| Title : | Chilakapaccha koka |
| Movie: | Narasimha naidu |
| Singers: | Nagur babu (Mano) గారు, Radhika గారు |
| Lyricist: | Bhuvana chandra గారు |
| Composer: | Mani sharma గారు |
| Director: | B. Gopal గారు |
చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా
రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా
వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి
చిలకపచ్చకోక హ పెట్టినాదికేక
చంపకమాలా చంపకే బేలా చాటుముద్దుల్లోనే ఉంది ఘాటుమసాలా
కొంటెగోపాలా ఆపరగోలా సరసానికి ఉందిరయ్యో వేళాపాళా
వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోద ఒసే తూగుటుయ్యాలా
వద్దు వద్దన్నా ముద్దుపెట్టేసే మగసిరినీకుందిగా మురళిలోలా
పిల్లచూస్తె జామకాయలే దీంతస్సదియ్య కొరకబోతె మిరపకాయలే
చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే
చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా
రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ
నిన్నుచూసాకే వెన్నుమీటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో
చెనుపట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో
పాలుకావాలా పళ్ళుకావాలా పళ్ళుపాలతోటి పడుచుపిల్ల కావాలా
చెంతచేరాలే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే
ఏడూళ్ళా అందగత్తిని నీసోకుమాడ పట్టుకుంటె అత్తిపత్తిని
హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి
చిలకపచ్చకోక పెట్టినాదికేక తోడులేక బాలకృష్ణుడా
రెండుజళ్ళ కైక రెచ్చినాది కాక పంచుకోవె పాలమీగడ
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా
వస్తే నా పూలజంగిడి నీ తస్సచక్క ఇస్తావా ముంతమావిడి
రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ నీదే నా పట్టుపావడా హొయ్

No comments:
Post a Comment