ సిన్నీ కోరికలడగ శీనీవాసుడు నన్నడగా

అన్నుల మిన్న అలమేల్ మంగై ఆతని సన్నిధి కొలువుంటా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ (SwayamKrushi)

Song Name :Siggu Poobanti
Movie:Swayamkrushi
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki, S.P. Sailaja garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Ramesh Naidu garu
DirectorK. Viswanath garu

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

విరజాజి.. పూలబంతి అతసేతా మోయలేని

విరజాజి పూలబంతి అతసేతా మోయలేని సుకుమారి ఈ సిన్నదేనా..

శివునివిల్లు మోసిన జాణ.. ఈ సిన్నదేనా..

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

ఔరా అని రామయకన్నులు మేలమాడి నవ్విన సిన్నెలు 

సూసీ అలకలొచ్చిన కలికీ 

సూసీ అలకలొచ్చిన కలికీ, ఏసినాది కులుకుల మలికి 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా 

శిరసొంచీ కూరుసున్నా, గురిసూసి సేరుకున్నా.. సిలకమ్మ కొనసూపు సౌరూ..

బొండుమల్లె సెండు జోరు 

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

సేరే ఆ సూపుల తళుకు ముసురుతున్న రామయ రూపు

మెరిసే నల్లమబ్బైనాదీ 

మెరిసే నల్లమబ్బైనాదీ, వలపుజల్లు వరదైనాది

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చీ 

మొగ్గా సింగారం ఇరిసే సుదతీ మీనాచ్చీ...

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా 

సొగసూ సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా

రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా..

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి 

Sunday, November 3, 2024

కన్యాకుమారీ కనపడదా దారి (Bobbili Raaja)

Song Name :Kanya kumari kanapada daari
Movie:Bobbili Raaja
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Illayaraja garu
DirectorB. Gopal garu

కన్యాకుమారీ కనపడదా దారి, కయ్యాలమారి పడతావే జారి

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల 

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు 

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

కొండలూ గుట్టలూ చిందులాడే తదిగిణతోం..

వాగులూ వంకలూ ఆగిచూసే కథచెబుదాం 

తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం

కుందేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం

చూడమ్మా హంగామా, అడివంతారంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం..

కళ్ళవిందుగా పైత్యాల పండగ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

కన్యాకుమారీ కనపడదా దారి.. ఆహ 

కయ్యాలమారి పడతావే జారి.. 

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు 

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

డేగతో ఈగలే ఫైటుచేసే చెడుగుడులో 

చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడలో 

నేలమ్మా తప్ప తాగెనో, ఏ మూలో తప్పిపోయెనో

మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడకనాపుకో 

ఓయమ్మో.. మాయమ్మో ..దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం..

వొళ్ళు వూగగా ఎక్కిళ్ళు రేగగా 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

ఏయ్..గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల  

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం 

Monday, October 7, 2024

స్వాతిలో ముత్యమంత [Bangaru bullodu]

Song Name :Swatilo mutyamanta
Movie:Bangaru Bullodu
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra Garu
Lyricist:Veturi Sundara rama murthy garu
Composer:Raj-Koti garu
DirectorRaviraja Pinisetty garu

వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  
తీగ డొంక కదిలేనంట  తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  

స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో అందాలెన్నో యాలో యాల  
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యెవ్వన ఘుమఘుమలయ నీదమ్మా
వానా వానా వల్లపా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గు చెల్లప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల
స్వాతిలో ముత్యమంత, ముద్దులా ముట్టుకుంది సందె వానా
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
 
వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  
తీగ డొంక కదిలేనంట  తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వానా
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమను వొణికే వాన
జన్మకు దొరకని మన్మధ తళుకులు ముదిరే వానా
చాలని గొడుగున నాలుగు ఆదుగుల నటనే వాన
వానల్లోన సంపెంగా వొళ్ళంత ఓ బెంగా
గాలివానా గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

