Showing posts with label R.P Patnaik. Show all posts
Showing posts with label R.P Patnaik. Show all posts

Saturday, April 25, 2026

Kita kita talupulu [కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం] - Manasanta Nuvve

Title :kita kita talupulu
Movie:Manasanta nuvve
Singers:K.S. Chitra గారు
Lyricist:Sirivennela seetaramasastry గారు
Composer:R.P. Patnaik గారు
Director:V.N. Aditya గారు

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

రెండూ కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా.. ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

నిన్నిలా చేరేదాక ఎన్నడూ నిదరేరాక కమ్మని కలలో ఐనా నిను చూడలేదే  

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే 

నాకోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా, కాస్సేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా 

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

కంటతడి నాడూ నేడు చెంపతడి నిన్నే చూడు చెమ్మలో ఎదో తేడా కనిపించలేదా 

చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం ఐపోలేదా ఆవేదనంతా 

ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా 

ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా 

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం 

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

ప్రేమ ప్రేమ ప్రేమా.. ప్రేమ 

Sunday, March 8, 2026

Oohala pallakilo ooreginchana [ఊహల పల్లకీలో ఊరేగించనా ] - Chitram

Song Name :ఊహల పల్లకీలో ఊరేగించనా  
Movie:Chitram
Singers:Nihal గారు, Usha గారు 
Lyricist:Kulasekhar గారు 
Composer:R.P. Patnaik గారు
DirectorTeja గారు

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

కలహంసై కబురులందివ్వనా రాచిలకై కిలకిలా నవ్వనా 

నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోన 

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

ప్రేమలో తీపిచూసే వయసే నీదిరా, బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా

సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా, పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా

సిరి తానుతనే వచ్చి నిన్ను చేరునురా 

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

మేఘాలకు నిచ్చెనేవేయనా ఆకాశపుటంచులే వంచనా

ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా 

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

ఆశగా పల్లవించే పాటేనీవులే, జీవితం తోడులేని మోడేంకాదులే 

కలిసుండే వేళలో కలతంటూ రాదులే, అమవాసై పోదులే అడిఆశే కాదులే 

చిరుదివ్వె కాంతులింక దారిచూపునులే 

ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా 

Wednesday, October 2, 2024

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం (Aa Naluguru)

Song Name :Aa naluguru
Movie:Aa Naluguru
Singers:S.P. Balasubramanyam garu
Lyricist:Chaitanya Prasad garu
Composer:R.P. Patnaik garu
DirectorChandra Siddartha garu

ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం విధిలీల

వెంట ఏ బంధము రక్తసంబంధము, తోడుగా రాదుగ తుదివేళ 

మరణమనేది ఖాయామని, మిగిలెను కీర్తిఖాయమని 

నీ బరువూ ని పరువూ మోసేదీ... ఆ నలుగురూ ... ఆ నలుగురూ..

ఆ నలుగురూ..ఆ నలుగురూ..

నలుగురూ మెచ్చిన నలుగురూ తిట్టినా, విలువలే శిలువగ మోసావు

అందరూ సుఖపడే సంఘమే కోరుతూ, మందిలో మార్గమే వేశావు

నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగ 

నీ వెనకే అనుచరులై నడిచారు...ఆ నలుగురూ.. ఆ నలుగురూ..

ఆ నలుగురూ.. ఆ నలుగురూ..

పోయిరా నేస్తమ పోయిరా ప్రియతమ, నీవుమా గుండెలో నిలిచావు

ఆత్మయే నిత్యము జీవితం సత్యము, చేతలే నిలుచురా కలకాలం 

బతికిననాడు బాసటగ పోయిన నాడు ఊరటగ 

అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ.. ఆ నలుగురూ.. 

ఆ నలుగురూ.. ఆ నలుగురూ.. 

Monday, September 16, 2024

చెప్పవే ప్రేమ (manasantaa nuvve)

Song Name :Cheppave Prema
Movie:Manasantha nuvve
Singers:R.P Patnaik, Usha 
Lyricist:Sirivennela seeta rama sastry garu
Composer:R.P. Patnaikgaru
Director:V.N. Aditya garu

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

మనసంతా నువ్వే మనసంత నువ్వె మనసంత నువ్వే నా మనసంత నువ్వే

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఏపుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని, 

ఇపుడూ నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని... నేస్తమా నీకు తెలిసేదెలా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా,ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా,ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా వున్నదే ఈ రోజే చూడాలని, గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ   

ఆశగా వున్నదే ఈ రోజే చూడాలని, గుండెలో ఊసులే నీకు చెప్పాలనీ   

నీ తలపులు చినుకు చినుకుగా దాచిన  బరువెంత పెరిగిన 

నిను చేరేవరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగ, స్నేహమా  నీకు తెలిపేదెలా  

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా 

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా 

మనసంతా నువ్వే, మనసంత నువ్వె, మనసంత నువ్వే, నా మనసంత నువ్వే