| Title : | rama rama raghurama ani padutunna |
| Movie: | Sri Anjaneyam |
| Singers: | Mallikarjun గారు |
| Lyricist: | Sirivennela sitarama sastry గారు |
| Composer: | Manisharma గారు |
| Director: | Krishna Vamsi గారు |
రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ
అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా
సరదాగా నా గాలిపాట వినుమ, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికిపుట్టా గాలికిపెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతోఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా
రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ
అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా
అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ, నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ, నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ
ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా, ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం
అన్నీ సొంతైళ్ళే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం
బతుకంతా ఈది తీరే రుణమా..
రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ
అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా
ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మ, ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా
ప్రసన్నాంజనేయం అనే నామధేయం, ప్రతి మంచికార్యం జరిపించు దైవం
ప్రభాదివ్యఖాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా ...
రామ రామ రఘురామ అనిపాడుతున్న హనుమ
అంత భక్తిపరవశమా ఓ కంట మమ్ముగనుమా
సరదాగా నా గాలిపాట వినుమ, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికిపుట్టా గాలికిపెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతోఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా

No comments:
Post a Comment