వాన వాన వచ్చేనంట వాగు వంక మెచ్చేనంట  
తీగ డొంక కదిలేనంట  తట్టా బుట్ట తడిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగ కోండా కోనా నీళ్ళాడంగ
కృష్ణా గోదరమ్మ కలిసి పరవళ్ళెత్తి పరుగెత్తంగ

Monday, September 23, 2024

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ (Allari Priyudu)

Song Name :Uttaraala urvasi..
Movie:Allari Priyudu
Singers:S.P. Balasubramanyam garu, K.S. Chitra garu
Lyricist:Veturi Sundararama Murthy garu
Composer:M.M.Keeravani garu
DirectorK.Raghavendra Rao garu

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ 

హల హలా అదెంత వేడివెన్నెలా, ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా 

గీతగోవిందుడు వీనులావిందుడు రాగమాలతోనె రాసలీలలాడగా 

మజా మజా మాజా గుమాగుమాలయా, నిజానికి ఇదంత ఒట్టు నీ దయా

పువ్వులెన్నొవిచ్చినట్టుగ చెలి నవ్వగానె నచ్చినావులే

చుక్కలెన్నొపుట్టినట్టుగ ప్రియా చూసుకోర పట్టి కౌగిలీ 

ఖవ్వాలిల కన్నులతోనే జవానీల జాబులురాసే జగడమొకటి సాగిందోయమ్మో   

అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలురేపి లలిత కవిత నీకేపాలగా 

దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై వంశధారనీటిమీద  హంసలేఖరాసినా    

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ 

హల హలా అదెంత వేడివెన్నెలా  

నిజానికి ఇదంతా ఒట్టు నీ దయా

సమ్ముఖాన రాయభారమా, సరే, సందేగాలి ఒప్పుకోదులే 

చందమామతోటి బేరమా, అదీ, అందగత్తె గొప్పకాదులే 

పెదాలమ్మ కచ్చేరీలో పదాలింక కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మా 

సరాగాల సంపెంగల్లో పరాగాలు పండిస్తుంటే, పరువమొకటి వచ్చే వాంఛలా 

కన్నె చెట్టు కొమ్మ మీద పొన్న తోట తుమ్మెదాడి 

ఝుంటితేని పట్టులోన కొంటె వేణువూదిన

గీతగోవిందుడు వీనులావిందుడు రాగమాలతోనె రాసలీలలాడగా 

మజా మజా మాజా గుమాగుమాలయా, నిజానికి ఇదంత ఒట్టు నీ దయా

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి అందమంత అక్షరాల హారతివ్వగ 

హల హలా అదెంత వేడివెన్నెలా, ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా 

Sunday, September 15, 2024

కలికి మేనిలో కలిగే స్పందనం (kaliki menilo) - Sankeerthana

Song Name :Kaliki menilo
Movie:Sankeerthana
Singers:S.P. Bala subramanyam garu, S, Janaki garu
Lyricist:C Narayana reddy garu
Composer:Illayaraja garu
Director:Geetha Krishna garu

కలికి మేనిలో కలిగే స్పందనం..

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 

రంగుల కలగ మెరిసే అకాశం, ముంగిట తానే నిలిచే

తోటకు వరమై దొరికే మధుమాసం, గూటిని తానే వలచే

గర్భగుడిని దాటి కదిలింది దేవతా, 

గర్భగుడిని దాటి కదిలింది దేవతా, చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జతా

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో 

పెదవుల వలలో పెరిగే ఏకాంతం ప్రేమకు తేరై ఎగసే

తలపుల ఒడిలో ఒదిగే అనురాగం తలుపులు తానే తెరిచే 

తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి 

తల్లి నేల వేసే మన పెళ్ళిపందిరి, వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలీ 

కలికి మేనిలో కలిగే స్పందనం

కలికి మేనిలో కలిగే స్పందనం.. ఇలకూ వెన్నెలకూ 

ఇలకూ వెన్నెలకూ జరిగే సంగమం

కలికి మేనిలో కలిగే స్పందనం..కలికి మేనిలో