| Song Name : | ఊహల పల్లకీలో ఊరేగించనా | |||
| Movie: | Chitram | |||
| Singers: | Nihal గారు, Usha గారు | |||
| Lyricist: | Kulasekhar గారు | |||
| Composer: | R.P. Patnaik గారు | |||
| Director | Teja గారు |
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురులందివ్వనా రాచిలకై కిలకిలా నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోన
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ప్రేమలో తీపిచూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా, పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
సిరి తానుతనే వచ్చి నిన్ను చేరునురా
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చెనేవేయనా ఆకాశపుటంచులే వంచనా
ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఆశగా పల్లవించే పాటేనీవులే, జీవితం తోడులేని మోడేంకాదులే
కలిసుండే వేళలో కలతంటూ రాదులే, అమవాసై పోదులే అడిఆశే కాదులే
చిరుదివ్వె కాంతులింక దారిచూపునులే
ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

Cool :)
ReplyDelete