Showing posts with label B. Gopal. Show all posts
Showing posts with label B. Gopal. Show all posts

Saturday, March 28, 2026

Chilakapaccha koka [చిలకపచ్చకోక పెట్టినాదికేక ] - Narasimha Nayudu/Naidu

Title :Chilakapaccha koka
Movie:Narasimha naidu
Singers:Nagur babu (Mano) గారు, Radhika గారు
Lyricist:Bhuvana chandra గారు
Composer:Mani sharma గారు
Director:B. Gopal గారు

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

చిలకపచ్చకోక హ పెట్టినాదికేక 

చంపకమాలా చంపకే బేలా చాటుముద్దుల్లోనే ఉంది ఘాటుమసాలా 

కొంటెగోపాలా ఆపరగోలా సరసానికి ఉందిరయ్యో వేళాపాళా 

వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోద ఒసే తూగుటుయ్యాలా 

వద్దు వద్దన్నా ముద్దుపెట్టేసే మగసిరినీకుందిగా మురళిలోలా 

పిల్లచూస్తె జామకాయలే దీంతస్సదియ్య కొరకబోతె మిరపకాయలే 

చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే 

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

నిన్నుచూసాకే వెన్నుమీటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో 

చెనుపట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో 

పాలుకావాలా పళ్ళుకావాలా పళ్ళుపాలతోటి పడుచుపిల్ల కావాలా 

చెంతచేరాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే 

ఏడూళ్ళా అందగత్తిని నీసోకుమాడ పట్టుకుంటె అత్తిపత్తిని 

హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి 

చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా 

రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా 

వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి 

రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా హొయ్ 

Tuesday, March 24, 2026

Andala ada bomma [అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ] - Samarasimha reddy

Title :Andala ada bomma
Movie:Samarasimha reddy
Singers:Udit Narayan గారు, Sujata గారు
Lyricist:Sirivennela Sitarama sastry గారు
Composer:Manisharma గారు
Director:B. Gopal గారు

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

కుచ్చిళ్ళ కోనలోన కన్నెచిక్కుకుంది రక్షించు నన్ను చప్పున

గుప్పిళ్ళుదాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

చెప్పుకుంటే తప్పులేదే ఉప్పుతిన్న నీ ఒంటియాతన

తప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాంటి ఈ కొంటెవేదన

నేనుంది అందుకేగా ఏమైంది ఇంతలోగా కానుంది మంచిదే ఎలాగా 

కాబట్టి కందిరీగ నీ కాటు అందుకోగ వేచింది వన్నె కన్నె తీగ 

వందేళ్ళ సందిళ్ళ పందిళ్ళు వేయించనా 

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్ని నీ చేతబెట్టనా 

నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నే మూతపెట్టనా 

ఒంపుల్ని లెక్కపెట్టి ఒక్కొక్క ముద్దుపెట్టి నీ ప్రేమనారు నాటిపోవా 

ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంత పూతపట్టి నిలువెల్ల మల్లెతోటకావా 

గంధాలు చిందేలా అందాలు పండించవా 

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

కుచ్చిళ్ళ కోనలోన కన్నెచిక్కుకుంది రక్షించు నన్ను చప్పున

గుప్పిళ్ళుదాటుతున్న గుట్టు గుప్పుమంది కవ్విస్తే కట్టు తప్పనా

అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ

అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నెజన్మ 

Tuesday, August 19, 2025

Bham bham bhole telugu lyrics [భం భం బోలే శంఖం మోగెలే] - Indra

Title :Bham bham bhole
Movie:Indra
Singers:Hari Haran గారు, Sankar Mahadevan గారు
Lyricist:Sririvennela Seetaramasastry గారు
Composer:Manisharma గారు
Director:B. Gopal  గారు

