| Song Name : | అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో | |||
| Movie: | Okariki okaru | |||
| Singers: | Ganga గారు, M.M. Keeravani గారు | |||
| Lyricist: | Chandraboseగారు | |||
| Composer: | M.M. Keeravani గారు | |||
| Director | Rasool Ellore గారు |
అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో
జనకుని కూతురు జానకి అల్లో నేరెళ్ళో
జాజుల సోదరి జానకి అల్లో నేరెళ్ళో
మిథిలా నగరిని జానకి అల్లో నేరెళ్ళో
ముద్దుగ పెరిగిన జానకి అల్లో నేరెళ్ళో
అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో

ఏటిపాయల పాపిటకి కుంకుమబొట్టే ఆభరణం
ఎదురు చూపుల కన్నులకి కాటుకరేఖే ఆభరణం
పుడమినంటని పదములకి పసుపు వన్నెలే ఆభరణం
పెదవిదాటని మాటలకి మౌనరాగమే ఆభరణం
మగువ మనసుకు ఏనాడూ మనసైనవాడే ఆభరణం
అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో
అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో
చేయిజారిన చందమామని అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని అందచేయగలనా
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా
చేరువై నా మనోవేదన మనవిచేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా
అందాలరాముని పరిణయమాడి అయోధ్య చేరును జానకి అల్లో నేరెళ్ళో

No comments:
Post a Comment