| Title : | Idi cheragani premaku |
| Movie: | Ankusam |
| Singers: | S.P. Balasubramanyam గారు, S. Janaki గారు |
| Lyricist: | Mallemaala గారు |
| Composer: | Chakravarthy గారు |
| Director: | Kodi Ramakrishna గారు |
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..
కలకాలం వైభోగమస్తు

కళ్యణ గంధాలు కౌగిలికి తెలుసు, రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు, పడటింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల చిలిపి చేతలు, పసిడి బుగ్గల పలకరింపులు
పడుచు జంటకే తెలుసు..
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..
కలకాలం వైభోగమస్తు
ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్ళకందం, శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
మింటికి పున్నమి జాబిల్లి అందం, ఇంటికి తొలిచూలు ఇల్లాలు అందం
జన్మజన్మల పుణ్యఫలముగా, జాలువారు పశిపాప నవ్వులే ఆలుమగలకు అందం
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం.. ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు.. పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి, కలకాలం వైభోగమస్తు..
కలకాలం వైభోగమస్తు

No comments:
Post a Comment