భం భం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే 

భం భం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే 

తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి

విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ

భం భం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే 

తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి

విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ

భం భం బోలే భం భం బోలే భం భం బోలే భోలెనాథ్ 

భం భం బోలే భం భం బోలే భం భం బోలే భోలెనాథ్ 

బోలే నాచె చం చమా చం, బోలే నాచె చం చమా చం

ఢమరు భాజే ఢమరు భాజె ఢమరు భాజె ఢం ఢమా ఢం 

బోలే నాచె చం చమా చం, బోలే నాచె చం చమా చం

వారణసిని వర్ణించే నాగీతిక, నాటి శ్రీనాథుని కవితే వినిపించగా 

ముక్తికే మర్గంచూపే మణికర్ణిక, అల్లదే అంది నా ఈ చిరుఘంటిక 

నమక గమకాలై ఎదలయలే కీర్తన చేయగా

యమక గమకాలై పదగతులే నర్తన చేయగా 

ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా 

విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి

విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ

కార్తీకమాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా 

ప్రియమార మదిలోని ఈశ్వరుని ధ్యానిస్తే మనకష్టమే తొలగిపోదా 

ఎదురయే శిలఏదైన శివలింగమే, మన్ను కాదు మాహాదేవుని వరదానమే

చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే, చరితలకు అందనిదీ కైలాశమే 

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే, గంగలో నిత్యం కనలేద శివకారుణ్యమే 

తరలిరండి తెలుసుకోండి కాశిమహిమా..

విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి

విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ

భం భం బోలే శంఖం మోగెలే, ఢం ఢం ఢోలే చెలరేగిందిలే 

తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

తద్దినకధిన్ దరువై సందడిరేగని, పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ

విలాసంగ సివానంద లహరి, మహాగంగ ప్రవాహంగ మారి

విశాలాక్షి సమేతంగచేరి, వరాలిచ్చే కాశీపురీ 

Sunday, November 3, 2024

కన్యాకుమారీ కనపడదా దారి (Bobbili Raaja)

Song Name :Kanya kumari kanapada daari
Movie:Bobbili Raaja
Singers:S.P. Balasubramanyam garu, S. Janaki garu
Lyricist:Sirivennela Seetaraama Sastry garu
Composer:Illayaraja garu
DirectorB. Gopal garu

కన్యాకుమారీ కనపడదా దారి, కయ్యాలమారి పడతావే జారి

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల 

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు 

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

కొండలూ గుట్టలూ చిందులాడే తదిగిణతోం..

వాగులూ వంకలూ ఆగిచూసే కథచెబుదాం 

తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం

కుందేటి కొమ్ము వెతుకుదాం, బంగారు జింకనడుగుదాం

చూడమ్మా హంగామా, అడివంతారంగేట్రం సాగించే వెరైటీ ప్రోగ్రాం..

కళ్ళవిందుగా పైత్యాల పండగ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

కన్యాకుమారీ కనపడదా దారి.. ఆహ 

కయ్యాలమారి పడతావే జారి.. 

మైకంలో మయసభ చూడు మహరాజ రా నా తోడు 

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

డేగతో ఈగలే ఫైటుచేసే చెడుగుడులో 

చేపలే చెట్టుపై పళ్ళుకోసే గడబిడలో 

నేలమ్మా తప్ప తాగెనో, ఏ మూలో తప్పిపోయెనో

మేఘాల కొంగు పట్టుకో, తూలేటి నడకనాపుకో 

ఓయమ్మో.. మాయమ్మో ..దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం..

వొళ్ళు వూగగా ఎక్కిళ్ళు రేగగా 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

ఏయ్..గోపాలబాలా ఆపరఈగోల, ఈ కైపుఏలా ఊపర ఉయ్యాల  

పాతాళం కనిపెట్టేలా, ఆకాశం పనిపట్టేలా

ఊగకే మరి, మతిలేని సుందరి

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం

సాగనీ మరి సరదాల గారడీ 

జింగుచక్ జింగుచక్ చాం.. చక్ జింగుచక్ జింగుచక్ చాం