| Title : | He satamaanamannadi le |
| Movie: | Mrugaraju |
| Singers: | Hari haran గారు, Saadhana Sargam గారు |
| Lyricist: | Veturi Sundara rama murthy గారు |
| Composer: | Mani sharma గారు |
| Director: | Guna sekhar గారు |
హే శతమానమన్నదిలే చెలిమే
చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల
హే శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా
నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా హల
హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే
వంక జాబిల్లి వలపులు జల్లే
విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే
కన్నానులే నీ కన్నుల్లోన కల్లలే కన్న సావాసమే
కోకిలలా కిలకిలలే మన పూదోటలో
తేనెలలా వెన్నెలలే వేసవిపూటలో
ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా
చూడాలని చలి కాటేపడని చోటే గిచ్చి చూడాలని
చెప్పాలని నీ చూపేసోకని సోకే అప్పజెప్పాలని
మరి పదవి విరి పొదకే చెలి మర్యాదగా
యెదకడిగే ఎదురడిగా సిరిదోచెయ్యగా
వీణవో జాణవో రతి ముఖ సుఖ శృతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే
చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల
హే శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల, తేటి కోరేది తేనెల లాలా
నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా హల

No comments:
Post a Comment